వైకుంఠము.
“దశద్వారపురం దేహం దశనాడీ మహాపథం |
దశభిర్వ్యాయుభిర్వ్యాప్తం దశేంద్రియ పరిచ్ఛదం |
షడాధారాపవరకం షడన్వయమహావనం |
చతుష్పీఠ సమాకీర్ణం చతురామ్నాయ దీపకం |
బిందునాద మహాలింగం విష్ణు లక్ష్మీ నికేతనం |
దేహం విష్ణ్వాలయంప్రోక్తం సిద్ధిదం సర్వ దేహినాం ||“.
(పది ద్వారములు గలదియు, పదినాడులు గలదియు, పదివాయువులు (ప్రాణవాయువు, అపానవాయువు మొదలగునవి) గలదియు, పది ఇంద్రియములు (5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు) కలదియు, ఆరు ఆవరణములు గలదియు, నాలుగు పీఠములు గలదియు, బిందువునాదము కలదియు, శ్రీమహావిష్ణువునకు, శ్రీమహాలక్ష్మికిన్నీ నివాసమైనదిన్నీ అయిన సకల దేహులయొక్క దేహము ముక్తినిచ్చు విష్ణ్వాలయము - (విష్ణువుయొక్క ఆలయమని - ఇల్లు) అని చెప్పబడినది. విష్ణువు అనగా అన్నింటియందు నివసించియుండువాడు కనుక విష్ణువు నివసించియుండునది, అతని ఆలయము - కోవిల - అని చెప్పబడినది).
vaikuṃṭhamu.
“daśadvārapuraṃ dēhaṃ daśanāḍī mahāpathaṃ |
daśabhirvyāyubhirvyāptaṃ daśēṃdriya paricchadaṃ |
ṣaḍādhārāpavarakaṃ ṣaḍanvayamahāvanaṃ |
catuṣpīṭha samākīrṇaṃ caturāmnāya dīpakaṃ |
biṃdunāda mahāliṃgaṃ viṣṇu lakṣmī nikētanaṃ |
dēhaṃ viṣṇvālayaṃprōktaṃ siddhidaṃ sarva dēhināṃ ||“.
(padi dvāramulu galadiyu, padināḍulu galadiyu, padivāyuvulu (prāṇavāyuvu, apānavāyuvu modalagunavi) galadiyu, padi iṃdriyamulu (5 jñānēṃdriyamulu, 5 karmēṃdriyamulu) kaladiyu, āru āvaraṇamulu galadiyu, nālugu pīṭhamulu galadiyu, biṃduvunādamu kaladiyu, śrīmahāviṣṇuvunaku, śrīmahālakṣmikinnī nivāsamainadinnī ayina sakala dēhulayokka dēhamu muktiniccu viṣṇvālayamu - (viṣṇuvuyokka ālayamani - illu) ani ceppabaḍinadi. viṣṇuvu anagā anniṃṭiyaṃdu nivasiṃciyuṃḍuvāḍu kanuka viṣṇuvu nivasiṃciyuṃḍunadi, atani ālayamu - kōvila - ani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.