(బంధించునది, బంధము కలుగ చేయునది, ఫలముననుభవింప చేయునది).
(శరీరముకంటె ఇంద్రియములకంటె వేఱైనది)
(శబ్దము మొదలగునవి)
(శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము -ఇవి విషయములు, పృధివి మొదలగు మహభూతములనుండి, క్రమముగా పుట్టినవి. వాక్కు, చేతులు, పాదములు, పాయువు ఉపస్థము అను పేరుగలవి కర్మేంద్రియములు. వీటికి క్రమముగా వచనము (మాటలాడుట), దానము, గమనము (నడచుట), విసర్గము, ఆనందములు విషయములు, ఇవి పృధివి మొదలగుమహా భూతములనుండి పుట్టినవి. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవి అంతఃకరణము చతుష్టయములు - వాటికి వరుసగా సంకల్పము, వికల్పము, అధ్యవసాయము, అభిమాన అవధారణ అనునవి విషయములు -
(జ్ఞానేంద్రియములకు విషయములు - శ్రోత్రమునకు (చెవికి) శబ్దము, త్వక్కునకు (చర్మమునకు) స్పర్శము, చక్షుస్సుకు రూపము, జిహ్వకు రసము, ఘ్రాణమునకు గంధము, కర్మేంద్రియములకు విషయములు - వాక్కునకు సంభాషణ, చతులకు గ్రహణము (పట్టుకొనుట); ఉపస్థకు ఆనందము; గుదమునకు మలమును విసర్జించుట, పాదము గమనము).
(పూలదండలు, మంచిగంధము, స్త్రీలు, మొదలగునవి - భోగమునకుపచరించునవి).
(ఇంద్రియములకు అర్థములగు శబ్దము మొదలగునవి.)
(ఇంద్రియములకు ఆహారములైనవి విషయములు - “ఇంద్రియములు పదిన్నీ - జ్ఞానేంద్రియములు అయిదు, కర్మేంద్రియములు అయిదు - ఆహారము సిద్ధించుటకొరకు ద్వారములు” అని చెప్పబడుటవలన ఇంద్రియములకు విషయములు ఆహారములని చెప్పబడినవి.
(విషయములని చెప్పబడినవే ఇంద్రియములు -)
(విషములనగా రూపము మొదలగునవి, వాటిని అనుభవించు ఇంద్ఫ్రియములుకూడా వాటి ఉపలక్షణములుగా చెప్పబడినవి).
(విషయములు సుఖరూపములు - అవే సుఖములు, సుఖమును కలిగించునవి, కాని ఆత్మస్వరూపము వాటికంటె హెచ్చు అయిన సుఖరూపము).
“సర్వప్రపంచమున్నూ వేద్యం కాబట్టి ఘటం వలెనే విషయం”.
శ్రోత్రియేంద్రియేణ శబ్ద సాక్షాత్కార సమయే శ్రోత్రేంద్రియద్వారా బహిర్నిర్గతాంతఃకరణస్య సాభాసా వృత్తిః దూరస్థంవా అంతిగస్థంవా శబ్దరూపం విషయం ప్రాప్య శబ్ద సమానాకారతాం భజతే తదా అంతఃకరణవృత్యా శబ్ద నిష్టావరణం నివర్త్యతే, తన్నిష్టా భాసేన శబ్దః ప్రకాశ్యతే.
“ఇత్థం ఇతరేంద్రియ విషయాణాం ప్రత్యక్షమో విజ్ఞేయః -”
(ఇంద్రియము - చెవి - ఒక శబ్దమును వినినపుడు శ్రోత్రేంద్రియము ద్వారా పైకి ప్రసరించిన అంతఃకరణ వృత్తి. ఆ శబ్దము దూరములో అయినను, దగ్గరలో అయినను శబ్దరూపమైన విషయమును పొంది శబ్ద సమానమైన ఆకారముగా మారును. అప్పుడు అంతఃకరణవృత్తిచేత శబ్ద నిష్టావరణము నివర్తించును, - అందుచేత శబ్దము వినబడును - ఈ ప్రకారముగానే విషయములు ఇంద్రియములను ఆకర్షించునని తెలియనగును).
