← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విష్ణు భక్తుడు viṣṇu bhaktuḍu

Original — తెలుగు
  1. విష్ణుని సేవించువాడు.

  2. “శ్లో. న చలతి నిజవర్ణ ధర్మతః యస్సమమతిరాత్మ సుహృద్విపక్ష పక్షే |

న హరతి న చహంతి కించిదుచ్ఛైః సితమననం తమేవ హి విష్ణుభక్తః ||“. (విష్ణుపురాణము -)

“ఉచ్ఛైః అతిశయేన, సితం స్వచ్చ్ఛం, రాగాదిరహితం మనో యస్యసః; తం విష్ణు భక్తం విద్ధి; మనస్స్వచ్ఛత్వస్య దుర్విజ్ఞేయత్వాత్ తస్య జ్ఞాపక ఛిన్నాన్యాహ న చతీతి. శుద్ధ సత్వస్య రాగాద్య భావాత్ ఆత్మనః సుహృత్పక్షే విపక్ష పక్షే అపి చ సమమతిత్వం పరస్వ హరణాది నివృత్తశ్చ భవతి తస్య చిహ్నం ఇత్యస్యార్థః”,

(మిక్కిలి స్వచ్చమైన మనస్సు గలవాడు, అనగా, రాగము మొదలగునవి లేని మనస్సు కలవాడు విష్ణు భక్తుడు అని తెలుసుకొనవలెను - తన వర్ణధర్మము తప్పకుండ నెరవేర్చువాడు. స్నేహితులందు, శత్రువులందు సమమైన - ఒక్కలాంటి - మనస్సు కలవాడు; స్వచ్చమైన నిర్మలమైన మనస్సుకలవాడు విష్ణు భక్తుడు.)

  1. “శ్లో. వర్ణాశ్రమాచారవతా పురుషేణ పరః పుమాన్, విష్ణు రారాధ్యతే; పంథా నాన్యః తత్తోషకారకః ||”.

“ఆచార వతాం ఇత్యత్ర ఆచారగ్రహణం యజ్ఞాదేః కర్మణోప్యుపలక్షణం. అన్యః విష్ణ్వారాధన లక్షణః శృతి, స్మృతి విహిత ధర్మత్యాగే న కేవల తద్ర్వత ధారణ శ్రవణ కీర్తనాదిః - తత్తోషకారకః న భవతీత్యర్థః.”

(వర్నాశ్రమ ధర్మములనాచరించు పురుషునిచే - అనగా - యజ్ఞములు మొదలగునవి - వర్ణములయొక్క, ఆశ్రమములయొక్క ధర్మములనాచరించు పురుషుని చేత విఉష్ణువు ఆరాధింపబడుచున్నాడు. ఇతర మార్గములు, సాధనములు విష్ణువుని సంతోషింపచేయవు. శృతి స్మృతులలో చెప్పిన ధర్మములను విడిచి పెట్టి కేవలము వ్రతములు, కథాశ్రవణము, నామకీర్తనము వలననే విష్ణువు సంతోషింపడని యర్థము).

  1. “శ్లో. యస్యానుగ్రహమిచ్ఛామి తస్య విత్తం హరామ్యహం |

బాంధవైశ్చ వియోగేన బృశంభవతి దుఃఖితః |

తేన దుఃఖేన సంతప్తో యది మాం న పరిత్యజేత్ |

తం ప్రసాదం కరిష్యామి యస్సురైరపి దుర్లభః ||“.

“సీ. వసుమతీనాధ! యెవ్వనిమీద నా కనుగ్రహ బుద్ధి వొడము నా ఘనుని విత్త

మంతయు గ్రమమున నపహరించినవాడు ధనహీనుడగుచు సంతాపమంద

విడుతురు బంధు లవ్విధమున నొంటరియై. చేయునది లేక యఖిల కార్య

భారంబులుడిగి మద్భక్తులతో మైత్రి నెఱపుచు విజ్ఞాన నిరతుడగుచు

తే. పిదప వాడవ్యయానంద పరమ యాత్మ

బరగ శ్రీవిష్ణులోక సంప్రాప్తి నొందు;

గాన మత్సేవ మిగుల దుష్కరమటంచు

వదలి భజియింతు రితల దేవతులనెపుడు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1234)

  1. సీ. - - - ఘనశక్తి సహితుండు కాలకంధరుడు దా వినుత గుణత్రయాన్వితుడు గాన

రాగాది యుక్తమై రాజిల్లు సంపదలాతని గొలుచువారందు చుందు

రచ్యుతు బరము ననంతు గుణాతీతు, బురుషోత్తముని నాది పురుషు ననఘ

తే. నర్జి భజియించువారు రాగాది రహితు

లగుచు దీపింతురెంతయు, ననఘ చరిత! - - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ. భా. - 1231, 1232)

  1. శ్లో. శ్వపచోపి మహీపాల విష్ణు భక్తో ద్విజాధికః |

విష్ణుభక్తి విహీనస్తు ద్విజోపి శ్వపచాధమః ||

(శ్వపచుడైనను విష్ణుభక్తుడైనయడల అతను బ్రాహ్మణుని కంటె నధికుడు - విష్ణుభక్తి లేనివాడు బ్రాహ్మణుడైనను శ్వపచునికంటె అధముడు).

