(జగత్తు అంతయు); (అన్నియు - సృష్టిలోనున్న వస్తువులన్నియు).
(ప్రకర్షేణ పంచీకృతం ఇతి ప్రపంచం - పంచభూతములకు పంచీకరణము చేయగా కలిగిన ప్రపంచము - జగత్తు అంతయు-). (జగత్తులోనున్న వస్తువులన్నియు).
(పంచీకృతము చేయబడిన పంచమహాభూతములు, వాటి కార్యములు కలిసి ఏర్పడిన స్థూల జగత్తు - విరాట్పురుషుని శరీరము). (చూడుము = విరాట్పురుషుడు).
(కంటికి కనబడు లోకమంతయు)
(కనబడునది, కనబడనిదియగు ప్రపంచమంతా).
(ఇల్లు, పిల్లలు, ధనము, భార్య మొదలగు ప్రపంచము) (ప్రపంచములో గలవన్నియు)
(సద్వస్తువు, అసద్వస్తువు, కారణవస్తువు, కార్యవస్తువు - ఇవన్నియు కలిసియున్నదే విశ్వము).
“సదసత్సంగతి నామరూపగుణ దృశ్యంబైన విశ్వంబు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 76)
సహస్తాసహస్తాది రూపంబైన విశ్వమంతయు నీశ్వరుండుగా తెలియుము - అతనికి వేఱులేదు) (“ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - )
“సీ. నరసురాసుర పితృనాగకుంజర మృగ గంధర్వ యక్షరాజ్షస మహీజ
సిద్ధ విద్యాధర జీమూత చారణ గ్రహ తారకాస్సరోగణ విహంగ
భూతతటిద్వసు పుంజంబులును, నీవు ముక్కంటియును, మహామునులు, నేను
సలిల నభస్థలచరములు మొదలైన వివిధ జీవులతోడి విశ్వమెల్ల
ఆ. విష్ణుమయము; పుత్ర, వేయేల, బ్రహ్మాండ
మతని జానలోన నడగియుండు
- - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 91)
హరి విశ్వమయుండు, సంశయము పనిలేదా
హరిమయముగాని ద్రవ్యము
పరమాణువు లేదు, వంశపావన, వింటే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1- 17)
భవవృద్ధి లయములా పరమేశుచేనగు - - - ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - 65)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 -)
(విశ్వము జడము - అనగా, భగవంతుని చైతన్యశక్తి తనలోపలలేనిదే తనంత తానే ఏమియు చేయలేదు - భగవంతునివలె ఎల్లకాలములం దుండునది కాదు).
“ఊర్ణనాభిర్లూతా కీటః తంతూన్ స్వదేహాత్ సృజతి, ఉపసంహరతి”.
(సాలెపురుగు తనలోనుండియే దారములను పుట్టించి వాటితో గూడు కట్టుకొని, అక్కరలేనపుడు తనలోనికి మరల తీసుకొనుచున్నది. భూమిలోనుండి ఔషధులు పుట్టుచున్నవి, సత్పురుషుని శరీరమునుండి కేశలోమములు పుట్టుచున్నవి. అట్లే అక్షరుడైన (నాశములేని) భగవంతునినుండి విశ్వము పుట్టుచున్నది).
- - - ఈశుండు దన లీలకై తనుదా సృజించె
గరమొప్ప నఖిలలోకములందు దానుండు, దనలోన నఖిలంబు దనరుచుండు
తే. గాన, విశ్వమ్మునకు గార్యకారణములు
దాన, యమ్మహాపురుషుని తనువు వలన
బాసి విశ్వంబు వెలియై ప్రభాసమొందె,
మానితాచార, యీ వర్తమాన సృష్టి.
