శక్తి కొలది స్వధర్మాచరణంబును, శాస్త్ర వినిషిద్ధ ధర్మ కర్మంబులు మానుటయు, దైవికంబై వచ్చిన యర్థంబువలన సంతోషించుటయు, మహాభాగవత శ్రీపాదారవిందార్చనంబును, గ్రామ్య ధర్మ నివృత్తియు (ధర్మార్థకామములనెడి త్రివర్గ నివృత్తియు) మోక్ష ధర్మంబులందు రతియు, మితంబై శుద్ధంబయిన యాహార సేవయు, విజనంబయి (జనములేనిది), నిర్భాధకంబయిన స్థానంబున నుండుటయు, హింసా రాహిత్యంబును, సత్యంబును, నస్తేయంబును (దొంగతనము చేయకుండుటయు) దనకెంత యర్థంబుపయోగించు నంత యర్థంబ స్వీకరించుటయు, బ్రహ్మచర్యంబును, తపశ్చౌచంబులును, స్వాధ్యాయ పఠనంబును, పరమపురుషుండైన సర్వేశ్వరుని అర్చనంబును, మౌనంబును, నాసనజయంబును, దానం జేసి స్థైర్యంబును, బ్రాణవాయు స్వవశీకరణంబును, నింద్రియ నిగ్రహరూపంబైన ప్రత్యాహారంబును, మనంబుచే నింద్రియంబుల విషయంబువలన మరలించి హృదయమందు నిలుపుటయు, దేహగతంబైన మూలాధారాది స్థానంబులలో నొక్కస్థానంబునందు హృదయగతంబైన మనస్సు తోడంగూడ బ్రాణధారణంబును, వైకుంఠుండైన సర్వేశ్వరుండు ప్రవర్తించిన దివ్య లీలాచరిత్ర ధ్యానంబును, మానసైకీకరణంబును పరమాత్మయగు పద్మనాభుని సమానాకారతయును, నిదియునుంగాక తక్కిన వ్రతదానాదులంజేసి మనోదుష్టంబయిన య సన్మార్గంబును పరిహరించి, జితప్రాణుండై మెల్లన యోజించి, శుచియైన దేశంబునం బ్రతిష్టించి, విజితాసనుండై, యభ్యస్తకుశాజిన చేలోత్తిరాననంబైన యాసనంబుజేసి, ఋజకాయుండై ప్రాణమార్గంబును కుంభక, రేచక, పూరకంబులం గోశశోధనంబు చేసి, కుంభక పూరకంబుల చేతం ప్రతికూలంబు గావించి, చంచలంబయిన చిత్తంబు సుస్థిరంబుగావించి, తీవ్రంబయిన యమంబునం బ్రతప్తంబయి విగత సమస్త దోషంబగు చామీకరంబు కరణి (బంగారమువలె) విరజంబుచేసి జితమారుతుండగు యోగికిం గ్రమ్మఱం బ్రాణాయామంబను పావకునిచేత వాత పిత్త శ్లేష్మంబులను దోషంబుల భస్మీకరణంబుసేసి, ధారణంబుచేత గిల్బిషంబులను, బ్రత్యాహారంబుచేత సంసర్గంబులను దహనంబుచేసి, దానంబుచేత, రాగంబుల సత్వాదిగుణంబులను నివారించి, స్వనాసాగ్రావ లోకనంబు సేయుచు - - - సర్వేశ్వరుని –
మ. విమలంబై పరిశుద్ధమై తగు మనో విజ్ఞాన తత్వ ప్రబో
ధమతిన్ నిల్పి, తదీయమూర్తి విభవధ్యానంబు గావించి, చి
త్తము సర్వానంద విమర్శన క్రియలకున్ దార్కొల్పి, ప్రత్యంగమున్
సుమహాధ్యానము సేయగావలయు బో శుద్ధాంత రంగంబునన్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 20 - 918, 924)
