(ఈ జగత్తు అంతయు విష్ణుమయము - విష్ణువుతో నిండియున్నది. విష్ణువు ఈ జగత్తు అంతటిలోను - లోపల, పైన - పూర్తిగా వ్యాపించియున్నాడు -
“వ. దేహంబున ద్రవ్యంబులైన మహాభూతంబులునూ, జన్మ నిమిత్తంబులైన కర్మంబులును, కర్మక్షోభకంబైన కాలంబును, గాలపరిమాణహేతువైన స్వభావంబును, భోక్త అయిన జీవుండును వాసుదేవుండగా నెఱుంగుము. వాసుదేవ వ్యతిరిక్తంబులేదు, సిద్ధంబు. నారాయణ నియమ్యంబులు లోకంబులు, దేవతులు నారాయణ శరీర సంభూతులు. వేదయాగ తపోయోగ, జ్ఞానంబులు నారాయణ పరంబులు”. (శ్రీమహాభాగవతము - 2 - 5 - 84)
“జ్యోతీమ్షి విష్ణుర్భువనాని విష్ణుర్వనాని విష్ణుర్గిరయో దిశశ్చ నద్యః సముద్రాశ్చ స ఏవ సర్వం యదస్తి యన్నాస్తి చ విప్రవర్య”.
(విష్ణుపురాణము)
(జ్యోతిస్సులు - ప్రకాశస్వరూపులైన సూర్యుడు మొదలగునవి - లోకములు, వనములు, పర్వతములు, దశదిశలు, నదులు, సముద్రములు, ఉన్నవి, లేనివి - సమస్తమూ విష్ణువే.
భగవత ఇతి సిద్ధం సర్వవేదాంత జాలే |
సహితృణమపి విష్ణోర్భిన్న సత్తాం లభేత |
విధిశుతమపి తద్వన్నైవ విష్ణోర్విభిన్నం“. (గీతాభావప్రకాశము - 9 - 63)
(పంచభూతములు అయిన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఇవి భగవంతుని వివర్తములు - అనగా, భగవంతుడు ఈ అయిదు భూతములుగా మారెను - ఇవి అతని రూపములే, అతనిలోనుండి ఒకటిగా పుట్టినవి. బంగారముతో చేబడిన వస్తువులన్నియు బంగారు వస్తువులేకాని, వెండి వస్తువులు కావు - ఈ విషయము ఉపనిషత్తులన్నింటిలోను సిద్ధాంతము చెయబడినది. గడ్డి పోచ అయినను విష్ణుని కంటె వేరు సత్తాకలది కాదు - “హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశపావన వింటే”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - -)
సిద్ధ విధ్యాధర జీమూతచారణ గ్రహతారకాస్సరో గణ విహంగ
భూత తటిద్వసు పంజంబులును నీవు, ముక్కటియును, మహామునులు, నేను
సలిల నభస్థ్సల చరములు, మొదలైన వివిధజీవులతోడి విశ్వమెల్ల
ఆ. విష్ణుమయము; పుత్ర!, వేయేల? బ్రహ్మాండ
మతని జేనలోన నడగియుండు;
బుద్ధి నెఱుగరాదు; భూత భవద్భావి
లోకమెల్ల విష్ణులోన నుండు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 91)
మంతోహ మహమే వాజ్యమహమగ్నిరహం హుతం ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 16)
“బహుదోపాసతేచేత్కధం త్వామేవ తత్పరాః |
సేవంత ఇత్యపేక్షాయాం ప్రాహ స్వస్తాఖిలాత్మతాం ||
శ్రోతో (అ)ధృరో(అ)గ్నిష్టోమాదిః క్రతుః స్మార్తస్తు యజ్ఞకః |
ప్రసిద్ధోవైద్యదేవాదిర్మహా యజ్ఞతయా స్మృతౌ |
పితృభ్యో దీయ మానంచ యదన్నం తత్స్వధేరితం |
ప్రాణిభిర్భుజ్యమానం వా భేషజం వౌషధం స్మృతం |
యజ్యా పురోను వాక్యాది మంత్రో యేనా ధ్వరే హవిః |
దేవేభ్యో దీయతే(అ)ధాజ్యం ఘృతోపలక్షణం |
