పంచప్రాణములలో నొకటి - వ్యానవాయువు -
"వ్యాయమన కర్మా వ్యానః - ప్రాణాపానయోః సంధిః వీర్యవత్కర హేతుశ్చ-". (శ్రీశంకరః)
(వ్యాయమనం = ప్రాణాపాన యోర్నియమనం కర్మా అస్య ఇతి తథోక్తిః; వీర్యవత్కర్మ; అరణ్యాం అగ్న్యుత్పాదనాది (ఆనందజ్ఞాన టీక)
(ప్రాణవాయువు, అపానవాయువు - ఈ రెండింటికి సంధి. ఈ రెండింటిని నియమించు కర్మకలది. అరణ్యములందు రగుల్కొను దావాగ్నివలె వీర్యవంతమైన కర్మ చేయునది. శరీరములో వేడిని కలిగించునది.)
(అంతటను వ్యాపించునది కనుక వ్యానము - సూర్యుడు తన కిరణములవలె, హృదయమునుండి అన్ని చోట్లకు ప్రసరించుచున్న నాడులద్వారా దేహమంతటను వ్యాపించి ప్రసరించునది. సంధులలోను, స్కందమందు, మర్మదేశమందు, ముఖ్యముగా ప్రాణాపానవృత్తులమధ్య పుట్టిన వృత్తులు కలదై వీర్యవత్కర్మ చేయునది).
(అన్నరసమును తీసుకొని దేహమంతటను సంచరించునది వ్యానము - చెమటను, రక్తమును బైటికి పంపించునది)
శరీరమునంతటను వ్యాపించి పైన ఉన్న శీతోష్ణములను లోపలికి తీసుకొని, లోపలనున్న శీతోష్ణములను పైకి పంపునది.
"శ్రోతాక్షి, కటి, గుల్ఫ,ఘ్రాణ గళ,స్నిగ్ధ,దేశేషు వ్యానః సంచరతి". (శాండిల్యోపనిషత్).
(చెవులు, కండ్లు, గుల్ఫము, ఘ్రాణము, గళము (కంఠము) మొదలగు దేశములందు వ్యానము - వ్యానవాయువు - సంచరించును).
(శరీరమంతటను ఉండునది, వర్తించునది)
(హనోపాదన చేష్టలు మొదలగు చేష్టలు వ్యానవాయువు చేయుకర్మ).
"వాయుతత్వం యొక్క నిజాంశమే వ్యానవాయువాయెను -" (బ్రహ్మవిద్యాసుధార్ణవము)
"తాసు సర్వాస్వవస్థాయ వ్యానో యం కురుతేబలం"
(నాడులన్నింటిలోను వ్యానము వ్యాపించి అన్ని అవస్థలలోను వాటికి బలమునిచ్చును)
paṃcaprāṇamulalō nokaṭi - vyānavāyuvu -
"vyāyamana karmā vyānaḥ - prāṇāpānayōḥ saṃdhiḥ vīryavatkara hētuśca-". (śrīśaṃkaraḥ)
(vyāyamanaṃ = prāṇāpāna yōrniyamanaṃ karmā asya iti tathōktiḥ; vīryavatkarma; araṇyāṃ agnyutpādanādi (ānaṃdajñāna ṭīka)
(prāṇavāyuvu, apānavāyuvu - ī reṃḍiṃṭiki saṃdhi. ī reṃḍiṃṭini niyamiṃcu karmakaladi. araṇyamulaṃdu ragulkonu dāvāgnivale vīryavaṃtamaina karma cēyunadi. śarīramulō vēḍini kaligiṃcunadi.)
(aṃtaṭanu vyāpiṃcunadi kanuka vyānamu - sūryuḍu tana kiraṇamulavale, hṛdayamunuṃḍi anni cōṭlaku prasariṃcucunna nāḍuladvārā dēhamaṃtaṭanu vyāpiṃci prasariṃcunadi. saṃdhulalōnu, skaṃdamaṃdu, marmadēśamaṃdu, mukhyamugā prāṇāpānavṛttulamadhya puṭṭina vṛttulu kaladai vīryavatkarma cēyunadi).
(annarasamunu tīsukoni dēhamaṃtaṭanu saṃcariṃcunadi vyānamu - cemaṭanu, raktamunu baiṭiki paṃpiṃcunadi)
śarīramunaṃtaṭanu vyāpiṃci paina unna śītōṣṇamulanu lōpaliki tīsukoni, lōpalanunna śītōṣṇamulanu paiki paṃpunadi.
"śrōtākṣi, kaṭi, gulpha,ghrāṇa gaḷa,snigdha,dēśēṣu vyānaḥ saṃcarati". (śāṃḍilyōpaniṣat).
(cevulu, kaṃḍlu, gulphamu, ghrāṇamu, gaḷamu (kaṃṭhamu) modalagu dēśamulaṃdu vyānamu - vyānavāyuvu - saṃcariṃcunu).
(śarīramaṃtaṭanu uṃḍunadi, vartiṃcunadi)
(hanōpādana cēṣṭalu modalagu cēṣṭalu vyānavāyuvu cēyukarma).
"vāyutatvaṃ yokka nijāṃśamē vyānavāyuvāyenu -" (brahmavidyāsudhārṇavamu)
"tāsu sarvāsvavasthāya vyānō yaṃ kurutēbalaṃ"
(nāḍulanniṃṭilōnu vyānamu vyāpiṃci anni avasthalalōnu vāṭiki balamuniccunu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.