← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విషయత్యాగము viṣayatyāgamu

Original — తెలుగు

“మనోయత్ర యోజయేత్ తత్త్రైవ యుక్తం భవతి. తథా తత్ యోజనం భవతీంద్రియ ద్వారైన.వయంభూయో యాదృశాని దృశ్యాని ద్రక్ష్యామో యాదృశీం వార్తాం శ్రోష్యామో, యథావిధం వస్తు భోక్ష్యామహే, యత్కించిత్ ఘ్రాశ్యమో, యాదృస్తుం స్పక్ష్యామశ్చ, తేషామేవ మనసి వారం వారం చింతనం భవిష్యతి. తథా, యస్య వస్తునో అధికం చింతనం భవిష్యతి తస్మిన్నేవ ఆసక్తిర్భవిష్యతి చేన్నాటకాని ద్రక్ష్యామః వేశ్యానాం గీతాని శ్రోష్యామః, తర్హితేషు ఆసక్తిర్భవిష్యతి. యది భక్తానాం లీలా విలోక్షిష్యాదునా కీర్తనాని ఆకర్ణయిష్యామశ్చ | తనాతేషు ఆసక్తిః ఉత్పద్యతే. అత ఏవ భక్తి మఖిల షద్భిః సాధకైః భగవతః ప్రతికూలానాం సర్వేషాం విషయాణాం త్రాగః కరణీయః - - - భగవతః ధ్యానం చింతనం కీర్తనం, భగవత్సేవా, సాధు సత్కారః సత్సంగాదయశ్చ యే భగవదనుకూలా విషయాః సంతితేషు తు తనుం మనశ్చ ఇచ్చాపూర్వకం యోజయేత్, తథా తథా తేషాం విషయాణాం సంగ్రహస్య సేవనస్య చ శరీర్రయాత్రా యై కుటుంబపోషణాయ వాని తాంత మానశ్యకతా భవేత్. తేషామపి యథా సంభవం స్వల్పతర పరిమాణ ఏవ సంగ్రహం సేవనం చ కుర్యాత్ తదపి శాస్త్రానుకూల మస్తి. తత్కర్తు మీశ్వరస్యాజ్ఞా అస్తీతి మత్వా అన్యాంకామ విఫలకా మనాం మనపి న స్థాపయన్ కేవలమీశ్వర ప్రీత్యర్థమేవ కుర్యాత్, ఏవం కృతం విషయసేవనమపి విషయ త్యాగేనైవ తుల్యం జ్ఞాయతే - కేవలం బహిరేవ కస్యాపి విషయస్య త్యాగః క్రియతే. తథా మనసి తస్య స్మరణం విద్యమానం స్యాత్. తథా స యదార్థస్త్యాగో నాస్తి”..

(మనస్సు ఎక్కడ నియోగించిన అక్కడేనే యుండవలెను - అట్లు అది ఇంద్రీయములద్వారా నియోగించియుండును - మనము మాటిమాటికి దేనిని - యే దృశ్యవస్తువులను - చూడవలసిన వస్తువులను - చూచు చుందుమో, ఏ వార్త విందుమో, యేరీతిగా భక్ష్యము చేయుచుందుమో, దేనిని ఏ కొంచెమైనను వాసన చేయుదుమో,వీటి గుఱించియే ప్రతిరోజు చింతించుచుందుమో, వాటిలో యే వస్తువు గుఱించి అధికముగ చింతించు చుందుమో వాటి యందే ఆసక్తి కలుగుచుండును. నాటకములను చూచుచుందుము, వేశ్యలగానము వినుచుందుము. అందుచేత వాటియందే ఆసక్తి కలుగును - భక్తుల లీలలు చూచినవారల

కీర్తనలను వినుచుండిన వాటియందాసక్తి కలుగును. అందుచేత భగవంతునికి ప్రతికూలమైన విషయములన్నింటినీ సాధకుడు వదలివేయవలేను. భగవంతుని గుఱించి చింతించుట, ధ్యానము చేయుట, భగవంతుని కీర్తించుట, భగవంతుని సేవ చేయుట, సాధువులను (సత్పురుషులను) సత్కరించుట, సాధుసంగము మొదలగు భగవంతునికనుకూలమైన ఏ విషయములు గలవో వాటియందు శరీరమును, మనస్సును నిల్పవలెను. శరీరయాత్ర జరుపుటకు (శరీరము నిలబెట్టుకొనుటకు), కుటుంబపోషణకు ఏ విషయములను సేవించుట యెంతవఱకు అనసరమో అంతమట్టుకే వాటిని సేవించవలెను - అట్లు చేయుటలో ఇది శాస్త్రములకనుకూలముగానున్నది. ఈ పని చేయమని భగవంతుని ఆజ్ఞ అయినది (కలదు) అని తలచి, ఇతర ఫలమును దేనిని కోఱక - మనసులో నుంచక - భగవంతునికొఱకే చేయవలెను - ఈ ప్రకారముగా విషయములను సేవించినను (అనుభవించినను) అవి విషయత్యాగముతో సమానమే యగును - కేవలము పైకి ఏదో ఒక విషయమును వదలి వేసినను మనసులో దానిని స్మరించుచునే యుండును - అట్టిది యదార్థముగా త్యాగము కాదు).

