← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగారంభము yōgāraṃbhamu

Original — తెలుగు

"యమ నియమ యుతః పురుషస్సర్వసంగ వివర్జితం, కృతవిద్యః సత్య ధర్మతః, జితక్రోధో, గురు శుశ్రూషా నిరతః, పితృ మాతృ విధేయః, స్సాశ్రమోక్త సదాచార విద్వచ్ఛిక్షితః, ఫలమూలోదకాన్వితం తపోవనం ప్రాప్య రమ్యదేశే బ్రహ్మఘోష సమన్వితే స్వధర్మ నిరత బ్రహ్మవిత్ సమావృతే, ఫలమూల పష్స వారిభిస్సు సంపూర్ణే దేవాయతనే నదీతీరే గ్రామే నగరేవాపి సుశోభనమఠం నాత్యుచ్చా నీచాయత మల్పద్వారం, గోమయాది లిప్తం, సర్వరక్షా సమన్వితం కృత్వా, తత్ర వేదాంత శ్రవణం కుర్వన్ యోగం సమారభేత్" (శాండిల్యోపనిషత్)

(యమ నియమములు కలిగినవాడును, అన్నివిధములైన సంగమును వదలివేసినవాడు, విద్యనభ్యసించినవాడు, సత్యము ధర్మమునందు రతికలవాడు, క్రోధమును జయించినవాడు, గురువుకు శుశ్రూష చేయుటయందు నిరతుడై యున్నవాడు, తల్లిదండ్రులకు విధేయుడైయుండువాడు, తన ఆశ్రమమునకు చెప్పబడిన విద్వచ్ఛిక్ష పొందినవాడును, ఫలములు, దుంపలు, నీరు గల తపోవనమును పొంది, శుభ్రమైన ప్రదేశమందు, వేదఘోషగల, తన ధర్మమందే నిరతులగు బ్రహ్మవేత్తలతో కూడియుండి, ఫలములు, దుంపలు, పుష్పములు, జలము పుష్కలముగానుండు దేవాయతనమందు, నదీ తీరమందు, గ్రామమందు, నగరమందు కాని మంచియోగమఠమును - మిక్కిలి యెత్తుగానుండునదికాక, మిక్కిలి లోతిగా

నున్నదికాక, చిన్నద్వారము కలిగి, ఆవుపేడతో అలికి, అన్నివిధముల రక్షణ కలిగియున్నదానిని చేసుకొని, అచ్చట వేదాంతశ్రవణము చేయుచు యోగమునారంభించవలెను).

Transliteration

"yama niyama yutaḥ puruṣassarvasaṃga vivarjitaṃ, kṛtavidyaḥ satya dharmataḥ, jitakrōdhō, guru śuśrūṣā nirataḥ, pitṛ mātṛ vidhēyaḥ, ssāśramōkta sadācāra vidvacchikṣitaḥ, phalamūlōdakānvitaṃ tapōvanaṃ prāpya ramyadēśē brahmaghōṣa samanvitē svadharma nirata brahmavit samāvṛtē, phalamūla paṣsa vāribhissu saṃpūrṇē dēvāyatanē nadītīrē grāmē nagarēvāpi suśōbhanamaṭhaṃ nātyuccā nīcāyata malpadvāraṃ, gōmayādi liptaṃ, sarvarakṣā samanvitaṃ kṛtvā, tatra vēdāṃta śravaṇaṃ kurvan yōgaṃ samārabhēt" (śāṃḍilyōpaniṣat)

(yama niyamamulu kaliginavāḍunu, annividhamulaina saṃgamunu vadalivēsinavāḍu, vidyanabhyasiṃcinavāḍu, satyamu dharmamunaṃdu ratikalavāḍu, krōdhamunu jayiṃcinavāḍu, guruvuku śuśrūṣa cēyuṭayaṃdu niratuḍai yunnavāḍu, tallidaṃḍrulaku vidhēyuḍaiyuṃḍuvāḍu, tana āśramamunaku ceppabaḍina vidvacchikṣa poṃdinavāḍunu, phalamulu, duṃpalu, nīru gala tapōvanamunu poṃdi, śubhramaina pradēśamaṃdu, vēdaghōṣagala, tana dharmamaṃdē niratulagu brahmavēttalatō kūḍiyuṃḍi, phalamulu, duṃpalu, puṣpamulu, jalamu puṣkalamugānuṃḍu dēvāyatanamaṃdu, nadī tīramaṃdu, grāmamaṃdu, nagaramaṃdu kāni maṃciyōgamaṭhamunu - mikkili yettugānuṃḍunadikāka, mikkili lōtigā

nunnadikāka, cinnadvāramu kaligi, āvupēḍatō aliki, annividhamula rakṣaṇa kaligiyunnadānini cēsukoni, accaṭa vēdāṃtaśravaṇamu cēyucu yōgamunāraṃbhiṃcavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.