(జీవాత్మ పరమాత్మలు కలియుట యోగమని యోగవిశారదులు - యోగము గుఱించి బాగుగా తెలిసినవారు - చెప్పిరి). “సమ్యగైక్యం” (బాగుగా ఏకమగుట - తేడా లేకుండా ఏకమగుట).
(జీవునకు పరబ్రహ్మమునకును - జీవునకును పరమాత్మకును భేదము లేకుండుట).
(పరబ్రహ్మతో కలియునట్లు - ఏకమగునట్లు చేయుట యోగము. బ్రహ్మసాక్షాత్కారము కలుగచేయునది యోగము.
సం యోగ యోగ ఇత్యుక్తో జీవాత్మపరమాత్మనోః“. (యాజ్ఞవల్క్యః)
(జ్ఞానము యోగము - యోగమనగా అష్టాంగములతో కూడినది).
(జీవాత్మ పరమాత్మల సం యోగము యోగమని చెప్పబడినది).
(యోగమనగా జీవాత్మ పరమాత్మల ఐక్యము, ఇద్దఱకు భేదములేదను తెలియచేయు వృత్తి - లోకమునకు అతీతమైన శక్తి)
రమణ పరమాత్మయైన పరమాత్మునకును
సమరిసైక్యాను సంథాన సరణి యెద్ది
యదియ యోగంబు సదుపాయ, మాంజనేయ”. (శ్రీసీతారామాంజనేయ సంవాదము - 1 - 87)
ఉమాశంకరా యోర్యోగః సం యోగో విష్ణు రుచ్యతే ||. (రుద్రహృదయోపనిషత్)
(ఈ కనబడుచున్న సమస్త ప్రపంచము పార్వతీరూపము, కనబడనిది (అవ్యక్తము) పరమేశ్వరుడు - ఈ ఇద్దరూ - పార్వతీ పరమేశ్వరులు కలియుటయే యోగమని చెప్పబడినది. అనగా, పరమాత్మ ప్రకృతిలో ప్రవేశించి ప్రకృతితో కలిసియుండుటయే యోగము - ఈ పురుష ప్రకృతుల సం యోగమువలననే ఒక వస్తువులో నుండి మఱియొక వస్తువు పుట్టినట్లు సృష్టి జరుగుచున్నది. సృష్టిలోనుండు ప్రతి వస్తువులోను - మొదటినుండి యిప్పటివరకు - ఈ రెండు తత్వములు - ఒకదానినొకటి విడువకుండా కలిసియే యున్నవి - ఈ సం యోగము వలననే సృష్టి జరుగుచున్నది).
తస్మిన్ బ్రహ్మణి సం యోగో యోగ ఇత్యభిధీయతే ||“. (విష్ణుపురాణము - 6 - 7 - 31)
(ఆత్మసాక్షాత్కారము పొందుటకు మనస్సు చేయు ప్రయత్నములో మనస్సు బ్రహ్మను కలియుట యోగము. ఇట్లు పొందుటకు చేయు యుక్తి, కుశలత, నేర్పు, విధి సాధనము, మార్గము, ఉపాయము మొదలగునవన్నియు యోగమనియే చెప్పబడుచున్నవి).
“యుజ్యతే ఇతి యోగః” (కలుపునది, జతకూర్చునది యోగము. మనస్సును పరమాత్మతో ఐక్యము చేయుటయే యోగము. ఇది ధ్యానముద్వారా, జ్ఞానముద్వారా, భక్తిద్వారా, లేకం ఇతర సాధనములద్వారా చేసినను యోగమే).
ఆత్మతత్వావలోకనం యోగః - గీతాశాస్త్రే ద్వితీయ షట్కే ప్రతిపాద్యో భక్తి యోగః.
(ఆత్మతత్వావలోకనమే - ఆత్మతత్వముగుఱించి చింతించుటయే యోగము - శ్రీమద్భగవద్గీతలో 7 నుండి 12 వరకు గల అధ్యాయములలో భక్తి యోగము చెప్పబడినది).
అష్టాంగయోగము -
“బ్రహ్మప్రాప్తౌ కారణం పరం”. (గీతాభావప్రకాశము - 4 - 8)
(బ్రహ్మప్రాప్తికి పరమకారణమైనది యోగము)
(అవిద్యావశవర్తులై సంసారమందు మునిగియుండువారికి సంసారబంధములను పోగొట్టుటకు చేయు ఉపాయము).
“తదాద్రష్టుః స్వరూపే అవస్థానం”, “వృత్తి సారూప్యమితరత్ర” - (పతంజలి - 1 - 3; 4)
(చిత్తముయొక్క వృత్తులను - వ్యాపారములను నిరోధించుట యోగము - అప్పుడు యోగి తన స్వరూపమునే చూచును. ఇట్లు చిత్తవృత్తుల నిరోధించనపుడు చిత్తవృత్తులతో చూచుచున్నదే కనుపించును, విషయములగుఱించియే చింతించును - ఈ విషయము శ్రీమదాంధ్రమహాభాగవతములో ఈ క్రింద విధముగా చెప్పబడినది : -
“జ్ఞానేంద్రియంబులేనును, విషయంబుల మీదదోచు బుద్ధులేనును నభిమానంబును నను నేకాదశవృత్తులం గూడిన మనంబు జీవునికి నసఖ్యంబులయిన జన్మంబుల బొందించు - మనోవృత్తుల నతిక్రమించిన జీవుండు పరంజ్యోతి అయిన నారాయణస్వరూపంబుగా నెఱుంగుము”. (1 - 11 - )
(పరమాత్మయొక్క అంశయే జీవాత్మయని శ్రీమద్భగవద్గీతలో చెప్పబడినది. పరమాత్మ ప్రకృతితో కలియుట కారణముగా అతనినుండి వేరైన (అతనినుండి పుట్టిన) ఒక అంశ జీవుడై సంసారములో (ప్రకృతి పరిణామములో) పడి, ప్రకృతిని వదలించుకొని చివరకు మరల పరమాత్మలో చేరుటయే యోగము - అంశ అంశి యోగము. అంశ గలవాడు అంశి, పరమాత్మ. అంశి యొక్క అంశ (భాగము) జీవాత్మ. ఈ అంశాంశిలు కలియుటయే యోగము).
ఏకాత్మ భావనా యోగః క్షేత్రజ్ఞ పరమాత్మనోః ||“.
(జ్ఞానేంద్రియములను నిగ్రహించి, తనవశములోనుంచుకొని, క్షేత్రజ్ఞుడైన జీవాత్మ భగవంతుడైన పరమాత్మ ఒకటే యను భావము కలిగియుండుట, అట్టి భావముననుభవించుటకు చేయు ప్రయత్నము యోగము).
(పరమాత్మనుగుఱించి ఏకాగ్ర చిత్తముతో నుండుట, పరమాత్మ ధ్యానమందు చిత్తమును కేంద్రీకరించుట).
(మూలధార చక్రమందు యోని స్థానమున్నది. అక్కడ రజోగుణముతో కూడిన దేవీ తత్వము లేక జీవుడు అను పేరుగలదికలదు - కనుబొమలమధ్యను సహస్రదళపద్మమందు శశిస్థానమున్నది. అక్కడయున్న బిందువు శివతత్వము - ఆ రెండు శక్తులయొక్క ఐక్యము, లేక జీవపరమాత్మలయొక్క ఐక్యము యోగము అని చెప్పబడును - అది యోగులకుతప్ప మిగిలినవారెవరికినీ దుర్లభము - లభించుట కష్టము).
“శుక్లరజోరూప భృఊసవస్రార మధ్య సోమసూర్యైక్యం యో జానాతి సయోగవిత్ భవతీత్యర్థః”.
(కనుబొమలమధ్యను శిరస్సులోని సహస్రారపద్మమందును ఉండు శుక్లరూపము, రజోరూపము అయిన చంద్రసూర్యుల ఐక్యమును తెలిసినవాడు యోగవిదుడు - యోగమును తెలిసినవాడు).
సూర్యాచంద్ర మసోర్యోగో జీవాత్మ పరమాత్మనోః |
ఏవంతు ద్వంద్వజాలస్య సం యోగో యోగ ఉచ్యతే ||“. (యోగశిఖోపనిషత్)
(అపానవాయువును ప్రాణవాయువుతో ఐక్యముచేయుట, తనరజస్సును రేతస్సుతో ఐక్యముచేయుట, సూర్యుని చంద్రునితో కలుపుట, జీవాత్మను పరమాత్మతో ఐక్యము చేయుట - అను ఈ ద్వంద్వములను (రెండేసి వస్తువులను) కలుపుట యోగమని చెప్పబడినది).
(ప్రమాణము, విపర్యయము, వికల్ప, నిద్రా, స్మృతి అను అయిదు విధములైన చిత్తవృత్తులను నిరోధించుట యోగము).
(భగవంతుని గుఱించి కాక ఇతరవిషయములనుండి చిత్తవృత్తులను నిరోధించుట.)
ఉపాసనం ధ్యానం -
(మోక్షమునకు సాధనమైన భగవంతుని గుఱించి ఉపాసన) - (ఉపాసన, ధ్యానము)
సమాధిః -
చేతః సమాధానం.
