“రెండు వస్తువులు వేరుగానుండుట యొక్క భావమే ద్విత; ద్వితయే ద్వైతము - న+ ద్వైతం = అద్వైతం = రెండు లేనిది, రెండు కానిది అద్వైతము. జీవుడు, దేవుడు అని ఇద్దరు ఉండరు - ఈశ్వరుడనువాడొక్కడే కలడు అని అద్వైతపదమునకు అర్థము”
“రెండు వస్తువులు విశేషముగా కలిగిన యొక వస్తువు ప్రపంచమున శాశ్వతముగా నుండుట విశిష్టాద్వైతము - దేవుడు మనకు కనబడుటలేదు - కాని దేవుడుకాని ఇతర వస్తువులు మనకు కనబడుచున్నవి. ఒక మఱ్ఱి చెట్టును చూచినపుడు దాని యుత్పత్తికి మూలమైన విత్తనమొకటి యుండవలెనని తోచునట్లే ఈ ప్రపంచమను మహావృక్షమును చూచునపుడుకూడ దీని సృష్టికి మూలమేదో యొకటి యుండవలనని తోచకపోదు. కాన, దేవుడు ఈ దృశ్యమాన ప్రకృతిని, దాని ననుభవించు జీవుని కూడ స్వరూపముగా గలిగి యున్నాడని విశిష్టాద్వైతమను పదమునకు భావము”.
“తథా” యః పృధివీమంతరే సంచరన్ యస్య పృధివీ శరీరం, యం పృధివీ నవేద “ఇత్యారభ్య” యో అక్షరమంతరే సంచరన్ యస్యాక్షరం శరీరం, యమక్షరం నవేద,“ఇత్యన్యత్వాపి జీవస్య పరమాత్మ శరీరత్వం శ్రుతం, ఏవం”త్ సృష్ట్వా తదేవాను ప్రావిసత్, తదను ప్రవిశ్య సచ్చత్యచ్చా భవేత్” ఇతి జగత్సర్గపూర్వకం బ్రహ్మణః సర్వత్రోవాప్త్యా సర్వ శరీరకత్వం శ్రూయతే - - - గోజఠరగతవత్సవత్ సర్వవ్యాప్తస్య బ్రహ్మణః ప్రత్యేకం సర్వ వస్తుషు పుష్కల ప్రతీత్యర్హస్థితి విశేషః ఏవత్ర అను ప్రవేశః.
తస్మాత్ శ్రుత్యాదిభిః ప్రమాణైః ప్రసిద్ధ్యాత్ పరం బ్రహ్మ చిద చిచ్ఛరీరకత్వం, సర్వాంతర్యామిత్ర, సత్యకామత్వ, సత్యసంకల్పత్వ నిరతిశయే షాడ్గుణ్యాది విశేష విశిష్టమేవ ప్రసిద్ధ్యతీతి. సవిశేషాద్వైత పరాణ్యేవ పూర్వోక్త వచనాని, న నిర్విశేషాద్వైత పరాణీతి విశిష్టాద్వైతినాం సిద్ధాంతః.
ఏవం స విశేష బ్రహ్మాద్వైతాభిప్రాయకత్వాత్ విశిష్టాద్వైతమితి వ్యపదేశః. అయం భావః - బ్రహ్మైకమేవ తత్వం ఇతి వైశిష్ట్యాభిప్రాయేణ వ్యపదేశః, నిష్కర్షేతు తత్వత్రయమేవ ఇతి.
