(విశ్వమే - ప్రపంచమే ఇతని రూపము - అందుచేత భగవంతుడు విశ్వరూపుడు)
సర్వప్రపంచాత్మకః - (సమస్త ప్రపంచము శరీరముగా గలవాడు)
విశ్వం రూపం ప్రతిమా యస్యాసౌ విశ్వరూపః -
(విశ్వము తన ప్రతిమగా గలవాడు)
(ప్రపంచము శరీరముగా గలవాడు - ప్రపంచము పూర్తిగా తన రూపమే అయినవాడు)
(తన రూపములో ప్రపంచమంతటిని కలవాడు)
(జగత్తును అనుగ్రహించుటకు విశ్వమును తనరూపముగా ధరించినవాడు)
(అన్ని విషయములు బాగుగ తెలిసిన తర్వాత చరాచరాములతోకూడిన యీ జగత్తు అంతయు ఆత్మవలేనే చూడవలెను, తెలుసుకొనలెను. అందుచేత విష్ణువు విశ్వరూపుడు)
(విశ్వము అనగా అన్నియు - అందుచేత అన్ని రూపములు తానే అయినవాడు).
(విష్ణుసహస్రనామములో విశ్వం విష్ణుః - విశ్వము విష్ణువు అను పేర్లు చెప్పుటవలన విశ్వమనగా విష్ణువు - విశ్వము విష్ణుని ప్రతీకమగుటవలనను విశ్వమే విష్ణువని ధ్యానించుటకు సాధనమగుటచేతను - విశ్వము విష్ణుని రూపమని చెప్పబడినది - విశ్వము భగవంతుని విభూతులలో పెద్దది.
(ప్రపంచమంతయు తన శరీరముగా గలవాడు - తన శరీరమే అయినవాడు)
(విరాడ్రూపుడగుటవలన - అనేక రూపములు తానే అగుటవలన - విశ్వమునకు - ప్రపంచమునకు - ఆత్మ అగుటవలనను విశ్వరూపుడు)
(తన స్వస్వరూపములో మార్పు లేకుండగనే భగవంతుడు ప్రపంచరూపముగా కనబడుట)
(విశ్వమనగా అనేకము - అనేక రూపములతో ప్రకాశించువాడు)
రూపమే తదనంతస్య విష్ణోర్భిన్నమివస్థితం | (విష్ణుపురాణము)
(దేవతులు, మనుష్యులు, పశువులు, పక్షులు మొదలగు రూపములుగల యీ జగత్తు అంతయు అనంతుడైన శ్రీమహావిష్ణువుయొక్క రూపమే - అతని కన్న వేరుగా - ఇతర వస్తువుగా కనబడుచున్నది మాత్రమే.)
వివిధాభరణములైన విధమున నితడే
దివియై, భువియై, రవియై
కవియై సర్వాత్ముడై ప్రకాశించు తగన్“. (శ్రీ సీతారామాంజనేయ సంవాదము - 1 - 78)
బరమాత్ముండఖిల ప్రపంచమయుడై భాసిల్లు, నట్లేటచే
సుర సిద్దోరగ యక్ష కిన్నర నరస్తోమాది శశ్వచ్చరా
చర రూపోజ్వల సర్వభూతములకున్ సద్భక్తితో మ్రొక్కెదన్“. (శ్రీసీతారామాంజనేయ సంవాదము - 14)
అపశ్య ద్దేవ దేవస్య శరీరే పాండవస్తదా |. ( శ్రీమద్భగవద్గీత - 11 - 13)
(కార్యవస్తువులు కారణవస్తువులు తానే యగుటచేత వాటివలన కలుగు రూపములే యగుటచేత నానారూపుడుగా - విశ్వరూపుడుగా చెప్పబడుచున్నాడు).
(మణి అనేక విధములైన ఉపాధి సన్నిధానమువలన అనేక రూపములు గలదిగా కనబడును - అంతేగాని నిజముగా అన్ని రూపములు గలదికాదు - చింతామణిలో కూడ ఏది చింతించబడునో అదియే కనబడును కాని యధార్థముగా అట్లుకాదు - ఆ ప్రకారమే స్థితి, గతి, నిత్యానిత్యములు మొదలైనవి ఒకదానికంటె ఇంకొకటి అనేక విరుద్ధమైన ధర్మములు కలవి ఉపాధులగుటవలన ఆత్మ - పరమాత్మ - అనేక ధర్మములు గలది - అనేకరూపములుగలది - గా కనబడును - అంతేగాని, ఏట్లు కనబడినా, ఏ రూపమునొందినా, అన్నీ భగవంతుడే - అందుచేత ప్రపంచములోనున్న రూపములన్నియు అతనివే, అవన్నియు కలిసి ఒకే రూపమైన ప్రపంచము - విశ్వము - అతని రూపమే - అందుచేత భగవంతుడు విశ్వరూపుడు).
“నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప” - (శ్రీమద్భగవద్గీత - 10 - 40)
అందుచేత చెప్పినవి, చెప్పబడనివి కలిసి భగవంతుని రూపములు అనంతములు - ఇట్లు సమస్త వస్తువులు భగవంతిఉని రూపములే యగుటవలన భగవంతుడు విశ్వరూపుడు - అనేక రూపములు గలవాడు. ప్రపంచములో గల వస్తువులన్నియు కలిసి ప్రపంచమని చెప్పబడును - అన్ని రూపములు కలిసి విశ్వము - ప్రపంచమను ఒకే పెద్ద రూపముగలవాడను కనుక విశ్వరూపుడను).