“క. తెఱగొప్ప నఖిల విశ్వము
బురుషోత్తము మాయచేత బుట్టుం బెరుగున్
విరతిం బొందుచు నుండును
గరమర్థిన్ భూత భావి కాలములందున్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 342, 343)
(ఇళ్ళని, మేడలని జనులు స్త్రీలని, పురుషులని వ్యవహరింపబడుచున్న - గంధర్వనగరము అనునది లేనిదైనను ఉన్నట్లు కనబడుచున్నది. సత్పదార్థమైన భగవంతుడే ఈ ప్రపంచమను అసత్పదార్థగ మారినట్లు కనబడుచున్నది. కల, మాయ యనునవి అసత్తు అయినట్లే ఈ ద్వైతప్రపంచము అంతయు అసత్తే యని పండితులు (బ్రహ్మజ్ఞానులు) తలంచెదరు. ఉపనిషత్తులుకూడ నిట్లే చెప్పుచున్నవి).
సన్మాత్రం నాన్య దస్మా న్మృద ఘటికోదంచనాది ర్వికారః |“. (స్వారాజ్యసిద్ధి - అపవాద ప్రకరణము)
(ప్రపంచము సద్రూపమగు బ్రహ్మమువలన పుట్టి, సద్రూపమగు బ్రహ్మచే పోషింపబడి, బ్రహ్మలోనే లీనమగుచున్నది. కనుక మన్నులో పుట్టిన కుండ మూకుడు మొదలగునవి మట్టికన్న వేరు కానట్లు - మట్టి వికారములే అయినట్లు ఈ విశ్వమంతయు పరబ్రహ్మ యొక్క వికారములే.)
“విజ్ఞానాత్మా చిదాభాసో విశ్వో వ్యావహారికో జాగ్రత్ స్థూలదేహోభిమానీ కర్మభూః ఇతి చ విశ్వస్య నామ భవతి”.
(ఈశ్వరుని ఆజ్ఞచేత విరాడ్రూపుడు వ్యష్టి దేహమును వేఱు వేఱుగానున్న ఒక్కొక్క దేహమును ప్రవేశించి అన్నింటిలోను ఉండుటచేత విశ్వము (ప్రపంచము) తానే ఆయెను.)
(సత్పదార్థమైన, నిత్యుడైన, పరమార్థభూతుడైన - పరమపురుషార్థమైన మోక్షరూపుడైన పరబ్రహ్మనుండి యీ జగత్తు (విశ్వము) పుట్టినది).
(“ఇదం విశ్వం ధర్మ సదతి సాధ్యో ధర్మః సతః ఉత్పన్నత్వాత్ ఇతి హేతుః; యత్ యతః ఉత్పన్నం తత్ తదాత్మకమేవ దృష్టం - యథాకనకాత్ ఉత్పన్నం కుండలాది, తదాత్మకం తద్వత్ ఇతి”.
(ఈ విశ్వము - ప్రపంచము - సత్పదార్థమువలన పుట్టినదికనుక సత్పదార్థముయొక్క ధర్మము కలీయున్నది, కనుక ఇది కూడ సత్తే. దేనివలన పుట్టిన వస్తువు దాని ధర్మమే కలిగి అదియే యగుచున్నదను విషయము మన అనుభవములోనిదే. బంగారముతో చేయబడిన కుండలములు మొదలగునవి బంగారు వస్తువులేకాని, వెండి వస్తువులు, రాగి వస్తువులు కానట్లే.)