Transliteration

“manōyatra yōjayēt tattraiva yuktaṃ bhavati. tathā tat yōjanaṃ bhavatīṃdriya dvāraina.vayaṃbhūyō yādṛśāni dṛśyāni drakṣyāmō yādṛśīṃ vārtāṃ śrōṣyāmō, yathāvidhaṃ vastu bhōkṣyāmahē, yatkiṃcit ghrāśyamō, yādṛstuṃ spakṣyāmaśca, tēṣāmēva manasi vāraṃ vāraṃ ciṃtanaṃ bhaviṣyati. tathā, yasya vastunō adhikaṃ ciṃtanaṃ bhaviṣyati tasminnēva āsaktirbhaviṣyati cēnnāṭakāni drakṣyāmaḥ vēśyānāṃ gītāni śrōṣyāmaḥ, tarhitēṣu āsaktirbhaviṣyati. yadi bhaktānāṃ līlā vilōkṣiṣyādunā kīrtanāni ākarṇayiṣyāmaśca | tanātēṣu āsaktiḥ utpadyatē. ata ēva bhakti makhila ṣadbhiḥ sādhakaiḥ bhagavataḥ pratikūlānāṃ sarvēṣāṃ viṣayāṇāṃ trāgaḥ karaṇīyaḥ - - - bhagavataḥ dhyānaṃ ciṃtanaṃ kīrtanaṃ, bhagavatsēvā, sādhu satkāraḥ satsaṃgādayaśca yē bhagavadanukūlā viṣayāḥ saṃtitēṣu tu tanuṃ manaśca iccāpūrvakaṃ yōjayēt, tathā tathā tēṣāṃ viṣayāṇāṃ saṃgrahasya sēvanasya ca śarīrrayātrā yai kuṭuṃbapōṣaṇāya vāni tāṃta mānaśyakatā bhavēt. tēṣāmapi yathā saṃbhavaṃ svalpatara parimāṇa ēva saṃgrahaṃ sēvanaṃ ca kuryāt tadapi śāstrānukūla masti. tatkartu mīśvarasyājñā astīti matvā anyāṃkāma viphalakā manāṃ manapi na sthāpayan kēvalamīśvara prītyarthamēva kuryāt, ēvaṃ kṛtaṃ viṣayasēvanamapi viṣaya tyāgēnaiva tulyaṃ jñāyatē - kēvalaṃ bahirēva kasyāpi viṣayasya tyāgaḥ kriyatē. tathā manasi tasya smaraṇaṃ vidyamānaṃ syāt. tathā sa yadārthastyāgō nāsti”..

(manassu ekkaḍa niyōgiṃcina akkaḍēnē yuṃḍavalenu - aṭlu adi iṃdrīyamuladvārā niyōgiṃciyuṃḍunu - manamu māṭimāṭiki dēnini - yē dṛśyavastuvulanu - cūḍavalasina vastuvulanu - cūcu cuṃdumō, ē vārta viṃdumō, yērītigā bhakṣyamu cēyucuṃdumō, dēnini ē koṃcemainanu vāsana cēyudumō,vīṭi guṟiṃciyē pratirōju ciṃtiṃcucuṃdumō, vāṭilō yē vastuvu guṟiṃci adhikamuga ciṃtiṃcu cuṃdumō vāṭi yaṃdē āsakti kalugucuṃḍunu. nāṭakamulanu cūcucuṃdumu, vēśyalagānamu vinucuṃdumu. aṃducēta vāṭiyaṃdē āsakti kalugunu - bhaktula līlalu cūcinavārala

kīrtanalanu vinucuṃḍina vāṭiyaṃdāsakti kalugunu. aṃducēta bhagavaṃtuniki pratikūlamaina viṣayamulanniṃṭinī sādhakuḍu vadalivēyavalēnu. bhagavaṃtuni guṟiṃci ciṃtiṃcuṭa, dhyānamu cēyuṭa, bhagavaṃtuni kīrtiṃcuṭa, bhagavaṃtuni sēva cēyuṭa, sādhuvulanu (satpuruṣulanu) satkariṃcuṭa, sādhusaṃgamu modalagu bhagavaṃtunikanukūlamaina ē viṣayamulu galavō vāṭiyaṃdu śarīramunu, manassunu nilpavalenu. śarīrayātra jarupuṭaku (śarīramu nilabeṭṭukonuṭaku), kuṭuṃbapōṣaṇaku ē viṣayamulanu sēviṃcuṭa yeṃtavaṟaku anasaramō aṃtamaṭṭukē vāṭini sēviṃcavalenu - aṭlu cēyuṭalō idi śāstramulakanukūlamugānunnadi. ī pani cēyamani bhagavaṃtuni ājña ayinadi (kaladu) ani talaci, itara phalamunu dēnini kōṟaka - manasulō nuṃcaka - bhagavaṃtunikoṟakē cēyavalenu - ī prakāramugā viṣayamulanu sēviṃcinanu (anubhaviṃcinanu) avi viṣayatyāgamutō samānamē yagunu - kēvalamu paiki ēdō oka viṣayamunu vadali vēsinanu manasulō dānini smariṃcucunē yuṃḍunu - aṭṭidi yadārthamugā tyāgamu kādu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.