(ఇంద్రియార్థములైన విషయములు శబ్ద స్పర్శ రూప రస గంధములు, నీరు కానివైనను సూర్య రశ్మి రూపములైన మృగతృష్ణములు నీరు అని భ్రాంతిచేత తోచును - ఆ ప్రకారముగానే విషయములు దుఃఖరూపములైనను - దుఃఖమును కలిగించునవైనను - భ్రాంతిచేత సుఖరూపములుగానే తోచును -)
ఇష్టమైనవార్త, కథ, గానము, వినుటవలన శబ్దవిషయము వలన కలుగు సుఖము. శీతోష్ణ ఇష్టవస్తుస్పర్శన, ఆలింగనము మొదలగునవి, వీటివలన కలుగు సుఖము స్పర్శ అను విషయమువలన కలుగు సుఖము, కంటికి ఇష్టమైన వస్తువులను చూచుటవలన, ప్రకృతి సౌందర్యము సుందర రూపము మొదలగునవి రూపము అను విషయమువలన కలుగు సుఖము, ఇష్టమైన భక్ష్యము సేవించుటవలన, ఇష్టమైన పండు మొదలగు వాటివలన తినుటవలన రసము అను విషయమువలన కలుగు సుఖము, కస్తూరి, కర్పూరము, అగరువత్తి, అత్తరువు, పన్నీరు, మంచిగంధము మొదలగు పరిమళద్రవ్యములను విషయమువలన కలుగు సుఖము.
విషయములవలన చాలా అనర్థములగును - ఈ విషయమీక్రింద వివరించబడినది : -
(విహయములు ఏడు విధములైన దోషములు కలవి –
అల్పములు
స్థిరముగా నుండనివి
దుఃఖములకు మూలమైనవి (కారణమైనవి)
దుఃఖముతో కలిసియుండునవి
దుఃఖముతో నిండియుండునవి
దేహమే ఆత్మయను అభిమానమునకు కారణమైనవి
స్వాభావికముగా కలుగు బ్రహ్మానుభవమునకు విరుద్ధమైనవి)
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే |
క్రోధాద్భవతి సం మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః |
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి |“. ( శ్రీమద్భగవద్గీత - 2 - 62, 63)
(పురుషుడు విషయములగుఱించియే ధ్యానించుచుండిన వాటియందాసక్తి కలుగును, ఆసక్తివలన వాటియందు కోరిక జనించును. ఆ కోరికవలన (అది ఫలించకపోయిన) క్రోధము కలుగును, క్రోధమువలన సమ్మోహము కలుగును, సమ్మోహమువలన స్మృతి విభ్రమము కలుగును, దానివలన నాశము కలుగును -)
మామనుస్మరతశ్చిత్తం మయ్యేవ ప్రలీయతే |”
(విషయములగుఱించి ధ్యానించు చిత్తము విషయములందే మునిగియుండును. భగవంతుని గుఱించి ధ్యానించు చిత్తము భగవంతునిలోనే లీనమగును -)
ఉపభుక్తం విషం హంతి, విషయాస్మరణాదపి | ఇతి స్మృతేః -
(విషయమునకు విషమునకు చాలా తేడా ఉన్నది. భుజించిననే విషము చంపును, విషయములు స్మరించినమాత్రమున చంపును.)
జన్మాంతరఘ్నాః విషయాః ఏక దేహహరం విషం |“. (యోగవాశిష్టము - 29 - 13)
(విషము విషముకాదు - విషయములే విషము - విషము ఒక్క దేహమునే చంపును. విషయములు అనేక జన్మములందుకూడ నుండి చంపును)
తేనాస క్షరతి ప్రజ్ఞా ధృతేః పాదాని బోధకం |”
అస్యార్థః _
“సర్వేషా మింద్రియాణాం మధ్యే ఏకమపీంద్రియం విషయప్రవణం యది భవతి, తతః అస్య విషయపరస్య ఇంద్రియాం తరైరపి తత్వజ్ఞానం క్షరతి, నవ్యవతిష్టతే, చర్మనిర్మితపాత్రాదివ ఏకేనాపిభిద్రేణ సర్వస్థానస్థం ఏవ ఉదకం నవ్యవతిష్టతే ఇతి.”