దేవోభ్యో ధీయతే (అ)థాజ్యం ఘృతోప లక్షణం |
అగ్నిరాహవనీయాది ర్హవిః ప్రక్షేపణాశ్రయః |
హుతం హవన మిత్యే తత్సర్వం విష్ణురహం హరిః |
ఏ తదే కైక విజ్ఞానమపి విష్ణో రుపాసనం |
క్రియాకారకే ముఖ్యం తత్సర్వం నాస్తి హరేః పృథక్ ||“. (గీతాభావప్రకాశము - 9 - 114 to 120)
(నా భక్తులు నన్నే సాక్షాత్తుగా ఉపాసించెదరు - ఇతరులు అనేక ఇతర దేవతలను ఉపాసించెదరు - ఇట్లయినప్పటికీ వారు నన్నే ఉపాసించుచున్నట్లే. ఎందుచేతననగా వారు ఉపాసించు అన్యదేవతలు నా రూపములే, నేను ఆ అన్యదేవతలలో అంతర్యామిగా నున్నాను - వారు ఆ దేవతా రూపములలో ఉన్న నన్నే ఉపాసన చేయుచున్నారు - ఇందుకు ఉదాహరణగా కొన్ని వస్తువులు చెప్పి అవి తానే అని శ్రీకృష్ణభగవానుడు చెప్పుచున్నాడు. - వాటిలో యజ్ఞము గుఱించి చెప్పుచూ ఆ యజ్ఞము దాని భాగములు, దానికి కావలసిన పరికరములు, యజమాని, యజ్ఞము చేయించువాడు, అన్నియు తానే యని స్పష్టపఱచెను. శృతులలో చెప్పబడిన అధ్వరమను యజ్ఞము స్మృతులలో చెప్పబడిన క్రతువు అను యజ్ఞము, వైశ్వేదేవాది యజ్ఞము - ఇవన్నియు నేనే. పితృ యజ్ఞములో పితృవులకు అర్పించిన అన్నము, స్వథా, యజ్ఞశిష్టము, భేషజం (ఔషధం), యజ్ఞము చేయునపుడు చదువు మంత్రము, యజ్ఞాగ్ని, ఆ అగ్నిలో హోమము చేయబడు నెయ్యి, ఇవన్నియు హరి అయిన ప్రకారముగా, యజ్ఞభాగములన్నియు కలిసిన యజ్ఞక్రియ నేనే (భగవంతుడే). ఇంతే కాక ఈ యజ్ఞభాగములలో ఒక్కొక్కటి నేనే గనుక ఒక్కొక్క దానిని ఉపాసించినను నన్ను ఉపాసించినట్లే).
హరి విశ్వమయండు, సంశయము పనిలేదా
హరిమయము కాని ద్రవ్యము
పరమాణువు లేదు, వంశపావన వింటే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 17)
(ī jagattu aṃtayu viṣṇumayamu - viṣṇuvutō niṃḍiyunnadi. viṣṇuvu ī jagattu aṃtaṭilōnu - lōpala, paina - pūrtigā vyāpiṃciyunnāḍu -
“va. dēhaṃbuna dravyaṃbulaina mahābhūtaṃbulunū, janma nimittaṃbulaina karmaṃbulunu, karmakṣōbhakaṃbaina kālaṃbunu, gālaparimāṇahētuvaina svabhāvaṃbunu, bhōkta ayina jīvuṃḍunu vāsudēvuṃḍagā neṟuṃgumu. vāsudēva vyatiriktaṃbulēdu, siddhaṃbu. nārāyaṇa niyamyaṃbulu lōkaṃbulu, dēvatulu nārāyaṇa śarīra saṃbhūtulu. vēdayāga tapōyōga, jñānaṃbulu nārāyaṇa paraṃbulu”. (śrīmahābhāgavatamu - 2 - 5 - 84)
“jyōtīmṣi viṣṇurbhuvanāni viṣṇurvanāni viṣṇurgirayō diśaśca nadyaḥ samudrāśca sa ēva sarvaṃ yadasti yannāsti ca vipravarya”.
(viṣṇupurāṇamu)
(jyōtissulu - prakāśasvarūpulaina sūryuḍu modalagunavi - lōkamulu, vanamulu, parvatamulu, daśadiśalu, nadulu, samudramulu, unnavi, lēnivi - samastamū viṣṇuvē.