(అనంతల్యాణగుణములకు సముద్రుడువంటివాడు - లెక్కలేనన్ని కల్యాణగుణములు గలవాడు - అయిన పరబ్రహ్మ చిద్వస్తువులు అచిద్వస్తువులు (జీవ ప్రకృతులు) ఆత్మ యొక్క శరీరములుగా నున్నవి యని వాటి సంబంధమును శ్రుతులు చెప్పుచున్నవి. బృహదారణ్యకోపనిషత్తులో “యః పృధివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో, యం పృథివీ న వేద, యస్య పృథివీ శరీరం, యః పృథివీమంతరో యమయతి, ఏషతే ఆత్మా అంతర్యామ్యమృతః”. భూమిమీదనుండి ఎవడు భూమికి లోపలనుండువాడో, భూమి అతనికి శరీరమయ్యును భూమి ఎవరిని నెరుగలేదో, భూమిలోపలనేయుండి దానిని ఎవడు నియమించునో, అతనే నీ యొక్క ఆత్మ, నీలో అంతర్యామిగా నున్నవాడు - నీ లోపల సంచరించువాడు -, అతడే అమృతుడు (చావులేనివాడు). ఇట్లు చెప్పుట మొదలుపెట్టి - “యో విజ్ఞానే తిష్టన్ విజ్ఞానాదం తరో, యం విజ్ఞానం న వేద, యస్య విజ్ఞానం శరీరం, యో విజ్ఞానమంతరో యమయతి, స త ఆత్మాంతర్యామ్యమృతః” అనునంతవఱకు చెప్పబడినది. విజ్ఞానమనగా జీవుడు. ఎవడు జీవునిలోనుండినను జీవుడతనిని తెలుసుకొనలేడో, ఎవనికి జీవుడే శరీరమో ఎవడు జీవునిలోపలనుండి అతనిని అతని పనులలో నియమించునో, అతడే నీ ఆత్మ, నీలోనుండు అంతర్యామి, అమృతుడు (చావులేనివాడు), (నిత్యుడు). ఇట్లు భూమి గుఱించి చెప్పుటవలన అచేతనవస్తువులలో భగవంతుడు అధిష్టించియుండుటను, అచేతనములు భగవంతుని శరీరములగుటను చెప్పబడినది. జీవుని గుఱించి చెప్పుటవలన జీవులలో భగవంతుడు అధిష్టించియుండు టయు, జీవులు భగవంతుని శరీరమగుటయు చెప్పడమైనది. ఇట్లు భూమి మొదలగు వాటిలో భగవంతుడు ఉండుట - అధిష్టించియుండుట - అనగా, వాటిలో అతను అంతర్యామిగానుండుట - యని అర్థము. “పృథివ్యాః అంతరం”, ” విజ్ఞానాదంతరం” అని చెప్పుటవలనను, “అంతరోయమ యతి” (లోపలనుండి నియమించువాడు) అని చెప్పుటచేతను భగవంతుడు శరీరము గల వాడగుట, అన్నింటిలోనుండుట చెప్పబడినది. శరీరలక్షణము ఈ విధముగా చెప్పబడినది - యస్య చేతనస్య యత్ ద్రవ్యం సర్వాత్మనా స్వార్థే నియంతుం ధారయితుంచ శక్యం తచ్ఛేషతైక స్వరూపంచ తత్ తస్య శరీరం (ఏ చేతనవస్తువుయొక్క ద్రవ్యము - material - సర్వాత్ముడగు (అన్నింటికి ఆత్మయగు) భగవంతునిచే స్వార్థమందు (తన స్వంతప్రయోజనము కొఱకు) నియమించి, దానిని నియమించుటకు, ధరించుటకు భగవంతుడు శక్తికలిగు యుండునో అది అతని శేషతైకస్వరూపము. ఇట్టి శరీరలక్షణము భూమి మొదలగువాటికి సిద్ధించుచున్నది.
ఇట్టి శరీరలక్షణము భూమి మొదలగువాటికి సిద్ధించుచున్నది. చేతనములను అచేతనములను సర్వాత్ముడైన భగవంతుడు తన ప్రయోజనము కొఱకు నియమించుటకు, ధరించుటకు శక్తి కలిగియున్నవాడగుటచేత వాటికి అతను శేషతైకస్వరూపుడగుటచేత భగవంతునికి శరీరమున్నదని చెప్పబడినది. అనగా, అంతర్యామియగు జీవుడుకంటె వ్యతిరేకమైనవాడు భగవంతుడు అనుట సిద్ధించినది.
