← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగమాయ yōgamāya

Original — తెలుగు
  1. “యుజ్యతే ఇతి యోగా, భగవత్సంబంధినీ, భవచ్ఛరీర భూతా ఇత్యర్థః - ప్రకృతిః.”.

(భగవంతునితో కలుపునది యోగము; మాయ యను యోగము - భగవంతునుకి సంబంధించినది; భగవంతుని శరీరము అయినది - ప్రకృతి.)

  1. “అనాది, అనిర్వాచ్యమజ్ఞానం” (శ్రీ ఆనందగిరి)

(మొదలు లేనిది - ఎప్పటినుండియో యున్నది, - ఇది ఇట్టిది యని నిర్వచనము చేయుటకు - నిర్ణయించుటకు, నిశ్చయముగా చెప్పుటకు వీలులేనిది, జీవుని యందు తానే భగవంతుడు అను జ్ఞానమును కప్పిపుచ్చుటచేత కలుగచేయు అజ్ఞానము).

  1. “అచింత్య ప్రజ్ఞావిలాసం, అఘటన ఘటనా పటీయసీ మాయా” (శ్రీధరస్వామి)

(ఊహకుమించిన ప్రజ్ఞకలది; ఘటించుటకు వీలుకానిదానిని ఘటించు శక్తి కలది, అయినదానిని కానిదానిని గాను, కాని దానిని అయినదానినిగాను చేయు శక్తి కలది - మాయ)

  1. “ఆత్మసంకల్ప విధాయినీ” (శ్రీమధుసూధనసరస్వతి)

(భగవంతుని సంకల్ప ప్రకారము కలుగచేయునది)

  1. “గుణత్రయ జనక సామ్యావస్థా మాయాంతర్ముఖా - యోగమాయా ఇత్యుచ్యతే”.

(సత్వరజస్తమోగుణముల యొక్క సామ్యావస్థ మాయా - సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములు సమానమైన పాళ్ళలో - హెచ్చు తగ్గులు లేకుండనుండు ప్రకృతియొక్క అవస్థ యోగ మాయయని చెప్పబడుచున్నది)

  1. యోగః గుణనాం యుక్తిః ఘటనం, సైవమాయా యోగమాయా; అధివా భగవతః చిత్తసమాధానం యోగః, తత్కృతా మాయా యోగమాయాః.

(యోగమనగా త్రిగుణముల - సత్వరజస్తమోగుణముల - కూటమి, కలియుట. అదియే మాయ, యోగమాయ, లేక భగవంతునిగుఱించి చిత్తసమాధానము యోగము, దానివలన కలిగినమాయ యోగమాయ).

  1. “క. నానావిధ సంపదలకు

దానకమై సర్వకామదాయినివగు నిన్

మానవులు భక్తి గొలుతురు

కానుకలను బలులనిచ్చి, కల్యాణమయీ

వ. మఱియు నిన్ను మానవులు దుర్గ, భద్ర,కాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక. కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, యంబికి, యను పదునాలుగు నామంబుల గొనియాడుదురయ్యై స్థానంబుల యందని యెఱింగించి సర్వేశ్వరుండగు హరి పొమ్మని యానతిచ్చిన - - - మహా ప్రసాదంబని యయ్యోగనిద్ర యియ్య కొనియె“.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 60, 61)

  1. “నాహం ప్రకాశస్సర్వస్య యోగమాయా సమావృతః |

మూఢో(అ)యం నాభిజానాతి లోకో మామజమవ్యయం ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 25)

“స్వేనరూపేణసర్వస్య ప్రకటో న భవామ్యహం |

కింతు కేషాంచి దేవైనం మద్భక్తానాం భవామ్యహం |

కథం లోకస్య సర్వస్య న ప్రకాశ ఇతీర్యతే |

యోగోమమైవ సంకల్పో మాయా తద్వశవర్తినీ |

అభక్తో యం జనోమాం నజానాతీత్థ మహేశ్వరం |

స్వరూపేణేతి సంకల్పానుసారిణ్యైవ మాయయా |

జ్ఞానగోచరత యోగ్యః సత్యపి జ్ఞాన కారణే |

కృతో(అ)తః ప్రాఙ్మయాప్రోక్తం పరం భవమీతీ హవై |

గుణానాం ఘనం యోగః సైవ మాయా తయావ్యహం |

సంభన్నో లోకదృష్ట్యా ద్థేత్యర్థో భాష్య కృతామతః |

అభక్తానాం మామాజ్ఞేనే సంకల్పో మే(అ)స్తికారణం |

అతోమే మాయ యాచ్ఛన్న జ్ఞానః సన్మత్పరాఙ్ముఖః |

లోకోయం మామజం నిత్యమనంతం, పరమేశ్వరం |

నాభి జానాతి సర్వజ్ఞం సత్యపి జ్ఞానకారణే ||

కింతు మూఢజనోయం మాం విపరీతదృశాన్యథా

కించిన్మనుష్యమేవాత్ర మన్యతే మాయయా |

వృతః |

విద్యమానం యథావస్తు స్వరూపం హ్యావృణోత్యసౌ |

అవిద్యమానం యత్కించిన్మయా దర్శయ తీత్యపి |

ప్రసిద్ధమస్తి భోః పార్థ లోకేపీత్యాశయో హరేః ||“. (గీతాభావప్రకాశము - 7 - 170 to 179)

