← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వ్యసనం vyasanaṃ

Original — తెలుగు
  1. స్త్రీ ద్యూత మద్య విషయాణి త్రీణి -

(స్త్రీ సంభోగము, మధ్యపానము, జూదము అను మూడు విషయములు-).

  1. దురాచారాః (దుష్టమైన ఆచారములు)

  2. సర్వం అన్యత్ విహాయ క్రియామాణత్వాత్ వ్యసనం; స్వపాసకర్మ జనితా విపత్.

(మిగిలినవన్నియు వదలి చేయుపని వ్యసనము - తాను చేసిన పాపకర్మలవలన కలిగిన విపత్తు).

  1. కామ క్రోధములవలన పుట్టిన దోషములు ఏడు –

(1). పానము - కల్లు త్రాగుట

(2). స్తీలను కోరుట

(3). మృగయ - వేటాడుట –

(4). ద్యూతము - జూదమాడుట - ఇవి కామము వలన పుట్టినవి.

(5). వాక్పౌరుష్యము - కఠినముగ పలుకుట

(6), దండ పౌరుష్యము - కఠిన దండనము.

(7). అర్థ దూషణము - ధనము నూరక ఖర్చుచేయుట - ఇవి కోపమువలన కలుగునవి - మొత్తము సప్త వ్యసనములు).

Transliteration
  1. strī dyūta madya viṣayāṇi trīṇi -

(strī saṃbhōgamu, madhyapānamu, jūdamu anu mūḍu viṣayamulu-).

  1. durācārāḥ (duṣṭamaina ācāramulu)

  2. sarvaṃ anyat vihāya kriyāmāṇatvāt vyasanaṃ; svapāsakarma janitā vipat.

(migilinavanniyu vadali cēyupani vyasanamu - tānu cēsina pāpakarmalavalana kaligina vipattu).

  1. kāma krōdhamulavalana puṭṭina dōṣamulu ēḍu –

(1). pānamu - kallu trāguṭa

(2). stīlanu kōruṭa

(3). mṛgaya - vēṭāḍuṭa –

(4). dyūtamu - jūdamāḍuṭa - ivi kāmamu valana puṭṭinavi.

(5). vākpauruṣyamu - kaṭhinamuga palukuṭa

(6), daṃḍa pauruṣyamu - kaṭhina daṃḍanamu.

(7). artha dūṣaṇamu - dhanamu nūraka kharcucēyuṭa - ivi kōpamuvalana kalugunavi - mottamu sapta vyasanamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.