(భగవంతుని గుఱించి ఇంకను ఈ విధముగా చెప్పబడినది - “యో అక్షరమంతరే సంచరన్ యస్యాక్షరం శరీరం, యమక్షరం న వేద” (ఎవడు జీవుని లోపల సంచరించుచు, జీవుడు ఎవరికి శరీరమగునో, ఎవనిని జీవుడు తెలుసుకొనలేడో) అని కూడా చెప్పబడినది. దీనిని బట్టి జీవుడు పరమాత్మకి శరీరమని చెప్పబడినది.” తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్, తదను ప్రవిశ్య సచ్చత్యచ్చా భవత్” (దానిని సృష్టించి - ప్రపంచమును, దానిలోని వస్తువులను సృష్టించి), దానిలో ప్రవేశించి ‘సత్’, ‘త్యత్’ (చేతనా చేతనములుగా) తానే ఆయెను). ఇట్లు చెప్పుటచేత సృష్టిపూర్వము భగవంతుడు అన్నింటిలోను వ్యాపించియుండుటచేత అన్నియు అతని శరీరములే యనుట చెప్పబడినది. భగవంతుడు అన్నింటిలోను ప్రవేశించి యున్నాడు అనగా - అన్నింటిలోను వ్యాపించియుండు పరబ్రహ్మ గోవుకడుపులోని పెయ్యివలె అన్ని వస్తువులందు ప్రత్యేకంగా నుండునని చెప్పుటయే దీని యర్థము).
(పైన చెప్పబడినదానిని బట్టి, శ్రుతి మొదలగు ప్రమాణములను బట్టి పరబ్రహ్మయొక్క చిదచిద్వస్తువులు శరీరముగా కలిగియుండుట, అన్నింటిలోను అంతర్యముగానుండుటయు, సత్యకామత్వము, సత్య సంకల్పత్వము - (“సత్యకామః సత్య సంకల్పః, ఆకాశాత్మా” అని శ్రుతి), అపరిమితమైన - అడ్డులేని శక్తిగలవాడగుటచేతను, అతని కామము సత్యమైనది, అతని సంకల్పము సత్యమైనది) కలిగియుండుట, షడ్విదైశ్వర్యములు కలిగియుండుట (అందువలననే భగవంతుడని చెప్పబడుట) - ఈ మొదలగు విశేషములచే విశిష్టుడని చెప్పుటచేత, విశిష్టాద్వైతముని తెలియచేయునవియే పైన చెప్పబడిన శ్రుతి వాక్యములగుచున్నవి. ఇదియే విశిష్టాద్వైతసిద్ధాంతము).
వస్తు తస్తు వేదాంతానాం చిదచిద్వశిష్టాద్వైతం ఏకమేవ బ్రహ్మ ఇతి తాత్పర్యం అత ఏవ చిదచిద్విశిష్టం బ్రహ్మ ఏక మేవమత్వా భగవాన్ బాదరాయణం “అధాతో బ్రహ్మ జిజ్ఞాసా” ఇతి ఉపక్రమ్య తదేవ సప్రకారం నిరూపితవాన్ అతః చిదచిద్వశిష్టః బ్రహ్మశబ్ద వాచ్య విష్ణ్వాఖ్యః పరవాసుదేవో నారాయణః ఏవైకమితి విశిష్టాద్వైత వాదినాం దర్శనం ఇతి సిద్ధం ( యతీంద్రిమాతదీపిక)
సూక్ష్మ చిదచిద్విశిష్ట బ్రహ్మము జగత్కారణమనియు, స్థూల చిదచిద్విశిష్ట బ్రహ్మము కార్యమనియు చెప్పునది.
స్థూల చిదవిద్విశిష్ట పరమాత్మకు, సూక్ష్మ చిదచిద్విశిష్ట ప్రమాత్మకు నభేదముచెప్పటే విశిష్టాద్వైత శబ్దార్థము.
