← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వయోనిః viśvayōniḥ

Original — తెలుగు
  1. “విశ్వస్య కారణత్వాత్ విశ్వయోనిః”. (శ్రీశంకరః).

(“విశ్వస్య యోనిః కారణం బ్రహ్మ”)

(ప్రపంచము పుట్టుటకు కారణమైనవాడు).

  1. “విశ్వం యోనిః అస్య ఇతి, విశ్వశ్చాసౌ యోనిశ్చ ఇతివా విశ్వయోనిః” (శ్రీశంకరః)

(విశ్వము - ప్రపంచము - యోనిగా గలవాడు - ఇతనే ప్రపంచము, ప్రపంచము పుట్టుటకు యోని రూపముగా నుండువాడు).

  1. ప్రపంచకారణం

(ప్రపంచమునకు - ప్రపంచము పుట్టుటకు - కారణమైనవాడు)

  1. విశ్వసంభవస్థితి ప్రలయహేతుత్వాత్ విశ్వయోనిః - యద్వా, విశ్వా యోనయః యస్య నియమ్యాః సవిశ్వయోనిః - పరమేశ్వరః -

(ప్రపంచము పుట్టుటకు, నిలిచియుండుటకు, నశించుటకు కారణమైనవాడు, లేక, లోకములోని యోనులన్నియు ఇతను - భగవంతుడు - నియమించినవే).

  1. “మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం |

సంభవః సర్వభూతానాం తతో భవతి, భారత |

సర్వ యోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః |

తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా |“. (శ్రీమద్భగవద్గీత - 14 - 3, 4)

(మహద్బ్రహ్మ యనగా, చతుర్ముఖ బ్రహ్మ - లేక, ప్రకృతి - నాకు యోని - దానిలో నేను గర్భము ధరింపచేయుచున్నాను - దానినుండి - దానిలోనుండి సమస్తమైన భూతములు పుట్టుచున్నవి. సృష్టిలోనున్న యోనులన్నింటియందు ఏ ఏ మూర్తులు - రూపముగలవస్తువులు - ఏవేవి పుట్టుచున్నవో వాటి అన్నింటికి ఆ చతుర్ముఖబ్రహ్మ - ప్రకృతి మహద్యోని - మూల యోని. వాటి అన్నింటిలోను బీజము నుంచువాడను నేను. అందుచేత ప్రపంచమంతటికి తండ్రిని, ప్రకృతి - చతుర్ముఖ బ్రహ్మ తల్లి)

Transliteration
  1. “viśvasya kāraṇatvāt viśvayōniḥ”. (śrīśaṃkaraḥ).

(“viśvasya yōniḥ kāraṇaṃ brahma”)

(prapaṃcamu puṭṭuṭaku kāraṇamainavāḍu).

  1. “viśvaṃ yōniḥ asya iti, viśvaścāsau yōniśca itivā viśvayōniḥ” (śrīśaṃkaraḥ)

(viśvamu - prapaṃcamu - yōnigā galavāḍu - itanē prapaṃcamu, prapaṃcamu puṭṭuṭaku yōni rūpamugā nuṃḍuvāḍu).

  1. prapaṃcakāraṇaṃ

(prapaṃcamunaku - prapaṃcamu puṭṭuṭaku - kāraṇamainavāḍu)

  1. viśvasaṃbhavasthiti pralayahētutvāt viśvayōniḥ - yadvā, viśvā yōnayaḥ yasya niyamyāḥ saviśvayōniḥ - paramēśvaraḥ -

(prapaṃcamu puṭṭuṭaku, niliciyuṃḍuṭaku, naśiṃcuṭaku kāraṇamainavāḍu, lēka, lōkamulōni yōnulanniyu itanu - bhagavaṃtuḍu - niyamiṃcinavē).

  1. “mama yōnirmahadbrahma tasmin garbhaṃ dadāmyahaṃ |

saṃbhavaḥ sarvabhūtānāṃ tatō bhavati, bhārata |

sarva yōniṣu kauṃtēya mūrtayaḥ saṃbhavaṃti yāḥ |

tāsāṃ brahma mahadyōnirahaṃ bījapradaḥ pitā |“. (śrīmadbhagavadgīta - 14 - 3, 4)

(mahadbrahma yanagā, caturmukha brahma - lēka, prakṛti - nāku yōni - dānilō nēnu garbhamu dhariṃpacēyucunnānu - dāninuṃḍi - dānilōnuṃḍi samastamaina bhūtamulu puṭṭucunnavi. sṛṣṭilōnunna yōnulanniṃṭiyaṃdu ē ē mūrtulu - rūpamugalavastuvulu - ēvēvi puṭṭucunnavō vāṭi anniṃṭiki ā caturmukhabrahma - prakṛti mahadyōni - mūla yōni. vāṭi anniṃṭilōnu bījamu nuṃcuvāḍanu nēnu. aṃducēta prapaṃcamaṃtaṭiki taṃḍrini, prakṛti - caturmukha brahma talli)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.