ఆత్మనో న తథా భిన్నం విశ్వమాత్మ వినిర్గతం |
తంతుమాత్రో భవేదేవ పటాః యద్విద్విచారితః |
ఆత్మ తన్మాత్రమేవ తద్విద్విశ్వం విచారితం |
యధైవేక్షురసే క్లుప్తా వ్యాప్తైవ శర్కరా |
తథా విశ్వం మయి క్లుప్తం మయావ్యాప్తం నిరంతరం |
ఆత్మా జ్ఞానత్ జగద్భాతి ఆత్మాజ్ఞానాన్న భాసతే |
రజ్జ్వ జ్ఞానా దహిర్భాతి తత్ జ్ఞానాత్ భాసతే నహి |
ప్రకాశో మేని నిజం రూపం నాతిరిక్తో స్మ్యహం తతః |
యథా ప్రకాశతే విశ్వం తథాహం భాస ఏవహి |“. (అష్టావక్రగీత - 2 - 4 to 8)
(నీటిలో పుట్టిన కెరటములు, బుడగలు, నురగ నీటికంటె వేరుకావు. అట్లే ఆత్మనుండి పుట్టిన విశ్వము (జగత్తు) ఆత్మకంటె వేరుకాదు. బట్ట అనునది దారములు మాత్రమే అయినట్లు విచారించి చూడగా ఈ విశ్వమంతయు ఆత్మ తన్మాత్రమే. చెరుకులోని రసములో పంచదార వ్యాపించియున్నట్లు ఈ విశ్వమంతయు నాచేత నిరంతరము వ్యాపించబడియున్నది. ఆత్మజ్ఞానములేకపోవుటవలన విశ్వము - జగత్తు - వేరే ఒకటి యున్నదని తోచుచున్నది. ఆత్మజ్ఞానము కలుగగనే - అంతయు ఆత్మయే యను జ్ఞానముకలుగగనే - విశ్వమనునది వేరుగానున్నదని తోచదు - చీకటిలో త్రాడును చూచి అది త్రాడు అను జ్ఞానము లేనందువలన - ఆ జ్ఞానము లేనంతవరకు పామువలె తోచును. అది త్రాడు, పాము కాదు అను జ్ఞానము కలిగినంతనే పామువలె తోచదు. నా నిజరూపము - స్వస్వరూపము - ప్రకాశము, తేజోరూపము. దానికంటె నేను వేరుకాదు - విశ్వమెట్లు కనబడుచున్నదో అదియే నా రూపము - విశ్వమే నా రూపముగా ప్రకాశమగుచున్నాను - కనబడుచున్నాను.)
రూప్యం శుక్తౌ ఫణీరజ్జౌ, వారి సూర్యకలే యథా |
మత్తో వినిర్గతం విశ్వం మయ్యేవలయమేష్యతి |
మృదికుంభో జలే వీచిః కనకే మకుటం యథా |“. (అష్టావక్రగీత - 9 - 10)
(ముత్యపుచిప్ప (చీకటిలో) వెండివకె కనుపించినట్లును, త్రాడు పామువలె తోచినట్లును, సూర్య కిరణములు మెరుపు దూరమునుండి నీటివలె తోచినట్లును, నాయందు ఈ విశ్వము కల్పించబడి తోచుచున్నది. నానుండి పుట్టిన విశ్వము నాయందే లయమగుచున్నది. కుండ మట్టినుండి పుట్టి మట్టిలోనే లయమగునట్లునూ, బంగారముతో చేయబడిన కిరీటము బంగారములోనే లయమగునట్లుగనే -
మహదహంకార తన్మాత్ర నభోమరుదనల జలావని ముని సుపర్వ
భూతగణాత్మక స్ఫురణ నీ విశ్వంబు భిన్నరూపమున నుత్పన్నమయ్యె - -
- - - “. (శ్రీమధాంధ్రమహాభాగవతము - 4 - 24 -723)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 9 - 360)
వెలినుందు, లోనుందు విశ్వమై యుందువు విశ్వంబు నీయందు మెలగుచుండు
భవదీయ మ్హిమచే బాటిల్లి భువనంబులుదయించు నొకవేళ నుడిగి మడుగు - - - . (శ్రీమదాంధ్రమహాభాగవతము - ఉ. భా. - 1079)
(ఈ విశ్వమంతయు బ్రహ్మమే. ఇదంతా (పరమ) పురుషుడే అని శ్రుతి చెప్పుచున్నది. అతను కానిది ఏదియు సత్పదార్థము లేదు. “విశ్వమే వేదం పురుషః” (మంత్రపుష్పము)
(అండాకారముగ నుండు బ్రహ్మ - చతుర్ముఖ బ్రహ్మ - భగవంతుని శక్తి కలిగియున్న - శక్తి రూముతోనున్న భగవంతుని తనలోనున్న ప్రకృతి - ప్రపంచసృష్టికి వలయునట్లు బ్రహ్మకు తోడ్పడు స్థితిలో నుండు - ప్రకృతి - ఈ బ్రహ్మాండము (cosmic egg) పగిలి, దాని ముక్కలు ఆకాశములో విరజిమ్ముకుపోయి అవి లోకములుగా మారుటకు - సృష్టింపబడుటకు మూలమైన వస్తువులుగలది - విరాట్పురుషుడు) - (చూడుము - బ్రహ్మాండము)
(శ్రీరామచంద్రపరబ్రహ్మమందు విశ్వమును - ప్రపంచమును - చూచు చున్నాను - భగవంతునిలోనే విశ్వమున్నది)
(jagattu aṃtayu); (anniyu - sṛṣṭilōnunna vastuvulanniyu).
