ప్రాప్తయోగః (యోగమును పొందినవాడు)
"యధాహి నేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్జతే |
సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్త దోచ్యతే ||". (శ్రీమద్భగవద్గీత - 6 - 4)
"యస్మిన్శ్చిత్త సమాధానకాలే కర్మసు తత్ఫలే |
తన్మిధ్యాత్మధియా స్వాత్మా కర్తృ భోక్తృ ధియా తథా |
అహం కర్తాస్య భోగ్యం తత్ఫలం మేచేతి రంజనాం |
న కరోతి పరిత్యక్త సర్వకామతయా మునిః |
ఇహముత్ర ఫలకామానాం హేతూ నాధ్యాసి కాస్యతః |
అంత్యక్తుమస్యాసౌ ప్రాప్తయోగస్తదోచ్యతే ||". (గీతాభావప్రకాశము - 6 - 20 to 22)
(కర్మలు వాటివలన కలుగు ఫలములు మిధ్యలు అను బుద్ధి కలుగుటచే ఈ కర్మలకు నేనే కర్తను, ఇది నేను భోగించవలసినది - అనుభవించవలసినది - దీనివలన కలుగు ఫలము నాది అను కర్తృత్వ, భోక్తృత్వములను వదలి, సమస్తమైన కోరికలను వదలివేసి - ఈ లోకమునందు, పరలోకమునందు కలిగెడి సుఖము అధ్యాసికములు అని వాటిని వదలివేయు శీలముగల ముని యోగారూఢుడు, లేక ప్రాప్తయోగి, లేక యోగాభ్యాసములో ఉత్తీర్ణుడైనవాడు అని చెప్పబడును).
(ఎప్పుడు కర్మలయందాసక్తి కలిగియుండదో అప్పుడు ఇంద్రియజయముకలవానికి నిరాయాసముగా మనస్సు సమాధానము కలిగియుండునో అప్పుడు యోగారూఢుడని చెప్పబడును).
(ఇంద్రియార్థములైన నిత్యకర్మలు, నైమిత్తికకర్మలు, కామ్యకర్మలు, ప్రతిషిద్ధకర్మలు ప్రయోజనములేనివి అను బుద్ధితో వాటియందు మునిగియుండు ఆశ వదలుకొనునో, సమాధాన మనస్సు కలిగియుండునో అప్పుడు యోగారూఢుడని చెప్పబడును).
(జీవబ్రహ్మలకు భేదములేదను జ్ఞానము కలవాడు)
యోగారూఢస్య తస్యైవ శమం కారణముచ్యతే ||". (శ్రీమద్భగవద్గీత - 6 - 3)
"తత్కిం కర్మప్రశస్తత్వా త్సదానుష్టేయ మామృతేః |
మైవం ధీశుద్ధి వైరాగ్య మారు రుక్షోర్హి కర్మతత్ |
శుద్ధిం ప్రాప్తస్య తస్యైవ తత్త్యాగో జ్ఞాన సాధనం ||". (గీతాభావప్రకాశము - 6 - 17, 18)
(కర్మచేయుట ప్రశస్తమని చనిపోవునంతవఱకు చేయనక్కరలేదు - ఆరురుక్షునకు, అనగా యోగాభ్యాసము చేయుచు యోగములో ఆరోహణము చేయువాడు కర్మ - నిత్యకర్మ, విహితకర్మ, నిష్కామకర్మ చేయవలసినదే. అది అతనికి యోగములో సాధనమగును, కాని యోగాభ్యాసము పూర్తి అయిన యోగారూఢునకు కర్మ అవసరము మరిలేదు - సర్వకర్మ సన్యాసరూపమైన శమము పైమెట్టు అయిన భగవత్ జ్ఞానమును సంపాదించుటకు సాధనమగును)
యోగాభ్యాసమును పరిపూర్తి గావించినవాడు - యోగములో ఆఖరిమెట్టు ఎక్కినవాడు.