(మనస్సును సమాధానపరచుకొనుట)
ధ్యానవిధి
“తాం యోగమితి మన్యంతే స్థిరమింద్రియ ధారణం” -
(ఇంద్రియములను స్థిరముగా నిగ్రహించుట యోగమని చెప్పుచున్నారు).
(సాక్షాత్కరింపచేసుకొని వస్తువునందు - పరమాత్మయందు - మనస్సును నిశ్చలముగా నుంచు కొనుటయే యోగము).
(శరీరము, కంఠము, శిరస్సు - ఈ మూడింటిని ఉన్నతముగా - తిన్నగా, వంకర లేకుండునట్లు ఉంచుట యోగము)
(లభించని వస్తువు లభించుట).
(యోగము గుఱించి తెలిసినవారు పరమ తపస్సే యోగమని తలంచెదరు) (ఉత్కృష్టమైన తపస్సే యోగము).
(కేవలుడైన బ్రహ్మనే అనుసంధానము చేయుట).
సిద్ధ్యసిద్థ్యోస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 48)
“ఫలతృష్ణ శూన్యేన క్రియామాణే కర్మణి సత్వశుద్ధి జా జ్ఞానప్రాప్తి లక్షణా సిద్ధిః, తద్విపర్యయజాత అసిద్ధిః, తయోః సిద్ధ్య సిధ్యోరపి సమత్వం యోగః” (శ్రీశంకరః)
(ఫలాపేక్షలేక చేయు కర్మయందు సత్వశుద్ధివలన జ్ఞానము కలుగుట సిద్ధి; అట్లు కలుగకపోవుట అసిద్ధి. ఈ రెండింటి విషయమై సమముగానుండుట యోగము. అట్లు యోగమును పాటించుచు కర్మలను చేయుము).
“సిద్ధ్య సధ్యోః కర్మఫలస్య వివిదిషాదేః, సిద్ధావసిద్ధౌవా సమో హర్ష విషాద శూన్యో భూత్వా కర్మాణి కురు. ఇతి సంబంధః - ఇదమేవ సిద్థ్యోః సమ త్వం యోగః ఉచయతే” (శ్రీనీలకంఠవ్యాఖ్యా)
(చేసిన కర్మఫలము సిద్ధించినను, సిద్ధించకపోయినను సంతోషముగాని, దుఃఖముగాని చెందక కర్మలను చేయుము - ఇట్టి సమత్వమే యోగమని చెప్పబడినది. “సిద్థ్య సిద్థ్యోః సమత్వరూపం చిత్త సమాధానం” సిద్ధి, అసిద్ధి - ఈ రెండింటియడల సమముగా నుండుట యను చిత్తసమాధానము - కార్యము ఫలించినను, ఫలించకపోయినను సమానమైన బుద్ధి కలిగియుండుట).
“యోగస్థస్సన్ ఫలేకామం కర్తృత్వాభిమతిం తథా |
త్యక్త్వా త్వం కురు కర్మాణి కృష్ణార్పణ ధియాసదా |
త్యక్త్వా హర్షం ఫలప్రాప్తౌ ఫలసిద్ధౌ విషాదతాం |
కో(అ)సౌయోగః సయత్రస్థః కర్మ కుర్వన్న దుష్యతి |
సిద్ధ్య సిద్ధ్యోః సమత్వం యత్సయోగ ఇతి కథ్యతే ||“. (గీతాభావప్రకాశము - 2 - 504 to 506)
(యోగములోనుండి చేయుచున్న కర్మయొక్క ఫలమందు కోరికలేక, ‘ఈ కర్మను నేను చేయుచున్నాను’ అను కర్తృత్వాభిమానములేక ఎల్లపుడు ‘కృష్ణార్పణం’ (ఈ కర్మ కృష్ణునకు భగవంతునకు అర్పించుచున్నాను) అను బుద్ధి కలిగియుండి, ఫలము పొందినపుడు సంతోషించక, ఫలము కలగనపుడు విషాదమును పొందక కర్మలను చేయుము - యోగమనగా ఫలము సిద్ధించినా సిద్ధించకపోయినను సమముగా నుండుట).
తస్మాద్యోగాయ యుజ్యస్య, యోగః కర్మస కౌశలం ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 50)
(కర్మఫలము సిద్ధించినను సిద్శ్ధించకపోయినను సమబుద్ధికలిగియుండుట యోగము. అట్టి యోగము నవలంభించిన యడల ఇక్కడే - ఈ లోకమునందే - పాపపుణ్యములను వదలివేయును - అనగా, వాటి ఫలము లేకుండ చేసుకొనును - అందుచేత అట్టియోగము నవలంభించుము - యోగమనగా కర్మలను చేయుట యందు కుశలత - నేర్పరితనము, కర్మలను చేయుటయందు కౌశలము అనగా “కర్మసు బంధకేష్వపి కౌశలం - బంధనివర్తకత్వ సంపాదకం” (నీలకంఠవ్యాఖ్య). బంధమును కలిగించు కర్మలయందు కౌశలము యోగము - అనగా, ఆ కర్మలు బంధమును నివర్తించునట్లుగా చేసుకొనుటయే యోగము).
“కర్మసు ప్రవర్తమానస్య కౌశలం, కుశలభావః - సమత్వబుద్ధి యుక్తః కర్మయోగః కర్మాత్మాపి సన్, దుష్కర్మక్షయా కరోతీతి మహాకుశలః”
(కర్మలు చేయువానియొక్క కుశలభావము. సిద్ధ్యసిద్ధులలో సమత్వబుద్ధి కలిగి కర్మలు చేయుచు, దుష్కర్మలను నశింపచేసుకొనుటయే కర్మలయందు కుశలత్వము - అదియే యోగము)
“కర్మసు యత్కౌశలం బంధకానామపి తేషాం ఈశ్వరారాధనేన మోక్షపరత్వ సంపాదన చాతుర్యం, స ఏవ యోగః” (శ్రీధరీయ వ్యాఖ్యా)
(బంధము కలిగించు కర్మలయందైనను భగవంతుని ఆరాధించుటచేత మోక్ష పరతత్వమును సంపాదించు చాతుర్యము కర్మలయందు కౌశల్యము - అదియే యోగము. - “యథాహి సుకృత దుష్కృతౌ నశ్యతః తథాకరణమేవ పరమం కౌశలం ఇతి భావః”. (అభినవగుప్తాచార్యవ్యాఖ్యా) - పాపపుణ్యములు ఫలమునీయకుండ ఎట్లు నశించునో అట్లు కర్మలను చేయుటయే కౌశము - అదియే యోగము).
బుద్ధిర్యశ్చ న వి చేష్టితే తామాహుం పరమాం గతిం |
తాం యో గమితి మన్యంతే స్థిరా మింద్రియ ధారణాం |
అప్రమత్తస్తథా భవతి యోగోహి ప్రభవాప్యయే ||“.
(జ్ఞానేంద్రియములయిదింటినీ మనస్సును, బుద్ధిని, వాటి వాటి చేష్టలను - వృత్తులను మానియుండు స్థితియే పరమగతి యని చెప్పబడినది. ఇంద్రియములను చలించకుండునట్లు చేసి ఒకే ధేయము మీదనుంచుట యోగమని చెప్పబడినది.
నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 2)
“యం కర్మ తత్ఫలత్యాగం ప్రాహుః సన్యాస మాగమాః |
ఫలాభిలాష కర్తృత్వాభిమానత్యాగయో గతిః |
యోగంతం విద్ధి, తత్ప్రాప్తౌ సాధనత్వస్య సామ్యతః | ” (గీతాభావ్ప్రకాశము - 6 - 13; 14)
(ఆగమములలో కర్మను, కర్మఫలమును త్యజించుట యన సన్యాసము అని యేది చెప్పబడినదో అదియే యోగము. ఫలాసక్తి కర్తృత్వాభిమానము - ఈ రెంటిని వదలివేయుటవలన, వాటివలన కలుగు ప్రాప్తికి రెండునూ సాధనములే యగుటవలన ఇదియు, నదియు ఒకటే - యోగము).
యోగ ఇత్యుచ్యతే - - - ||“. (గీతాభావప్రకాశము - 5 - 69)
(చేయుచున్నకర్మయొక్క ఫలమందాసక్తిలేక ఆ కర్మను శ్రీకృష్ణునకు (భగవంతునికి) అర్పించుట యోగమని చెప్పబడుచున్నది).
(యోగము నభ్యసించుకారణముగా అన్నింటినుండి చిత్తమును నిరోధించియుండుట; ఇందులోనే గొప్ప సుఖమున్నదని దానియందే అత్యంతము రతి గలిగియుండుట; మనసులో ఆత్మనే చూచుచు, ఇతరమైన దేనియందును అపేక్షలేకుండి, ఆత్మయందే సంతోషము పొందుట; ఇంద్రియముల శక్తికి మించిన బుద్ధిచేతనే గ్రహించతగినది, అనంత సుఖమైనది యగుదానిని తెలుసుకొని స్థితి - అనుభవించుస్థితి; సుఖాతిరేకమువలన (అత్యంత సుఖానుభవమువలన) దానినుండిచలించని స్థితి - ఇట్టి యోగమును పొంది, దానినుండి విరమించక, దానినే కోరుచు, ఇతర లాభమును తలంపడు - ఆ స్థితిని పొందగా పుత్రవియోగము మొదలగు గొప్ప దుఃఖము కలిగినను చలింపడు - ఇటువంటిది యోగము -).