Transliteration
  1. viṣṇuni sēviṃcuvāḍu.

  2. “ślō. na calati nijavarṇa dharmataḥ yassamamatirātma suhṛdvipakṣa pakṣē |

na harati na cahaṃti kiṃciducchaiḥ sitamananaṃ tamēva hi viṣṇubhaktaḥ ||“. (viṣṇupurāṇamu -)

“ucchaiḥ atiśayēna, sitaṃ svaccchaṃ, rāgādirahitaṃ manō yasyasaḥ; taṃ viṣṇu bhaktaṃ viddhi; manassvacchatvasya durvijñēyatvāt tasya jñāpaka chinnānyāha na catīti. śuddha satvasya rāgādya bhāvāt ātmanaḥ suhṛtpakṣē vipakṣa pakṣē api ca samamatitvaṃ parasva haraṇādi nivṛttaśca bhavati tasya cihnaṃ ityasyārthaḥ”,

(mikkili svaccamaina manassu galavāḍu, anagā, rāgamu modalagunavi lēni manassu kalavāḍu viṣṇu bhaktuḍu ani telusukonavalenu - tana varṇadharmamu tappakuṃḍa neravērcuvāḍu. snēhitulaṃdu, śatruvulaṃdu samamaina - okkalāṃṭi - manassu kalavāḍu; svaccamaina nirmalamaina manassukalavāḍu viṣṇu bhaktuḍu.)

  1. “ślō. varṇāśramācāravatā puruṣēṇa paraḥ pumān, viṣṇu rārādhyatē; paṃthā nānyaḥ tattōṣakārakaḥ ||”.

“ācāra vatāṃ ityatra ācāragrahaṇaṃ yajñādēḥ karmaṇōpyupalakṣaṇaṃ. anyaḥ viṣṇvārādhana lakṣaṇaḥ śṛti, smṛti vihita dharmatyāgē na kēvala tadrvata dhāraṇa śravaṇa kīrtanādiḥ - tattōṣakārakaḥ na bhavatītyarthaḥ.”

(varnāśrama dharmamulanācariṃcu puruṣunicē - anagā - yajñamulu modalagunavi - varṇamulayokka, āśramamulayokka dharmamulanācariṃcu puruṣuni cēta viuṣṇuvu ārādhiṃpabaḍucunnāḍu. itara mārgamulu, sādhanamulu viṣṇuvuni saṃtōṣiṃpacēyavu. śṛti smṛtulalō ceppina dharmamulanu viḍici peṭṭi kēvalamu vratamulu, kathāśravaṇamu, nāmakīrtanamu valananē viṣṇuvu saṃtōṣiṃpaḍani yarthamu).

  1. “ślō. yasyānugrahamicchāmi tasya vittaṃ harāmyahaṃ |

bāṃdhavaiśca viyōgēna bṛśaṃbhavati duḥkhitaḥ |

tēna duḥkhēna saṃtaptō yadi māṃ na parityajēt |

taṃ prasādaṃ kariṣyāmi yassurairapi durlabhaḥ ||“.

“sī. vasumatīnādha! yevvanimīda nā kanugraha buddhi voḍamu nā ghanuni vitta

maṃtayu gramamuna napahariṃcinavāḍu dhanahīnuḍagucu saṃtāpamaṃda

viḍuturu baṃdhu lavvidhamuna noṃṭariyai. cēyunadi lēka yakhila kārya

bhāraṃbuluḍigi madbhaktulatō maitri neṟapucu vijñāna niratuḍagucu

tē. pidapa vāḍavyayānaṃda parama yātma

baraga śrīviṣṇulōka saṃprāpti noṃdu;

gāna matsēva migula duṣkaramaṭaṃcu

vadali bhajiyiṃtu ritala dēvatulanepuḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1234)

  1. sī. - - - ghanaśakti sahituṃḍu kālakaṃdharuḍu dā vinuta guṇatrayānvituḍu gāna

rāgādi yuktamai rājillu saṃpadalātani golucuvāraṃdu cuṃdu

racyutu baramu nanaṃtu guṇātītu, buruṣōttamuni nādi puruṣu nanagha

tē. narji bhajiyiṃcuvāru rāgādi rahitu

lagucu dīpiṃtureṃtayu, nanagha carita! - - - (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u. bhā. - 1231, 1232)

  1. ślō. śvapacōpi mahīpāla viṣṇu bhaktō dvijādhikaḥ |

viṣṇubhakti vihīnastu dvijōpi śvapacādhamaḥ ||

(śvapacuḍainanu viṣṇubhaktuḍainayaḍala atanu brāhmaṇuni kaṃṭe nadhikuḍu - viṣṇubhakti lēnivāḍu brāhmaṇuḍainanu śvapacunikaṃṭe adhamuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.