(పైశ్లోకమునకర్థము : - ఇంద్రియములన్నింటిలోను ఏ ఒక్క ఇంద్రియమైనను విషయములందు నిమగ్నమైయున్న యడల ఆ విషయలోలుడైనవాని మిగిలిన ఇంద్రియములుకూడచెడిపోయి అతని తత్వజ్ఞానమును నశింపచేయును - అనగా, మిగిలిన విషయములందుకూడ లోలత్వము కలుగచేయును, అందుచేత బ్రహ్మజ్ఞానమునకు దూరముగా నుండునట్లు చేయును - ఎట్లంటే చర్మముతో (తోలుతో) చేయబడిన ఒకపాత్రలో (సంచీవంటిదానిలో) ఒకే కన్నముండినను ఆ పాత్రలోనుండు నీరంతయు కారిపోవును -, పాత్రనిండా కన్నములుండ నవసరము లేకనే)
“శబ్దాదిభిః పంచభిరేవ పంచ పంచత్వమాపుః స్వగుణై ర్నిబద్ధాః |
కురంగ మాతంగ పతంగ మీనభంగా నరః పంచభిరం చితః కిం?”
(లేడి, ఏనుగు, మిడిత, చేప, తుమ్మెద - ఆ అయిదు ప్రాణులు క్రమముగ శబ్ద స్పర్శ రూప రస గంధములను అయిదు విషయములవలనను మరణము పొందుచున్నవి. ఈ ప్రకారము ఒక్కొక్క జీవి ఒక్కొక్క విషయము మూలమున నశించుచుండగా, ఈ అయిదు విషయములు కలిసిన - ఈ అయిదు విషయములను సేవించిన - నరుని సంగతి అడుగనవసరములేదు, చెప్పనక్కరలేదు. కొండ పైనుండి నీరు సులభముగను వేగముగను పారును. కాని, కొండ కిందనుండి నీరును పైకి పంపుట కష్టము. ఈ ప్రకారముగానే విషయములందు ఉన్ముఖమై యుండుట మనస్సునకు చాల సులభము - త్వరితము గాని విషయములనుండి మనస్సును మరలించుట కష్టము).
ముదిసెను కేశములు, దనువు ముదిసెం; దనకున్
ముదియనివి రెండు సిక్కెను
- బ్రతికెడు తీపి యును విషయ పక్షస్పృహయున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 -)
(ఆడకుక్కలు కఱచుచున్నను వాటిని మగ కుక్కలు వెంటనంటుచుండునట్లునూ, ఆడగాడిదలు కాలి డెక్కలతో తన్నుచున్నను మగగాడదలు వాటి వెంబడి తగులుచుండునట్లును, చంపుటకు తీసుకొనిపోబడుచున్నను గుర్తు తెలియక పోవుచున్నట్లునూ, మనుష్యులు రాజసగుణము మొదలగు విషయములను దుఃఖవంతములని యెఱిగియు ఆపద పధమునే - ఆపద కలుగచేయు మార్గమునే అవలంభించెదరు)
ఇంద్రియాణీంద్రీయార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా |
విషయాః వినివర్తంతే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే |” ( శ్రీమద్భగవద్గీత - 2 - 58, 59)
(తాబేలు తన అవయవములన్నింటిని లోపలకు ముడుచుకొనునట్లు, విషయములనుండి ఇంద్రియములను మళ్ళించుకొనువాడు స్థితప్రజ్ఞుడు).
(విషయములనుండి ఇంద్రియములు నివర్తించినను వాటియందుగల తృష్ణ నివర్తించదు - పరమపదమగు భగవత్సాక్షాత్కరమును పొందినవానికి విషయములందలి రసము (అనురాగము) కూడ నివర్తించును).
వశే హి యస్యేంద్రియాణి తస్యప్రజ్ఞా ప్రతిష్టితా - (శ్రీమద్భగవద్గీత - 2 - 61)
(ఎవడు తన్మ ఇంద్రియములను తన వశములో నుంచుకొనునో - విషయములమీదకు పోనీయకుండునో - అతను స్థితప్రజ్ఞుడు)
(గ్రహించు స్వభావముగల ఇంద్రియములకంటె విషయములే మిక్కిలి గ్రాహక శకిగలవి)
(baṃdhiṃcunadi, baṃdhamu kaluga cēyunadi, phalamunanubhaviṃpa cēyunadi).
