← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విశ్వుడు viśvuḍu

Original — తెలుగు
  1. “ఈశాజ్ఞయా విరాట్ వ్యష్టి దేహం ప్రవిశ్య బుధిమధిష్ఠాయ విశ్వత్వమగమత్ విజ్ఞానాత్మా, చిదాభాసో, విశ్వో, వ్యావహారికో, జాగ్రత్ స్థూలదేహాభిమానీ కర్మ భూరిత చ విశ్వస్య నామభవతి.” (పైంగలోపనిషత్)

(ఈశ్వరుని ఆజ్ఞచేత విరాడ్రూపుడే వ్యష్టిదేహమును - ఒక్కొక్క దేహమును - ప్రవేశించి, బుద్ధిని అధిష్టించియుండి విశ్వుడు ఆయెను. విజ్ఞానాత్మయని, చిదాభాసుడని, విశ్వుడని, వ్యావహారిక జీవుడు అని జాగ్రదవస్థ యందున్న స్థూలదేకమును అభిమానించువాడనిన్నీ, కర్మభూః - కర్మవలన కలిగినవాడనిన్నీ - విశ్వునకు పేర్లు)

  1. ఈ దేహమునందు బుద్ధియని ఉపాధితో కూడియుండి, జాగ్రదవస్థయందు జ్ఞాన కర్మేంద్రియములతో వ్యవహరించునపుడు విశ్వుడనబడును - ఇతనినే విజ్ఞానాత్మ, చిదాభాసుడు, విశ్వుడు, వ్యావహారికుడు అని అందురు - వ్యవహారములన్నియు చేయువాడగుటచేత వ్యావహారికుడనియు, చిత్ స్వభావము, లేక, చైతన్యస్వభావము కలిగియుండుటచేత చిత్పదార్థమైనపరమాత్మవలె తోచుచుండును కనుక చిదాభాసుడు (చిత్ + అభాసుడు) అనియు, లేక, విజ్ఞానము కలిగియుండుటవలన విజ్ఞానాత్మ - (విజ్ఞానము కల ఆత్మ) అనియు - (జీవాత్మయనియు), విషయములన్నింటియందును అభిమానము కలిగియుండుటచేత విశ్వుడనియు ఇతడే చెప్పబడుచున్నాడు).

  2. “సూక్ష్మ దేహాభిమానినా పరిత్యాగేనైవ స్థూల దేహే ‘అహం’ ఇత్యభిమానవాన్, జాగ్రదభిమానీ జీవః ఇత్యుచ్యతే -”

(సూక్ష్మ దేహమునందభిమానము వదలి స్థూలదేహమందు ‘నేను’ అని ఆ దేహమందు అభిమానము కలిగి, జాగ్రదవస్థయందుండి చైతన్యము కనపర్చుచుండు జీవునకు విశ్వుడనిపేరు - స్థూల శరీరములన్నింటియందును వేఱు వేఱుగా నుండి తన శరీరములోనున్న అదియే తాను అని దానియందభిమానము కలిగియుండువాడు).

  1. వ్యష్టి స్థూల దేహాభిమానినో విశ్వ ఇతి నామ.

(సృష్టిలో వ్యష్టిగానున్న - వేఱు వేఱుగానున్న - స్థూలదేహముల నభిమానించువాని పేరు - జీవుడు పేరు - విశ్వుడు)

  1. “స్థూల సూక్ష్మకారణ శరీరములనెడి తనుత్రయాభిమాని జీవుండు - - - ఆ జీవుండె సత్వగుణయుక్తుండై వైకారికాహంకారమువల్ల మోహన వికృతిభావం కలవాడై స్థూలశరీరాభిమానియై జాగ్రదవస్థయందు విశ్వుండనిపించుకొనును.” (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 2)

  2. పంచీకృత పంచమహాభూతాని తత్కార్యం సర్వం విరాడిత్యుచ్యతే. ఏ తత్ స్థూల శరీరమాత్మనః ఇంద్రియైరర్థోపలబ్ధి జాగరితం తదుభయాభిమాన్యాత్మా విశ్వః |.

(పంచీకృతము కాబడిన పంచమహాభూతములు, వాటి కార్యములయిన - వాటిలోనుండి పుట్టిన సమస్త వస్తువులు - ఇదంతయు విరాట్ అని చెప్పబడుచున్నది. ఇట్టి స్థూల శరీరమును, దాని జాగ్రదవస్థను - ఈ రెండింటినీ అభిమానించు ఆత్మ విశ్వుడు అనిపించుకొనును)

  1. “స్థూలశరీర వ్యష్టభిమానీ, వ్యావహారిక జీవుడు, బుద్ధిప్రతిఫలిత చైతన్యుడు, చిదాభాసుడు, విక్షేపరూపుడు, క్షేత్రి, శరీరి, ప్రమాత, కర్త, భోక్త, సంసారి, విషయి, ప్రత్యగాత్మ, విజ్ఞానమయుడు, ‘త్వం’ పదముఖ్యార్థంబు అనునవి మొదలుగాగల యవియు విశ్వుని పర్యాయనామములు -” (వివేకచింతామణి - పరమానందతీర్థ)