(శ్రీమద్భగవద్గీత ఏకాదశాధ్యయములో భగవంతుని విశ్వరూపము ఈ క్రింద విధముగా వర్ణింపబడినది - శ్రీకృష్ణుడు =
“పశ్యమే పార్థ రూపాణి శతశోథ సహస్రశః |
నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీనిచ |
పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రా నశ్వినౌ మరు తస్తధా |
- - - ఇహై కస్థం జగత్కృత్స్నం పశ్యాద్య స చరాచరః |”
తజో మయం విశ్వమనంతమాద్యం | - - -.
సంజయుడు - “అనేక వక్త్రనయనమనేకాద్భుత దర్శనం |
అనంతం విశ్వతో ముఖం |
దివి సూర్య సహస్రస్య భవేద్యుగవ దుత్థితా |
యది భాః సగృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః |
తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్త మనేకథా |
అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తదా |“.
అర్జునా - “పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ |
బ్రహ్మాణమీశం కలమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ |
అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో (అ)నంతరూపం |
నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప |
- - - తేజోరాశిం సర్వతో దీప్తిమంతం |
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం |
- - - అనంత బాహుం శశిసూర్యనేత్రం పశ్యామిత్వాం దీప్తహుతాశవక్త్రం |
స్వ తేజసా విశ్వమిదం తపంతం |
ద్యావా పృధివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వ యైకేన దిశశ్చ సర్వాః |
- - - రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహు బాహూరుపాదం |
బహూదరం బహుద్రమ్ష్ట్రాకరాళం” - - - త్యయాతతం విశ్వమనంతరూప |
” శ్రీకృష్ణః- - “సుదుర్దర్శమదం రూపం దృష్టవానపి యన్మమ |
- - - “నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా |
శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసిమాం యథా |
భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున | - - ” ( శ్రీమద్భగవద్గీత - 15,16,17,19,20,23,38,52,53,54 - 11)
(“శ్రీకృష్ణుడు - పార్థా - అనేక విధములైనటువంటిన్నీ, అనేకవర్ణములు, అనేక ఆకృతులు కలిగినటువంటిన్నీ, దివ్యమైనటువంటిన్నీ వందలకొలది, వేలకొలదియున్న నా రూపములను ఈ నా విశ్వరూపములో చూడుము - ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వనీ దేవతులను, మరుద్గణమును కూడ చూడుము - - చరాచరములు కలిగినటువంటి జగత్తు అంతటిని ఒకే చోట నున్నదానిని చూడుము - తేజోమయము, తేజస్సుతో నిండియున్నది, అనంతము అయిన జగత్తును, వేరు వేరు వస్తువుకలదైనను, ఒకే వస్తువుగా ఒకే చోట కలిసియిన్నదానిని చూడుము - సంజయుడు - అనేక వక్త్రములు, నయనములు - (అనేక జీవుల అవయవములు) కలదియు, అనేక అద్భుతములు కలదియు, అంతము లేనట్టిదియు అంతట ముఖములు కలదియు, అయిన విశ్వమును శ్రీకృష్ణభగవానుని విశ్వరూపములో అర్జునుడు చూచెను - ఒక వేయి సూర్యులు ఒకేమారు కలిసి ప్రకాశించిన వాటి కాంతితో శ్రీకృష్ణుని తేజస్సు సమానమగును - అనేకములుగా విభక్తమైన జగత్తు అంతటిలోని దేవదేవుడైన శ్రీకృష్ణపరమాత్మునియొక్క యీ శరీరములో - విశ్వరూపములో పార్థుడు చూచెను” అర్జునుడు - “దేవ, నీ యీ దేహమందు సమస్త దేవతులును, అనేక విధములుగానున్న భూతములను, చతుర్ముఖ బ్రహ్మను, శివుని, ఋషులందరిని, ఉరగములను, చూచుచున్నాను - అనేకమైన బాహువులు, ఉదరములు, వక్త్రములు, నేత్రములు, కలిగిన నిన్ను అంతములేని నీ యీ విశ్వరూపములో అంతటను ఉన్నదానిలో చూచుచున్నాను - విశ్వమునకు ఈశ్వరుడవైన నీ యొక్క ఆది మద్యాంతములు నాకు కానరాకున్నవి. తేజోరాశివి, అనతటను ప్రకాశించువాడవు, ఇంత అను పరిమితి లేని సూర్యాగ్నుల కాంతి గలవాడవు, చూచుటకు అలవికాని తేజస్సు గలవాడివి అయిన వాడివిగా నిన్ను చూచుచున్నాను - లెక్కలేనన్ని బాహువులుగలవాడివి, సూర్యచంద్రులు నేత్రములుగా గలవాడివి, బాగుగా ప్రజ్వలించిన అగ్నిహోత్రమువంటి నోరు గలవాడివి, నీ తేజస్సుతో ఈ ప్రపంచమంతటిని దీప్తి వంతముగా చేయువాడివి - తపింపచేయువాడివి - భూమ్యాకాశముల మధ్యప్రదేశమును దిక్కులను నీవొక్కడివే వ్యాపించియున్నావు - అనేక వక్త్రములు, నేత్రములు, బాహువులు, ఊరువులు, పాదములు, ఉదరములు, దమ్ష్ట్రలు గల నీ రూపమును చూచుచున్నాను - ఈ విశ్వమంతటిని నీవు (బట్టలోని) పొడుగు పేకవలె అల్లుకొని యున్న దారమువలె వ్యాపించియున్నావు” (శ్రీకృష్ణుని వచనము - నీవు చూచుచున్న యీ నా విశ్వరూపము బహు కష్టముచేత చూడ వీలగునది - చూచుటకు చాలకష్టమైనది. వేదాధ్యయనమువలనగాని, తపస్సుచేతగాని, దానము చేతగాని, యజ్ఞముచేతగాని ఈ నా రూపమును నీవు చూచినట్లుగా - చూచుట శక్యముకాదు - నన్ను ఈ ప్రకారముగా - నీవు చూచినట్లుగా - చూచుట నాయందు అనన్య భక్తి కలిగియుండుటచేతనే శక్యమగును -)(నా యీ విశ్వరూపమును దేవతులుత్సాహపడియుండియు ఇప్పటికిముందు చూచియుండలేదు)
