← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వీర్యం vīryaṃ

Original — తెలుగు
  1. అండోత్పాదన శక్తియుక్తం తేజోరూపం ద్రవ్యం.

(అండమును - పుట్టించు శక్తిగల తేజోరూపమైన పదార్థము).

  1. భగవద్వీర్యం, మహదాది ప్రపంచ సృష్టి సామర్థ్యం, చేతన సమష్టిం వా.

(భగవంతుని వీర్యము, మహత్తత్వము మొదలగు తత్వములన్నింటితో కూడిన ప్రపంచమును సృష్టించు సామర్థ్యము, చేతన వస్తువుల సమష్టి).

  1. చిచ్ఛక్తి; చిదాభాసం -

(చైతన్యశక్తి; చిదాభాసము. భగవంతుని రెండు శక్తులలో జడపదార్థము, త్రిగుణాత్మకము, ప్రపంచమునకు ఉపాదానము అయి అష్టవిధములుగనున్న ప్రకృతికాక, రెండవదియగు పరాశక్తి - “జీవభూతాం య యేదం ధార్యతే జగత్” అని శ్రీమద్భగవద్గీతలో చెప్పబడిన పరాప్రకృతి - ప్రపంచమంతటిలోనుండి అంతటికీ అన్నింటికీ చైతన్యశక్తినిచ్చి జీవవంతముగా చేయునది)

  1. రేతస్సు, తేజస్సు, పరాక్రమము - ప్రభావః; సామర్థ్యం; పరాక్రమం.

(రేతస్సు - ప్రకృతి అంశతో కూడిన జీవ సూక్ష్మము - తేజస్సు (భగవదంశయగు జీవుడు తాని ఉపాధిలో నున్నట్లు విశదీకరించుటకు పైకి కనబడు కాంతిరూపము). (ప్రభావము; పరాక్రమము; సామ ర్థ్యము).

  1. శరీరబలం.

(భగవంతుని చిచ్ఛక్తి శరీరములోనుండి దానిని అన్ని విధములైన చైతన్యవంతముగాచేసి, బలముగలదిగా చేయునది).

Transliteration
  1. aṃḍōtpādana śaktiyuktaṃ tējōrūpaṃ dravyaṃ.

(aṃḍamunu - puṭṭiṃcu śaktigala tējōrūpamaina padārthamu).

  1. bhagavadvīryaṃ, mahadādi prapaṃca sṛṣṭi sāmarthyaṃ, cētana samaṣṭiṃ vā.

(bhagavaṃtuni vīryamu, mahattatvamu modalagu tatvamulanniṃṭitō kūḍina prapaṃcamunu sṛṣṭiṃcu sāmarthyamu, cētana vastuvula samaṣṭi).

  1. cicchakti; cidābhāsaṃ -

(caitanyaśakti; cidābhāsamu. bhagavaṃtuni reṃḍu śaktulalō jaḍapadārthamu, triguṇātmakamu, prapaṃcamunaku upādānamu ayi aṣṭavidhamuluganunna prakṛtikāka, reṃḍavadiyagu parāśakti - “jīvabhūtāṃ ya yēdaṃ dhāryatē jagat” ani śrīmadbhagavadgītalō ceppabaḍina parāprakṛti - prapaṃcamaṃtaṭilōnuṃḍi aṃtaṭikī anniṃṭikī caitanyaśaktinicci jīvavaṃtamugā cēyunadi)

  1. rētassu, tējassu, parākramamu - prabhāvaḥ; sāmarthyaṃ; parākramaṃ.

(rētassu - prakṛti aṃśatō kūḍina jīva sūkṣmamu - tējassu (bhagavadaṃśayagu jīvuḍu tāni upādhilō nunnaṭlu viśadīkariṃcuṭaku paiki kanabaḍu kāṃtirūpamu). (prabhāvamu; parākramamu; sāma rthyamu).

  1. śarīrabalaṃ.

(bhagavaṃtuni cicchakti śarīramulōnuṃḍi dānini anni vidhamulaina caitanyavaṃtamugācēsi, balamugaladigā cēyunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.