త్రిథా ప్రకల్పయన్ ప్రజ్ఞాం లభతే యోగముత్తమం ||“. (ఇతి స్మృతిః)
(ఆగమములద్వారా, అనుమానప్రమాణముద్వారా, ధ్యానాభ్యాసముద్వారా జ్ఞానమును సంపాదించిన ఉత్తమయోగము లభించును).
యోగస్తద్వత్తి నిరోధోహి, జ్ఞానం సమ్యగవేక్షణం ||“.
(చిత్తమును నశింపచేయుటకు - తన స్వాధీనములో నుంచుకొనుటకు రెండే మార్గములు - యోగము, జ్ఞానము - చిత్తవృత్తి నిరోధించుట యోగము, పరమాత్మ సాక్షాత్కారము పొందుటే జ్ఞానము).
సమాధానవచలా బుద్ధిస్తథా యోగమవాప్స్యసి ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 53)
“అవిచారిత తత్పర్యైరనేక శ్రవణైస్తవ |
ధీః సంశయ విపర్యాసైః విక్షిప్తా అనేకథా |
యస్మిన్కాలే విశుద్ధ్యతం వివేక జనితేన చ |
ఇహముత్ర ఫలే దోషదర్శనేన సమన్వితా |
త్యక్త్వా విక్షేప మద్వైతతత్వే (అ)త్యంత నిశ్చలా |
జాగ్రత్స్వప్న మనోరాజ్య వర్జితా బ్రహ్మణి స్థితా |
అచలా సూప్తి మూర్చాది లయశూన్యాసతీ స్వయం |
యద్వా(అ)సంభావనాం త్యక్త్వా విపరీతమతిం తథా |
నిథి ధ్యాసనా సంపన్నా తత్వే స్థాస్యతి నిశ్చలా |
తస్మిన్కాలే పరాత్మైక్యయోగం వేదాంతవాక్య జం |
అఖండ సాక్షాత్కారాఖ్యం సర్వయోగఫలం పరం |
అవాప్స్యసి కృతకృత్యో భవిష్యసి ||“. (గీతాభావప్రకాశము - 2 - 532 to 537)
(వేదవచనములువిని, వాటి తాత్పర్యము సరిగా బోధపఱచుకొనక, వాటిలో అనేక సందేహములున్నవని అనుకొనుటచేత నీ చిత్తము ఇదివఱకు విక్షిప్తమై యున్నది. ఎప్పుడు నీకు చిత్తశుద్ధికలుగునో అప్పుడు వివేకము కలుగును - దానివలన ఈ లోకమునందు పరలోకమునందు అనుభవించు ఫలములందు దోషము స్పష్టముగా కనబడును - అప్పుడు నీ బుద్ధి విక్షేపములేక యుండును. అప్పుడు అధ్వైత తత్వమున్నూ, మిక్కిలి నిశ్చలమైనది, జాగ్రత్స్వప్నమనస్సులయొక్క అవస్థలు లేని పరబ్రహ్మయందు, సుషుప్తి, మూర్ఛ మొదలగు లయములు లేనటువంటి నిశ్చలమైన స్థితి కలిగియుండును - అప్పుడు పరమాత్మతో ఐక్యమగుట అను యోగము కలుగును. అదియే సర్వయోగఫలము - అఖండసాక్షాత్కారమని పేరుగల యోగము. దానిని పొందగలవు. అప్పుడు స్థితప్రజ్ఞుడవు, కృతకృత్యుడవు కాగలవు).
సాధ్యసాధనయో రైక్యం ఫలైక్యాదౌపచారికం |
సాధనం కర్మయోగాఖ్యం, సాధ్యం జ్ఞానమనే కథా |
గుణైస్తౌతి హరిః - - - ||. (గీతాభావప్రకాశము - 4 - 2; 3)
(శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు రెండు యోగములను చెప్పియుండెను - అవియేవి యన - సాధ్యయోగము, సాధనయోగము - జ్ఞానయోగము, సాధ్యయోగము, దానికి సాధనమైన యోగము (సాధనయోగము) కర్మయోగము - ఈ రెండుయోగములఫలము ఒక్కటేగనుక రెండుయోగములు ఒకటే - ఔపచారికము).
జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 3)
“చిత్తశుద్ధ్య శుద్ధిభ్యాం జనే(అ)స్మిన్నధికారిణి |
ద్వివిధా ద్విప్రకారైవ పూర్వాద్యాయే స్ఫుటం మయా |
జ్ఞానకర్మ పరత్వాఖ్యా నిష్ఠోక్తా తే హి తైషిణా ||
- - - సాధ్య సాధన భేదేన నిష్టై కైవాస్తి సా ద్విథా ||“. (గీతాభావప్రకాశము - 3 - 28, 29, 32)
చిత్తశుద్ధిగల అధికారి, చిత్తశుద్ధిలేని అధికారి అని అధికారి రెండు విధములు - ఇట్టి అధికారి భేదమును బట్టి యోగము (నిష్ట) రెండు విధములు:-
(చిత్తశుద్ధిగలవారికి సాంఖ్యయోగము, లేక జ్ఞానయోగము, చిత్తశుద్ధిలేనివారికి కర్మయోగము - కర్మయోగము వలన చిత్తశుద్ధి కలిగి తద్ద్వారా జ్ఞానయోగము అలవడును. అందుచేత వేరు వేఱు పేర్లు ఉన్ననూ, రెండూ ఒకటే,సాధ్యసాధకభేదముగాని నిజముగా రెండింటికి భేదములేదు).
“ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం |
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే(అ)బ్రవీత్ |
ఏవం పరంపరా ప్రాప్తమమః రాజర్షయో విదుః |
స కాలేనేహ మహతా యోగో నష్టః, పరంతప |
స ఏవాయం మయా తే అద్యయోగః పోక్తః పురాతనః ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 1 to 3)
“ఏవం మహాఫలో యోగో ధర్మహ్రాసకరేణ సః |
నష్టో దీర్ఘేనే కాలేన ద్వాపరాంతే(అ)ధునా క్షితౌ |
ర్బలాన్ ప్రాప్య భోగాదౌ తత్సరాన జితేంద్రియాన్ |
కామద్వైరభిభూతస్సన్ విచ్ఛినః సంప్రదాయ తః |
క్రోధాది శత్రు సంఘం యః శౌర్యేణ స్వవివేకతః |
తాప యత్యర్కవత్సుత్వమధికారీ జితేంద్రీయః |
స్వర్లోకే స్యూర్వశీ త్యాగితయా సమ్యక్పరీక్షితః |
పరే విపక్ష భూతాంస్తాన్ శౌర్యతేజో గభస్తిభిః |
తాపయత్యర్కవ ద్వాయం ప్రోక్త స్త్వమ్హి, పరం తప ||“. (గీతాభావప్రకాశము - 4 - 16 to 20)
(ఈ యోగమును నేను సూర్యునకు చెప్పియుంటిని. సూర్యుడు మనువునకు చెప్పెను - ఈ విధముగా పరంపరగా ఒకరివద్దనుండి ఇంకొకరు నేర్చుకున్న యీ యోగము ద్వాపరయుగము ఆఖరున ధర్మము క్షీణించుచు రావడముచేత ఇప్పుడు భూమిమీద భోగములు మొదలగువానియందు తత్పరులై ఇంద్రియజయములేనట్టి దుర్బలులు అయినవారిద్వారా నష్టపోయినది. నీవు క్రోధము మోదలగు అరిషడ్వర్గమును శౌర్యముచేత, వివేకమువల్లను, సూర్యునివలె తపింప చేసినవాడవు, ఇంద్రియములను జయించినవాడవు, నీ శత్రువులను కూడ శౌర్యమను తేజోకిరణములచేత తపింప చేయుదువు, ఈ యోగమును నేర్చుకొనుటకు తగిన అధికారివి. అందుచేత నీకీ యోగము నేను చెప్పితిని).
ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలం |
యత్సాంఖ్యైర్ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే |
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి |
సన్యాసస్తు, మహాబాహో, దుఃఖమాప్తుమయో గతః |
యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధి గచ్చతి ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 4 to 6)
(సాంఖ్యయోగమువేరు, (కర్మ) యోగమువేరు అని అజ్ఞానులు చెప్పుదురు, పండితులట్లు చెప్పరు. సాంఖయ్యోగముచే యే స్థానమును పొందుదురఓ - ఏ ఫలమును పొందుదురో (కర్మ) యోగముచేతకూడ ఆ ఫలమునే పొందుదురు. సాంఖ్యయోగము, (కర్మ) యోగము ఒకటేయని తెలిసినవారే పండితులు.)
