← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగనిద్ర yōganidra

Original — తెలుగు
  1. యోగః వృత్తి నిరోధరూపః సమాధిః తద్రూపాం నిద్రాం ప్రలయకాలే సర్వమాత్మని ప్రవిలాప్య స్వస్థస్థితిః - ఇతి యావత్ -

(యోగమనగా వృత్తి నిరోధ రూపమైన సమాధి - ఇతర విషయమలును మఱచుట - అట్టి సమాధిరూపమైన నిద్ర, పళయకాలమందు అన్నింటిలో తనలో లయము చేసుకొని స్వస్థస్థితిలో నుండుట).

  1. యోగః స్వాత్మని మనోలయః, తన్మయీ నిద్రా.

(యోగమనగా తన ఆత్మలో మనస్సును లయము పొందించుట. అట్లు పూర్తిగా లయము చేయు నిద్ర)

  1. “సీ. - - - సర్వస్వామియైన గోవిందుండు - - -

సలలిత స్వోపాధిక శక్తి సహితుడై తనరారు నాత్మీయ థామమందు

ఫణిరాజమృదుల తల్పంబుపై సుఖలీల యోగనిద్రారతి యున్నవేళ

నఖిల జీవులు నిజవ్యాపారశూన్యులై యున్నత తేజంబులురలుగొనగ

తే. జరుగు నయ్యవస్థా విశేషంబులెల్ల - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 266)

  1. “సీ. - - -

తే. పురుషరూపంబు ధరియించి పరుడనంతు

డఖిల భువనైక వర్తన యత్నమమర

మానితోదార జలరాశిమధ్యమునను

యోగనిద్రావిలాసియై యొప్పుచుండు

వ. అది సకలావతారంబులకు మొదలిగనియైన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానంబైన దివ్యరూపంబు, దానిం బరమ యోగీంద్రులు దర్శింతురు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 62,63)

  1. “పరమాత్మ సృజించుకాలము వచ్చినదని తనంత తానే యెఱింగి నిద్రనుండి మేల్కొనును - - - పూవు నికసించు కాలము రాగానే వికసించినట్లు పరమాత్మ కూడ తనంత తానే మేల్కొనును - అంతవఱకు చైతన్యములేని వస్తువునకు చైతన్యము కలిగినదా యన్నట్లుండును - - - యోగమనగా రక్షణోపాయము - తనను విడియుండలేని చేతనులు తనను చేరుకొనుటకు చేయు ధ్యానమే యోగనిద్ర. అట్లు చేరుటకుపాయము తన శరీరమైన ప్రకృతిని కదల్చుటకు సిద్ధపడుటయే మేల్కొనుట.” కారణతత్వము చేతనా చేతనములు కలియుటకు యోగ్యమైన సమయమని కాలతత్వము సూచింపగనే సృష్టికుపక్రమించును. అట్లుపక్రమించగనే “నేను బహు విధములుగా కావలెను” అను సంకల్పము పరమాత్మకు కలుగును. ఇట్లు బహు భవన సంకల్పమే మేల్కొని చూచుట - “స ఐక్షత బహుస్యాం ప్రజాయేయ||” (నేను బహువిధములుగా - బహు రూపములతో పుట్టుదును అని సంకల్పించును). (చూడుము - “సృష్టిక్రమము”; “ప్రకృతి”).

    1. (యోగనిద్ర) హరి మాయాదేవికిట్లనియె - నిన్ను మానవులు దుర్గ భర్గ - - - యను పదునాలుగు నామంబుల గొనియాడుదురయ్యైస్థానంబులందని పొమ్మనిన - - - మహాప్రసాదంబని యయ్యోగనిద్ర యియ్యశానియె.
  2. యోగమనగా జీవులకు ప్రకృతితో సంబంధము కలుగచేయుట. అదియే సృష్టి, దానికై చేయు సంకల్పమే యోగనిద్ర - కారణ తత్వములో జీవప్రకృతి తత్వములు లయమై వేఱుగా తీసి చూపుటకు వీలుకానివై యుండును - ఆ కారణతత్వము సృష్టికిముందు విత్తనమును వ్యవసాయదారుడు నీటిలో నానవేసినట్లు, పాలసముద్రములోనుండును - - - శేషుడు భగవానునికి శయ్యయై యుండును. సమస్తమైన జీవప్రకృతి తత్వములు సృష్టికి ముందును, సృష్టికి తర్వాతను గూడ పరమాత్మకు శేషభూతమై యుండుటయే యా శేష శయ్య సిఊచించును. ఈ క్షీరసముద్రములో శయనించిన యీ స్వామి ఆగమ శాస్త్రానుసారముగ వ్యూహతత్వములలో అనిరుద్ధరూపి - ఇదియే అవతారములకు మూలము.

  3. “నిద్రాముద్రాం నిఖిల జగతీ రక్షణే జాగరూకాం”.

