← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వ్యభిచారి vyabhicāri

Original — తెలుగు
  1. "యద్వస్తు స్వల్పదేశే స్వల్ప కాలేచ వర్తతే, తద్వభిచారి- పట ఇవ. దేహోపి పరిచ్ఛిన్నః, స్వల్ప దేశే వర్తతే, ఉత్పత్తి నాశవాన్ చ దేహః, సర్వకాలవర్తీ న భవతి, కింతు స్వల్పకాలే ఏవ వర్తతే, అతః స్వల్ప దేశకాలవర్తిత్వాత్ స్థూల దేహో వ్యభిచారీ".

(ఏ వస్తువు స్వల్ప దేశమందు, స్వల్ప కాలమందు ఉండునో, దానిని వ్యభిచారి యందురు - బట్టవలెనే - దేహము పరిచ్ఛిన్నమైనది - అనగా స్వల్పదేశమందుండునది - ఒకే కాలమందు అంతటను ఉండనిది. జన్మ, మరణము కలది - అనగా, అన్ని కాలములందు - శాశ్వతముగా - ఉండనిది - స్వల్పకాలమందే ఉండునది. అందుచేత స్వల్ప దేశమందు, స్వల్పకాలమందు ఉండునదగుటచేత స్థూలదేహము వ్యభిచారియని చెప్పబడుచున్నది).

  1. "యద్వస్తు క్వచిద్విచ్యతే క్వచిచ్చ న విద్యతే తత్ వ్యభిచారి ఇత్యుచ్యతే" ఘట ఇతినామ పృధ బఘ వర్తులత్వాది రూపంచ పటే న విద్యతే ‘పట’ ఇతినామ ఆతాన వితానాత్మవాది "రూపం చ ఘటే న విద్యతే - ఇత్థం సర్వపదార్థ్గేషు అపినామ రూపాంశా వ్యభిచారిణౌ".

(ఏ వస్తువు ఒక చోటనుండి ఇంకొక చోట నుండదో అది వ్యభిచారి యని చెప్పబడుచున్నది. కుండ అను పేరు దాని ఆకారభేదములు బట్టయందు లేవు - ఆ ప్రకారముగానే ‘పటము’ (బట్త) అను పేరు, దాని ఆతాన వితానములు మొదలగు రూపములు కుండయందు లేవు. ఈ ప్రకారముగా అన్ని పదార్థములందు వాటి వాటి నామ రూపములు వేరు వేరుగ నుండును - మారుచుండును)

  1. ఆగమాపాయినః, బాలయు వాది దేహద్యవస్థాః -

(వచ్చుచు పోవుచుండునవి - స్థిరముగా నుండనివి - బాల్యము, యౌవనము అను మొదలగు దేహముయొక్క అవస్థలు - దేహము యొక్క ఏ అవస్థయు కలకాలముండదు - అందుచేత అవి వ్యభిచారి.)

  1. పరమార్థం జహాతి

(పరమార్థమును విడిచి వేయునది)

  1. అన్యవృత్తి మనస్కత్వం.

(ఇతర వ్యాపారములందు - అనేకములందు మనస్సు కలిగుఇ యుండుట. ఒకే విషయమందు మనస్సు స్థిరముగా నుండకపోవుట)

Transliteration
  1. "yadvastu svalpadēśē svalpa kālēca vartatē, tadvabhicāri- paṭa iva. dēhōpi paricchinnaḥ, svalpa dēśē vartatē, utpatti nāśavān ca dēhaḥ, sarvakālavartī na bhavati, kiṃtu svalpakālē ēva vartatē, ataḥ svalpa dēśakālavartitvāt sthūla dēhō vyabhicārī".

(ē vastuvu svalpa dēśamaṃdu, svalpa kālamaṃdu uṃḍunō, dānini vyabhicāri yaṃduru - baṭṭavalenē - dēhamu paricchinnamainadi - anagā svalpadēśamaṃduṃḍunadi - okē kālamaṃdu aṃtaṭanu uṃḍanidi. janma, maraṇamu kaladi - anagā, anni kālamulaṃdu - śāśvatamugā - uṃḍanidi - svalpakālamaṃdē uṃḍunadi. aṃducēta svalpa dēśamaṃdu, svalpakālamaṃdu uṃḍunadaguṭacēta sthūladēhamu vyabhicāriyani ceppabaḍucunnadi).

  1. "yadvastu kvacidvicyatē kvacicca na vidyatē tat vyabhicāri ityucyatē" ghaṭa itināma pṛdha bagha vartulatvādi rūpaṃca paṭē na vidyatē ‘paṭa’ itināma ātāna vitānātmavādi "rūpaṃ ca ghaṭē na vidyatē - itthaṃ sarvapadārthgēṣu apināma rūpāṃśā vyabhicāriṇau".

(ē vastuvu oka cōṭanuṃḍi iṃkoka cōṭa nuṃḍadō adi vyabhicāri yani ceppabaḍucunnadi. kuṃḍa anu pēru dāni ākārabhēdamulu baṭṭayaṃdu lēvu - ā prakāramugānē ‘paṭamu’ (baṭta) anu pēru, dāni ātāna vitānamulu modalagu rūpamulu kuṃḍayaṃdu lēvu. ī prakāramugā anni padārthamulaṃdu vāṭi vāṭi nāma rūpamulu vēru vēruga nuṃḍunu - mārucuṃḍunu)

  1. āgamāpāyinaḥ, bālayu vādi dēhadyavasthāḥ -

(vaccucu pōvucuṃḍunavi - sthiramugā nuṃḍanivi - bālyamu, yauvanamu anu modalagu dēhamuyokka avasthalu - dēhamu yokka ē avasthayu kalakālamuṃḍadu - aṃducēta avi vyabhicāri.)

  1. paramārthaṃ jahāti

(paramārthamunu viḍici vēyunadi)

  1. anyavṛtti manaskatvaṃ.

(itara vyāpāramulaṃdu - anēkamulaṃdu manassu kaligui yuṃḍuṭa. okē viṣayamaṃdu manassu sthiramugā nuṃḍakapōvuṭa)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.