పతంజలి చేసినది - యోగసూత్రములు - “ఇది నాలుగు పాదములు గలది - ప్రథమపాదమందు చిత్తనివృత్తి నిరోధరూపమయిన సమాధి, మఱియు తత్సాధనములయిన అభ్యాసవైరాగ్యాదులు చెప్పియున్నాడు. విక్షిప్తచిత్తునకు యమ నియమాది సమాధిసాధనములైన అష్టాంగములు ద్వితీయపాదమందు చెప్పియున్నాడు. తృతీయపాదమందు యోగము యొక్క విభూతి, చతుర్ధపాదమందు యోగఫలమైన మోక్షము చెప్పియున్నాడు. ఈ రీతిగా యోగశాస్త్రము జ్ఞానసాధన నిధిధ్యాసన సంపాదనద్వారమున మోక్షమునకు హేతువుగా నున్నది”.
‘యోగము’ అను పదము ‘యుజ్’ అను ధాతువునుండి కలిగినది. ‘యుజ్’ అనగా కలుపుట - జీవాత్మ పరమాత్మల కలుపునదగుటవలన ఈ శాస్త్రమునకు యోగమను పేరు కలిగినది. ఈ శాస్త్రమువలన మోక్షమనగా జీవేశ్వరుల అనుసంధాన మని స్పష్టపడినది - ఇది నాలుగు పాదములుగలది - మొదటిపాదములో సమాధి గుఱించి చెప్పబడినది. దానిని పొందగలుగు విధానము రెండవపాదములో చెప్పబడినది. మూడవ పాదములోను, నాలుగవపాదములోను అణిమాద్యష్ట సిద్ధులు లభించుట కైవల్యప్రాప్తి సాధనము చెప్పబడినది.
pataṃjali cēsinadi - yōgasūtramulu - “idi nālugu pādamulu galadi - prathamapādamaṃdu cittanivṛtti nirōdharūpamayina samādhi, maṟiyu tatsādhanamulayina abhyāsavairāgyādulu ceppiyunnāḍu. vikṣiptacittunaku yama niyamādi samādhisādhanamulaina aṣṭāṃgamulu dvitīyapādamaṃdu ceppiyunnāḍu. tṛtīyapādamaṃdu yōgamu yokka vibhūti, caturdhapādamaṃdu yōgaphalamaina mōkṣamu ceppiyunnāḍu. ī rītigā yōgaśāstramu jñānasādhana nidhidhyāsana saṃpādanadvāramuna mōkṣamunaku hētuvugā nunnadi”.
‘yōgamu’ anu padamu ‘yuj’ anu dhātuvunuṃḍi kaliginadi. ‘yuj’ anagā kalupuṭa - jīvātma paramātmala kalupunadaguṭavalana ī śāstramunaku yōgamanu pēru kaliginadi. ī śāstramuvalana mōkṣamanagā jīvēśvarula anusaṃdhāna mani spaṣṭapaḍinadi - idi nālugu pādamulugaladi - modaṭipādamulō samādhi guṟiṃci ceppabaḍinadi. dānini poṃdagalugu vidhānamu reṃḍavapādamulō ceppabaḍinadi. mūḍava pādamulōnu, nālugavapādamulōnu aṇimādyaṣṭa siddhulu labhiṃcuṭa kaivalyaprāpti sādhanamu ceppabaḍinadi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.