(బ్రహ్మాండరూపమే దేహముగా ధరించియుండుటచేత ఆ బ్రహ్మాండములోనుండు సమస్త ప్రాణుల దేహములు తన రూపములే యగుటచేత పరబ్రహ్మ ప్రాణులందఱి కండ్లు మొదలగు అవయవములు కలిగియుండువాడు - అని ‘విశ్వతశ్చక్షుః’ అను మొదలగు (విశ్వతో ముఖః, విశ్వతః పాణాపాదం) నామములచే చెప్పబడుచున్నాడు-)
(సమస్త ప్రాణుల కండ్లునూ పరబ్రహ్మవేయగుటవలన “విశ్వతశ్చక్షుః” అని చెప్పబడుచున్నాడు - ఇందువలననే స్వేచ్చగా అంతటా చక్షువులు, రూపములు గలిగియుండు సామర్థ్యము కలిగియుండుట తటస్థించినది.)
(మీదను చతుర్ముఖబ్రహ్మ మొదలు క్రిందను స్తంబము వరకునుగల సమస్త ప్రాణులయొక్క - కండ్లు, ముఖములు, చేతులు, పాదములు మొదలగునవన్నియు పరబ్రహ్మవే - అంతా పరబ్రహ్మమేకనుక, పరబ్రహ్మ కాక మఱియొకటి లేనందున. దీనిని బట్టి ప్రాణులందఱి మిగిలిన అవయవములన్నియు పరబ్రహ్మవే యగును అని చెప్పినట్లేయని గ్రహించ వలెను).
(brahmāṃḍarūpamē dēhamugā dhariṃciyuṃḍuṭacēta ā brahmāṃḍamulōnuṃḍu samasta prāṇula dēhamulu tana rūpamulē yaguṭacēta parabrahma prāṇulaṃdaṟi kaṃḍlu modalagu avayavamulu kaligiyuṃḍuvāḍu - ani ‘viśvataścakṣuḥ’ anu modalagu (viśvatō mukhaḥ, viśvataḥ pāṇāpādaṃ) nāmamulacē ceppabaḍucunnāḍu-)
(samasta prāṇula kaṃḍlunū parabrahmavēyaguṭavalana “viśvataścakṣuḥ” ani ceppabaḍucunnāḍu - iṃduvalananē svēccagā aṃtaṭā cakṣuvulu, rūpamulu galigiyuṃḍu sāmarthyamu kaligiyuṃḍuṭa taṭasthiṃcinadi.)
(mīdanu caturmukhabrahma modalu kriṃdanu staṃbamu varakunugala samasta prāṇulayokka - kaṃḍlu, mukhamulu, cētulu, pādamulu modalagunavanniyu parabrahmavē - aṃtā parabrahmamēkanuka, parabrahma kāka maṟiyokaṭi lēnaṃduna. dīnini baṭṭi prāṇulaṃdaṟi migilina avayavamulanniyu parabrahmavē yagunu ani ceppinaṭlēyani grahiṃca valenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.