"శివ జీవైక్య సమాధియందు విలసచ్చిన్మాత్ర తత్వంబుతో |
నవలీలంగని పూర్ణుడై పిదప మాయా సంసృతిం జెందినన్ |
దవులన్నేర్చునే యోగి, పాలు పెరుగై ద్రచ్చంగ వేఱైన యా |
నవనీతంబిక చల్లలో కలియునే నానా ప్రకారంబులన్ ||".
prāptayōgaḥ (yōgamunu poṃdinavāḍu)
"yadhāhi nēṃdriyārthēṣu na karma svanuṣajjatē |
sarvasaṃkalpa sanyāsī yōgārūḍhasta dōcyatē ||". (śrīmadbhagavadgīta - 6 - 4)
"yasminścitta samādhānakālē karmasu tatphalē |
tanmidhyātmadhiyā svātmā kartṛ bhōktṛ dhiyā tathā |
ahaṃ kartāsya bhōgyaṃ tatphalaṃ mēcēti raṃjanāṃ |
na karōti parityakta sarvakāmatayā muniḥ |
ihamutra phalakāmānāṃ hētū nādhyāsi kāsyataḥ |
aṃtyaktumasyāsau prāptayōgastadōcyatē ||". (gītābhāvaprakāśamu - 6 - 20 to 22)
(karmalu vāṭivalana kalugu phalamulu midhyalu anu buddhi kaluguṭacē ī karmalaku nēnē kartanu, idi nēnu bhōgiṃcavalasinadi - anubhaviṃcavalasinadi - dīnivalana kalugu phalamu nādi anu kartṛtva, bhōktṛtvamulanu vadali, samastamaina kōrikalanu vadalivēsi - ī lōkamunaṃdu, paralōkamunaṃdu kaligeḍi sukhamu adhyāsikamulu ani vāṭini vadalivēyu śīlamugala muni yōgārūḍhuḍu, lēka prāptayōgi, lēka yōgābhyāsamulō uttīrṇuḍainavāḍu ani ceppabaḍunu).
(eppuḍu karmalayaṃdāsakti kaligiyuṃḍadō appuḍu iṃdriyajayamukalavāniki nirāyāsamugā manassu samādhānamu kaligiyuṃḍunō appuḍu yōgārūḍhuḍani ceppabaḍunu).
(iṃdriyārthamulaina nityakarmalu, naimittikakarmalu, kāmyakarmalu, pratiṣiddhakarmalu prayōjanamulēnivi anu buddhitō vāṭiyaṃdu munigiyuṃḍu āśa vadalukonunō, samādhāna manassu kaligiyuṃḍunō appuḍu yōgārūḍhuḍani ceppabaḍunu).
(jīvabrahmalaku bhēdamulēdanu jñānamu kalavāḍu)
yōgārūḍhasya tasyaiva śamaṃ kāraṇamucyatē ||". (śrīmadbhagavadgīta - 6 - 3)
"tatkiṃ karmapraśastatvā tsadānuṣṭēya māmṛtēḥ |
maivaṃ dhīśuddhi vairāgya māru rukṣōrhi karmatat |
śuddhiṃ prāptasya tasyaiva tattyāgō jñāna sādhanaṃ ||". (gītābhāvaprakāśamu - 6 - 17, 18)
(karmacēyuṭa praśastamani canipōvunaṃtavaṟaku cēyanakkaralēdu - ārurukṣunaku, anagā yōgābhyāsamu cēyucu yōgamulō ārōhaṇamu cēyuvāḍu karma - nityakarma, vihitakarma, niṣkāmakarma cēyavalasinadē. adi ataniki yōgamulō sādhanamagunu, kāni yōgābhyāsamu pūrti ayina yōgārūḍhunaku karma avasaramu marilēdu - sarvakarma sanyāsarūpamaina śamamu paimeṭṭu ayina bhagavat jñānamunu saṃpādiṃcuṭaku sādhanamagunu)
yōgābhyāsamunu paripūrti gāviṃcinavāḍu - yōgamulō ākharimeṭṭu ekkinavāḍu.
"śiva jīvaikya samādhiyaṃdu vilasaccinmātra tatvaṃbutō |
navalīlaṃgani pūrṇuḍai pidapa māyā saṃsṛtiṃ jeṃdinan |
davulannērcunē yōgi, pālu perugai draccaṃga vēṟaina yā |
navanītaṃbika callalō kaliyunē nānā prakāraṃbulan ||".
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.