విరాడాత్మనః విశ్వస్య ముఖాని - ఏకో న వింశతి ముఖాని - ప్రాణాః పంచ, కర్మేంద్రియాణి పంచ, జ్ఞానేంద్రియాణి పంచ, అంతఃకరన చతుష్టయం ఇత్యేతాని ముఖాని ఇత్యుచ్యతే. జాగ్రదవస్థాయాం ఏతైః ఏకోనవింశతి ముఖైః స్థూలశబ్దాదయః బాహ్యవృత్యా అనుభూయంతే, తస్మాత్ విరాడ్రూపో విశ్వః స్థూలభుక్, బాహ్య వృత్తిరితి, జాగ్రదవస్థః ఇతి చ కథ్యతే.
(విరాడ్రూపుని ముఖములు పందొమ్మిది - పంచప్రాణములు, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, (మనో బుద్ధి చిత్తాహంకారములు అను) అంతఃకరణ చతుష్టయము, కలిసి పందొమ్మిది, భోగమునకు - అనుభవించుటకు - సాధములగుటవలన ఇవి ముఖములని చెప్పబడుచున్నవి.)
(జాగ్రదవస్థయందు ఈ పందొమ్మిది ముఖములద్వారా స్థూలరూపములోనున్న శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనుభవించబడుచున్నవి. అందుచేత విరాడ్రూపుడైన విశ్వుడు స్థూల భుక్ - స్థూలరూపములోనున్న విషయములను అనుభవించువాడు - భుజించువాడు - అని, బాహ్య వృత్తులని, జాగ్రదవస్థయని చెప్పబడుచున్నాడు)
virāḍātmanaḥ viśvasya mukhāni - ēkō na viṃśati mukhāni - prāṇāḥ paṃca, karmēṃdriyāṇi paṃca, jñānēṃdriyāṇi paṃca, aṃtaḥkarana catuṣṭayaṃ ityētāni mukhāni ityucyatē. jāgradavasthāyāṃ ētaiḥ ēkōnaviṃśati mukhaiḥ sthūlaśabdādayaḥ bāhyavṛtyā anubhūyaṃtē, tasmāt virāḍrūpō viśvaḥ sthūlabhuk, bāhya vṛttiriti, jāgradavasthaḥ iti ca kathyatē.
(virāḍrūpuni mukhamulu paṃdommidi - paṃcaprāṇamulu, paṃca karmēṃdriyamulu, paṃca jñānēṃdriyamulu, (manō buddhi cittāhaṃkāramulu anu) aṃtaḥkaraṇa catuṣṭayamu, kalisi paṃdommidi, bhōgamunaku - anubhaviṃcuṭaku - sādhamulaguṭavalana ivi mukhamulani ceppabaḍucunnavi.)
(jāgradavasthayaṃdu ī paṃdommidi mukhamuladvārā sthūlarūpamulōnunna śabda, sparśa, rūpa, rasa, gaṃdhamulu anubhaviṃcabaḍucunnavi. aṃducēta virāḍrūpuḍaina viśvuḍu sthūla bhuk - sthūlarūpamulōnunna viṣayamulanu anubhaviṃcuvāḍu - bhujiṃcuvāḍu - ani, bāhya vṛttulani, jāgradavasthayani ceppabaḍucunnāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.