bhagavata iti siddhaṃ sarvavēdāṃta jālē |
sahitṛṇamapi viṣṇōrbhinna sattāṃ labhēta |
vidhiśutamapi tadvannaiva viṣṇōrvibhinnaṃ”. (gītābhāvaprakāśamu - 9 - 63)
(paṃcabhūtamulu ayina ākāśamu, vāyuvu, agni, jalamu, bhūmi ivi bhagavaṃtuni vivartamulu - anagā, bhagavaṃtuḍu ī ayidu bhūtamulugā mārenu - ivi atani rūpamulē, atanilōnuṃḍi okaṭigā puṭṭinavi. baṃgāramutō cēbaḍina vastuvulanniyu baṃgāru vastuvulēkāni, veṃḍi vastuvulu kāvu - ī viṣayamu upaniṣattulanniṃṭilōnu siddhāṃtamu ceyabaḍinadi. gaḍḍi pōca ayinanu viṣṇuni kaṃṭe vēru sattākaladi kādu - “harimayamugāni dravyamu paramāṇuvu lēdu, vaṃśapāvana viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu - -)
siddha vidhyādhara jīmūtacāraṇa grahatārakāssarō gaṇa vihaṃga
bhūta taṭidvasu paṃjaṃbulunu nīvu, mukkaṭiyunu, mahāmunulu, nēnu
salila nabhasthsala caramulu, modalaina vividhajīvulatōḍi viśvamella
ā. viṣṇumayamu; putra!, vēyēla? brahmāṃḍa
matani jēnalōna naḍagiyuṃḍu;
buddhi neṟugarādu; bhūta bhavadbhāvi
lōkamella viṣṇulōna nuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 91)
maṃtōha mahamē vājyamahamagnirahaṃ hutaṃ ||“. (śrīmadbhagavadgīta - 9 - 16)
“bahudōpāsatēcētkadhaṃ tvāmēva tatparāḥ |
sēvaṃta ityapēkṣāyāṃ prāha svastākhilātmatāṃ ||
śrōtō (a)dhṛrō(a)gniṣṭōmādiḥ kratuḥ smārtastu yajñakaḥ |
prasiddhōvaidyadēvādirmahā yajñatayā smṛtau |
pitṛbhyō dīya mānaṃca yadannaṃ tatsvadhēritaṃ |
prāṇibhirbhujyamānaṃ vā bhēṣajaṃ vauṣadhaṃ smṛtaṃ |
yajyā purōnu vākyādi maṃtrō yēnā dhvarē haviḥ |
dēvēbhyō dīyatē(a)dhājyaṃ ghṛtōpalakṣaṇaṃ |
dēvōbhyō dhīyatē (a)thājyaṃ ghṛtōpa lakṣaṇaṃ |
agnirāhavanīyādi rhaviḥ prakṣēpaṇāśrayaḥ |
hutaṃ havana mityē tatsarvaṃ viṣṇurahaṃ hariḥ |
ē tadē kaika vijñānamapi viṣṇō rupāsanaṃ |
kriyākārakē mukhyaṃ tatsarvaṃ nāsti harēḥ pṛthak ||“. (gītābhāvaprakāśamu - 9 - 114 to 120)
(nā bhaktulu nannē sākṣāttugā upāsiṃcedaru - itarulu anēka itara dēvatalanu upāsiṃcedaru - iṭlayinappaṭikī vāru nannē upāsiṃcucunnaṭlē. eṃducētananagā vāru upāsiṃcu anyadēvatalu nā rūpamulē, nēnu ā anyadēvatalalō aṃtaryāmigā nunnānu - vāru ā dēvatā rūpamulalō unna nannē upāsana cēyucunnāru - iṃduku udāharaṇagā konni vastuvulu ceppi avi tānē ani śrīkṛṣṇabhagavānuḍu ceppucunnāḍu. - vāṭilō yajñamu guṟiṃci ceppucū ā yajñamu dāni bhāgamulu, dāniki kāvalasina parikaramulu, yajamāni, yajñamu cēyiṃcuvāḍu, anniyu tānē yani spaṣṭapaṟacenu. śṛtulalō ceppabaḍina adhvaramanu yajñamu smṛtulalō ceppabaḍina kratuvu anu yajñamu, vaiśvēdēvādi yajñamu - ivanniyu nēnē. pitṛ yajñamulō pitṛvulaku arpiṃcina annamu, svathā, yajñaśiṣṭamu, bhēṣajaṃ (auṣadhaṃ), yajñamu cēyunapuḍu caduvu maṃtramu, yajñāgni, ā agnilō hōmamu cēyabaḍu neyyi, ivanniyu hari ayina prakāramugā, yajñabhāgamulanniyu kalisina yajñakriya nēnē (bhagavaṃtuḍē). iṃtē kāka ī yajñabhāgamulalō okkokkaṭi nēnē ganuka okkokka dānini upāsiṃcinanu nannu upāsiṃcinaṭlē).
hari viśvamayaṃḍu, saṃśayamu panilēdā
harimayamu kāni dravyamu
paramāṇuvu lēdu, vaṃśapāvana viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 17)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.