“కారణతత్వమునకు కార్యతత్వమునకు గల భేదము నెఱుంగుటయే తత్వమెఱుంగుట - - - బాహ్యముగ కన్పట్టు నామరూపములు నియతముగ నుండవు. కాని మూలపదార్థము సూక్ష్మముగా కారణావస్థలోకాని స్థూలముగానుండు కార్యావస్థలోగాని ఏక రూపముగానే యుండును. స్థూలముగా కన్పట్టు జగత్తులో జడమగు ప్రకృతితత్వము దానికాత్మగా జీవతత్వము, దానికాత్మగా అంతర్యామియై ప్రరమాత్మ తత్వము ఉండును. పరమాత్మ ఆత్మగావున జీవ ప్రకృతి తత్వములు పరమాత్మలేనిదే నిలువ జాలునవి కావు, దానితో నుండిననే యుండును. కావున తత్వము విశిష్టమగునదే కాని విడివిడిగానుండదు. ఆ తత్వము సృష్టికిముందు కారణము, సృష్టికి తర్వాత కార్యము అనబడును. సృష్టికిముందు జడమగు ప్రకృతి నామరూపవిభాగములేక ఏకమై యుండును -, కాని ప్రకృతి జీవతత్వములు పరమాత్మతో సూక్ష్మరూపములో చేరియుండును, అందుచే లేనట్టు కన్పట్టును. సృష్టిలో పరమాత్మ సంకల్పముచే ప్రకృతి పరిణామమునంది - జగద్రూపము నంది బయల్పడును, అపుడు స్థూలముగ కనబడు నామరూపములుగల ప్రకృతికి లోన ఆత్మ, ఆలోన పరమాత్మ యుండును. ఇట్లు స్థూలమగు ప్రకృతితో, జీవతత్వముతోను కూడిన పరమాత్మయే జగత్తు - కార్యము)”.
ఈశ్వరుడు సర్వాంతర్యామి - ఇతడు సూక్ష్మ జీవ ప్రకృతులందును, స్థూలజీవ ప్రకృతులందును గలడు. స్థూలరూపమునకు సూక్ష్మరూపమే కారణము. కాబట్టి సూక్ష్మజీవ ప్రకృతులకు అంతర్యామి యగు ఈశ్వరుడు స్థూలజీవ ప్రకృతులకు అంతర్యామి యగు ఈశ్వరుడు - ఈశ్వరుడే కార్యము. ఇట్లు రెండు అవస్థలయందును జీవప్రకృతులు పరమాత్మకు శరీరభూతములు. అందువల్లనే ఈశ్వరుడు విశిష్టుడని పిలువబడుచున్నాడు. సూక్ష్మజీవప్రకౄతి విశిష్టుడును, స్థూలజీవప్రకృతి విశిష్టుడును అగు పరమాత్మ యొక్కడే - ఇదియే విశిష్టాద్వైతము - విశిష్టులిద్దరికిని ఐక్యము.
“reṃḍu vastuvulu vērugānuṃḍuṭa yokka bhāvamē dvita; dvitayē dvaitamu - na+ dvaitaṃ = advaitaṃ = reṃḍu lēnidi, reṃḍu kānidi advaitamu. jīvuḍu, dēvuḍu ani iddaru uṃḍaru - īśvaruḍanuvāḍokkaḍē kalaḍu ani advaitapadamunaku arthamu”
“reṃḍu vastuvulu viśēṣamugā kaligina yoka vastuvu prapaṃcamuna śāśvatamugā nuṃḍuṭa viśiṣṭādvaitamu - dēvuḍu manaku kanabaḍuṭalēdu - kāni dēvuḍukāni itara vastuvulu manaku kanabaḍucunnavi. oka maṟṟi ceṭṭunu cūcinapuḍu dāni yutpattiki mūlamaina vittanamokaṭi yuṃḍavalenani tōcunaṭlē ī prapaṃcamanu mahāvṛkṣamunu cūcunapuḍukūḍa dīni sṛṣṭiki mūlamēdō yokaṭi yuṃḍavalanani tōcakapōdu. kāna, dēvuḍu ī dṛśyamāna prakṛtini, dāni nanubhaviṃcu jīvuni kūḍa svarūpamugā galigi yunnāḍani viśiṣṭādvaitamanu padamunaku bhāvamu”.
