← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశుద్ధాత్మా viśuddhātmā

Original — తెలుగు
  1. విశుద్ధః రాగద్వేషాది రహితః ఆత్మా మనో యస్యసః -

(రాగము, ద్వేషము, మొదలగునవి లేకుండుటచేత విశుద్ధమైన - బాగుగా నిర్మలమైన మనస్సు గలవాడు)

  1. “విశుద్ధసత్వః -” (శ్రీశంకరః)

(నిర్మలమైన సత్వగుణము గలవాడు - రజస్తమోగుణములతో కలియని సత్వగుణము కలవాడు.

  1. “విశుద్ధో రజస్తమోభ్యాం అకలుషితః ఆత్మా అంతఃకరణరూపం సత్వం యస్యసః -” (శ్రీమధుసూదనీవ్యాఖ్య)

(“విశుద్ధిః అత్ర రజస్తమో నివృత్తిః, తన్మూల రాగద్వేషాది కషాయ నివృత్తిశ్చ -” (వేదాంతదేశికః)

(విశుద్ధమనగా రజోగుణము, తమో గుణము అవి కారణముగాగల రాగము ద్వేషము మొదలగునవి లేకుండుట. ఇట్లు రజస్తమములు, రాగద్వేషాదులవలన కలుషితము కానటువంటి మనస్సు కలవాడు).

  1. “రజస్తమో మలాసృష్టం సత్వం యస్యసః - శుద్ధ ధీః” (గీతాభావప్రకాశము - 5 - 70)

(రజస్తమోగుణములయొక్క మలము చేత దోషముచేత అంటని సత్వగుణము కలవాడు - విశుద్ధాత్ముడు)

  1. గుణత్రయాతీత తయా విశుద్ధశ్చాసౌ ఆత్మా ఇతి విశుద్ధాత్మా -

(సత్వము, రజస్సు, తమము అను త్రిగుణములకు అతీతుడైనవాడు; వాటి ప్రభావము తనమీద లేనివాడు అగుట చేత విశుద్ధమైన - నిర్మలమైన, కలుషితముకాని ఆత్మగలవాడు. పరమాత్మ స్వతస్సిద్ధముగా శుద్ధమైనవాడు. త్రిగుణములుగల ప్రకృతితో కలిసి (ఉపాధిలో) ఉన్నపుడు జీవుడై కాలుష్యమును చెందినట్లగును -).

  1. “శాస్త్రీయే పరమపురుషారాధన రూపే విశుద్ధే కర్మణి వర్తమానః - తేన విఉశుద్ధమనాః -”. (శ్రీమాన్ రామానుజః)

(శాస్త్రములో చెప్పిన ప్రకారము పరమపురుషునియొక్క ఆరాధన రూపమైన విశుద్ధకర్మయందు వర్తించువాడగుటచేత శుద్ధమైన మనస్సు కలవాడు, నిర్మలమైన మనస్సు కలవాడు).

Transliteration
  1. viśuddhaḥ rāgadvēṣādi rahitaḥ ātmā manō yasyasaḥ -

(rāgamu, dvēṣamu, modalagunavi lēkuṃḍuṭacēta viśuddhamaina - bāgugā nirmalamaina manassu galavāḍu)

  1. “viśuddhasatvaḥ -” (śrīśaṃkaraḥ)

(nirmalamaina satvaguṇamu galavāḍu - rajastamōguṇamulatō kaliyani satvaguṇamu kalavāḍu.

  1. “viśuddhō rajastamōbhyāṃ akaluṣitaḥ ātmā aṃtaḥkaraṇarūpaṃ satvaṃ yasyasaḥ -” (śrīmadhusūdanīvyākhya)

(“viśuddhiḥ atra rajastamō nivṛttiḥ, tanmūla rāgadvēṣādi kaṣāya nivṛttiśca -” (vēdāṃtadēśikaḥ)

(viśuddhamanagā rajōguṇamu, tamō guṇamu avi kāraṇamugāgala rāgamu dvēṣamu modalagunavi lēkuṃḍuṭa. iṭlu rajastamamulu, rāgadvēṣādulavalana kaluṣitamu kānaṭuvaṃṭi manassu kalavāḍu).

  1. “rajastamō malāsṛṣṭaṃ satvaṃ yasyasaḥ - śuddha dhīḥ” (gītābhāvaprakāśamu - 5 - 70)

(rajastamōguṇamulayokka malamu cēta dōṣamucēta aṃṭani satvaguṇamu kalavāḍu - viśuddhātmuḍu)

  1. guṇatrayātīta tayā viśuddhaścāsau ātmā iti viśuddhātmā -

(satvamu, rajassu, tamamu anu triguṇamulaku atītuḍainavāḍu; vāṭi prabhāvamu tanamīda lēnivāḍu aguṭa cēta viśuddhamaina - nirmalamaina, kaluṣitamukāni ātmagalavāḍu. paramātma svatassiddhamugā śuddhamainavāḍu. triguṇamulugala prakṛtitō kalisi (upādhilō) unnapuḍu jīvuḍai kāluṣyamunu ceṃdinaṭlagunu -).

  1. “śāstrīyē paramapuruṣārādhana rūpē viśuddhē karmaṇi vartamānaḥ - tēna viuśuddhamanāḥ -”. (śrīmān rāmānujaḥ)

(śāstramulō ceppina prakāramu paramapuruṣuniyokka ārādhana rūpamaina viśuddhakarmayaṃdu vartiṃcuvāḍaguṭacēta śuddhamaina manassu kalavāḍu, nirmalamaina manassu kalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.