బ్రహ్మచర్యాశ్రమాదేవ వేదాంత శ్రవణాదిభిః |
జ్ఞానభూమే ప్రవిష్టానాం సాంఖ్యానాం శుద్ధచేతసాం |
యుజ్యతే బ్రహ్మణానేన జ్ఞానం తద్యోగ ఈరితః |
జ్ఞానయోగేన తేనైవ నిష్ఠా తేషా ముదాహృతా |
కర్మాధి కారేణాం పుంసా మశుద్ధ మనసాం తథా |
కర్మైవ యుజ్యతే చిత్తశుద్ధ్యా(అ)నేనేతి యోగకః |
తేనైవ కర్మయోగేన నిష్ఠా తేషా ముదాహృత |
ధీశుద్ధి ద్వారతో జ్ఞానభూవౌ సమ్యక్ప్రవేశనం |
నాన్య ధేత్యాశియో విష్ణోః శ్రీకృష్ణస్య కృపానిధేః |
అతో భిన్నాధికారిత్వాత్ సాధ్యసాధన రూపయోః |
నవికల్పస్తయోః జ్ఞానకర్మణోర్వా సముచ్ఛయః |
తస్మాదవస్థాన భేదే న చైకమేవ ప్రతిద్వయోః |
ఉపయోగాన్న వైయర్థ్యముపదేశస్య చేవ్తి దృక్ ||. (గీతాభావప్రకాశము - 3 - 34 to 40)
(బ్రహ్మచర్యాశ్రమములోనుండి మొదట వేదాంత శ్రవణము మొదలగునవి చేయుచు చిత్తశుద్ధి కలవారికి జ్ఞానయోగము చెప్పబడినది. చిత్తశుద్ధి లేకుండుటవలన కర్మలు చేయుటయందే అధికారముగలవారికి కర్మయోగము చెప్పబడినది. చిత్తశుద్ధి కలిగిననే జ్ఞానయోగము నవలంభించుటకు అవకాశమగును. ఇట్లు అధికారి భేదమువలన ఈ రెండు యోగములు వేఱు అనిపించినను, రెండునూ ఒకటే ఫలముకలవి. అందుచేత రెండు యోగములు ఒకటే).
నిర్వణ్ణానాం జ్ఞానయోగో న్యాసినా మిహ కర్మసు |
తేష్వ నిర్విణ్ణ చిత్తానాం కర్మయోగస్త్వ కామినాం ||.
(కర్మలనాచరించుటయందు విసుగు పుట్టి వైరాగ్యము చెందినవారికి జ్ఞానయోగము చెప్పబడినది. కర్మాచరణమందు ఇష్టముకలిగి, వాటి ఫలమందాసక్తిగలవారికి కర్మయోగము చెప్పబడినది).
శృణు సన్యాసిభిః పుణ్యైః పూర్వజన్మ స్వనుష్టితైః |
శుద్ధాంతఃకరణైః సమ్యక్ వేదాంత శ్రవణాదిభిః |
అవాప్తాత్మావబోధైః యన్మోక్షాఖ్యం ప్రాప్యతే ఫలం |
ఈశార్పణ ధియాయోగాః శాస్త్రీయాణి కృతానిచ |
కర్మాణసంతి యేషాంతే యోగా స్తైరపి యోగిభిః |
సత్వశుద్ధ్యాచ సన్యాస పూర్వయం జ్ఞాన నిష్టయా |
తత్స్థానం గమ్యతే వర్తమానే భావినివా భవే |
అతః ఏకఫలత్వా ద్యః పశ్యత్యేకం విశుద్ధ ధీః |
సాంఖ్యం యోగం స ఏవాహ సమ్యక్పశ్యాతి నాపరః | (గీతాభావప్రకాశము - 5 - 50 to 54)
(వేదాంతశ్రవణము మొదలగు వాటివల్ల అంతఃకరణశుద్ధికలవారు, ఆత్మజ్ఞానము సంపాదించిన వారు, పూర్వజన్మలలో పుణ్యములను చేసినవారు అయిన సన్యాసులు మోక్షమను పేరుగల యే ఫలమును పొందుదురో, శాస్త్రప్రకారము భగవంతునికి అర్పణచేసిన కర్మలుకూడ యోగమగుటచేత, అట్టి యోగమును సత్వశుద్ధితో సన్యాస పూర్వముగా జ్ఞాననిష్టతో చెసిన యోగులు ఈ జన్మలోకాని, ముందుకలుగబోయే జన్మలోకాని, ఆస్థానమునే - ఆ ఫలమునే పొందుదురు - రెండింటికి ఫలమొకటే యగుటవలన, పరిశుద్ధమైన మనస్సు గలవారు సాంఖ్యము అదే, యోగము అదే - రెండునూ ఒకటేయని తలచెదరు).(అట్టివారే భగవత్ స్థానమును పొందకలుగుదురు - ఇతరులుకాదు).
(ఆసనము మొదలగు పరికరములతో (అంగములతో) కూడినది, భగవత్సాక్షాత్కారము పొందుటకు ఆత్మావలోకనము అనుపేరుగల చిత్తసమాధానము అను పేరుగల మనోవ్యాపారము).
(యోగములు వాసుదేవపరములు - వాసుదేవుని గుఱించి చేయబడినవి - వాసుదేవుడే).
“వేదయాగ యోగక్రియా, జ్ఞాన, తపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 24)
బాహ్యం బహిక్రియాపేక్షం ఆతరం ధ్యానముచ్యతే ||“.
(యోగము రెండు విధములుగా చెప్పబడినది - బాహ్యము, ఆభ్యంతరము. బాహ్యమనగా పైకి చేయు క్రియ, రెండవది ధ్యానము).
జ్ఞానం కర్మ చ భక్తిశ్చ నోపాయో(అ)న్యోస్తి కశ్చన. (శ్రీమద్భాగవతం - 11 - 20 - )
(శ్రేయస్సుకోరు మానవులకు నేను మూడు యోగములు చెప్పియుంటిని - జ్ఞానయోగము,. కర్మయోగము, భక్తియోగము - వీటికంటె మఱియొక ఉపాయము - యోగము - లేదు).
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 3) (చూడుము - 41)
ఏక ఏవ చతుర్థా(అ)యం మహాయోగో అభిధీయతే ||“. (యోగశిఖోపనిషత్)
(మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము. ఈ నాలుగు క్రమముగా ఒకటేయగు మహాయోగమునకు భూమికలు - యోగములో మెట్లు).
మంత్రయోగో లయశ్చైవ హఠో (అ)సౌ రాజయోగకః ||“. (యోగతత్వోపనిషత్)
(వ్యవహారమునుబట్టి యోగము అనేక విధములుగా నున్నది - మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము).
యోగః పరం తపో జ్ఞేయః తస్మాద్యుక్తస్తమభ్యసేత్ “.
(యోగమువలన జ్ఞానము కలుగును; యోగము ధర్మలక్షణము, యోగము గొప్ప తపస్సు - అని తెలుసుకొనవలెను).
గతిం గంతుం ద్విజాః శక్తాః యోగాసం ప్రాప్నువంతి యాం ||.
(యోగముద్వారా పొందగలుగు పరమగతిని - పరమపదమును - ద్విజులు గొప్ప తపస్సుచేతనైన గాని,వేదాధ్యయనముచేతగాని పొందలేరు).
కర్మభ్యశ్చాదికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ||“.
(తపస్వికంటెను, జ్ఞానికంటెను, కర్మికంటెను యోగి అధికుడు, అనగా, తపస్సుకంటె, జ్ఞానయోగముకంటె, నిష్కామకర్మయోగముకంటె యోగాభ్యాసము అధికమైనది. అందుచేత యోగివి కమ్ము -).
(యోగము పూర్వకాలమునకేకాక, ఋషులకేకాక, ప్రస్తుతకాలమునకును, పరిస్థితులకుకూడ ఉపయోగకరమగునట్లు చేసుకొనవచ్చును. దీనికి వయసుతో పనిలేదు. కాలములో నున్నవారు, వృద్ధులుకూడ చేయవచ్చును. ఇది వృద్ధులకే హెచ్చుగా - ఒక పద్ధతి ప్రకారము అభ్యాసము చేసుకొనిన లాభకరము - ఆరోగ్యమును కలిగించి శారీరకముగాను, మానసికముగాను ధారుఢ్యమును కలిగించును. పూర్వము యోగులు చాలాకాలము ఆహారము తీసుకొనకయే జీవించగలిగిరి, అతిమానుష శక్తులను (super human powers) సంపాదింపగలిగిరి - - - ఒక పాశ్చాత్యుడు యోగాభ్యాసముచేసి వాని స్వదేశమైన ఇంగ్లాండులో మంచి చలికాలములో ఆరుబైట చిన్నవస్త్రముతో సంచరించగలిగెను - (ABOUT YOGA) శరీరమునకు కావలసిన వేడిమిని శరీరములోనే కలిగించుకొనిన ఇది సాధ్యమగును - యోగాభ్యాసమువలన రక్తము శుభ్రపడి శరీరమును శుభ్రపరచును. ఆయుర్దాయము పెరుగును. శరీరము కాంతివంతమగును).
మిద్ధ్యైతత్ - అన్య ద్ద్రవ్యమ్హి నైతి తద్ద్రవ్య తాం యతః ||“.