భగవంతుని విశ్వరూపములో ప్రపంచములో అప్పుడు ఏమి జరుగుచున్నదో దానిని చూచుటయేగాక, ముందురాబోవు రోజులలో యేవి జరుగనున్నదో అను విషయముకూడ అర్జునుడు చూడకలిగెను - “యచ్చాన్య ద్రష్టుమిచ్చసి” (నీకు యింకా ఏమి చూడవలెనని యున్నదో దానిని కూడ చూడమని శ్రీకృష్ణభగవానుడు అర్జునునితో చెప్పెను - అనగా, యీ కురుక్షేత్రయుద్ధములో ఎవరు గెలిచెదరు అను సందేహముకూడ తీర్చుకొనవచ్చునని దీని ధ్వని - ఆ ప్రకారమే అజేయులని తాను అభిప్రాయపడిన భీషంఉడు (తాతగారు, పరశురాముని గెల్చినవాడు), ద్రోణుడు ( తన గురువు), కర్ణుడు (సూర్యాంశ సంభూతుడు - తనవలె దైవాంశ సంభూతుడు), దుర్యోధనుడు - మఱియు వారి పక్షమున యుద్ధమునకు వచ్చిన రాజులు, వారి శైన్యము యుద్ధములో చనిపోయి శ్రీకృష్ణభగవానుని నోటిలో, కాలముతీరిన వారివలె, ప్రవేశించుట అర్జునుడు విశ్వరూపములో చూడకలిగెను - తానే జయము పొందునని ముందుగా తెలుసుకొనెను - అందుచేత అధైర్యపడి యుద్ధము మానవలసిన అవసరము లేదని హెచ్చరించబడెను -
ఈ విశ్వరూపవర్ణనవలన కొన్ని ముఖ్యమైన విషయములు తెలియనగుచున్నవి - అవి ఏవి యనగా -
(1) భగవంతుడు తేజోమయుడు - అతని తేజస్సు కలిగియుండుటచేతనే సూర్యాగ్నులు మొదలగు తేజోరూపములు ( నక్షత్రములు మొదలగునవి) ప్రకాశించుచున్నవి.
(2). సృష్టిలో వ్యష్టిరూపములోనున్న సమస్త వస్తువులు భగవంతునిలోనే యున్నవి.
(3). సృష్టిలోనున్న జీవకోటిలన్నియు - వాటి జీవితకాలము తీరినంతనే, వాటికి ఇష్టము లేకున్నను, తప్పించుకొను అవకాశము లేక, ఎంతటివారైనను, ఆ భగవంతునిలోనే, బలవంతముగా లయమైపోవుచున్నారు.
(4). సృష్టిలోనున్న జీవకోటిలన్నియు భగవంతునిలోనుండి పుట్టుటచేత భగవంతుని రూపములే యగుటచేత, ఆ రూపముల అవయవములన్నియు అతనివే యగుటచేత సహస్రశీర్షుడు, సహస్రాక్షుడు, సహస్రపాదుడు, సర్వుడు అను మొదలగు నామములుగలవాడాయెను -
(5). అంతము లేనంత రూపము, అంతము లేనన్ని శక్తులుగలవాడగుటచేత, సర్వాంతర్యామి యగుటచేత, ప్రపంచమంతటను తానే నిండియుండి, అన్నింటికి తన శక్తి నిచ్చి పనులు తన యిష్టప్రకారము చేయించుకొనుటచేత, తానొక్కడే యీ ప్రపంచమంతటను, దానిలోని ప్రతి వస్తువులోనుండుటచేత, సృష్టిస్థితిలయములు వాటికి సంబంధించిన ఇతర కార్యములు తానే అన్నింటిచేతను చేయించుచుండుటచేత, సృష్టి అంతటిలోను ఉన్నాడు తానొకడే - ఒకే తత్వముగా - నుండుటచేత అద్వయుడనిరూఢిగా తెలియచేయుచున్నాడు. (It is only one Energy that manifests itself in several forms and several ways and pervades and permeats all things in the entire creation).
“బహుపాదోదర వక్త్రలోచనం దీప్త ప్రచండానల దుర్నిరీక్షం |
అశేష బృందారకనాగ గీచరం భజామి తే రాఘవ విశ్వరూపం ||“.
సహస్రనేత్రాననపాదబాహు మనంతవీర్యం రవికోటితుక్యం |
స్రక్చందనాలంకృత దివ్యదేహం భజామ్యహుం తే హరి విశ్వరూపం |
కలంబ కోదండ గదాబ్జ సం యుతం దన్ష్ట్రాకరాళాంకధనం జయాననం |
పీతాంశుక స్వర్ణకిరీటకుండలం భజామితే రాఘవ విశ్వరూపం | ( శ్రీరామకర్ణామృతం - 2 - 24 to 26)
(అనేకములైన తొడలు, పాదములు, ఉదరములు, మొగములు, నేత్రములు కలిగి తీక్ష్ణమైన అగ్నివలె చూచుటకు శక్యముగానట్టిన్నీ, సమస్తదేవతలతోను సర్పములతోను కనబడిన నీ విశ్వరూపమును, ఓ రాఘవా | నేను సేవించుచున్నాను - వేలకొలది అయిన నేత్రములు, మొగములు, కాళ్ళు చేతులు కలిగినట్టిన్నీ, అంతములేని వీర్యము కలిగినట్టిన్నీ, కోటి సూర్యులతో సమానమైనట్టిన్నీ, పూల దండలతోను, మంచిగంధముతోను అలంకరింపబడిన దివ్య దేహమును - నీ విశ్వరూపమును నేను సేవించుచున్నాను - బాగము, ధనస్సు, గద, శంఖము కలదియు, భయంకరమైన అగ్ని గల మొగము కలదియు, పచ్చని బట్టయు, బంగారు కిరీటము, కుండలములు, కలదియు నగు నీ విశ్వరూపమును, శ్రీరామా, నేను సేవించుచున్నాను).
“అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవవనిపాల సంఘైః |
భీష్మో ద్రోణః, సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః |
వక్త్రాణి తే త్వరమాణా విశంతి దమ్ష్ట్రాకరాళని భయానకాని |
కే చిద్విలగ్నా దశనాంతరేషు సం దృశ్యంతే చూర్ణిః తైరుత్తమాంగైః |
యథా నదీనాం బహవోంబు వేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి |
తథా తవామీ నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభి విజ్వలంతి |
యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృథవేగాః |
తధైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్తాణి సమృద్ధవేగాః |“. ( శ్రీమద్భగవద్గీత - 11 - 26 to 29)
(నేనెవరిని జయించగలనా అని నీకు సంశయము కలుగచేసిన ఈ ధృతరాష్ట్రుని పుత్రులు, దుర్యోధనుడు మొదలగు కౌరవులు నూరుగురు, శల్యుడు మొదలగు రాజులు, వారి వారి సేనలతో కలిసి నీలో కలియుచున్నారు - నీలో అంతమొందుచున్నారు - ఆ ప్రకారమే అజేయులని లోకములో ప్రసిద్ధికాంచిన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలగువారు కూడా, మా పక్షమునకు చేరిన దృష్టద్యుమ్నుడు మొదలగు అనేకమైన యోధముఖ్యులతో నీలో కలీసిపోవుచున్నారు - భయమును కలుగచేయు నీ నోటిలో తొందఱపడినవారివలె ప్రవేశించుచున్నారు. కొందఱు నీ దంతములందు చిక్కుకొనియుండగా వారి శిరములు పిండి అయిపోవుచున్నవి. అనేకమైన నదులు అనేకమార్గములమీదుగా ప్రవహించుచూ వాటి ప్రవాహ వేగముతో అన్నియు సముద్రము దిక్కుగనే వెళ్ళి దానిలో కలిసిపోవుచున్నవి. ఆ ప్రకారముగానే ఈ వీరులందఱు కాలమురాగా - అవసానముకాలమురాగా, కాలముచే త్వరగా చేరుటకు ప్రేరేరింపబడి దానివలన బలవంతముగా త్రోయబడిన వారివలెనే - ఈ భీష్ముడు మొదలగు నీమహావీరులందఱు నీ నోటిలో ప్రవేశించుచున్నారు - ఎంత గొప్పవారైనను కాలము తీరిపోయినతోడనే చనిపోవలసినవారే. ఆ కాలమునకు అడ్డుతగిలి దానిని ధిక్కరింప నెట్టివారికి శక్యముకాదు. భగవంతుడు తానే అట్టి కాలస్వరూపుడను అని చెప్పెను –
“కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో” (శ్రీమద్భగవద్గీత - 11 32)
మిడతలు అగ్నిని చూచి దాని కాంతికి భ్రమపడి అది తినుబండారము అని ఆశతో బుద్ధిపూర్వకముగానే, తొదరపడుచూ మండుచున్న అగ్నిలో పడి నశించుచున్నవి. ఆ ప్రకారముగా యీ లోకములు మంచి వేగముగలవై నీ నోటిలో ప్రవేశించుచున్నవి. ఓడి పోవుట ఎన్నడూ యెఱుగక జయమునే ఎల్లపుడూ పొందుచుండువారైన భీష్ముడు మొదలగువారి దగ్గరనుండి అల్పజీవులైన, అల్పాయుస్సుగలవైన మిడతలవఱకుగల సమస్త జీవులు వారి జీవితకాలసమాప్తి యగునప్పుడు ఈ విధముగనే, ఇష్టములేకపోయినను బలవంతముగా కొందఱు, తెలియక కొందఱు, బుద్ధి పూర్వకముగా కొందఱు మరణమును పొందుదురు - (The paths of glory lead but to the grave)
అన్ని రూపములలో నుండువాడు కనుక విశ్వరూపుడు.
విష్ణుండు గుణత్రయాత్మకంబగు విశ్వరూపంబుధరియించిన భువియును, నభంబును దివంబును, దిశలును, దిశాభిద్రంబులును సముద్రంబులును, జగదఖిల భూ నివహంబులుం దానయై యేకీభవించి - - - బ్రహ్మాండంబు తనమేని కప్పుతెఱంగున నుండ విజృంభించి –
మ. ఒకపాదంబున భూమిగప్పి, దివి వేఱొంటన్ నిరోధించి, యొం
డకటన్ మీది జగంబులెల్ల దొడి నొండుంటిన్ విలంఘించి, ప
ట్టక బ్రహ్మాండ కటాహముం బెటిలి వేండ్రంబై పగుల్ గానరా
కొకడై వాగ్దృగలభ్యుడై హరివిభుండొప్పారె విశ్వాకృతిన్ (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 19 - 623,624)
(viśvamē - prapaṃcamē itani rūpamu - aṃducēta bhagavaṃtuḍu viśvarūpuḍu)
sarvaprapaṃcātmakaḥ - (samasta prapaṃcamu śarīramugā galavāḍu)
viśvaṃ rūpaṃ pratimā yasyāsau viśvarūpaḥ -
(viśvamu tana pratimagā galavāḍu)
(prapaṃcamu śarīramugā galavāḍu - prapaṃcamu pūrtigā tana rūpamē ayinavāḍu)
(tana rūpamulō prapaṃcamaṃtaṭini kalavāḍu)
(jagattunu anugrahiṃcuṭaku viśvamunu tanarūpamugā dhariṃcinavāḍu)
(anni viṣayamulu bāguga telisina tarvāta carācarāmulatōkūḍina yī jagattu aṃtayu ātmavalēnē cūḍavalenu, telusukonalenu. aṃducēta viṣṇuvu viśvarūpuḍu)
(viśvamu anagā anniyu - aṃducēta anni rūpamulu tānē ayinavāḍu).
