"నారాయణాయ విద్మహే, వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ -" (వాసుదేవుడు అనగా తనలోనుండి పుట్టిన సర్వ భూతములలోను వ్యాపించి నిండియుండువాడు అని యర్థము - నారాయణుడనగా శాశ్వతుడైన తనలోనుండి పుట్టిన నారములే ఆశ్రయముగా గలవాడు, లేక, వాటికి ఆశ్రయుడైనవాడు, లయస్థానమైనవాడు అని అర్థము - విష్ణువు అనగా అన్నింటిలోను ప్రవేశించి వాటిలో పూర్తిగా వ్యాపించియుండువాడు అని అర్థము - ఈ మూడు భగవన్నామములు వ్యాపనశీలుడైన, వ్యాపక శక్తిగల భగవంతుడని చెప్పుచున్నవి. అట్టి వ్యాపకశీలుడైన వానిని తెలుసుకొనుచున్నాను - ధ్యానించుచున్నాను. అతను నన్ను భగవత్ జ్ఞానములో ప్రేరేపించుగాక అని మంత్రార్థము - ఈ మూడునామములు భగవంతుని వ్యాపకత్వమునే తెలియచేయునవి, కనుక ఈ మూడు నామమములతో కూడిన మంత్రము వ్యాపక మంత్రము)
"nārāyaṇāya vidmahē, vāsudēvāya dhīmahi tannō viṣṇuḥ pracōdayāt -" (vāsudēvuḍu anagā tanalōnuṃḍi puṭṭina sarva bhūtamulalōnu vyāpiṃci niṃḍiyuṃḍuvāḍu ani yarthamu - nārāyaṇuḍanagā śāśvatuḍaina tanalōnuṃḍi puṭṭina nāramulē āśrayamugā galavāḍu, lēka, vāṭiki āśrayuḍainavāḍu, layasthānamainavāḍu ani arthamu - viṣṇuvu anagā anniṃṭilōnu pravēśiṃci vāṭilō pūrtigā vyāpiṃciyuṃḍuvāḍu ani arthamu - ī mūḍu bhagavannāmamulu vyāpanaśīluḍaina, vyāpaka śaktigala bhagavaṃtuḍani ceppucunnavi. aṭṭi vyāpakaśīluḍaina vānini telusukonucunnānu - dhyāniṃcucunnānu. atanu nannu bhagavat jñānamulō prērēpiṃcugāka ani maṃtrārthamu - ī mūḍunāmamulu bhagavaṃtuni vyāpakatvamunē teliyacēyunavi, kanuka ī mūḍu nāmamamulatō kūḍina maṃtramu vyāpaka maṃtramu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.