  2. (జీవులకు గల జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అను మూడు అవస్థలలోను జాగ్రదవస్థాభిమాని విశ్వుడు, లేక వైశ్యానరుడు - వ్యావహారిక జీవుడు)

Transliteration
  1. “īśājñayā virāṭ vyaṣṭi dēhaṃ praviśya budhimadhiṣṭhāya viśvatvamagamat vijñānātmā, cidābhāsō, viśvō, vyāvahārikō, jāgrat sthūladēhābhimānī karma bhūrita ca viśvasya nāmabhavati.” (paiṃgalōpaniṣat)

(īśvaruni ājñacēta virāḍrūpuḍē vyaṣṭidēhamunu - okkokka dēhamunu - pravēśiṃci, buddhini adhiṣṭiṃciyuṃḍi viśvuḍu āyenu. vijñānātmayani, cidābhāsuḍani, viśvuḍani, vyāvahārika jīvuḍu ani jāgradavastha yaṃdunna sthūladēkamunu abhimāniṃcuvāḍaninnī, karmabhūḥ - karmavalana kaliginavāḍaninnī - viśvunaku pērlu)

  1. ī dēhamunaṃdu buddhiyani upādhitō kūḍiyuṃḍi, jāgradavasthayaṃdu jñāna karmēṃdriyamulatō vyavahariṃcunapuḍu viśvuḍanabaḍunu - itaninē vijñānātma, cidābhāsuḍu, viśvuḍu, vyāvahārikuḍu ani aṃduru - vyavahāramulanniyu cēyuvāḍaguṭacēta vyāvahārikuḍaniyu, cit svabhāvamu, lēka, caitanyasvabhāvamu kaligiyuṃḍuṭacēta citpadārthamainaparamātmavale tōcucuṃḍunu kanuka cidābhāsuḍu (cit + abhāsuḍu) aniyu, lēka, vijñānamu kaligiyuṃḍuṭavalana vijñānātma - (vijñānamu kala ātma) aniyu - (jīvātmayaniyu), viṣayamulanniṃṭiyaṃdunu abhimānamu kaligiyuṃḍuṭacēta viśvuḍaniyu itaḍē ceppabaḍucunnāḍu).

  2. “sūkṣma dēhābhimāninā parityāgēnaiva sthūla dēhē ‘ahaṃ’ ityabhimānavān, jāgradabhimānī jīvaḥ ityucyatē -”

(sūkṣma dēhamunaṃdabhimānamu vadali sthūladēhamaṃdu ‘nēnu’ ani ā dēhamaṃdu abhimānamu kaligi, jāgradavasthayaṃduṃḍi caitanyamu kanaparcucuṃḍu jīvunaku viśvuḍanipēru - sthūla śarīramulanniṃṭiyaṃdunu vēṟu vēṟugā nuṃḍi tana śarīramulōnunna adiyē tānu ani dāniyaṃdabhimānamu kaligiyuṃḍuvāḍu).

  1. vyaṣṭi sthūla dēhābhimāninō viśva iti nāma.

(sṛṣṭilō vyaṣṭigānunna - vēṟu vēṟugānunna - sthūladēhamula nabhimāniṃcuvāni pēru - jīvuḍu pēru - viśvuḍu)

  1. “sthūla sūkṣmakāraṇa śarīramulaneḍi tanutrayābhimāni jīvuṃḍu - - - ā jīvuṃḍe satvaguṇayuktuṃḍai vaikārikāhaṃkāramuvalla mōhana vikṛtibhāvaṃ kalavāḍai sthūlaśarīrābhimāniyai jāgradavasthayaṃdu viśvuṃḍanipiṃcukonunu.” (brahmavidyāsudhārṇavamu - 2)

  2. paṃcīkṛta paṃcamahābhūtāni tatkāryaṃ sarvaṃ virāḍityucyatē. ē tat sthūla śarīramātmanaḥ iṃdriyairarthōpalabdhi jāgaritaṃ tadubhayābhimānyātmā viśvaḥ |.

(paṃcīkṛtamu kābaḍina paṃcamahābhūtamulu, vāṭi kāryamulayina - vāṭilōnuṃḍi puṭṭina samasta vastuvulu - idaṃtayu virāṭ ani ceppabaḍucunnadi. iṭṭi sthūla śarīramunu, dāni jāgradavasthanu - ī reṃḍiṃṭinī abhimāniṃcu ātma viśvuḍu anipiṃcukonunu)

  1. “sthūlaśarīra vyaṣṭabhimānī, vyāvahārika jīvuḍu, buddhipratiphalita caitanyuḍu, cidābhāsuḍu, vikṣēparūpuḍu, kṣētri, śarīri, pramāta, karta, bhōkta, saṃsāri, viṣayi, pratyagātma, vijñānamayuḍu, ‘tvaṃ’ padamukhyārthaṃbu anunavi modalugāgala yaviyu viśvuni paryāyanāmamulu -” (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

  2. (jīvulaku gala jāgratta, svapnamu, suṣupti anu mūḍu avasthalalōnu jāgradavasthābhimāni viśvuḍu, lēka vaiśyānaruḍu - vyāvahārika jīvuḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.