← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగతల్పం yōgatalpaṃ

Original — తెలుగు
  1. యోగ ఏవ తల్పం, శయ్యా.

(యోగమే శయ్య, పాన్పు).

  1. యోగనిద్రా తల్పస్థానాపన్నా శేష పర్యంకం -

(యోగనిద్రకు శయ్యగా ఉపరించిన శేషపర్యంకం) (యోగనిద్ర).

  1. “అమ్మహాత్ముండు లీలార్థంబై జగత్సర్జనంబు సేయుతలంపున బ్రహ్మాండంబు వినిర్భేధించి, తనకు సుఖశయనంబపేక్షించి మొదల జలతత్వంబు సృజియించె, స్వతః పరిశుద్ధుండు గావున సృష్టంబై యేకార్ణ వాకారంబైన జలరాశియందు శయనంబు సేయుటంజేసి - - - నారాయణ శబ్దవాచ్యుండు - - - అట్టి ప్రభావంబుగల సర్వేశ్వరుండు దానేకమయ్యు ననేకంబుగా దలంచి యోగతల్పంబునం బ్రబద్ధుండై యుండి, యటమీద స్వసంకల్పబునం జేసి హిరణ్మయంబైన తన విగ్రహము నధి దైవతంబును, నధ్యాత్మకంబును, నధిభూతంబును నను సంజ్ఞాయుతంబై త్రివిధంబుగా సృజియించె. అట్టి విరాడ్విగ్రహంబందు - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - )
Transliteration
  1. yōga ēva talpaṃ, śayyā.

(yōgamē śayya, pānpu).

  1. yōganidrā talpasthānāpannā śēṣa paryaṃkaṃ -

(yōganidraku śayyagā upariṃcina śēṣaparyaṃkaṃ) (yōganidra).

  1. “ammahātmuṃḍu līlārthaṃbai jagatsarjanaṃbu sēyutalaṃpuna brahmāṃḍaṃbu vinirbhēdhiṃci, tanaku sukhaśayanaṃbapēkṣiṃci modala jalatatvaṃbu sṛjiyiṃce, svataḥ pariśuddhuṃḍu gāvuna sṛṣṭaṃbai yēkārṇa vākāraṃbaina jalarāśiyaṃdu śayanaṃbu sēyuṭaṃjēsi - - - nārāyaṇa śabdavācyuṃḍu - - - aṭṭi prabhāvaṃbugala sarvēśvaruṃḍu dānēkamayyu nanēkaṃbugā dalaṃci yōgatalpaṃbunaṃ brabaddhuṃḍai yuṃḍi, yaṭamīda svasaṃkalpabunaṃ jēsi hiraṇmayaṃbaina tana vigrahamu nadhi daivataṃbunu, nadhyātmakaṃbunu, nadhibhūtaṃbunu nanu saṃjñāyutaṃbai trividhaṃbugā sṛjiyiṃce. aṭṭi virāḍvigrahaṃbaṃdu - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - )
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.