(śarīramukaṃṭe iṃdriyamulakaṃṭe vēṟainadi)
(śabdamu modalagunavi)
(śabdamu, sparśamu, rūpamu, rasamu, gaṃdhamu -ivi viṣayamulu, pṛdhivi modalagu mahabhūtamulanuṃḍi, kramamugā puṭṭinavi. vākku, cētulu, pādamulu, pāyuvu upasthamu anu pērugalavi karmēṃdriyamulu. vīṭiki kramamugā vacanamu (māṭalāḍuṭa), dānamu, gamanamu (naḍacuṭa), visargamu, ānaṃdamulu viṣayamulu, ivi pṛdhivi modalagumahā bhūtamulanuṃḍi puṭṭinavi. manassu, buddhi, ahaṃkāramu, cittamu ivi aṃtaḥkaraṇamu catuṣṭayamulu - vāṭiki varusagā saṃkalpamu, vikalpamu, adhyavasāyamu, abhimāna avadhāraṇa anunavi viṣayamulu -
(jñānēṃdriyamulaku viṣayamulu - śrōtramunaku (ceviki) śabdamu, tvakkunaku (carmamunaku) sparśamu, cakṣussuku rūpamu, jihvaku rasamu, ghrāṇamunaku gaṃdhamu, karmēṃdriyamulaku viṣayamulu - vākkunaku saṃbhāṣaṇa, catulaku grahaṇamu (paṭṭukonuṭa); upasthaku ānaṃdamu; gudamunaku malamunu visarjiṃcuṭa, pādamu gamanamu).
(pūladaṃḍalu, maṃcigaṃdhamu, strīlu, modalagunavi - bhōgamunakupacariṃcunavi).
(iṃdriyamulaku arthamulagu śabdamu modalagunavi.)
(iṃdriyamulaku āhāramulainavi viṣayamulu - “iṃdriyamulu padinnī - jñānēṃdriyamulu ayidu, karmēṃdriyamulu ayidu - āhāramu siddhiṃcuṭakoraku dvāramulu” ani ceppabaḍuṭavalana iṃdriyamulaku viṣayamulu āhāramulani ceppabaḍinavi.
(viṣayamulani ceppabaḍinavē iṃdriyamulu -)
(viṣamulanagā rūpamu modalagunavi, vāṭini anubhaviṃcu iṃdphriyamulukūḍā vāṭi upalakṣaṇamulugā ceppabaḍinavi).
(viṣayamulu sukharūpamulu - avē sukhamulu, sukhamunu kaligiṃcunavi, kāni ātmasvarūpamu vāṭikaṃṭe heccu ayina sukharūpamu).
“sarvaprapaṃcamunnū vēdyaṃ kābaṭṭi ghaṭaṃ valenē viṣayaṃ”.
śrōtriyēṃdriyēṇa śabda sākṣātkāra samayē śrōtrēṃdriyadvārā bahirnirgatāṃtaḥkaraṇasya sābhāsā vṛttiḥ dūrasthaṃvā aṃtigasthaṃvā śabdarūpaṃ viṣayaṃ prāpya śabda samānākāratāṃ bhajatē tadā aṃtaḥkaraṇavṛtyā śabda niṣṭāvaraṇaṃ nivartyatē, tanniṣṭā bhāsēna śabdaḥ prakāśyatē.
“itthaṃ itarēṃdriya viṣayāṇāṃ pratyakṣamō vijñēyaḥ -”
(iṃdriyamu - cevi - oka śabdamunu vininapuḍu śrōtrēṃdriyamu dvārā paiki prasariṃcina aṃtaḥkaraṇa vṛtti. ā śabdamu dūramulō ayinanu, daggaralō ayinanu śabdarūpamaina viṣayamunu poṃdi śabda samānamaina ākāramugā mārunu. appuḍu aṃtaḥkaraṇavṛtticēta śabda niṣṭāvaraṇamu nivartiṃcunu, - aṃducēta śabdamu vinabaḍunu - ī prakāramugānē viṣayamulu iṃdriyamulanu ākarṣiṃcunani teliyanagunu).