(prakarṣēṇa paṃcīkṛtaṃ iti prapaṃcaṃ - paṃcabhūtamulaku paṃcīkaraṇamu cēyagā kaligina prapaṃcamu - jagattu aṃtayu-). (jagattulōnunna vastuvulanniyu).
(paṃcīkṛtamu cēyabaḍina paṃcamahābhūtamulu, vāṭi kāryamulu kalisi ērpaḍina sthūla jagattu - virāṭpuruṣuni śarīramu). (cūḍumu = virāṭpuruṣuḍu).
(kaṃṭiki kanabaḍu lōkamaṃtayu)
(kanabaḍunadi, kanabaḍanidiyagu prapaṃcamaṃtā).
(illu, pillalu, dhanamu, bhārya modalagu prapaṃcamu) (prapaṃcamulō galavanniyu)
(sadvastuvu, asadvastuvu, kāraṇavastuvu, kāryavastuvu - ivanniyu kalisiyunnadē viśvamu).
“sadasatsaṃgati nāmarūpaguṇa dṛśyaṃbaina viśvaṃbu” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 76)
sahastāsahastādi rūpaṃbaina viśvamaṃtayu nīśvaruṃḍugā teliyumu - ataniki vēṟulēdu) (“ā harimayamugāni dravyamu paramāṇuvu lēdu” - (śrīmadāṃdhramahābhāgavatamu - )
“sī. narasurāsura pitṛnāgakuṃjara mṛga gaṃdharva yakṣarājṣasa mahīja
siddha vidyādhara jīmūta cāraṇa graha tārakāssarōgaṇa vihaṃga
bhūtataṭidvasu puṃjaṃbulunu, nīvu mukkaṃṭiyunu, mahāmunulu, nēnu
salila nabhasthalacaramulu modalaina vividha jīvulatōḍi viśvamella
ā. viṣṇumayamu; putra, vēyēla, brahmāṃḍa
matani jānalōna naḍagiyuṃḍu
- - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 91)
hari viśvamayuṃḍu, saṃśayamu panilēdā
harimayamugāni dravyamu
paramāṇuvu lēdu, vaṃśapāvana, viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1- 17)
bhavavṛddhi layamulā paramēśucēnagu - - - ” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - 65)
(śrīmadāṃdhramahābhāgavatamu - 4 -)
(viśvamu jaḍamu - anagā, bhagavaṃtuni caitanyaśakti tanalōpalalēnidē tanaṃta tānē ēmiyu cēyalēdu - bhagavaṃtunivale ellakālamulaṃ duṃḍunadi kādu).
“ūrṇanābhirlūtā kīṭaḥ taṃtūn svadēhāt sṛjati, upasaṃharati”.
(sālepurugu tanalōnuṃḍiyē dāramulanu puṭṭiṃci vāṭitō gūḍu kaṭṭukoni, akkaralēnapuḍu tanalōniki marala tīsukonucunnadi. bhūmilōnuṃḍi auṣadhulu puṭṭucunnavi, satpuruṣuni śarīramunuṃḍi kēśalōmamulu puṭṭucunnavi. aṭlē akṣaruḍaina (nāśamulēni) bhagavaṃtuninuṃḍi viśvamu puṭṭucunnadi).
- - - īśuṃḍu dana līlakai tanudā sṛjiṃce
garamoppa nakhilalōkamulaṃdu dānuṃḍu, danalōna nakhilaṃbu danarucuṃḍu
tē. gāna, viśvammunaku gāryakāraṇamulu
dāna, yammahāpuruṣuni tanuvu valana
bāsi viśvaṃbu veliyai prabhāsamoṃde,
mānitācāra, yī vartamāna sṛṣṭi.
