- “పరమాణు పరమమహత్వాంతో (అ)స్య వశీకారః (పతంజలి యోగసూత్రములు - 1 - 40)
(పరమాణువు మొదలు మహతత్వమువరకు గలవన్నియు యోగి వశమందుండును - అదియే అతని
యోగఫలము).
- వ. భగవంతుడగు వాసుదేవునియందు బ్రయుక్తంబగు భక్తియోగంబు బ్రహ్మసాక్షాత్కార సాధనంబులగు
వైరాగ్య జ్ఞానంబులం జేయు. అట్టి భగవద్భక్తియుక్తంబయిన చిత్తంబింద్రియల వృత్తులచే సమంబులగు
నర్థంబులందు వైషమ్యంబును, బ్రియా ప్రియంబులును లేక, నిస్సంగంబు, సమదర్శనంబు హేయోపాదేయ
విరహితంబునై యారూఢంబైన యాత్మపదంబు నాత్మచే జూచుచుండు, జ్ఞాన పురుషుండును బరబ్రహ్మంబును
బరమాత్ముండును, నీశ్వరుండును నగు పరమపురుషుండేక రూపంబు గలిగియుండియు దృశ్యద్రష్టృ
కరణంబులచేతం బృథిగ్భావంబు బొందుచుండు. ఇదియ యోగికి సమగ్రంబగు యోగంబునం జేసి ప్రాప్యంబగు
ఫలంబు గావున విముఖంబులగు నింద్రియంబులచేత జ్ఞానరూపంబును హేయగుణరహి తంబునునగు బ్రహ్మంబు
మనో విభ్రాంతిం జేసి శబ్దాది ధర్మంబగు నర్థరూపంబునం దోచు. అది యెట్టులర్థాకారంబునం దోచునని
యడిగితివేని నహంకారంబు గుణరూపంబునం జేసి త్రివిధంబును, భూతరూపంబునం బంచవిధంబును
నింద్రియరూపంబున నేకాదశవిధంబును నైయుండు. జీవరూపుండగు విరాట్పురుషుండు జీవ విగ్రహంబైన
యండంబగు జగంబునం దోచుచుండు - దీని శ్రద్ధాయుక్తంబయిన భక్తిచేత యోగాభ్యాసంబునం జేసి
సమాహితమనస్కుండై నిస్సంగత్వంబున విరక్తుండైనవాడు పొడగనుచుండు“.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32 - 1022)
Transliteration
- “paramāṇu paramamahatvāṃtō (a)sya vaśīkāraḥ (pataṃjali yōgasūtramulu
- 1 - 40)
(paramāṇuvu modalu mahatatvamuvaraku galavanniyu yōgi vaśamaṃduṃḍunu
- adiyē atani yōgaphalamu).
- va. bhagavaṃtuḍagu vāsudēvuniyaṃdu brayuktaṃbagu bhaktiyōgaṃbu
brahmasākṣātkāra sādhanaṃbulagu vairāgya jñānaṃbulaṃ jēyu. aṭṭi
bhagavadbhaktiyuktaṃbayina cittaṃbiṃdriyala vṛttulacē samaṃbulagu
narthaṃbulaṃdu vaiṣamyaṃbunu, briyā priyaṃbulunu lēka, nissaṃgaṃbu,
samadarśanaṃbu hēyōpādēya virahitaṃbunai yārūḍhaṃbaina yātmapadaṃbu
nātmacē jūcucuṃḍu, jñāna puruṣuṃḍunu barabrahmaṃbunu baramātmuṃḍunu,
nīśvaruṃḍunu nagu paramapuruṣuṃḍēka rūpaṃbu galigiyuṃḍiyu dṛśyadraṣṭṛ
karaṇaṃbulacētaṃ bṛthigbhāvaṃbu boṃducuṃḍu. idiya yōgiki samagraṃbagu
yōgaṃbunaṃ jēsi prāpyaṃbagu phalaṃbu gāvuna vimukhaṃbulagu
niṃdriyaṃbulacēta jñānarūpaṃbunu hēyaguṇarahi taṃbununagu brahmaṃbu manō
vibhrāṃtiṃ jēsi śabdādi dharmaṃbagu nartharūpaṃbunaṃ dōcu. adi
yeṭṭularthākāraṃbunaṃ dōcunani yaḍigitivēni nahaṃkāraṃbu guṇarūpaṃbunaṃ
jēsi trividhaṃbunu, bhūtarūpaṃbunaṃ baṃcavidhaṃbunu niṃdriyarūpaṃbuna
nēkādaśavidhaṃbunu naiyuṃḍu. jīvarūpuṃḍagu virāṭpuruṣuṃḍu jīva
vigrahaṃbaina yaṃḍaṃbagu jagaṃbunaṃ dōcucuṃḍu - dīni śraddhāyuktaṃbayina
bhakticēta yōgābhyāsaṃbunaṃ jēsi samāhitamanaskuṃḍai nissaṃgatvaṃbuna
viraktuṃḍainavāḍu poḍaganucuṃḍu”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32 - 1022)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.