మాయావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే |
శ్రద్దయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః. (శ్రీమద్భగవద్గీత - 12 - 2)
“మత్కర్మకృన్మత్పరమ ఇత్యత్తోక్త ప్రకారతః |
సావధానతయా నిత్యం యే ప్రవృత్తా మహాత్సహి |
అనన్యశరణాః నంతస్త్వత్కర్మాదౌ తయేరితా |
త్వామేవం విశ్వరూపం శ్రీభగవంతం గుణాలయం |
నైరంతర్యేణ సాకారం చింతయంతి విచక్షణాః |
యే చ సన్యస్త కర్మాణస్త్యక్త సర్వైషణాః బుధాః |
పరబ్రహ్మో క్షిరం శుద్ధం నిర్గుణం నిష్కలం శివం |
సర్వోపాధి వినుర్ముక్తం నిరాకారం నిరామయం |
త్వాం పర్యుపాసతే నిత్యమఖండాత్మానమ వ్యయం |
కే విశిష్టతరాస్తేషాముభయేషాం హి యోగినాం |
మయాముముక్షుణా స్థేయం కేషా మాశ్రిత్య సన్మతం |
వాసుదేవే భగవతి, మయీద్యే పరమేశ్వరే |
సగుణే బ్రహ్మణి స్వచ్ఛమనస్య శరణం మనః |
ప్రవేశ్య మన్మయం కృత్వా యేమాం యోగేశ్వరేశ్వరం |
సర్వజ్ఞం సర్వకల్యాణ నిధిం సాకారమద్భుతం |
సాత్విక్యా శ్రద్ధయోపేతాః సదోద్యుక్తా నిరంతరం |
చింతయంతి త ఏతే మే అభిమతా యోగవిత్తమాః |
సుశక్నో యోగ ఏ తేషాం మత ఇత్యాశయో హరేః ||“.
(భగవత్కర్మచేయువాడు, భగవత్పరుడు, భగవద్భక్తుడు అయినవాడు భగవంతుని పొందును అని శ్రీకృష్ణభగవానుడు చెప్పినపుడున్నూ, నిరాకార పరబ్రహ్మ గుఱించి చెప్పెనా, లేక సాకార బ్రహ్మ (సగుణబ్రహ్మ) గుఱించి చెప్పెనా అను సంశయము అర్జునునకు కలిగినది. అనేక జన్మల తర్వాత భగవంతుని విశ్వరూపము జ్ఞాని అయినవాడు చూడగలడు అని చెప్పినపుడుకూడా అది నిర్గుణరూపమా సగుణరూపమా యని కూడ సందేహము కలిగెను - ఇట్లు అధికారి భేదమువలన సగుణ బ్రహ్మధ్యానము, నిర్గుణ బ్రహ్మధ్యానము భగవంతుడు చెప్పెనుకదా ఈ రెండింటిలోను ఏది శ్రేష్టమైనది, దేనిని ఆచరించవలెను అని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించెను - కొందఱు ఎల్లపుడు ఉత్సాహముగలవారై భగవంతుడు తప్ప ఇతర శరణము లేదని నమ్మినవారై భగవంతుని కర్మయందే నిమగ్నులై సగుణుడు సాకారుడు విశ్వరూపుడు అయిన భగవంతుని ధ్యానించుదురు - మరికొందఱు సమస్త కర్మలని వదలి, సమస్త కోరికలను వదలి, అక్షరుడు, శుద్ధుడు, నిర్గుణుడు, నిరాకారుడు, నిష్కలుడు, నిరామయుడు, అఖండాత్మ, అవ్యయుడు అయిన పరబ్రహ్మనుపాసించెదరు. ఈ ఇద్దరిలో (సగుణపరబ్రహ్మ, నిర్గుణపరబ్రహ్మలలో) ఉపాసించుటకు ఎవరు శ్రేష్టులు అని అర్జునుడడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణభగవానుడు ఈ క్రిందవిధముగా ఉత్తరమునిచ్చెను - అతని సందేహము తీర్చెను - వాసుదేవుడు పరమేశ్వరుడు, అనన్య శరణ్యుడు, సగుణబ్రహ్మ అయిన భగవంతునియందు మనస్సును ప్రవేశింపచేసి, మనస్సును భగవన్మయముగా చేసుకొని (అనగా, భగవంతునితప్ప ఇంకొక వస్తువును మనస్సులో లేకుండ చేసుకొని), యోగేశ్వరేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వకల్యాణనిధి అయిన సాకారబ్రహ్మను - సగుణబ్రహ్మను - సాత్వికశ్రద్ధతో చింతించువారు - ధ్యానము చేయువారు - శ్రేష్టులు - వారికి యోగము చాలా సులభము - వారే యోగవిత్తములు - యోగము తెలిసినవారిలో ఉత్తములు).