(నా స్వస్వరూపముతో అందఱకు నేను కనబడను. నా భక్తులైన కొందఱికే ఈ ప్రకారముగా - నేను పరమాత్మయని, జన్మలేనినాడనని వ్యయరహితుడనైన నా నిర్గుణరూపము - కనబఱచు చున్నాను - లోకులందఱకు ఈ నిర్గుణరూపము కనబడదనగా - నా సంకల్పమే యోగము. నా సంకల్ప వశములోనున్నది మాయ. ఇట్లు నన్ను నా భక్తులుకాని జనులు తెలియలేరు. బ్రహ్మ జ్ఞానము కలవారికి గోచరుడనైనను మాయచేత కప్పబడియుండుట వలన అజ్ఞానులకు - భక్తులు కానివారికి - కనబడకుండనున్నాను. సత్వరజస్తమో గుణములు మూడింటి కూటమి యోగము, అదియే మాయ - ఆ మాయచేత అభక్తులను నేను లోకదృష్టిలో కప్పబడియున్నానని భాష్యకారుల మతము (అభిప్రాయము). దీనికి కారణము నా సంకల్పము. అందుచేత భగవత్పారాఙ్ముఖులగువారు (భక్తులుకానివారు) నా మాయచేత కప్పబడినవారై, అజుడు నిత్యుడు అనంతుడు, పరమేశ్వరుడు, సర్వజ్ఞుడు అయిన నన్ను తెలియలేరు - అట్టి మూఢజనులు మాయచేత కప్పబడినవారై నేను సాధారణమానవుడననియే తలంచెదరు - కనబడని వస్తువు కనుపించులాగున, కనుపించు వస్తువు కనుపించని లాగున చేయునది మాయయని యీ లోకములో ప్రసిద్ధియే కదా!).

  1. “క. నందుని సతికి యశోదకు

బొందుగ హరియోగమాయ పుట్టిన, మాయా

స్పందమున నొక్క యెఱుగమి

క్రందుకొనియె నూరి వారి, గావలి వారిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భ. 142)

Transliteration
  1. “yujyatē iti yōgā, bhagavatsaṃbaṃdhinī, bhavaccharīra bhūtā ityarthaḥ - prakṛtiḥ.”.

(bhagavaṃtunitō kalupunadi yōgamu; māya yanu yōgamu - bhagavaṃtunuki saṃbaṃdhiṃcinadi; bhagavaṃtuni śarīramu ayinadi - prakṛti.)

  1. “anādi, anirvācyamajñānaṃ” (śrī ānaṃdagiri)

(modalu lēnidi - eppaṭinuṃḍiyō yunnadi, - idi iṭṭidi yani nirvacanamu cēyuṭaku - nirṇayiṃcuṭaku, niścayamugā ceppuṭaku vīlulēnidi, jīvuni yaṃdu tānē bhagavaṃtuḍu anu jñānamunu kappipuccuṭacēta kalugacēyu ajñānamu).

  1. “aciṃtya prajñāvilāsaṃ, aghaṭana ghaṭanā paṭīyasī māyā” (śrīdharasvāmi)

(ūhakumiṃcina prajñakaladi; ghaṭiṃcuṭaku vīlukānidānini ghaṭiṃcu śakti kaladi, ayinadānini kānidānini gānu, kāni dānini ayinadāninigānu cēyu śakti kaladi - māya)

  1. “ātmasaṃkalpa vidhāyinī” (śrīmadhusūdhanasarasvati)

(bhagavaṃtuni saṃkalpa prakāramu kalugacēyunadi)

  1. “guṇatraya janaka sāmyāvasthā māyāṃtarmukhā - yōgamāyā ityucyatē”.

(satvarajastamōguṇamula yokka sāmyāvastha māyā - satvamu, rajassu, tamassu anu mūḍu guṇamulu samānamaina pāḷḷalō - heccu taggulu lēkuṃḍanuṃḍu prakṛtiyokka avastha yōga māyayani ceppabaḍucunnadi)

  1. yōgaḥ guṇanāṃ yuktiḥ ghaṭanaṃ, saivamāyā yōgamāyā; adhivā bhagavataḥ cittasamādhānaṃ yōgaḥ, tatkṛtā māyā yōgamāyāḥ.

(yōgamanagā triguṇamula - satvarajastamōguṇamula - kūṭami, kaliyuṭa. adiyē māya, yōgamāya, lēka bhagavaṃtuniguṟiṃci cittasamādhānamu yōgamu, dānivalana kaliginamāya yōgamāya).

