← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగీశ్వరః yōgīśvaraḥ

Original — తెలుగు
  1. "యోగినః, యోగాః తేషాం ఈశ్వరః"- (శ్రీశంకరః)

(యాగములు, యోగులు - ఈ ఇద్దఱికి ఈశ్వరుడైనవాడు).

  1. సర్వ యోగానా మీశ్వరః, తత్ప్రభావత్వాత్ సర్వ యోగ బీజస్య ఈశ్వరః | కృష్ణః.

(సమస్త యోగములకు ఈశ్వరుడైనవాడు - ప్రభువైనవాడు యోగేశ్వరుడు - భగవంతునినుండి పుట్టుటచేత సమస్త యోగముల బీజము - మూలము - యోగేశ్వరుడు).

  1. "యోగో జ్ఞానాది కల్యాణ గుణయోగః, తద్వ్యతిరిక్తస్య కస్యాప్యసంభావితానాం జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజసాం నిధిః".

(యోగమనగా జ్ఞానము మొదలగు కల్యాణగుణములు కలిగియుండుట - భగవంతునికి తప్పించి ఇంకెవరికి లేనటువంటి జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజస్సులకు నిధి అయినటువంటివాడు - శ్రీకృష్ణుడు). (చూడుము - "భగవంతుడు").

  1. సర్వేషాం అణిమాది సిద్ధశాలినాం యోగానాం యోగినాం ఈశ్వరః.

(అణిమాదిసిద్ధులతో కూడిన సమస్త యోగములకు, యోగులకు ఈశ్వరుడు - ప్రభువు)

  1. యోగినాం ఐశ్వర రూప దర్శనే సమర్థానాం ఈశ్వరః, అచింత్య శక్తిః -

(ఈశ్వరరూపమును సర్వ ప్రపంచమునకు ప్రభువై యుండువాని రూపమును దర్శింపగల సమర్థత గల యోగులకు ఈశ్వరుడైనవాడు - ఊహించలేనంత శక్తి గలవాడు).

  1. కృత్స్నస్య ఉచ్ఛాన చ రూపేణ అవస్థితస్య చేతనస్య అచేతనస్య చ వస్తునః యేయే స్వభావయోగాః, తేషాం సర్వేషాం యోగానాం ఈశ్వరః, స్వసంక్లపాయత్త స్వేతర సమస్త వస్తు స్వరూప స్థితి ప్రవృత్తి భేదః కృష్ణః, వాసుదేవ సూనుః.

(ఉచ్ఛమైనది, నీచమైనది అని తేడాగల చేతనములు, అచేతనములు అయిన సమస్త వస్తువులకు వాటివాటికి స్వభావమువలన కలుగు యోగములన్నింటికి ఈశ్వరుడైనవాడు - తనచేతనే సృష్టింపబడిన సమస్త వస్తువుల ప్రవృత్తిలో - స్థితి పోషణలో - భేదమును కల్పించువాడు)

  1. యోగాభ్యాసేన సమర్థః.

(యోగాభ్యాసము చేయుటచే సమర్థుడైనవాడు).

  1. అవ్యక్తరూపమైన ప్రకృతినుండి కోటానుకోట్లు వస్తువులను నిర్మించిన శక్తి యోగము - అట్టి యోగమునకు ఈశ్వరుడైనవాడు - ప్రకృతికి ఈశ్వరుడైనవాడు).

  2. "విశ్వకర్మ నిర్మితంభైన ద్వారకానగరంబునకు నిజయోగ ప్రభావంబున మధురాపుర జనులనందఱం జేర్చి - -"

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1618)

Transliteration
  1. "yōginaḥ, yōgāḥ tēṣāṃ īśvaraḥ"- (śrīśaṃkaraḥ)

(yāgamulu, yōgulu - ī iddaṟiki īśvaruḍainavāḍu).

  1. sarva yōgānā mīśvaraḥ, tatprabhāvatvāt sarva yōga bījasya īśvaraḥ | kṛṣṇaḥ.

(samasta yōgamulaku īśvaruḍainavāḍu - prabhuvainavāḍu yōgēśvaruḍu - bhagavaṃtuninuṃḍi puṭṭuṭacēta samasta yōgamula bījamu - mūlamu - yōgēśvaruḍu).

  1. "yōgō jñānādi kalyāṇa guṇayōgaḥ, tadvyatiriktasya kasyāpyasaṃbhāvitānāṃ jñāna balaiśvarya vīrya śakti tējasāṃ nidhiḥ".

(yōgamanagā jñānamu modalagu kalyāṇaguṇamulu kaligiyuṃḍuṭa - bhagavaṃtuniki tappiṃci iṃkevariki lēnaṭuvaṃṭi jñāna balaiśvarya vīrya śakti tējassulaku nidhi ayinaṭuvaṃṭivāḍu - śrīkṛṣṇuḍu). (cūḍumu - "bhagavaṃtuḍu").

  1. sarvēṣāṃ aṇimādi siddhaśālināṃ yōgānāṃ yōgināṃ īśvaraḥ.

(aṇimādisiddhulatō kūḍina samasta yōgamulaku, yōgulaku īśvaruḍu - prabhuvu)

  1. yōgināṃ aiśvara rūpa darśanē samarthānāṃ īśvaraḥ, aciṃtya śaktiḥ -

(īśvararūpamunu sarva prapaṃcamunaku prabhuvai yuṃḍuvāni rūpamunu darśiṃpagala samarthata gala yōgulaku īśvaruḍainavāḍu - ūhiṃcalēnaṃta śakti galavāḍu).

  1. kṛtsnasya ucchāna ca rūpēṇa avasthitasya cētanasya acētanasya ca vastunaḥ yēyē svabhāvayōgāḥ, tēṣāṃ sarvēṣāṃ yōgānāṃ īśvaraḥ, svasaṃklapāyatta svētara samasta vastu svarūpa sthiti pravṛtti bhēdaḥ kṛṣṇaḥ, vāsudēva sūnuḥ.

(ucchamainadi, nīcamainadi ani tēḍāgala cētanamulu, acētanamulu ayina samasta vastuvulaku vāṭivāṭiki svabhāvamuvalana kalugu yōgamulanniṃṭiki īśvaruḍainavāḍu - tanacētanē sṛṣṭiṃpabaḍina samasta vastuvula pravṛttilō - sthiti pōṣaṇalō - bhēdamunu kalpiṃcuvāḍu)

  1. yōgābhyāsēna samarthaḥ.

(yōgābhyāsamu cēyuṭacē samarthuḍainavāḍu).

  1. avyaktarūpamaina prakṛtinuṃḍi kōṭānukōṭlu vastuvulanu nirmiṃcina śakti yōgamu - aṭṭi yōgamunaku īśvaruḍainavāḍu - prakṛtiki īśvaruḍainavāḍu).

  2. "viśvakarma nirmitaṃbhaina dvārakānagaraṃbunaku nijayōga prabhāvaṃbuna madhurāpura janulanaṃdaṟaṃ jērci - -"

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1618)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.