“tathā” yaḥ pṛdhivīmaṃtarē saṃcaran yasya pṛdhivī śarīraṃ, yaṃ pṛdhivī navēda “ityārabhya” yō akṣaramaṃtarē saṃcaran yasyākṣaraṃ śarīraṃ, yamakṣaraṃ navēda,“ityanyatvāpi jīvasya paramātma śarīratvaṃ śrutaṃ, ēvaṃ”t sṛṣṭvā tadēvānu prāvisat, tadanu praviśya saccatyaccā bhavēt” iti jagatsargapūrvakaṃ brahmaṇaḥ sarvatrōvāptyā sarva śarīrakatvaṃ śrūyatē - - - gōjaṭharagatavatsavat sarvavyāptasya brahmaṇaḥ pratyēkaṃ sarva vastuṣu puṣkala pratītyarhasthiti viśēṣaḥ ēvatra anu pravēśaḥ.
tasmāt śrutyādibhiḥ pramāṇaiḥ prasiddhyāt paraṃ brahma cida ciccharīrakatvaṃ, sarvāṃtaryāmitra, satyakāmatva, satyasaṃkalpatva niratiśayē ṣāḍguṇyādi viśēṣa viśiṣṭamēva prasiddhyatīti. saviśēṣādvaita parāṇyēva pūrvōkta vacanāni, na nirviśēṣādvaita parāṇīti viśiṣṭādvaitināṃ siddhāṃtaḥ.
ēvaṃ sa viśēṣa brahmādvaitābhiprāyakatvāt viśiṣṭādvaitamiti vyapadēśaḥ. ayaṃ bhāvaḥ - brahmaikamēva tatvaṃ iti vaiśiṣṭyābhiprāyēṇa vyapadēśaḥ, niṣkarṣētu tatvatrayamēva iti.
(anaṃtalyāṇaguṇamulaku samudruḍuvaṃṭivāḍu - lekkalēnanni kalyāṇaguṇamulu galavāḍu - ayina parabrahma cidvastuvulu acidvastuvulu (jīva prakṛtulu) ātma yokka śarīramulugā nunnavi yani vāṭi saṃbaṃdhamunu śrutulu ceppucunnavi. bṛhadāraṇyakōpaniṣattulō “yaḥ pṛdhivyāṃ tiṣṭan pṛthivyā aṃtarō, yaṃ pṛthivī na vēda, yasya pṛthivī śarīraṃ, yaḥ pṛthivīmaṃtarō yamayati, ēṣatē ātmā aṃtaryāmyamṛtaḥ”. bhūmimīdanuṃḍi evaḍu bhūmiki lōpalanuṃḍuvāḍō, bhūmi ataniki śarīramayyunu bhūmi evarini nerugalēdō, bhūmilōpalanēyuṃḍi dānini evaḍu niyamiṃcunō, atanē nī yokka ātma, nīlō aṃtaryāmigā nunnavāḍu - nī lōpala saṃcariṃcuvāḍu -, ataḍē amṛtuḍu (cāvulēnivāḍu). iṭlu ceppuṭa modalupeṭṭi - “yō vijñānē tiṣṭan vijñānādaṃ tarō, yaṃ vijñānaṃ na vēda, yasya vijñānaṃ śarīraṃ, yō vijñānamaṃtarō yamayati, sa ta ātmāṃtaryāmyamṛtaḥ” anunaṃtavaṟaku ceppabaḍinadi. vijñānamanagā jīvuḍu. evaḍu jīvunilōnuṃḍinanu jīvuḍatanini telusukonalēḍō, evaniki jīvuḍē śarīramō evaḍu jīvunilōpalanuṃḍi atanini atani panulalō niyamiṃcunō, ataḍē nī ātma, nīlōnuṃḍu aṃtaryāmi, amṛtuḍu (cāvulēnivāḍu), (nityuḍu). iṭlu bhūmi guṟiṃci ceppuṭavalana acētanavastuvulalō bhagavaṃtuḍu adhiṣṭiṃciyuṃḍuṭanu, acētanamulu bhagavaṃtuni śarīramulaguṭanu ceppabaḍinadi. jīvuni guṟiṃci ceppuṭavalana jīvulalō bhagavaṃtuḍu adhiṣṭiṃciyuṃḍu ṭayu, jīvulu bhagavaṃtuni śarīramaguṭayu ceppaḍamainadi. iṭlu bhūmi modalagu vāṭilō bhagavaṃtuḍu uṃḍuṭa - adhiṣṭiṃciyuṃḍuṭa - anagā, vāṭilō atanu aṃtaryāmigānuṃḍuṭa - yani arthamu. “pṛthivyāḥ aṃtaraṃ”, ” vijñānādaṃtaraṃ” ani ceppuṭavalananu, “aṃtarōyama yati” (lōpalanuṃḍi niyamiṃcuvāḍu) ani ceppuṭacētanu bhagavaṃtuḍu śarīramu gala vāḍaguṭa, anniṃṭilōnuṃḍuṭa ceppabaḍinadi. śarīralakṣaṇamu ī vidhamugā ceppabaḍinadi - yasya cētanasya yat dravyaṃ sarvātmanā svārthē niyaṃtuṃ dhārayituṃca śakyaṃ tacchēṣataika svarūpaṃca tat tasya śarīraṃ (ē cētanavastuvuyokka dravyamu - material - sarvātmuḍagu (anniṃṭiki ātmayagu) bhagavaṃtunicē svārthamaṃdu (tana svaṃtaprayōjanamu koṟaku) niyamiṃci, dānini niyamiṃcuṭaku, dhariṃcuṭaku bhagavaṃtuḍu śaktikaligu yuṃḍunō adi atani śēṣataikasvarūpamu. iṭṭi śarīralakṣaṇamu bhūmi modalaguvāṭiki siddhiṃcucunnadi.