(viṣṇusahasranāmamulō viśvaṃ viṣṇuḥ - viśvamu viṣṇuvu anu pērlu ceppuṭavalana viśvamanagā viṣṇuvu - viśvamu viṣṇuni pratīkamaguṭavalananu viśvamē viṣṇuvani dhyāniṃcuṭaku sādhanamaguṭacētanu - viśvamu viṣṇuni rūpamani ceppabaḍinadi - viśvamu bhagavaṃtuni vibhūtulalō peddadi.
(prapaṃcamaṃtayu tana śarīramugā galavāḍu - tana śarīramē ayinavāḍu)
(virāḍrūpuḍaguṭavalana - anēka rūpamulu tānē aguṭavalana - viśvamunaku - prapaṃcamunaku - ātma aguṭavalananu viśvarūpuḍu)
(tana svasvarūpamulō mārpu lēkuṃḍaganē bhagavaṃtuḍu prapaṃcarūpamugā kanabaḍuṭa)
(viśvamanagā anēkamu - anēka rūpamulatō prakāśiṃcuvāḍu)
rūpamē tadanaṃtasya viṣṇōrbhinnamivasthitaṃ | (viṣṇupurāṇamu)
(dēvatulu, manuṣyulu, paśuvulu, pakṣulu modalagu rūpamulugala yī jagattu aṃtayu anaṃtuḍaina śrīmahāviṣṇuvuyokka rūpamē - atani kanna vērugā - itara vastuvugā kanabaḍucunnadi mātramē.)
vividhābharaṇamulaina vidhamuna nitaḍē
diviyai, bhuviyai, raviyai
kaviyai sarvātmuḍai prakāśiṃcu tagan”. (śrī sītārāmāṃjanēya saṃvādamu - 1 - 78)
baramātmuṃḍakhila prapaṃcamayuḍai bhāsillu, naṭlēṭacē
sura siddōraga yakṣa kinnara narastōmādi śaśvaccarā
cara rūpōjvala sarvabhūtamulakun sadbhaktitō mrokkedan”. (śrīsītārāmāṃjanēya saṃvādamu - 14)
apaśya ddēva dēvasya śarīrē pāṃḍavastadā |. ( śrīmadbhagavadgīta - 11 - 13)
(kāryavastuvulu kāraṇavastuvulu tānē yaguṭacēta vāṭivalana kalugu rūpamulē yaguṭacēta nānārūpuḍugā - viśvarūpuḍugā ceppabaḍucunnāḍu).
(maṇi anēka vidhamulaina upādhi sannidhānamuvalana anēka rūpamulu galadigā kanabaḍunu - aṃtēgāni nijamugā anni rūpamulu galadikādu - ciṃtāmaṇilō kūḍa ēdi ciṃtiṃcabaḍunō adiyē kanabaḍunu kāni yadhārthamugā aṭlukādu - ā prakāramē sthiti, gati, nityānityamulu modalainavi okadānikaṃṭe iṃkokaṭi anēka viruddhamaina dharmamulu kalavi upādhulaguṭavalana ātma - paramātma - anēka dharmamulu galadi - anēkarūpamulugaladi - gā kanabaḍunu - aṃtēgāni, ēṭlu kanabaḍinā, ē rūpamunoṃdinā, annī bhagavaṃtuḍē - aṃducēta prapaṃcamulōnunna rūpamulanniyu atanivē, avanniyu kalisi okē rūpamaina prapaṃcamu - viśvamu - atani rūpamē - aṃducēta bhagavaṃtuḍu viśvarūpuḍu).
“nāṃtōsti mama divyānāṃ vibhūtīnāṃ paraṃtapa” - (śrīmadbhagavadgīta - 10 - 40)
aṃducēta ceppinavi, ceppabaḍanivi kalisi bhagavaṃtuni rūpamulu anaṃtamulu - iṭlu samasta vastuvulu bhagavaṃtiuni rūpamulē yaguṭavalana bhagavaṃtuḍu viśvarūpuḍu - anēka rūpamulu galavāḍu. prapaṃcamulō gala vastuvulanniyu kalisi prapaṃcamani ceppabaḍunu - anni rūpamulu kalisi viśvamu - prapaṃcamanu okē pedda rūpamugalavāḍanu kanuka viśvarūpuḍanu).