(అత్మ పరమాత్మలు కలియుటయే పరమార్థమని చెప్పబడినది, కాని ఇది మిథ్య. ఎందుచేతననగా - తత్పదార్థమైన పరమార్థ తత్వముకంటె ఇతరమైన ద్రవ్యము (వస్తువు, తత్వము) పరమాత్మతత్వములో కలియనేరదు - ఏకము కానేరదు - అంతా భగవంతుడే - భగవత్తత్వమే - కనుక ఇంకొక తత్వము (ద్రవ్యము, వస్తువు) అనునదే లేదు. అందుచేత ఇతరవస్తువు దానితో కలియుట - యోగమగుట - మిథ్యయే). (తత్వమొకటే కనుక ఏకమగును).
(jīvātma paramātmalu kaliyuṭa yōgamani yōgaviśāradulu - yōgamu guṟiṃci bāgugā telisinavāru - ceppiri). “samyagaikyaṃ” (bāgugā ēkamaguṭa - tēḍā lēkuṃḍā ēkamaguṭa).
(jīvunaku parabrahmamunakunu - jīvunakunu paramātmakunu bhēdamu lēkuṃḍuṭa).
(parabrahmatō kaliyunaṭlu - ēkamagunaṭlu cēyuṭa yōgamu. brahmasākṣātkāramu kalugacēyunadi yōgamu.
saṃ yōga yōga ityuktō jīvātmaparamātmanōḥ”. (yājñavalkyaḥ)
(jñānamu yōgamu - yōgamanagā aṣṭāṃgamulatō kūḍinadi).
(jīvātma paramātmala saṃ yōgamu yōgamani ceppabaḍinadi).
(yōgamanagā jīvātma paramātmala aikyamu, iddaṟaku bhēdamulēdanu teliyacēyu vṛtti - lōkamunaku atītamaina śakti)
ramaṇa paramātmayaina paramātmunakunu
samarisaikyānu saṃthāna saraṇi yeddi
yadiya yōgaṃbu sadupāya, māṃjanēya”. (śrīsītārāmāṃjanēya saṃvādamu - 1 - 87)
umāśaṃkarā yōryōgaḥ saṃ yōgō viṣṇu rucyatē ||. (rudrahṛdayōpaniṣat)
(ī kanabaḍucunna samasta prapaṃcamu pārvatīrūpamu, kanabaḍanidi (avyaktamu) paramēśvaruḍu - ī iddarū - pārvatī paramēśvarulu kaliyuṭayē yōgamani ceppabaḍinadi. anagā, paramātma prakṛtilō pravēśiṃci prakṛtitō kalisiyuṃḍuṭayē yōgamu - ī puruṣa prakṛtula saṃ yōgamuvalananē oka vastuvulō nuṃḍi maṟiyoka vastuvu puṭṭinaṭlu sṛṣṭi jarugucunnadi. sṛṣṭilōnuṃḍu prati vastuvulōnu - modaṭinuṃḍi yippaṭivaraku - ī reṃḍu tatvamulu - okadāninokaṭi viḍuvakuṃḍā kalisiyē yunnavi - ī saṃ yōgamu valananē sṛṣṭi jarugucunnadi).
tasmin brahmaṇi saṃ yōgō yōga ityabhidhīyatē ||“. (viṣṇupurāṇamu - 6 - 7 - 31)
(ātmasākṣātkāramu poṃduṭaku manassu cēyu prayatnamulō manassu brahmanu kaliyuṭa yōgamu. iṭlu poṃduṭaku cēyu yukti, kuśalata, nērpu, vidhi sādhanamu, mārgamu, upāyamu modalagunavanniyu yōgamaniyē ceppabaḍucunnavi).
“yujyatē iti yōgaḥ” (kalupunadi, jatakūrcunadi yōgamu. manassunu paramātmatō aikyamu cēyuṭayē yōgamu. idi dhyānamudvārā, jñānamudvārā, bhaktidvārā, lēkaṃ itara sādhanamuladvārā cēsinanu yōgamē).
ātmatatvāvalōkanaṃ yōgaḥ - gītāśāstrē dvitīya ṣaṭkē pratipādyō bhakti yōgaḥ.
(ātmatatvāvalōkanamē - ātmatatvamuguṟiṃci ciṃtiṃcuṭayē yōgamu - śrīmadbhagavadgītalō 7 nuṃḍi 12 varaku gala adhyāyamulalō bhakti yōgamu ceppabaḍinadi).
aṣṭāṃgayōgamu -
“brahmaprāptau kāraṇaṃ paraṃ”. (gītābhāvaprakāśamu - 4 - 8)
(brahmaprāptiki paramakāraṇamainadi yōgamu)
(avidyāvaśavartulai saṃsāramaṃdu munigiyuṃḍuvāriki saṃsārabaṃdhamulanu pōgoṭṭuṭaku cēyu upāyamu).
“tadādraṣṭuḥ svarūpē avasthānaṃ”, “vṛtti sārūpyamitaratra” - (pataṃjali - 1 - 3; 4)
(cittamuyokka vṛttulanu - vyāpāramulanu nirōdhiṃcuṭa yōgamu - appuḍu yōgi tana svarūpamunē cūcunu. iṭlu cittavṛttula nirōdhiṃcanapuḍu cittavṛttulatō cūcucunnadē kanupiṃcunu, viṣayamulaguṟiṃciyē ciṃtiṃcunu - ī viṣayamu śrīmadāṃdhramahābhāgavatamulō ī kriṃda vidhamugā ceppabaḍinadi : -
“jñānēṃdriyaṃbulēnunu, viṣayaṃbula mīdadōcu buddhulēnunu nabhimānaṃbunu nanu nēkādaśavṛttulaṃ gūḍina manaṃbu jīvuniki nasakhyaṃbulayina janmaṃbula boṃdiṃcu - manōvṛttula natikramiṃcina jīvuṃḍu paraṃjyōti ayina nārāyaṇasvarūpaṃbugā neṟuṃgumu”. (1 - 11 - )
(paramātmayokka aṃśayē jīvātmayani śrīmadbhagavadgītalō ceppabaḍinadi. paramātma prakṛtitō kaliyuṭa kāraṇamugā ataninuṃḍi vēraina (ataninuṃḍi puṭṭina) oka aṃśa jīvuḍai saṃsāramulō (prakṛti pariṇāmamulō) paḍi, prakṛtini vadaliṃcukoni civaraku marala paramātmalō cēruṭayē yōgamu - aṃśa aṃśi yōgamu. aṃśa galavāḍu aṃśi, paramātma. aṃśi yokka aṃśa (bhāgamu) jīvātma. ī aṃśāṃśilu kaliyuṭayē yōgamu).
ēkātma bhāvanā yōgaḥ kṣētrajña paramātmanōḥ ||“.
(jñānēṃdriyamulanu nigrahiṃci, tanavaśamulōnuṃcukoni, kṣētrajñuḍaina jīvātma bhagavaṃtuḍaina paramātma okaṭē yanu bhāvamu kaligiyuṃḍuṭa, aṭṭi bhāvamunanubhaviṃcuṭaku cēyu prayatnamu yōgamu).
(paramātmanuguṟiṃci ēkāgra cittamutō nuṃḍuṭa, paramātma dhyānamaṃdu cittamunu kēṃdrīkariṃcuṭa).
(mūladhāra cakramaṃdu yōni sthānamunnadi. akkaḍa rajōguṇamutō kūḍina dēvī tatvamu lēka jīvuḍu anu pērugaladikaladu - kanubomalamadhyanu sahasradaḷapadmamaṃdu śaśisthānamunnadi. akkaḍayunna biṃduvu śivatatvamu - ā reṃḍu śaktulayokka aikyamu, lēka jīvaparamātmalayokka aikyamu yōgamu ani ceppabaḍunu - adi yōgulakutappa migilinavārevarikinī durlabhamu - labhiṃcuṭa kaṣṭamu).
“śuklarajōrūpa bhṛūsavasrāra madhya sōmasūryaikyaṃ yō jānāti sayōgavit bhavatītyarthaḥ”.
(kanubomalamadhyanu śirassulōni sahasrārapadmamaṃdunu uṃḍu śuklarūpamu, rajōrūpamu ayina caṃdrasūryula aikyamunu telisinavāḍu yōgaviduḍu - yōgamunu telisinavāḍu).
sūryācaṃdra masōryōgō jīvātma paramātmanōḥ |
ēvaṃtu dvaṃdvajālasya saṃ yōgō yōga ucyatē ||“. (yōgaśikhōpaniṣat)
(apānavāyuvunu prāṇavāyuvutō aikyamucēyuṭa, tanarajassunu rētassutō aikyamucēyuṭa, sūryuni caṃdrunitō kalupuṭa, jīvātmanu paramātmatō aikyamu cēyuṭa - anu ī dvaṃdvamulanu (reṃḍēsi vastuvulanu) kalupuṭa yōgamani ceppabaḍinadi).
(pramāṇamu, viparyayamu, vikalpa, nidrā, smṛti anu ayidu vidhamulaina cittavṛttulanu nirōdhiṃcuṭa yōgamu).
(bhagavaṃtuni guṟiṃci kāka itaraviṣayamulanuṃḍi cittavṛttulanu nirōdhiṃcuṭa.)
upāsanaṃ dhyānaṃ -
(mōkṣamunaku sādhanamaina bhagavaṃtuni guṟiṃci upāsana) - (upāsana, dhyānamu)
samādhiḥ -
cētaḥ samādhānaṃ.