iṭṭi śarīralakṣaṇamu bhūmi modalaguvāṭiki siddhiṃcucunnadi. cētanamulanu acētanamulanu sarvātmuḍaina bhagavaṃtuḍu tana prayōjanamu koṟaku niyamiṃcuṭaku, dhariṃcuṭaku śakti kaligiyunnavāḍaguṭacēta vāṭiki atanu śēṣataikasvarūpuḍaguṭacēta bhagavaṃtuniki śarīramunnadani ceppabaḍinadi. anagā, aṃtaryāmiyagu jīvuḍukaṃṭe vyatirēkamainavāḍu bhagavaṃtuḍu anuṭa siddhiṃcinadi.
(bhagavaṃtuni guṟiṃci iṃkanu ī vidhamugā ceppabaḍinadi - “yō akṣaramaṃtarē saṃcaran yasyākṣaraṃ śarīraṃ, yamakṣaraṃ na vēda” (evaḍu jīvuni lōpala saṃcariṃcucu, jīvuḍu evariki śarīramagunō, evanini jīvuḍu telusukonalēḍō) ani kūḍā ceppabaḍinadi. dīnini baṭṭi jīvuḍu paramātmaki śarīramani ceppabaḍinadi.” tat sṛṣṭvā tadēvānu prāviśat, tadanu praviśya saccatyaccā bhavat” (dānini sṛṣṭiṃci - prapaṃcamunu, dānilōni vastuvulanu sṛṣṭiṃci), dānilō pravēśiṃci ‘sat’, ‘tyat’ (cētanā cētanamulugā) tānē āyenu). iṭlu ceppuṭacēta sṛṣṭipūrvamu bhagavaṃtuḍu anniṃṭilōnu vyāpiṃciyuṃḍuṭacēta anniyu atani śarīramulē yanuṭa ceppabaḍinadi. bhagavaṃtuḍu anniṃṭilōnu pravēśiṃci yunnāḍu anagā - anniṃṭilōnu vyāpiṃciyuṃḍu parabrahma gōvukaḍupulōni peyyivale anni vastuvulaṃdu pratyēkaṃgā nuṃḍunani ceppuṭayē dīni yarthamu).
(paina ceppabaḍinadānini baṭṭi, śruti modalagu pramāṇamulanu baṭṭi parabrahmayokka cidacidvastuvulu śarīramugā kaligiyuṃḍuṭa, anniṃṭilōnu aṃtaryamugānuṃḍuṭayu, satyakāmatvamu, satya saṃkalpatvamu - (“satyakāmaḥ satya saṃkalpaḥ, ākāśātmā” ani śruti), aparimitamaina - aḍḍulēni śaktigalavāḍaguṭacētanu, atani kāmamu satyamainadi, atani saṃkalpamu satyamainadi) kaligiyuṃḍuṭa, ṣaḍvidaiśvaryamulu kaligiyuṃḍuṭa (aṃduvalananē bhagavaṃtuḍani ceppabaḍuṭa) - ī modalagu viśēṣamulacē viśiṣṭuḍani ceppuṭacēta, viśiṣṭādvaitamuni teliyacēyunaviyē paina ceppabaḍina śruti vākyamulagucunnavi. idiyē viśiṣṭādvaitasiddhāṃtamu).