(śrīmadbhagavadgīta ēkādaśādhyayamulō bhagavaṃtuni viśvarūpamu ī kriṃda vidhamugā varṇiṃpabaḍinadi - śrīkṛṣṇuḍu =
“paśyamē pārtha rūpāṇi śataśōtha sahasraśaḥ |
nānā vidhāni divyāni nānā varṇākṛtīnica |
paśyādityān vasūn rudrā naśvinau maru tastadhā |
- - - ihai kasthaṃ jagatkṛtsnaṃ paśyādya sa carācaraḥ |”
tajō mayaṃ viśvamanaṃtamādyaṃ | - - -.
saṃjayuḍu - “anēka vaktranayanamanēkādbhuta darśanaṃ |
anaṃtaṃ viśvatō mukhaṃ |
divi sūrya sahasrasya bhavēdyugava dutthitā |
yadi bhāḥ sagṛśī sā syādbhāsastasya mahātmanaḥ |
tatraikasthaṃ jagatkṛtsnaṃ pravibhakta manēkathā |
apaśyaddēva dēvasya śarīrē pāṃḍavastadā |“.
arjunā - “paśyāmi dēvāṃstava dēva dēhē sarvāṃstathā bhūtaviśēṣasaṃghān |
brahmāṇamīśaṃ kalamalāsanasthaṃ ṛṣīṃśca sarvānuragāṃśca divyān |
anēka bāhūdara vaktra nētraṃ paśyāmi tvāṃ sarvatō (a)naṃtarūpaṃ |
nāṃtaṃ na madhyaṃ na punastavādiṃ paśyāmi viśvēśvara viśvarūpa |
- - - tējōrāśiṃ sarvatō dīptimaṃtaṃ |
paśyāmi tvāṃ durnirīkṣyaṃ samaṃtāt dīptānalārkadyutimapramēyaṃ |
- - - anaṃta bāhuṃ śaśisūryanētraṃ paśyāmitvāṃ dīptahutāśavaktraṃ |
sva tējasā viśvamidaṃ tapaṃtaṃ |
dyāvā pṛdhivyōridamaṃtaraṃ hi vyāptaṃ tva yaikēna diśaśca sarvāḥ |
- - - rūpaṃ mahattē bahuvaktra nētraṃ mahābāhō bahu bāhūrupādaṃ |
bahūdaraṃ bahudramṣṭrākarāḷaṃ” - - - tyayātataṃ viśvamanaṃtarūpa |
” śrīkṛṣṇaḥ- - “sudurdarśamadaṃ rūpaṃ dṛṣṭavānapi yanmama |
- - - “nāhaṃ vēdairna tapasā na dānēna na cējyayā |
śakya ēvaṃ vidhō draṣṭuṃ dṛṣṭavānasimāṃ yathā |
bhaktyā tvananyayā śakya ahamēvaṃ vidōrjuna | - - ” ( śrīmadbhagavadgīta - 15,16,17,19,20,23,38,52,53,54 - 11)
(“śrīkṛṣṇuḍu - pārthā - anēka vidhamulainaṭuvaṃṭinnī, anēkavarṇamulu, anēka ākṛtulu kaliginaṭuvaṃṭinnī, divyamainaṭuvaṃṭinnī vaṃdalakoladi, vēlakoladiyunna nā rūpamulanu ī nā viśvarūpamulō cūḍumu - ādityulanu, vasuvulanu, rudrulanu, aśvanī dēvatulanu, marudgaṇamunu kūḍa cūḍumu - - carācaramulu kaliginaṭuvaṃṭi jagattu aṃtaṭini okē cōṭa nunnadānini cūḍumu - tējōmayamu, tējassutō niṃḍiyunnadi, anaṃtamu ayina jagattunu, vēru vēru vastuvukaladainanu, okē vastuvugā okē cōṭa kalisiyinnadānini cūḍumu - saṃjayuḍu - anēka vaktramulu, nayanamulu - (anēka jīvula avayavamulu) kaladiyu, anēka adbhutamulu kaladiyu, aṃtamu lēnaṭṭidiyu aṃtaṭa mukhamulu kaladiyu, ayina viśvamunu śrīkṛṣṇabhagavānuni viśvarūpamulō arjunuḍu cūcenu - oka vēyi sūryulu okēmāru kalisi prakāśiṃcina vāṭi kāṃtitō śrīkṛṣṇuni tējassu samānamagunu - anēkamulugā vibhaktamaina jagattu aṃtaṭilōni dēvadēvuḍaina śrīkṛṣṇaparamātmuniyokka yī śarīramulō - viśvarūpamulō pārthuḍu cūcenu” arjunuḍu - “dēva, nī yī dēhamaṃdu samasta dēvatulunu, anēka vidhamulugānunna bhūtamulanu, caturmukha brahmanu, śivuni, ṛṣulaṃdarini, uragamulanu, cūcucunnānu - anēkamaina bāhuvulu, udaramulu, vaktramulu, nētramulu, kaligina ninnu aṃtamulēni nī yī viśvarūpamulō aṃtaṭanu unnadānilō cūcucunnānu - viśvamunaku īśvaruḍavaina nī yokka ādi madyāṃtamulu nāku kānarākunnavi. tējōrāśivi, anataṭanu prakāśiṃcuvāḍavu, iṃta anu parimiti lēni sūryāgnula kāṃti galavāḍavu, cūcuṭaku alavikāni tējassu galavāḍivi ayina vāḍivigā ninnu cūcucunnānu - lekkalēnanni bāhuvulugalavāḍivi, sūryacaṃdrulu nētramulugā galavāḍivi, bāgugā prajvaliṃcina agnihōtramuvaṃṭi nōru galavāḍivi, nī tējassutō ī prapaṃcamaṃtaṭini dīpti vaṃtamugā cēyuvāḍivi - tapiṃpacēyuvāḍivi - bhūmyākāśamula madhyapradēśamunu dikkulanu nīvokkaḍivē vyāpiṃciyunnāvu - anēka vaktramulu, nētramulu, bāhuvulu, ūruvulu, pādamulu, udaramulu, damṣṭralu gala nī rūpamunu cūcucunnānu - ī viśvamaṃtaṭini nīvu (baṭṭalōni) poḍugu pēkavale allukoni yunna dāramuvale vyāpiṃciyunnāvu” (śrīkṛṣṇuni vacanamu - nīvu cūcucunna yī nā viśvarūpamu bahu kaṣṭamucēta cūḍa vīlagunadi - cūcuṭaku cālakaṣṭamainadi. vēdādhyayanamuvalanagāni, tapassucētagāni, dānamu cētagāni, yajñamucētagāni ī nā rūpamunu nīvu cūcinaṭlugā - cūcuṭa śakyamukādu - nannu ī prakāramugā - nīvu cūcinaṭlugā - cūcuṭa nāyaṃdu ananya bhakti kaligiyuṃḍuṭacētanē śakyamagunu -)(nā yī viśvarūpamunu dēvatulutsāhapaḍiyuṃḍiyu ippaṭikimuṃdu cūciyuṃḍalēdu)