(manassunu samādhānaparacukonuṭa)
dhyānavidhi
“tāṃ yōgamiti manyaṃtē sthiramiṃdriya dhāraṇaṃ” -
(iṃdriyamulanu sthiramugā nigrahiṃcuṭa yōgamani ceppucunnāru).
(sākṣātkariṃpacēsukoni vastuvunaṃdu - paramātmayaṃdu - manassunu niścalamugā nuṃcu konuṭayē yōgamu).
(śarīramu, kaṃṭhamu, śirassu - ī mūḍiṃṭini unnatamugā - tinnagā, vaṃkara lēkuṃḍunaṭlu uṃcuṭa yōgamu)
(labhiṃcani vastuvu labhiṃcuṭa).
(yōgamu guṟiṃci telisinavāru parama tapassē yōgamani talaṃcedaru) (utkṛṣṭamaina tapassē yōgamu).
(kēvaluḍaina brahmanē anusaṃdhānamu cēyuṭa).
siddhyasidthyōssamō bhūtvā samatvaṃ yōga ucyatē ||“. (śrīmadbhagavadgīta - 2 - 48)
“phalatṛṣṇa śūnyēna kriyāmāṇē karmaṇi satvaśuddhi jā jñānaprāpti lakṣaṇā siddhiḥ, tadviparyayajāta asiddhiḥ, tayōḥ siddhya sidhyōrapi samatvaṃ yōgaḥ” (śrīśaṃkaraḥ)
(phalāpēkṣalēka cēyu karmayaṃdu satvaśuddhivalana jñānamu kaluguṭa siddhi; aṭlu kalugakapōvuṭa asiddhi. ī reṃḍiṃṭi viṣayamai samamugānuṃḍuṭa yōgamu. aṭlu yōgamunu pāṭiṃcucu karmalanu cēyumu).
“siddhya sadhyōḥ karmaphalasya vividiṣādēḥ, siddhāvasiddhauvā samō harṣa viṣāda śūnyō bhūtvā karmāṇi kuru. iti saṃbaṃdhaḥ - idamēva sidthyōḥ sama tvaṃ yōgaḥ ucayatē” (śrīnīlakaṃṭhavyākhyā)
(cēsina karmaphalamu siddhiṃcinanu, siddhiṃcakapōyinanu saṃtōṣamugāni, duḥkhamugāni ceṃdaka karmalanu cēyumu - iṭṭi samatvamē yōgamani ceppabaḍinadi. “sidthya sidthyōḥ samatvarūpaṃ citta samādhānaṃ” siddhi, asiddhi - ī reṃḍiṃṭiyaḍala samamugā nuṃḍuṭa yanu cittasamādhānamu - kāryamu phaliṃcinanu, phaliṃcakapōyinanu samānamaina buddhi kaligiyuṃḍuṭa).
“yōgasthassan phalēkāmaṃ kartṛtvābhimatiṃ tathā |
tyaktvā tvaṃ kuru karmāṇi kṛṣṇārpaṇa dhiyāsadā |
tyaktvā harṣaṃ phalaprāptau phalasiddhau viṣādatāṃ |
kō(a)sauyōgaḥ sayatrasthaḥ karma kurvanna duṣyati |
siddhya siddhyōḥ samatvaṃ yatsayōga iti kathyatē ||“. (gītābhāvaprakāśamu - 2 - 504 to 506)
(yōgamulōnuṃḍi cēyucunna karmayokka phalamaṃdu kōrikalēka, ‘ī karmanu nēnu cēyucunnānu’ anu kartṛtvābhimānamulēka ellapuḍu ‘kṛṣṇārpaṇaṃ’ (ī karma kṛṣṇunaku bhagavaṃtunaku arpiṃcucunnānu) anu buddhi kaligiyuṃḍi, phalamu poṃdinapuḍu saṃtōṣiṃcaka, phalamu kalaganapuḍu viṣādamunu poṃdaka karmalanu cēyumu - yōgamanagā phalamu siddhiṃcinā siddhiṃcakapōyinanu samamugā nuṃḍuṭa).
tasmādyōgāya yujyasya, yōgaḥ karmasa kauśalaṃ ||“. (śrīmadbhagavadgīta - 2 - 50)
(karmaphalamu siddhiṃcinanu sidśdhiṃcakapōyinanu samabuddhikaligiyuṃḍuṭa yōgamu. aṭṭi yōgamu navalaṃbhiṃcina yaḍala ikkaḍē - ī lōkamunaṃdē - pāpapuṇyamulanu vadalivēyunu - anagā, vāṭi phalamu lēkuṃḍa cēsukonunu - aṃducēta aṭṭiyōgamu navalaṃbhiṃcumu - yōgamanagā karmalanu cēyuṭa yaṃdu kuśalata - nērparitanamu, karmalanu cēyuṭayaṃdu kauśalamu anagā “karmasu baṃdhakēṣvapi kauśalaṃ - baṃdhanivartakatva saṃpādakaṃ” (nīlakaṃṭhavyākhya). baṃdhamunu kaligiṃcu karmalayaṃdu kauśalamu yōgamu - anagā, ā karmalu baṃdhamunu nivartiṃcunaṭlugā cēsukonuṭayē yōgamu).
“karmasu pravartamānasya kauśalaṃ, kuśalabhāvaḥ - samatvabuddhi yuktaḥ karmayōgaḥ karmātmāpi san, duṣkarmakṣayā karōtīti mahākuśalaḥ”
(karmalu cēyuvāniyokka kuśalabhāvamu. siddhyasiddhulalō samatvabuddhi kaligi karmalu cēyucu, duṣkarmalanu naśiṃpacēsukonuṭayē karmalayaṃdu kuśalatvamu - adiyē yōgamu)
“karmasu yatkauśalaṃ baṃdhakānāmapi tēṣāṃ īśvarārādhanēna mōkṣaparatva saṃpādana cāturyaṃ, sa ēva yōgaḥ” (śrīdharīya vyākhyā)
(baṃdhamu kaligiṃcu karmalayaṃdainanu bhagavaṃtuni ārādhiṃcuṭacēta mōkṣa paratatvamunu saṃpādiṃcu cāturyamu karmalayaṃdu kauśalyamu - adiyē yōgamu. - “yathāhi sukṛta duṣkṛtau naśyataḥ tathākaraṇamēva paramaṃ kauśalaṃ iti bhāvaḥ”. (abhinavaguptācāryavyākhyā) - pāpapuṇyamulu phalamunīyakuṃḍa eṭlu naśiṃcunō aṭlu karmalanu cēyuṭayē kauśamu - adiyē yōgamu).
buddhiryaśca na vi cēṣṭitē tāmāhuṃ paramāṃ gatiṃ |
tāṃ yō gamiti manyaṃtē sthirā miṃdriya dhāraṇāṃ |
apramattastathā bhavati yōgōhi prabhavāpyayē ||“.
(jñānēṃdriyamulayidiṃṭinī manassunu, buddhini, vāṭi vāṭi cēṣṭalanu - vṛttulanu māniyuṃḍu sthitiyē paramagati yani ceppabaḍinadi. iṃdriyamulanu caliṃcakuṃḍunaṭlu cēsi okē dhēyamu mīdanuṃcuṭa yōgamani ceppabaḍinadi.
nahya sanyasta saṃkalpō yōgī bhavati kaścana ||“. (śrīmadbhagavadgīta - 6 - 2)
“yaṃ karma tatphalatyāgaṃ prāhuḥ sanyāsa māgamāḥ |
phalābhilāṣa kartṛtvābhimānatyāgayō gatiḥ |
yōgaṃtaṃ viddhi, tatprāptau sādhanatvasya sāmyataḥ | ” (gītābhāvprakāśamu - 6 - 13; 14)
(āgamamulalō karmanu, karmaphalamunu tyajiṃcuṭa yana sanyāsamu ani yēdi ceppabaḍinadō adiyē yōgamu. phalāsakti kartṛtvābhimānamu - ī reṃṭini vadalivēyuṭavalana, vāṭivalana kalugu prāptiki reṃḍunū sādhanamulē yaguṭavalana idiyu, nadiyu okaṭē - yōgamu).
yōga ityucyatē - - - ||“. (gītābhāvaprakāśamu - 5 - 69)
(cēyucunnakarmayokka phalamaṃdāsaktilēka ā karmanu śrīkṛṣṇunaku (bhagavaṃtuniki) arpiṃcuṭa yōgamani ceppabaḍucunnadi).
