నాజ్యంబు, పాదంబులందు జాతుర్హోత్ర కలితంబులగు యజ్ఞకర్మములును
స్రుక్కు తుండంబున, స్రువము నాసికను, నిడాపాత్రముదరకోటరమునందు
శ్రవణాస్యబిలముల జమసప్రాశిత్రముల్, గళమున నిష్టి త్రికంబు, జిహ్వ
తే. దగు దగు బ్రవర్గ్ర్యము, నగ్నిహోత్రములు నీదు
చర్వణంబును సభ్యాపసధ్యులుత్త
మాంగ మసువులు చయనములగు గిటీశ
యనుచు నుతియించి రత్తఱి యజ్ఞ విభుని.
వ. వెండియు, ముహుర్ముహుర్భగవదా విర్భావంబు దక్షిణీ యేష్టియగు. నీదు దమ్ష్ట్రలు ప్రాయణీయంబను దీక్షానంతరేష్టియు, నుదయనీయంబును సమాప్తేష్టియు, యుష్మద్రేతంబు సోమంబును, ద్వదీయావస్థానంబు పాతస్సవనాదులు, నీదు త్వఙ్నాంసాది సప్తధాతులగ్నిష్టోమోక్ధ్యషోడశీవాజి పేయాతి రాత్రప్తోర్యామంబులును, సంస్థా భేదంబులును, ద్వాదశాహాది రూపంబులైన బహుయాగ సంఘాత రూపంబులునగు - సర్వ సత్రంబులు భవదీయ శరీరసంధులు ససోమా సోమంబులగు యజ్ఞక్రతువులు నీవ. మఱియును, నీవు యజనబంధనంబులచే నొప్పుచుందువు, అదియునుంగాక –
క. హవరూపివి, హవనేతవు
హవభోక్తవు, నిఖిల హవ ఫలధారూడవున్
హవ రక్షకుడవునగునీ
కవితతముగ నుతులొనర్తుమయ్య, ముకుందా". శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 13 - 425, 426, 427)
nājyaṃbu, pādaṃbulaṃdu jāturhōtra kalitaṃbulagu yajñakarmamulunu
srukku tuṃḍaṃbuna, sruvamu nāsikanu, niḍāpātramudarakōṭaramunaṃdu
śravaṇāsyabilamula jamasaprāśitramul, gaḷamuna niṣṭi trikaṃbu, jihva
tē. dagu dagu bravargryamu, nagnihōtramulu nīdu
carvaṇaṃbunu sabhyāpasadhyulutta
māṃga masuvulu cayanamulagu giṭīśa
yanucu nutiyiṃci rattaṟi yajña vibhuni.
va. veṃḍiyu, muhurmuhurbhagavadā virbhāvaṃbu dakṣiṇī yēṣṭiyagu. nīdu damṣṭralu prāyaṇīyaṃbanu dīkṣānaṃtarēṣṭiyu, nudayanīyaṃbunu samāptēṣṭiyu, yuṣmadrētaṃbu sōmaṃbunu, dvadīyāvasthānaṃbu pātassavanādulu, nīdu tvaṅnāṃsādi saptadhātulagniṣṭōmōkdhyaṣōḍaśīvāji pēyāti rātraptōryāmaṃbulunu, saṃsthā bhēdaṃbulunu, dvādaśāhādi rūpaṃbulaina bahuyāga saṃghāta rūpaṃbulunagu - sarva satraṃbulu bhavadīya śarīrasaṃdhulu sasōmā sōmaṃbulagu yajñakratuvulu nīva. maṟiyunu, nīvu yajanabaṃdhanaṃbulacē noppucuṃduvu, adiyunuṃgāka –
ka. havarūpivi, havanētavu
havabhōktavu, nikhila hava phaladhārūḍavun
hava rakṣakuḍavunagunī
kavitatamuga nutulonartumayya, mukuṃdā". śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 13 - 425, 426, 427)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.