bhagavaṃtuni viśvarūpamulō prapaṃcamulō appuḍu ēmi jarugucunnadō dānini cūcuṭayēgāka, muṃdurābōvu rōjulalō yēvi jaruganunnadō anu viṣayamukūḍa arjunuḍu cūḍakaligenu - “yaccānya draṣṭumiccasi” (nīku yiṃkā ēmi cūḍavalenani yunnadō dānini kūḍa cūḍamani śrīkṛṣṇabhagavānuḍu arjununitō ceppenu - anagā, yī kurukṣētrayuddhamulō evaru gelicedaru anu saṃdēhamukūḍa tīrcukonavaccunani dīni dhvani - ā prakāramē ajēyulani tānu abhiprāyapaḍina bhīṣaṃuḍu (tātagāru, paraśurāmuni gelcinavāḍu), drōṇuḍu ( tana guruvu), karṇuḍu (sūryāṃśa saṃbhūtuḍu - tanavale daivāṃśa saṃbhūtuḍu), duryōdhanuḍu - maṟiyu vāri pakṣamuna yuddhamunaku vaccina rājulu, vāri śainyamu yuddhamulō canipōyi śrīkṛṣṇabhagavānuni nōṭilō, kālamutīrina vārivale, pravēśiṃcuṭa arjunuḍu viśvarūpamulō cūḍakaligenu - tānē jayamu poṃdunani muṃdugā telusukonenu - aṃducēta adhairyapaḍi yuddhamu mānavalasina avasaramu lēdani heccariṃcabaḍenu -
ī viśvarūpavarṇanavalana konni mukhyamaina viṣayamulu teliyanagucunnavi - avi ēvi yanagā -
(1) bhagavaṃtuḍu tējōmayuḍu - atani tējassu kaligiyuṃḍuṭacētanē sūryāgnulu modalagu tējōrūpamulu ( nakṣatramulu modalagunavi) prakāśiṃcucunnavi.
(2). sṛṣṭilō vyaṣṭirūpamulōnunna samasta vastuvulu bhagavaṃtunilōnē yunnavi.
(3). sṛṣṭilōnunna jīvakōṭilanniyu - vāṭi jīvitakālamu tīrinaṃtanē, vāṭiki iṣṭamu lēkunnanu, tappiṃcukonu avakāśamu lēka, eṃtaṭivārainanu, ā bhagavaṃtunilōnē, balavaṃtamugā layamaipōvucunnāru.
(4). sṛṣṭilōnunna jīvakōṭilanniyu bhagavaṃtunilōnuṃḍi puṭṭuṭacēta bhagavaṃtuni rūpamulē yaguṭacēta, ā rūpamula avayavamulanniyu atanivē yaguṭacēta sahasraśīrṣuḍu, sahasrākṣuḍu, sahasrapāduḍu, sarvuḍu anu modalagu nāmamulugalavāḍāyenu -
(5). aṃtamu lēnaṃta rūpamu, aṃtamu lēnanni śaktulugalavāḍaguṭacēta, sarvāṃtaryāmi yaguṭacēta, prapaṃcamaṃtaṭanu tānē niṃḍiyuṃḍi, anniṃṭiki tana śakti nicci panulu tana yiṣṭaprakāramu cēyiṃcukonuṭacēta, tānokkaḍē yī prapaṃcamaṃtaṭanu, dānilōni prati vastuvulōnuṃḍuṭacēta, sṛṣṭisthitilayamulu vāṭiki saṃbaṃdhiṃcina itara kāryamulu tānē anniṃṭicētanu cēyiṃcucuṃḍuṭacēta, sṛṣṭi aṃtaṭilōnu unnāḍu tānokaḍē - okē tatvamugā - nuṃḍuṭacēta advayuḍanirūḍhigā teliyacēyucunnāḍu. (It is only one Energy that manifests itself in several forms and several ways and pervades and permeats all things in the entire creation).
“bahupādōdara vaktralōcanaṃ dīpta pracaṃḍānala durnirīkṣaṃ |
aśēṣa bṛṃdārakanāga gīcaraṃ bhajāmi tē rāghava viśvarūpaṃ ||“.
sahasranētrānanapādabāhu manaṃtavīryaṃ ravikōṭitukyaṃ |
srakcaṃdanālaṃkṛta divyadēhaṃ bhajāmyahuṃ tē hari viśvarūpaṃ |
kalaṃba kōdaṃḍa gadābja saṃ yutaṃ danṣṭrākarāḷāṃkadhanaṃ jayānanaṃ |
pītāṃśuka svarṇakirīṭakuṃḍalaṃ bhajāmitē rāghava viśvarūpaṃ | ( śrīrāmakarṇāmṛtaṃ - 2 - 24 to 26)
(anēkamulaina toḍalu, pādamulu, udaramulu, mogamulu, nētramulu kaligi tīkṣṇamaina agnivale cūcuṭaku śakyamugānaṭṭinnī, samastadēvatalatōnu sarpamulatōnu kanabaḍina nī viśvarūpamunu, ō rāghavā | nēnu sēviṃcucunnānu - vēlakoladi ayina nētramulu, mogamulu, kāḷḷu cētulu kaliginaṭṭinnī, aṃtamulēni vīryamu kaliginaṭṭinnī, kōṭi sūryulatō samānamainaṭṭinnī, pūla daṃḍalatōnu, maṃcigaṃdhamutōnu alaṃkariṃpabaḍina divya dēhamunu - nī viśvarūpamunu nēnu sēviṃcucunnānu - bāgamu, dhanassu, gada, śaṃkhamu kaladiyu, bhayaṃkaramaina agni gala mogamu kaladiyu, paccani baṭṭayu, baṃgāru kirīṭamu, kuṃḍalamulu, kaladiyu nagu nī viśvarūpamunu, śrīrāmā, nēnu sēviṃcucunnānu).