  1. “ka. nānāvidha saṃpadalaku

dānakamai sarvakāmadāyinivagu nin

mānavulu bhakti goluturu

kānukalanu balulanicci, kalyāṇamayī

va. maṟiyu ninnu mānavulu durga, bhadra,kāḷi, vijaya, vaiṣṇavi, kumuda, caṃḍika. kṛṣṇa, mādhavi, kanyaka, māya, nārāyaṇi, īśāna, śārada, yaṃbiki, yanu padunālugu nāmaṃbula goniyāḍudurayyai sthānaṃbula yaṃdani yeṟiṃgiṃci sarvēśvaruṃḍagu hari pommani yānaticcina - - - mahā prasādaṃbani yayyōganidra yiyya koniye”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 60, 61)

  1. “nāhaṃ prakāśassarvasya yōgamāyā samāvṛtaḥ |

mūḍhō(a)yaṃ nābhijānāti lōkō māmajamavyayaṃ ||“. (śrīmadbhagavadgīta - 7 - 25)

“svēnarūpēṇasarvasya prakaṭō na bhavāmyahaṃ |

kiṃtu kēṣāṃci dēvainaṃ madbhaktānāṃ bhavāmyahaṃ |

kathaṃ lōkasya sarvasya na prakāśa itīryatē |

yōgōmamaiva saṃkalpō māyā tadvaśavartinī |

abhaktō yaṃ janōmāṃ najānātīttha mahēśvaraṃ |

svarūpēṇēti saṃkalpānusāriṇyaiva māyayā |

jñānagōcarata yōgyaḥ satyapi jñāna kāraṇē |

kṛtō(a)taḥ prāṅmayāprōktaṃ paraṃ bhavamītī havai |

guṇānāṃ ghanaṃ yōgaḥ saiva māyā tayāvyahaṃ |

saṃbhannō lōkadṛṣṭyā dthētyarthō bhāṣya kṛtāmataḥ |

abhaktānāṃ māmājñēnē saṃkalpō mē(a)stikāraṇaṃ |

atōmē māya yācchanna jñānaḥ sanmatparāṅmukhaḥ |

lōkōyaṃ māmajaṃ nityamanaṃtaṃ, paramēśvaraṃ |

nābhi jānāti sarvajñaṃ satyapi jñānakāraṇē ||

kiṃtu mūḍhajanōyaṃ māṃ viparītadṛśānyathā

kiṃcinmanuṣyamēvātra manyatē māyayā |

vṛtaḥ |

vidyamānaṃ yathāvastu svarūpaṃ hyāvṛṇōtyasau |

avidyamānaṃ yatkiṃcinmayā darśaya tītyapi |

prasiddhamasti bhōḥ pārtha lōkēpītyāśayō harēḥ ||“. (gītābhāvaprakāśamu - 7 - 170 to 179)

(nā svasvarūpamutō aṃdaṟaku nēnu kanabaḍanu. nā bhaktulaina koṃdaṟikē ī prakāramugā - nēnu paramātmayani, janmalēnināḍanani vyayarahituḍanaina nā nirguṇarūpamu - kanabaṟacu cunnānu - lōkulaṃdaṟaku ī nirguṇarūpamu kanabaḍadanagā - nā saṃkalpamē yōgamu. nā saṃkalpa vaśamulōnunnadi māya. iṭlu nannu nā bhaktulukāni janulu teliyalēru. brahma jñānamu kalavāriki gōcaruḍanainanu māyacēta kappabaḍiyuṃḍuṭa valana ajñānulaku - bhaktulu kānivāriki - kanabaḍakuṃḍanunnānu. satvarajastamō guṇamulu mūḍiṃṭi kūṭami yōgamu, adiyē māya - ā māyacēta abhaktulanu nēnu lōkadṛṣṭilō kappabaḍiyunnānani bhāṣyakārula matamu (abhiprāyamu). dīniki kāraṇamu nā saṃkalpamu. aṃducēta bhagavatpārāṅmukhulaguvāru (bhaktulukānivāru) nā māyacēta kappabaḍinavārai, ajuḍu nityuḍu anaṃtuḍu, paramēśvaruḍu, sarvajñuḍu ayina nannu teliyalēru - aṭṭi mūḍhajanulu māyacēta kappabaḍinavārai nēnu sādhāraṇamānavuḍananiyē talaṃcedaru - kanabaḍani vastuvu kanupiṃculāguna, kanupiṃcu vastuvu kanupiṃcani lāguna cēyunadi māyayani yī lōkamulō prasiddhiyē kadā!).

  1. “ka. naṃduni satiki yaśōdaku

boṃduga hariyōgamāya puṭṭina, māyā

spaṃdamuna nokka yeṟugami

kraṃdukoniye nūri vāri, gāvali vārin”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bha. 142)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.