(iṃdriyārthamulaina viṣayamulu śabda sparśa rūpa rasa gaṃdhamulu, nīru kānivainanu sūrya raśmi rūpamulaina mṛgatṛṣṇamulu nīru ani bhrāṃticēta tōcunu - ā prakāramugānē viṣayamulu duḥkharūpamulainanu - duḥkhamunu kaligiṃcunavainanu - bhrāṃticēta sukharūpamulugānē tōcunu -)
iṣṭamainavārta, katha, gānamu, vinuṭavalana śabdaviṣayamu valana kalugu sukhamu. śītōṣṇa iṣṭavastusparśana, āliṃganamu modalagunavi, vīṭivalana kalugu sukhamu sparśa anu viṣayamuvalana kalugu sukhamu, kaṃṭiki iṣṭamaina vastuvulanu cūcuṭavalana, prakṛti sauṃdaryamu suṃdara rūpamu modalagunavi rūpamu anu viṣayamuvalana kalugu sukhamu, iṣṭamaina bhakṣyamu sēviṃcuṭavalana, iṣṭamaina paṃḍu modalagu vāṭivalana tinuṭavalana rasamu anu viṣayamuvalana kalugu sukhamu, kastūri, karpūramu, agaruvatti, attaruvu, pannīru, maṃcigaṃdhamu modalagu parimaḷadravyamulanu viṣayamuvalana kalugu sukhamu.
viṣayamulavalana cālā anarthamulagunu - ī viṣayamīkriṃda vivariṃcabaḍinadi : -
(vihayamulu ēḍu vidhamulaina dōṣamulu kalavi –
alpamulu
sthiramugā nuṃḍanivi
duḥkhamulaku mūlamainavi (kāraṇamainavi)
duḥkhamutō kalisiyuṃḍunavi
duḥkhamutō niṃḍiyuṃḍunavi
dēhamē ātmayanu abhimānamunaku kāraṇamainavi
svābhāvikamugā kalugu brahmānubhavamunaku viruddhamainavi)
saṃgāt saṃjāyatē kāmaḥ kāmāt krōdhōbhijāyatē |
krōdhādbhavati saṃ mōhaḥ sammōhāt smṛtivibhramaḥ |
smṛtibhraṃśāt buddhināśō buddhināśātpraṇaśyati |“. ( śrīmadbhagavadgīta - 2 - 62, 63)
(puruṣuḍu viṣayamulaguṟiṃciyē dhyāniṃcucuṃḍina vāṭiyaṃdāsakti kalugunu, āsaktivalana vāṭiyaṃdu kōrika janiṃcunu. ā kōrikavalana (adi phaliṃcakapōyina) krōdhamu kalugunu, krōdhamuvalana sammōhamu kalugunu, sammōhamuvalana smṛti vibhramamu kalugunu, dānivalana nāśamu kalugunu -)
māmanusmarataścittaṃ mayyēva pralīyatē |”
(viṣayamulaguṟiṃci dhyāniṃcu cittamu viṣayamulaṃdē munigiyuṃḍunu. bhagavaṃtuni guṟiṃci dhyāniṃcu cittamu bhagavaṃtunilōnē līnamagunu -)
upabhuktaṃ viṣaṃ haṃti, viṣayāsmaraṇādapi | iti smṛtēḥ -
(viṣayamunaku viṣamunaku cālā tēḍā unnadi. bhujiṃcinanē viṣamu caṃpunu, viṣayamulu smariṃcinamātramuna caṃpunu.)
janmāṃtaraghnāḥ viṣayāḥ ēka dēhaharaṃ viṣaṃ |“. (yōgavāśiṣṭamu - 29 - 13)
(viṣamu viṣamukādu - viṣayamulē viṣamu - viṣamu okka dēhamunē caṃpunu. viṣayamulu anēka janmamulaṃdukūḍa nuṃḍi caṃpunu)
tēnāsa kṣarati prajñā dhṛtēḥ pādāni bōdhakaṃ |”
asyārthaḥ _
“sarvēṣā miṃdriyāṇāṃ madhyē ēkamapīṃdriyaṃ viṣayapravaṇaṃ yadi bhavati, tataḥ asya viṣayaparasya iṃdriyāṃ tarairapi tatvajñānaṃ kṣarati, navyavatiṣṭatē, carmanirmitapātrādiva ēkēnāpibhidrēṇa sarvasthānasthaṃ ēva udakaṃ navyavatiṣṭatē iti.”