“ka. teṟagoppa nakhila viśvamu
buruṣōttamu māyacēta buṭṭuṃ berugun
viratiṃ boṃducu nuṃḍunu
garamarthin bhūta bhāvi kālamulaṃdun “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 342, 343)
(iḷḷani, mēḍalani janulu strīlani, puruṣulani vyavahariṃpabaḍucunna - gaṃdharvanagaramu anunadi lēnidainanu unnaṭlu kanabaḍucunnadi. satpadārthamaina bhagavaṃtuḍē ī prapaṃcamanu asatpadārthaga mārinaṭlu kanabaḍucunnadi. kala, māya yanunavi asattu ayinaṭlē ī dvaitaprapaṃcamu aṃtayu asattē yani paṃḍitulu (brahmajñānulu) talaṃcedaru. upaniṣattulukūḍa niṭlē ceppucunnavi).
sanmātraṃ nānya dasmā nmṛda ghaṭikōdaṃcanādi rvikāraḥ |“. (svārājyasiddhi - apavāda prakaraṇamu)
(prapaṃcamu sadrūpamagu brahmamuvalana puṭṭi, sadrūpamagu brahmacē pōṣiṃpabaḍi, brahmalōnē līnamagucunnadi. kanuka mannulō puṭṭina kuṃḍa mūkuḍu modalagunavi maṭṭikanna vēru kānaṭlu - maṭṭi vikāramulē ayinaṭlu ī viśvamaṃtayu parabrahma yokka vikāramulē.)
“vijñānātmā cidābhāsō viśvō vyāvahārikō jāgrat sthūladēhōbhimānī karmabhūḥ iti ca viśvasya nāma bhavati”.
(īśvaruni ājñacēta virāḍrūpuḍu vyaṣṭi dēhamunu vēṟu vēṟugānunna okkokka dēhamunu pravēśiṃci anniṃṭilōnu uṃḍuṭacēta viśvamu (prapaṃcamu) tānē āyenu.)
(satpadārthamaina, nityuḍaina, paramārthabhūtuḍaina - paramapuruṣārthamaina mōkṣarūpuḍaina parabrahmanuṃḍi yī jagattu (viśvamu) puṭṭinadi).
(“idaṃ viśvaṃ dharma sadati sādhyō dharmaḥ sataḥ utpannatvāt iti hētuḥ; yat yataḥ utpannaṃ tat tadātmakamēva dṛṣṭaṃ - yathākanakāt utpannaṃ kuṃḍalādi, tadātmakaṃ tadvat iti”.
(ī viśvamu - prapaṃcamu - satpadārthamuvalana puṭṭinadikanuka satpadārthamuyokka dharmamu kalīyunnadi, kanuka idi kūḍa sattē. dēnivalana puṭṭina vastuvu dāni dharmamē kaligi adiyē yagucunnadanu viṣayamu mana anubhavamulōnidē. baṃgāramutō cēyabaḍina kuṃḍalamulu modalagunavi baṃgāru vastuvulēkāni, veṃḍi vastuvulu, rāgi vastuvulu kānaṭlē.)