(yōgamu nabhyasiṃcukāraṇamugā anniṃṭinuṃḍi cittamunu nirōdhiṃciyuṃḍuṭa; iṃdulōnē goppa sukhamunnadani dāniyaṃdē atyaṃtamu rati galigiyuṃḍuṭa; manasulō ātmanē cūcucu, itaramaina dēniyaṃdunu apēkṣalēkuṃḍi, ātmayaṃdē saṃtōṣamu poṃduṭa; iṃdriyamula śaktiki miṃcina buddhicētanē grahiṃcataginadi, anaṃta sukhamainadi yagudānini telusukoni sthiti - anubhaviṃcusthiti; sukhātirēkamuvalana (atyaṃta sukhānubhavamuvalana) dāninuṃḍicaliṃcani sthiti - iṭṭi yōgamunu poṃdi, dāninuṃḍi viramiṃcaka, dāninē kōrucu, itara lābhamunu talaṃpaḍu - ā sthitini poṃdagā putraviyōgamu modalagu goppa duḥkhamu kaliginanu caliṃpaḍu - iṭuvaṃṭidi yōgamu -).
trithā prakalpayan prajñāṃ labhatē yōgamuttamaṃ ||“. (iti smṛtiḥ)
(āgamamuladvārā, anumānapramāṇamudvārā, dhyānābhyāsamudvārā jñānamunu saṃpādiṃcina uttamayōgamu labhiṃcunu).
yōgastadvatti nirōdhōhi, jñānaṃ samyagavēkṣaṇaṃ ||“.
(cittamunu naśiṃpacēyuṭaku - tana svādhīnamulō nuṃcukonuṭaku reṃḍē mārgamulu - yōgamu, jñānamu - cittavṛtti nirōdhiṃcuṭa yōgamu, paramātma sākṣātkāramu poṃduṭē jñānamu).
samādhānavacalā buddhistathā yōgamavāpsyasi ||“. (śrīmadbhagavadgīta - 2 - 53)
“avicārita tatparyairanēka śravaṇaistava |
dhīḥ saṃśaya viparyāsaiḥ vikṣiptā anēkathā |
yasminkālē viśuddhyataṃ vivēka janitēna ca |
ihamutra phalē dōṣadarśanēna samanvitā |
tyaktvā vikṣēpa madvaitatatvē (a)tyaṃta niścalā |
jāgratsvapna manōrājya varjitā brahmaṇi sthitā |
acalā sūpti mūrcādi layaśūnyāsatī svayaṃ |
yadvā(a)saṃbhāvanāṃ tyaktvā viparītamatiṃ tathā |
nithi dhyāsanā saṃpannā tatvē sthāsyati niścalā |
tasminkālē parātmaikyayōgaṃ vēdāṃtavākya jaṃ |
akhaṃḍa sākṣātkārākhyaṃ sarvayōgaphalaṃ paraṃ |
avāpsyasi kṛtakṛtyō bhaviṣyasi ||“. (gītābhāvaprakāśamu - 2 - 532 to 537)
(vēdavacanamuluvini, vāṭi tātparyamu sarigā bōdhapaṟacukonaka, vāṭilō anēka saṃdēhamulunnavani anukonuṭacēta nī cittamu idivaṟaku vikṣiptamai yunnadi. eppuḍu nīku cittaśuddhikalugunō appuḍu vivēkamu kalugunu - dānivalana ī lōkamunaṃdu paralōkamunaṃdu anubhaviṃcu phalamulaṃdu dōṣamu spaṣṭamugā kanabaḍunu - appuḍu nī buddhi vikṣēpamulēka yuṃḍunu. appuḍu adhvaita tatvamunnū, mikkili niścalamainadi, jāgratsvapnamanassulayokka avasthalu lēni parabrahmayaṃdu, suṣupti, mūrcha modalagu layamulu lēnaṭuvaṃṭi niścalamaina sthiti kaligiyuṃḍunu - appuḍu paramātmatō aikyamaguṭa anu yōgamu kalugunu. adiyē sarvayōgaphalamu - akhaṃḍasākṣātkāramani pērugala yōgamu. dānini poṃdagalavu. appuḍu sthitaprajñuḍavu, kṛtakṛtyuḍavu kāgalavu).
sādhyasādhanayō raikyaṃ phalaikyādaupacārikaṃ |
sādhanaṃ karmayōgākhyaṃ, sādhyaṃ jñānamanē kathā |
guṇaistauti hariḥ - - - ||. (gītābhāvaprakāśamu - 4 - 2; 3)
(śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu reṃḍu yōgamulanu ceppiyuṃḍenu - aviyēvi yana - sādhyayōgamu, sādhanayōgamu - jñānayōgamu, sādhyayōgamu, dāniki sādhanamaina yōgamu (sādhanayōgamu) karmayōgamu - ī reṃḍuyōgamulaphalamu okkaṭēganuka reṃḍuyōgamulu okaṭē - aupacārikamu).
jñānayōgēna sāṃkhyānāṃ, karmayōgēna yōgināṃ ||“. (śrīmadbhagavadgīta - 3 - 3)
“cittaśuddhya śuddhibhyāṃ janē(a)sminnadhikāriṇi |
dvividhā dviprakāraiva pūrvādyāyē sphuṭaṃ mayā |
jñānakarma paratvākhyā niṣṭhōktā tē hi taiṣiṇā ||
- - - sādhya sādhana bhēdēna niṣṭai kaivāsti sā dvithā ||“. (gītābhāvaprakāśamu - 3 - 28, 29, 32)
cittaśuddhigala adhikāri, cittaśuddhilēni adhikāri ani adhikāri reṃḍu vidhamulu - iṭṭi adhikāri bhēdamunu baṭṭi yōgamu (niṣṭa) reṃḍu vidhamulu:-
(cittaśuddhigalavāriki sāṃkhyayōgamu, lēka jñānayōgamu, cittaśuddhilēnivāriki karmayōgamu - karmayōgamu valana cittaśuddhi kaligi taddvārā jñānayōgamu alavaḍunu. aṃducēta vēru vēṟu pērlu unnanū, reṃḍū okaṭē,sādhyasādhakabhēdamugāni nijamugā reṃḍiṃṭiki bhēdamulēdu).
“imaṃ vivasvatē yōgaṃ prōktavānahamavyayaṃ |
vivasvān manavē prāha manurikṣvākavē(a)bravīt |
ēvaṃ paraṃparā prāptamamaḥ rājarṣayō viduḥ |
sa kālēnēha mahatā yōgō naṣṭaḥ, paraṃtapa |
sa ēvāyaṃ mayā tē adyayōgaḥ pōktaḥ purātanaḥ ||“. (śrīmadbhagavadgīta - 4 - 1 to 3)
“ēvaṃ mahāphalō yōgō dharmahrāsakarēṇa saḥ |
naṣṭō dīrghēnē kālēna dvāparāṃtē(a)dhunā kṣitau |
rbalān prāpya bhōgādau tatsarāna jitēṃdriyān |
kāmadvairabhibhūtassan vicchinaḥ saṃpradāya taḥ |
krōdhādi śatru saṃghaṃ yaḥ śauryēṇa svavivēkataḥ |
tāpa yatyarkavatsutvamadhikārī jitēṃdrīyaḥ |
svarlōkē syūrvaśī tyāgitayā samyakparīkṣitaḥ |
parē vipakṣa bhūtāṃstān śauryatējō gabhastibhiḥ |
tāpayatyarkava dvāyaṃ prōkta stvamhi, paraṃ tapa ||“. (gītābhāvaprakāśamu - 4 - 16 to 20)
(ī yōgamunu nēnu sūryunaku ceppiyuṃṭini. sūryuḍu manuvunaku ceppenu - ī vidhamugā paraṃparagā okarivaddanuṃḍi iṃkokaru nērcukunna yī yōgamu dvāparayugamu ākharuna dharmamu kṣīṇiṃcucu rāvaḍamucēta ippuḍu bhūmimīda bhōgamulu modalaguvāniyaṃdu tatparulai iṃdriyajayamulēnaṭṭi durbalulu ayinavāridvārā naṣṭapōyinadi. nīvu krōdhamu mōdalagu ariṣaḍvargamunu śauryamucēta, vivēkamuvallanu, sūryunivale tapiṃpa cēsinavāḍavu, iṃdriyamulanu jayiṃcinavāḍavu, nī śatruvulanu kūḍa śauryamanu tējōkiraṇamulacēta tapiṃpa cēyuduvu, ī yōgamunu nērcukonuṭaku tagina adhikārivi. aṃducēta nīkī yōgamu nēnu ceppitini).