śakti koladi svadharmācaraṇaṃbunu, śāstra viniṣiddha dharma karmaṃbulu mānuṭayu, daivikaṃbai vaccina yarthaṃbuvalana saṃtōṣiṃcuṭayu, mahābhāgavata śrīpādāraviṃdārcanaṃbunu, grāmya dharma nivṛttiyu (dharmārthakāmamulaneḍi trivarga nivṛttiyu) mōkṣa dharmaṃbulaṃdu ratiyu, mitaṃbai śuddhaṃbayina yāhāra sēvayu, vijanaṃbayi (janamulēnidi), nirbhādhakaṃbayina sthānaṃbuna nuṃḍuṭayu, hiṃsā rāhityaṃbunu, satyaṃbunu, nastēyaṃbunu (doṃgatanamu cēyakuṃḍuṭayu) danakeṃta yarthaṃbupayōgiṃcu naṃta yarthaṃba svīkariṃcuṭayu, brahmacaryaṃbunu, tapaścaucaṃbulunu, svādhyāya paṭhanaṃbunu, paramapuruṣuṃḍaina sarvēśvaruni arcanaṃbunu, maunaṃbunu, nāsanajayaṃbunu, dānaṃ jēsi sthairyaṃbunu, brāṇavāyu svavaśīkaraṇaṃbunu, niṃdriya nigraharūpaṃbaina pratyāhāraṃbunu, manaṃbucē niṃdriyaṃbula viṣayaṃbuvalana maraliṃci hṛdayamaṃdu nilupuṭayu, dēhagataṃbaina mūlādhārādi sthānaṃbulalō nokkasthānaṃbunaṃdu hṛdayagataṃbaina manassu tōḍaṃgūḍa brāṇadhāraṇaṃbunu, vaikuṃṭhuṃḍaina sarvēśvaruṃḍu pravartiṃcina divya līlācaritra dhyānaṃbunu, mānasaikīkaraṇaṃbunu paramātmayagu padmanābhuni samānākāratayunu, nidiyunuṃgāka takkina vratadānādulaṃjēsi manōduṣṭaṃbayina ya sanmārgaṃbunu parihariṃci, jitaprāṇuṃḍai mellana yōjiṃci, śuciyaina dēśaṃbunaṃ bratiṣṭiṃci, vijitāsanuṃḍai, yabhyastakuśājina cēlōttirānanaṃbaina yāsanaṃbujēsi, ṛjakāyuṃḍai prāṇamārgaṃbunu kuṃbhaka, rēcaka, pūrakaṃbulaṃ gōśaśōdhanaṃbu cēsi, kuṃbhaka pūrakaṃbula cētaṃ pratikūlaṃbu gāviṃci, caṃcalaṃbayina cittaṃbu susthiraṃbugāviṃci, tīvraṃbayina yamaṃbunaṃ brataptaṃbayi vigata samasta dōṣaṃbagu cāmīkaraṃbu karaṇi (baṃgāramuvale) virajaṃbucēsi jitamārutuṃḍagu yōgikiṃ grammaṟaṃ brāṇāyāmaṃbanu pāvakunicēta vāta pitta ślēṣmaṃbulanu dōṣaṃbula bhasmīkaraṇaṃbusēsi, dhāraṇaṃbucēta gilbiṣaṃbulanu, bratyāhāraṃbucēta saṃsargaṃbulanu dahanaṃbucēsi, dānaṃbucēta, rāgaṃbula satvādiguṇaṃbulanu nivāriṃci, svanāsāgrāva lōkanaṃbu sēyucu - - - sarvēśvaruni –
ma. vimalaṃbai pariśuddhamai tagu manō vijñāna tatva prabō
dhamatin nilpi, tadīyamūrti vibhavadhyānaṃbu gāviṃci, ci
ttamu sarvānaṃda vimarśana kriyalakun dārkolpi, pratyaṃgamun
sumahādhyānamu sēyagāvalayu bō śuddhāṃta raṃgaṃbunan. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 20 - 918, 924)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.