← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విష్ణు స్వరూపము viṣṇu svarūpamu

Original — తెలుగు

“సీ. వినుమాత్మవేత్తకు విష్ణు స్వరూపంబు నెఱుంగబడు; నది యెట్లటన్న

గగనస్థుడగు దినకరు కిరణచ్ఛాయ జలముల గృహకుడ్య జాలకముల

వలన దోచిన ప్రతి ఫలితంబుచేత నూహింపంగబడిన యయ్యినుని పగిది

నర్థి మనో బుద్ధ్యాహంకరణత్రయ నాడీప్రకాశమునను నెఱుంగ

తే. వచ్చు నాత్మస్వరూపంబువలతిగాగ

చిత్తమున దోచు నంచిత శ్రీదనర్చి

యమ్మహామూర్తి సర్వభూతాంతరాత్ము

డగుట నాత్మజ్ఞులకు గాననగును“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 27 - 902)

Transliteration

“sī. vinumātmavēttaku viṣṇu svarūpaṃbu neṟuṃgabaḍu; nadi yeṭlaṭanna

gaganasthuḍagu dinakaru kiraṇacchāya jalamula gṛhakuḍya jālakamula

valana dōcina prati phalitaṃbucēta nūhiṃpaṃgabaḍina yayyinuni pagidi

narthi manō buddhyāhaṃkaraṇatraya nāḍīprakāśamunanu neṟuṃga

tē. vaccu nātmasvarūpaṃbuvalatigāga

cittamuna dōcu naṃcita śrīdanarci

yammahāmūrti sarvabhūtāṃtarātmu

ḍaguṭa nātmajñulaku gānanagunu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 27 - 902)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.