ēkamapyāsthitaḥ samyagubhayōrviṃdatē phalaṃ |
yatsāṃkhyairprāpyatē sthānaṃ tadyōgairapi gamyatē |
ēkaṃ sāṃkhyaṃ ca yōgaṃ ca yaḥ paśyati sa paśyati |
sanyāsastu, mahābāhō, duḥkhamāptumayō gataḥ |
yōgayuktō munirbrahma nacirēṇādhi gaccati ||“. (śrīmadbhagavadgīta - 5 - 4 to 6)
(sāṃkhyayōgamuvēru, (karma) yōgamuvēru ani ajñānulu ceppuduru, paṃḍitulaṭlu cepparu. sāṃkhayyōgamucē yē sthānamunu poṃduduraō - ē phalamunu poṃdudurō (karma) yōgamucētakūḍa ā phalamunē poṃduduru. sāṃkhyayōgamu, (karma) yōgamu okaṭēyani telisinavārē paṃḍitulu.)
brahmacaryāśramādēva vēdāṃta śravaṇādibhiḥ |
jñānabhūmē praviṣṭānāṃ sāṃkhyānāṃ śuddhacētasāṃ |
yujyatē brahmaṇānēna jñānaṃ tadyōga īritaḥ |
jñānayōgēna tēnaiva niṣṭhā tēṣā mudāhṛtā |
karmādhi kārēṇāṃ puṃsā maśuddha manasāṃ tathā |
karmaiva yujyatē cittaśuddhyā(a)nēnēti yōgakaḥ |
tēnaiva karmayōgēna niṣṭhā tēṣā mudāhṛta |
dhīśuddhi dvāratō jñānabhūvau samyakpravēśanaṃ |
nānya dhētyāśiyō viṣṇōḥ śrīkṛṣṇasya kṛpānidhēḥ |
atō bhinnādhikāritvāt sādhyasādhana rūpayōḥ |
navikalpastayōḥ jñānakarmaṇōrvā samucchayaḥ |
tasmādavasthāna bhēdē na caikamēva pratidvayōḥ |
upayōgānna vaiyarthyamupadēśasya cēvti dṛk ||. (gītābhāvaprakāśamu - 3 - 34 to 40)
(brahmacaryāśramamulōnuṃḍi modaṭa vēdāṃta śravaṇamu modalagunavi cēyucu cittaśuddhi kalavāriki jñānayōgamu ceppabaḍinadi. cittaśuddhi lēkuṃḍuṭavalana karmalu cēyuṭayaṃdē adhikāramugalavāriki karmayōgamu ceppabaḍinadi. cittaśuddhi kaliginanē jñānayōgamu navalaṃbhiṃcuṭaku avakāśamagunu. iṭlu adhikāri bhēdamuvalana ī reṃḍu yōgamulu vēṟu anipiṃcinanu, reṃḍunū okaṭē phalamukalavi. aṃducēta reṃḍu yōgamulu okaṭē).
nirvaṇṇānāṃ jñānayōgō nyāsinā miha karmasu |
tēṣva nirviṇṇa cittānāṃ karmayōgastva kāmināṃ ||.
(karmalanācariṃcuṭayaṃdu visugu puṭṭi vairāgyamu ceṃdinavāriki jñānayōgamu ceppabaḍinadi. karmācaraṇamaṃdu iṣṭamukaligi, vāṭi phalamaṃdāsaktigalavāriki karmayōgamu ceppabaḍinadi).
śṛṇu sanyāsibhiḥ puṇyaiḥ pūrvajanma svanuṣṭitaiḥ |
śuddhāṃtaḥkaraṇaiḥ samyak vēdāṃta śravaṇādibhiḥ |
avāptātmāvabōdhaiḥ yanmōkṣākhyaṃ prāpyatē phalaṃ |
īśārpaṇa dhiyāyōgāḥ śāstrīyāṇi kṛtānica |
karmāṇasaṃti yēṣāṃtē yōgā stairapi yōgibhiḥ |
satvaśuddhyāca sanyāsa pūrvayaṃ jñāna niṣṭayā |
tatsthānaṃ gamyatē vartamānē bhāvinivā bhavē |
ataḥ ēkaphalatvā dyaḥ paśyatyēkaṃ viśuddha dhīḥ |
sāṃkhyaṃ yōgaṃ sa ēvāha samyakpaśyāti nāparaḥ | (gītābhāvaprakāśamu - 5 - 50 to 54)
(vēdāṃtaśravaṇamu modalagu vāṭivalla aṃtaḥkaraṇaśuddhikalavāru, ātmajñānamu saṃpādiṃcina vāru, pūrvajanmalalō puṇyamulanu cēsinavāru ayina sanyāsulu mōkṣamanu pērugala yē phalamunu poṃdudurō, śāstraprakāramu bhagavaṃtuniki arpaṇacēsina karmalukūḍa yōgamaguṭacēta, aṭṭi yōgamunu satvaśuddhitō sanyāsa pūrvamugā jñānaniṣṭatō cesina yōgulu ī janmalōkāni, muṃdukalugabōyē janmalōkāni, āsthānamunē - ā phalamunē poṃduduru - reṃḍiṃṭiki phalamokaṭē yaguṭavalana, pariśuddhamaina manassu galavāru sāṃkhyamu adē, yōgamu adē - reṃḍunū okaṭēyani talacedaru).(aṭṭivārē bhagavat sthānamunu poṃdakaluguduru - itarulukādu).
(āsanamu modalagu parikaramulatō (aṃgamulatō) kūḍinadi, bhagavatsākṣātkāramu poṃduṭaku ātmāvalōkanamu anupērugala cittasamādhānamu anu pērugala manōvyāpāramu).
(yōgamulu vāsudēvaparamulu - vāsudēvuni guṟiṃci cēyabaḍinavi - vāsudēvuḍē).
“vēdayāga yōgakriyā, jñāna, tapōgati dharmaṃbulu vāsudēva paraṃbulu” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 24)
bāhyaṃ bahikriyāpēkṣaṃ ātaraṃ dhyānamucyatē ||“.
(yōgamu reṃḍu vidhamulugā ceppabaḍinadi - bāhyamu, ābhyaṃtaramu. bāhyamanagā paiki cēyu kriya, reṃḍavadi dhyānamu).
jñānaṃ karma ca bhaktiśca nōpāyō(a)nyōsti kaścana. (śrīmadbhāgavataṃ - 11 - 20 - )
(śrēyassukōru mānavulaku nēnu mūḍu yōgamulu ceppiyuṃṭini - jñānayōgamu,. karmayōgamu, bhaktiyōgamu - vīṭikaṃṭe maṟiyoka upāyamu - yōgamu - lēdu).
jñānayōgēna sāṃkhyānāṃ karmayōgēna yōgināṃ ||“. (śrīmadbhagavadgīta - 3 - 3) (cūḍumu - 41)
ēka ēva caturthā(a)yaṃ mahāyōgō abhidhīyatē ||“. (yōgaśikhōpaniṣat)
(maṃtrayōgamu, layayōgamu, haṭhayōgamu, rājayōgamu. ī nālugu kramamugā okaṭēyagu mahāyōgamunaku bhūmikalu - yōgamulō meṭlu).
maṃtrayōgō layaścaiva haṭhō (a)sau rājayōgakaḥ ||“. (yōgatatvōpaniṣat)
(vyavahāramunubaṭṭi yōgamu anēka vidhamulugā nunnadi - maṃtrayōgamu, layayōgamu, haṭhayōgamu, rājayōgamu).
yōgaḥ paraṃ tapō jñēyaḥ tasmādyuktastamabhyasēt “.
(yōgamuvalana jñānamu kalugunu; yōgamu dharmalakṣaṇamu, yōgamu goppa tapassu - ani telusukonavalenu).
gatiṃ gaṃtuṃ dvijāḥ śaktāḥ yōgāsaṃ prāpnuvaṃti yāṃ ||.
(yōgamudvārā poṃdagalugu paramagatini - paramapadamunu - dvijulu goppa tapassucētanaina gāni,vēdādhyayanamucētagāni poṃdalēru).
karmabhyaścādikō yōgī tasmādyōgī bhavārjuna ||“.
(tapasvikaṃṭenu, jñānikaṃṭenu, karmikaṃṭenu yōgi adhikuḍu, anagā, tapassukaṃṭe, jñānayōgamukaṃṭe, niṣkāmakarmayōgamukaṃṭe yōgābhyāsamu adhikamainadi. aṃducēta yōgivi kammu -).
(yōgamu pūrvakālamunakēkāka, ṛṣulakēkāka, prastutakālamunakunu, paristhitulakukūḍa upayōgakaramagunaṭlu cēsukonavaccunu. dīniki vayasutō panilēdu. kālamulō nunnavāru, vṛddhulukūḍa cēyavaccunu. idi vṛddhulakē heccugā - oka paddhati prakāramu abhyāsamu cēsukonina lābhakaramu - ārōgyamunu kaligiṃci śārīrakamugānu, mānasikamugānu dhāruḍhyamunu kaligiṃcunu. pūrvamu yōgulu cālākālamu āhāramu tīsukonakayē jīviṃcagaligiri, atimānuṣa śaktulanu (super human powers) saṃpādiṃpagaligiri - - - oka pāścātyuḍu yōgābhyāsamucēsi vāni svadēśamaina iṃglāṃḍulō maṃci calikālamulō ārubaiṭa cinnavastramutō saṃcariṃcagaligenu - (ABOUT YOGA) śarīramunaku kāvalasina vēḍimini śarīramulōnē kaligiṃcukonina idi sādhyamagunu - yōgābhyāsamuvalana raktamu śubhrapaḍi śarīramunu śubhraparacunu. āyurdāyamu perugunu. śarīramu kāṃtivaṃtamagunu).
middhyaitat - anya ddravyamhi naiti taddravya tāṃ yataḥ ||“.
(atma paramātmalu kaliyuṭayē paramārthamani ceppabaḍinadi, kāni idi mithya. eṃducētananagā - tatpadārthamaina paramārtha tatvamukaṃṭe itaramaina dravyamu (vastuvu, tatvamu) paramātmatatvamulō kaliyanēradu - ēkamu kānēradu - aṃtā bhagavaṃtuḍē - bhagavattatvamē - kanuka iṃkoka tatvamu (dravyamu, vastuvu) anunadē lēdu. aṃducēta itaravastuvu dānitō kaliyuṭa - yōgamaguṭa - mithyayē). (tatvamokaṭē kanuka ēkamagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.