← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విష్ణుపదీ viṣṇupadī

Original — తెలుగు
  1. గాంగా.

  2. “శ్లో. నిర్గతా విష్ణు పదాబ్జాత్ తేన విష్ణు పదీస్మృతా”. (దేవీ పురాణము)

  3. “శ్లో. యత్పాదాంబుజ సంభవా త్రిపథగా భాగీరధీ ముక్తిదా |

లోకానాం హత కిల్బిషా భగవతీ మందాకినీ శాంభవీ |

లోకేభాతి సరస్వతీ సురనదీ పుణ్యేందు కాంతి ప్రభా || - -“. (శ్రీరామకర్ణామృతం - 3 - 34)

(వామనావతారములో బ్రహ్మలోకమువరకు వ్యాపించిన శ్రీమహావిష్ణుని యొక్క పాదమును చతుర్ముఖబ్రహ్మ తన కమండలోదకములతో కడుగగా పుట్టిన గంగ విష్ణుపదీ యని చెప్పబడినది).

“మ. తన పుట్టిల్లిదె పొమ్మటంచు నజుడుం దన్నాభి పంకేరుహం

బు నిరీక్షించి నటించి, యున్నత పదంబుం జూచి, తత్పాద సే

చనముం జేసి గమండలోదకములం జల్లించి తత్తోయముల్

వినువీధిం ప్రవహించె దేవ నదినా విశ్వాత్ము కీర్తి ప్రభన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 20 - 630)

(శ్రీమహావిష్ణువు యొక్క పాదపద్మముల పుట్టి మూడు లోకములందు - మూడుమార్గముల మూడు లోకములందును - ప్రవహించుచు, మూడు లోకములవారిని పవిత్రము చేయు గంగానది, దేవలోకములో ప్రవహించునపుడు సురనది - దేవనది - యనియు, శంభుని శిఉరస్సునుండి భూలోకములోనికి దిగుటచే శాంభవీ యనియు, భూలోకములో సరస్వతినదియనియు పేరుగాంచినది.

Transliteration
  1. gāṃgā.

  2. “ślō. nirgatā viṣṇu padābjāt tēna viṣṇu padīsmṛtā”. (dēvī purāṇamu)

  3. “ślō. yatpādāṃbuja saṃbhavā tripathagā bhāgīradhī muktidā |

lōkānāṃ hata kilbiṣā bhagavatī maṃdākinī śāṃbhavī |

lōkēbhāti sarasvatī suranadī puṇyēṃdu kāṃti prabhā || - -“. (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 34)

(vāmanāvatāramulō brahmalōkamuvaraku vyāpiṃcina śrīmahāviṣṇuni yokka pādamunu caturmukhabrahma tana kamaṃḍalōdakamulatō kaḍugagā puṭṭina gaṃga viṣṇupadī yani ceppabaḍinadi).

“ma. tana puṭṭillide pommaṭaṃcu najuḍuṃ dannābhi paṃkēruhaṃ

bu nirīkṣiṃci naṭiṃci, yunnata padaṃbuṃ jūci, tatpāda sē

canamuṃ jēsi gamaṃḍalōdakamulaṃ jalliṃci tattōyamul

vinuvīdhiṃ pravahiṃce dēva nadinā viśvātmu kīrti prabhan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 20 - 630)

(śrīmahāviṣṇuvu yokka pādapadmamula puṭṭi mūḍu lōkamulaṃdu - mūḍumārgamula mūḍu lōkamulaṃdunu - pravahiṃcucu, mūḍu lōkamulavārini pavitramu cēyu gaṃgānadi, dēvalōkamulō pravahiṃcunapuḍu suranadi - dēvanadi - yaniyu, śaṃbhuni śiurassunuṃḍi bhūlōkamulōniki diguṭacē śāṃbhavī yaniyu, bhūlōkamulō sarasvatinadiyaniyu pērugāṃcinadi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.