“amī ca tvāṃ dhṛtarāṣṭrasya putrāḥ sarvē sahaivavanipāla saṃghaiḥ |
bhīṣmō drōṇaḥ, sūtaputrastathāsau sahāsmadīyairapi yōdhamukhyaiḥ |
vaktrāṇi tē tvaramāṇā viśaṃti damṣṭrākarāḷani bhayānakāni |
kē cidvilagnā daśanāṃtarēṣu saṃ dṛśyaṃtē cūrṇiḥ tairuttamāṃgaiḥ |
yathā nadīnāṃ bahavōṃbu vēgāḥ samudramēvābhimukhā dravaṃti |
tathā tavāmī naralōkavīrāḥ viśaṃti vaktrāṇyabhi vijvalaṃti |
yathā pradīptaṃ jvalanaṃ pataṃgāḥ viśaṃti nāśāya samṛthavēgāḥ |
tadhaiva nāśāya viśaṃti lōkāḥ tavāpi vaktāṇi samṛddhavēgāḥ |“. ( śrīmadbhagavadgīta - 11 - 26 to 29)
(nēnevarini jayiṃcagalanā ani nīku saṃśayamu kalugacēsina ī dhṛtarāṣṭruni putrulu, duryōdhanuḍu modalagu kauravulu nūruguru, śalyuḍu modalagu rājulu, vāri vāri sēnalatō kalisi nīlō kaliyucunnāru - nīlō aṃtamoṃducunnāru - ā prakāramē ajēyulani lōkamulō prasiddhikāṃcina bhīṣmuḍu, drōṇuḍu, karṇuḍu modalaguvāru kūḍā, mā pakṣamunaku cērina dṛṣṭadyumnuḍu modalagu anēkamaina yōdhamukhyulatō nīlō kalīsipōvucunnāru - bhayamunu kalugacēyu nī nōṭilō toṃdaṟapaḍinavārivale pravēśiṃcucunnāru. koṃdaṟu nī daṃtamulaṃdu cikkukoniyuṃḍagā vāri śiramulu piṃḍi ayipōvucunnavi. anēkamaina nadulu anēkamārgamulamīdugā pravahiṃcucū vāṭi pravāha vēgamutō anniyu samudramu dikkuganē veḷḷi dānilō kalisipōvucunnavi. ā prakāramugānē ī vīrulaṃdaṟu kālamurāgā - avasānamukālamurāgā, kālamucē tvaragā cēruṭaku prērēriṃpabaḍi dānivalana balavaṃtamugā trōyabaḍina vārivalenē - ī bhīṣmuḍu modalagu nīmahāvīrulaṃdaṟu nī nōṭilō pravēśiṃcucunnāru - eṃta goppavārainanu kālamu tīripōyinatōḍanē canipōvalasinavārē. ā kālamunaku aḍḍutagili dānini dhikkariṃpa neṭṭivāriki śakyamukādu. bhagavaṃtuḍu tānē aṭṭi kālasvarūpuḍanu ani ceppenu –
“kālōsmi lōkakṣayakṛt pravṛddhō” (śrīmadbhagavadgīta - 11 32)
miḍatalu agnini cūci dāni kāṃtiki bhramapaḍi adi tinubaṃḍāramu ani āśatō buddhipūrvakamugānē, todarapaḍucū maṃḍucunna agnilō paḍi naśiṃcucunnavi. ā prakāramugā yī lōkamulu maṃci vēgamugalavai nī nōṭilō pravēśiṃcucunnavi. ōḍi pōvuṭa ennaḍū yeṟugaka jayamunē ellapuḍū poṃducuṃḍuvāraina bhīṣmuḍu modalaguvāri daggaranuṃḍi alpajīvulaina, alpāyussugalavaina miḍatalavaṟakugala samasta jīvulu vāri jīvitakālasamāpti yagunappuḍu ī vidhamuganē, iṣṭamulēkapōyinanu balavaṃtamugā koṃdaṟu, teliyaka koṃdaṟu, buddhi pūrvakamugā koṃdaṟu maraṇamunu poṃduduru - (The paths of glory lead but to the grave)
anni rūpamulalō nuṃḍuvāḍu kanuka viśvarūpuḍu.
viṣṇuṃḍu guṇatrayātmakaṃbagu viśvarūpaṃbudhariyiṃcina bhuviyunu, nabhaṃbunu divaṃbunu, diśalunu, diśābhidraṃbulunu samudraṃbulunu, jagadakhila bhū nivahaṃbuluṃ dānayai yēkībhaviṃci - - - brahmāṃḍaṃbu tanamēni kapputeṟaṃguna nuṃḍa vijṛṃbhiṃci –
ma. okapādaṃbuna bhūmigappi, divi vēṟoṃṭan nirōdhiṃci, yoṃ
ḍakaṭan mīdi jagaṃbulella doḍi noṃḍuṃṭin vilaṃghiṃci, pa
ṭṭaka brahmāṃḍa kaṭāhamuṃ beṭili vēṃḍraṃbai pagul gānarā
kokaḍai vāgdṛgalabhyuḍai harivibhuṃḍoppāre viśvākṛtin (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 19 - 623,624)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.