ātmanō na tathā bhinnaṃ viśvamātma vinirgataṃ |
taṃtumātrō bhavēdēva paṭāḥ yadvidvicāritaḥ |
ātma tanmātramēva tadvidviśvaṃ vicāritaṃ |
yadhaivēkṣurasē kluptā vyāptaiva śarkarā |
tathā viśvaṃ mayi kluptaṃ mayāvyāptaṃ niraṃtaraṃ |
ātmā jñānat jagadbhāti ātmājñānānna bhāsatē |
rajjva jñānā dahirbhāti tat jñānāt bhāsatē nahi |
prakāśō mēni nijaṃ rūpaṃ nātiriktō smyahaṃ tataḥ |
yathā prakāśatē viśvaṃ tathāhaṃ bhāsa ēvahi |“. (aṣṭāvakragīta - 2 - 4 to 8)
(nīṭilō puṭṭina keraṭamulu, buḍagalu, nuraga nīṭikaṃṭe vērukāvu. aṭlē ātmanuṃḍi puṭṭina viśvamu (jagattu) ātmakaṃṭe vērukādu. baṭṭa anunadi dāramulu mātramē ayinaṭlu vicāriṃci cūḍagā ī viśvamaṃtayu ātma tanmātramē. cerukulōni rasamulō paṃcadāra vyāpiṃciyunnaṭlu ī viśvamaṃtayu nācēta niraṃtaramu vyāpiṃcabaḍiyunnadi. ātmajñānamulēkapōvuṭavalana viśvamu - jagattu - vērē okaṭi yunnadani tōcucunnadi. ātmajñānamu kalugaganē - aṃtayu ātmayē yanu jñānamukalugaganē - viśvamanunadi vērugānunnadani tōcadu - cīkaṭilō trāḍunu cūci adi trāḍu anu jñānamu lēnaṃduvalana - ā jñānamu lēnaṃtavaraku pāmuvale tōcunu. adi trāḍu, pāmu kādu anu jñānamu kaliginaṃtanē pāmuvale tōcadu. nā nijarūpamu - svasvarūpamu - prakāśamu, tējōrūpamu. dānikaṃṭe nēnu vērukādu - viśvameṭlu kanabaḍucunnadō adiyē nā rūpamu - viśvamē nā rūpamugā prakāśamagucunnānu - kanabaḍucunnānu.)
rūpyaṃ śuktau phaṇīrajjau, vāri sūryakalē yathā |
mattō vinirgataṃ viśvaṃ mayyēvalayamēṣyati |
mṛdikuṃbhō jalē vīciḥ kanakē makuṭaṃ yathā |“. (aṣṭāvakragīta - 9 - 10)
(mutyapucippa (cīkaṭilō) veṃḍivake kanupiṃcinaṭlunu, trāḍu pāmuvale tōcinaṭlunu, sūrya kiraṇamulu merupu dūramunuṃḍi nīṭivale tōcinaṭlunu, nāyaṃdu ī viśvamu kalpiṃcabaḍi tōcucunnadi. nānuṃḍi puṭṭina viśvamu nāyaṃdē layamagucunnadi. kuṃḍa maṭṭinuṃḍi puṭṭi maṭṭilōnē layamagunaṭlunū, baṃgāramutō cēyabaḍina kirīṭamu baṃgāramulōnē layamagunaṭluganē -
mahadahaṃkāra tanmātra nabhōmarudanala jalāvani muni suparva
bhūtagaṇātmaka sphuraṇa nī viśvaṃbu bhinnarūpamuna nutpannamayye - -
- - - “. (śrīmadhāṃdhramahābhāgavatamu - 4 - 24 -723)
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 9 - 360)
velinuṃdu, lōnuṃdu viśvamai yuṃduvu viśvaṃbu nīyaṃdu melagucuṃḍu
bhavadīya mhimacē bāṭilli bhuvanaṃbuludayiṃcu nokavēḷa nuḍigi maḍugu - - - . (śrīmadāṃdhramahābhāgavatamu - u. bhā. - 1079)
(ī viśvamaṃtayu brahmamē. idaṃtā (parama) puruṣuḍē ani śruti ceppucunnadi. atanu kānidi ēdiyu satpadārthamu lēdu. “viśvamē vēdaṃ puruṣaḥ” (maṃtrapuṣpamu)
(aṃḍākāramuga nuṃḍu brahma - caturmukha brahma - bhagavaṃtuni śakti kaligiyunna - śakti rūmutōnunna bhagavaṃtuni tanalōnunna prakṛti - prapaṃcasṛṣṭiki valayunaṭlu brahmaku tōḍpaḍu sthitilō nuṃḍu - prakṛti - ī brahmāṃḍamu (cosmic egg) pagili, dāni mukkalu ākāśamulō virajimmukupōyi avi lōkamulugā māruṭaku - sṛṣṭiṃpabaḍuṭaku mūlamaina vastuvulugaladi - virāṭpuruṣuḍu) - (cūḍumu - brahmāṃḍamu)
(śrīrāmacaṃdraparabrahmamaṃdu viśvamunu - prapaṃcamunu - cūcu cunnānu - bhagavaṃtunilōnē viśvamunnadi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.