māyāvēśya manō yē māṃ nityayuktā upāsatē |
śraddayā parayōpētāstē mē yuktatamā matāḥ. (śrīmadbhagavadgīta - 12 - 2)
“matkarmakṛnmatparama ityattōkta prakārataḥ |
sāvadhānatayā nityaṃ yē pravṛttā mahātsahi |
ananyaśaraṇāḥ naṃtastvatkarmādau tayēritā |
tvāmēvaṃ viśvarūpaṃ śrībhagavaṃtaṃ guṇālayaṃ |
nairaṃtaryēṇa sākāraṃ ciṃtayaṃti vicakṣaṇāḥ |
yē ca sanyasta karmāṇastyakta sarvaiṣaṇāḥ budhāḥ |
parabrahmō kṣiraṃ śuddhaṃ nirguṇaṃ niṣkalaṃ śivaṃ |
sarvōpādhi vinurmuktaṃ nirākāraṃ nirāmayaṃ |
tvāṃ paryupāsatē nityamakhaṃḍātmānama vyayaṃ |
kē viśiṣṭatarāstēṣāmubhayēṣāṃ hi yōgināṃ |
mayāmumukṣuṇā sthēyaṃ kēṣā māśritya sanmataṃ |
vāsudēvē bhagavati, mayīdyē paramēśvarē |
saguṇē brahmaṇi svacchamanasya śaraṇaṃ manaḥ |
pravēśya manmayaṃ kṛtvā yēmāṃ yōgēśvarēśvaraṃ |
sarvajñaṃ sarvakalyāṇa nidhiṃ sākāramadbhutaṃ |
sātvikyā śraddhayōpētāḥ sadōdyuktā niraṃtaraṃ |
ciṃtayaṃti ta ētē mē abhimatā yōgavittamāḥ |
suśaknō yōga ē tēṣāṃ mata ityāśayō harēḥ ||“.
(bhagavatkarmacēyuvāḍu, bhagavatparuḍu, bhagavadbhaktuḍu ayinavāḍu bhagavaṃtuni poṃdunu ani śrīkṛṣṇabhagavānuḍu ceppinapuḍunnū, nirākāra parabrahma guṟiṃci ceppenā, lēka sākāra brahma (saguṇabrahma) guṟiṃci ceppenā anu saṃśayamu arjununaku kaliginadi. anēka janmala tarvāta bhagavaṃtuni viśvarūpamu jñāni ayinavāḍu cūḍagalaḍu ani ceppinapuḍukūḍā adi nirguṇarūpamā saguṇarūpamā yani kūḍa saṃdēhamu kaligenu - iṭlu adhikāri bhēdamuvalana saguṇa brahmadhyānamu, nirguṇa brahmadhyānamu bhagavaṃtuḍu ceppenukadā ī reṃḍiṃṭilōnu ēdi śrēṣṭamainadi, dēnini ācariṃcavalenu ani arjunuḍu śrīkṛṣṇuni praśniṃcenu - koṃdaṟu ellapuḍu utsāhamugalavārai bhagavaṃtuḍu tappa itara śaraṇamu lēdani namminavārai bhagavaṃtuni karmayaṃdē nimagnulai saguṇuḍu sākāruḍu viśvarūpuḍu ayina bhagavaṃtuni dhyāniṃcuduru - marikoṃdaṟu samasta karmalani vadali, samasta kōrikalanu vadali, akṣaruḍu, śuddhuḍu, nirguṇuḍu, nirākāruḍu, niṣkaluḍu, nirāmayuḍu, akhaṃḍātma, avyayuḍu ayina parabrahmanupāsiṃcedaru. ī iddarilō (saguṇaparabrahma, nirguṇaparabrahmalalō) upāsiṃcuṭaku evaru śrēṣṭulu ani arjunuḍaḍigina praśnaku śrīkṛṣṇabhagavānuḍu ī kriṃdavidhamugā uttaramuniccenu - atani saṃdēhamu tīrcenu - vāsudēvuḍu paramēśvaruḍu, ananya śaraṇyuḍu, saguṇabrahma ayina bhagavaṃtuniyaṃdu manassunu pravēśiṃpacēsi, manassunu bhagavanmayamugā cēsukoni (anagā, bhagavaṃtunitappa iṃkoka vastuvunu manassulō lēkuṃḍa cēsukoni), yōgēśvarēśvaruḍu, sarvajñuḍu, sarvakalyāṇanidhi ayina sākārabrahmanu - saguṇabrahmanu - sātvikaśraddhatō ciṃtiṃcuvāru - dhyānamu cēyuvāru - śrēṣṭulu - vāriki yōgamu cālā sulabhamu - vārē yōgavittamulu - yōgamu telisinavārilō uttamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.