vastu tastu vēdāṃtānāṃ cidacidvaśiṣṭādvaitaṃ ēkamēva brahma iti tātparyaṃ ata ēva cidacidviśiṣṭaṃ brahma ēka mēvamatvā bhagavān bādarāyaṇaṃ “adhātō brahma jijñāsā” iti upakramya tadēva saprakāraṃ nirūpitavān ataḥ cidacidvaśiṣṭaḥ brahmaśabda vācya viṣṇvākhyaḥ paravāsudēvō nārāyaṇaḥ ēvaikamiti viśiṣṭādvaita vādināṃ darśanaṃ iti siddhaṃ ( yatīṃdrimātadīpika)
sūkṣma cidacidviśiṣṭa brahmamu jagatkāraṇamaniyu, sthūla cidacidviśiṣṭa brahmamu kāryamaniyu ceppunadi.
sthūla cidavidviśiṣṭa paramātmaku, sūkṣma cidacidviśiṣṭa pramātmaku nabhēdamuceppaṭē viśiṣṭādvaita śabdārthamu.
“kāraṇatatvamunaku kāryatatvamunaku gala bhēdamu neṟuṃguṭayē tatvameṟuṃguṭa - - - bāhyamuga kanpaṭṭu nāmarūpamulu niyatamuga nuṃḍavu. kāni mūlapadārthamu sūkṣmamugā kāraṇāvasthalōkāni sthūlamugānuṃḍu kāryāvasthalōgāni ēka rūpamugānē yuṃḍunu. sthūlamugā kanpaṭṭu jagattulō jaḍamagu prakṛtitatvamu dānikātmagā jīvatatvamu, dānikātmagā aṃtaryāmiyai praramātma tatvamu uṃḍunu. paramātma ātmagāvuna jīva prakṛti tatvamulu paramātmalēnidē niluva jālunavi kāvu, dānitō nuṃḍinanē yuṃḍunu. kāvuna tatvamu viśiṣṭamagunadē kāni viḍiviḍigānuṃḍadu. ā tatvamu sṛṣṭikimuṃdu kāraṇamu, sṛṣṭiki tarvāta kāryamu anabaḍunu. sṛṣṭikimuṃdu jaḍamagu prakṛti nāmarūpavibhāgamulēka ēkamai yuṃḍunu -, kāni prakṛti jīvatatvamulu paramātmatō sūkṣmarūpamulō cēriyuṃḍunu, aṃducē lēnaṭṭu kanpaṭṭunu. sṛṣṭilō paramātma saṃkalpamucē prakṛti pariṇāmamunaṃdi - jagadrūpamu naṃdi bayalpaḍunu, apuḍu sthūlamuga kanabaḍu nāmarūpamulugala prakṛtiki lōna ātma, ālōna paramātma yuṃḍunu. iṭlu sthūlamagu prakṛtitō, jīvatatvamutōnu kūḍina paramātmayē jagattu - kāryamu)”.
īśvaruḍu sarvāṃtaryāmi - itaḍu sūkṣma jīva prakṛtulaṃdunu, sthūlajīva prakṛtulaṃdunu galaḍu. sthūlarūpamunaku sūkṣmarūpamē kāraṇamu. kābaṭṭi sūkṣmajīva prakṛtulaku aṃtaryāmi yagu īśvaruḍu sthūlajīva prakṛtulaku aṃtaryāmi yagu īśvaruḍu - īśvaruḍē kāryamu. iṭlu reṃḍu avasthalayaṃdunu jīvaprakṛtulu paramātmaku śarīrabhūtamulu. aṃduvallanē īśvaruḍu viśiṣṭuḍani piluvabaḍucunnāḍu. sūkṣmajīvaprakṝti viśiṣṭuḍunu, sthūlajīvaprakṛti viśiṣṭuḍunu agu paramātma yokkaḍē - idiyē viśiṣṭādvaitamu - viśiṣṭuliddarikini aikyamu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.