(paiślōkamunakarthamu : - iṃdriyamulanniṃṭilōnu ē okka iṃdriyamainanu viṣayamulaṃdu nimagnamaiyunna yaḍala ā viṣayalōluḍainavāni migilina iṃdriyamulukūḍaceḍipōyi atani tatvajñānamunu naśiṃpacēyunu - anagā, migilina viṣayamulaṃdukūḍa lōlatvamu kalugacēyunu, aṃducēta brahmajñānamunaku dūramugā nuṃḍunaṭlu cēyunu - eṭlaṃṭē carmamutō (tōlutō) cēyabaḍina okapātralō (saṃcīvaṃṭidānilō) okē kannamuṃḍinanu ā pātralōnuṃḍu nīraṃtayu kāripōvunu -, pātraniṃḍā kannamuluṃḍa navasaramu lēkanē)
“śabdādibhiḥ paṃcabhirēva paṃca paṃcatvamāpuḥ svaguṇai rnibaddhāḥ |
kuraṃga mātaṃga pataṃga mīnabhaṃgā naraḥ paṃcabhiraṃ citaḥ kiṃ?”
(lēḍi, ēnugu, miḍita, cēpa, tummeda - ā ayidu prāṇulu kramamuga śabda sparśa rūpa rasa gaṃdhamulanu ayidu viṣayamulavalananu maraṇamu poṃducunnavi. ī prakāramu okkokka jīvi okkokka viṣayamu mūlamuna naśiṃcucuṃḍagā, ī ayidu viṣayamulu kalisina - ī ayidu viṣayamulanu sēviṃcina - naruni saṃgati aḍuganavasaramulēdu, ceppanakkaralēdu. koṃḍa painuṃḍi nīru sulabhamuganu vēgamuganu pārunu. kāni, koṃḍa kiṃdanuṃḍi nīrunu paiki paṃpuṭa kaṣṭamu. ī prakāramugānē viṣayamulaṃdu unmukhamai yuṃḍuṭa manassunaku cāla sulabhamu - tvaritamu gāni viṣayamulanuṃḍi manassunu maraliṃcuṭa kaṣṭamu).
mudisenu kēśamulu, danuvu mudiseṃ; danakun
mudiyanivi reṃḍu sikkenu
- bratikeḍu tīpi yunu viṣaya pakṣaspṛhayun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 -)
(āḍakukkalu kaṟacucunnanu vāṭini maga kukkalu veṃṭanaṃṭucuṃḍunaṭlunū, āḍagāḍidalu kāli ḍekkalatō tannucunnanu magagāḍadalu vāṭi veṃbaḍi tagulucuṃḍunaṭlunu, caṃpuṭaku tīsukonipōbaḍucunnanu gurtu teliyaka pōvucunnaṭlunū, manuṣyulu rājasaguṇamu modalagu viṣayamulanu duḥkhavaṃtamulani yeṟigiyu āpada padhamunē - āpada kalugacēyu mārgamunē avalaṃbhiṃcedaru)
iṃdriyāṇīṃdrīyārthēbhyastasya prajñā pratiṣṭitā |
viṣayāḥ vinivartaṃtē nirāhārasya dēhinaḥ |
rasavarjaṃ rasōpyasya paraṃ dṛṣṭvā nivartatē |” ( śrīmadbhagavadgīta - 2 - 58, 59)
(tābēlu tana avayavamulanniṃṭini lōpalaku muḍucukonunaṭlu, viṣayamulanuṃḍi iṃdriyamulanu maḷḷiṃcukonuvāḍu sthitaprajñuḍu).
(viṣayamulanuṃḍi iṃdriyamulu nivartiṃcinanu vāṭiyaṃdugala tṛṣṇa nivartiṃcadu - paramapadamagu bhagavatsākṣātkaramunu poṃdinavāniki viṣayamulaṃdali rasamu (anurāgamu) kūḍa nivartiṃcunu).
vaśē hi yasyēṃdriyāṇi tasyaprajñā pratiṣṭitā - (śrīmadbhagavadgīta - 2 - 61)
(evaḍu tanma iṃdriyamulanu tana vaśamulō nuṃcukonunō - viṣayamulamīdaku pōnīyakuṃḍunō - atanu sthitaprajñuḍu)
(grahiṃcu svabhāvamugala iṃdriyamulakaṃṭe viṣayamulē mikkili grāhaka śakigalavi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.