భూతగణంబులను మేఘపుంజంబుల ని
ర్ధూతముగ జేయు ననిలుని
భాతిని జరియింపజేసి పౌరుషమొప్పన్
“తే. రూఢి తత్తత్క్రియాలబ్ధ రూపుడవును
సుమహిత స్ఫురదమిత తేజుడవు, జండ
వేగుడవు నయిఘన భుజావిపుల మహిమ
విశ్వసంహార మర్థిగావింతు వీశ”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 24 - 725, 726)
“తే. అప్రమత్తుండవగుచు బద్మాక్ష! నీవు
మ్రింగుదువు చాల నాకట మ్రేగుచుండి
నాలుకలు గ్రోయు భూరి పన్నగము వాత
బడిన యెలుకను భక్షించు పగిది, ననఘ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 24 - 729)
bhūtagaṇaṃbulanu mēghapuṃjaṃbula ni
rdhūtamuga jēyu naniluni
bhātini jariyiṃpajēsi pauruṣamoppan
“tē. rūḍhi tattatkriyālabdha rūpuḍavunu
sumahita sphuradamita tējuḍavu, jaṃḍa
vēguḍavu nayighana bhujāvipula mahima
viśvasaṃhāra marthigāviṃtu vīśa”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 24 - 725, 726)
“tē. apramattuṃḍavagucu badmākṣa! nīvu
mriṃguduvu cāla nākaṭa mrēgucuṃḍi
nālukalu grōyu bhūri pannagamu vāta
baḍina yelukanu bhakṣiṃcu pagidi, nanagha “. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 24 - 729)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.