(నిద్రపోవుచు జగములను రక్షించుటలో మేలుకొనియే యుండుట)

Transliteration
  1. yōgaḥ vṛtti nirōdharūpaḥ samādhiḥ tadrūpāṃ nidrāṃ pralayakālē sarvamātmani pravilāpya svasthasthitiḥ - iti yāvat -

(yōgamanagā vṛtti nirōdha rūpamaina samādhi - itara viṣayamalunu maṟacuṭa - aṭṭi samādhirūpamaina nidra, paḷayakālamaṃdu anniṃṭilō tanalō layamu cēsukoni svasthasthitilō nuṃḍuṭa).

  1. yōgaḥ svātmani manōlayaḥ, tanmayī nidrā.

(yōgamanagā tana ātmalō manassunu layamu poṃdiṃcuṭa. aṭlu pūrtigā layamu cēyu nidra)

  1. “sī. - - - sarvasvāmiyaina gōviṃduṃḍu - - -

salalita svōpādhika śakti sahituḍai tanarāru nātmīya thāmamaṃdu

phaṇirājamṛdula talpaṃbupai sukhalīla yōganidrārati yunnavēḷa

nakhila jīvulu nijavyāpāraśūnyulai yunnata tējaṃbuluralugonaga

tē. jarugu nayyavasthā viśēṣaṃbulella - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 266)

  1. “sī. - - -

tē. puruṣarūpaṃbu dhariyiṃci paruḍanaṃtu

ḍakhila bhuvanaika vartana yatnamamara

mānitōdāra jalarāśimadhyamunanu

yōganidrāvilāsiyai yoppucuṃḍu

va. adi sakalāvatāraṃbulaku modaliganiyaina śrīmannārāyaṇa dēvuni virājamānaṃbaina divyarūpaṃbu, dāniṃ barama yōgīṃdrulu darśiṃturu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 62,63)

  1. “paramātma sṛjiṃcukālamu vaccinadani tanaṃta tānē yeṟiṃgi nidranuṃḍi mēlkonunu - - - pūvu nikasiṃcu kālamu rāgānē vikasiṃcinaṭlu paramātma kūḍa tanaṃta tānē mēlkonunu - aṃtavaṟaku caitanyamulēni vastuvunaku caitanyamu kaliginadā yannaṭluṃḍunu - - - yōgamanagā rakṣaṇōpāyamu - tananu viḍiyuṃḍalēni cētanulu tananu cērukonuṭaku cēyu dhyānamē yōganidra. aṭlu cēruṭakupāyamu tana śarīramaina prakṛtini kadalcuṭaku siddhapaḍuṭayē mēlkonuṭa.” kāraṇatatvamu cētanā cētanamulu kaliyuṭaku yōgyamaina samayamani kālatatvamu sūciṃpaganē sṛṣṭikupakramiṃcunu. aṭlupakramiṃcaganē “nēnu bahu vidhamulugā kāvalenu” anu saṃkalpamu paramātmaku kalugunu. iṭlu bahu bhavana saṃkalpamē mēlkoni cūcuṭa - “sa aikṣata bahusyāṃ prajāyēya||” (nēnu bahuvidhamulugā - bahu rūpamulatō puṭṭudunu ani saṃkalpiṃcunu). (cūḍumu - “sṛṣṭikramamu”; “prakṛti”).

    1. (yōganidra) hari māyādēvikiṭlaniye - ninnu mānavulu durga bharga - - - yanu padunālugu nāmaṃbula goniyāḍudurayyaisthānaṃbulaṃdani pommanina - - - mahāprasādaṃbani yayyōganidra yiyyaśāniye.
  2. yōgamanagā jīvulaku prakṛtitō saṃbaṃdhamu kalugacēyuṭa. adiyē sṛṣṭi, dānikai cēyu saṃkalpamē yōganidra - kāraṇa tatvamulō jīvaprakṛti tatvamulu layamai vēṟugā tīsi cūpuṭaku vīlukānivai yuṃḍunu - ā kāraṇatatvamu sṛṣṭikimuṃdu vittanamunu vyavasāyadāruḍu nīṭilō nānavēsinaṭlu, pālasamudramulōnuṃḍunu - - - śēṣuḍu bhagavānuniki śayyayai yuṃḍunu. samastamaina jīvaprakṛti tatvamulu sṛṣṭiki muṃdunu, sṛṣṭiki tarvātanu gūḍa paramātmaku śēṣabhūtamai yuṃḍuṭayē yā śēṣa śayya siūciṃcunu. ī kṣīrasamudramulō śayaniṃcina yī svāmi āgama śāstrānusāramuga vyūhatatvamulalō aniruddharūpi - idiyē avatāramulaku mūlamu.

  3. “nidrāmudrāṃ nikhila jagatī rakṣaṇē jāgarūkāṃ”.

(nidrapōvucu jagamulanu rakṣiṃcuṭalō mēlukoniyē yuṃḍuṭa)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.