← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోనిః yōniḥ

Original — తెలుగు
  1. ఉత్పత్తిస్థానము - సర్వభూతోత్పత్తిస్థానము; గర్భస్థానము, జన్మస్థానము -

  2. జగత్ యస్మాత్ జాతం, సయోనిః, జగత్కారణం; ప్రకృతిః

(జగత్తు పుట్టుక చోటు - ప్రకృతి)

  1. కారణం; అభివ్యక్తస్థానం, మార్గం.

(కార్య వస్తువును పుట్టించునది - సూక్షమమగు వస్తువు - స్థూలరూపములో పైకి కనుపించునట్లు చేయునది - అట్లు చేయు స్థానము - మార్గము)

  1. "మమయోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం |

సంభవః సర్వభూతానాం తతో భవతి భారత |

సర్వ యోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః |

తాసాం బ్రహ్మ మహద్యోని రహం బీజప్రదః పితా ||” (శ్రీమద్భగవద్గీత - 14 - 3,4)

(మహద్బ్రహ్మయనగా ప్రకృతి. దానిని భగవంతుడు యోనిగా ఉపయోగించుకొని దానిహే గర్భమును ధరించునట్లు చేయుచున్నాడు. దానిలోనుండి సమస్త భూతములు ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టుచున్నవి. అట్లు పుట్టిన వస్తువు కార్యము. కార్యవస్తువు ఎందులోనుండి పుట్టినదో అది (దానికి) కారణము (కారణవస్తువు). ఈ కారణవస్తువు కార్యవస్తువునకు యోని (పుట్టుకస్థానము). ఇట్లు ప్రతియోనిలోను (కారణవస్తువులోను) మొదటి యోని అయిన ప్రకృతి అంశ ఉన్నది. అందుచేత ఇట్టి యోనులు అయిన కారణవస్తువులన్నింటికి ప్రకృతి మహద్యోని (మూలకారణము). దానిలోనున్న భగవదంశ దానిలో తన బీజమునుంఛి దానిచే గర్భము ధరించునట్లు చేసి, దానిలోనుండి యింకొక వస్తువును పుట్టునట్లు (ఆవిర్భవించునట్లు) చేయును, కనుక భగవంతుడు అట్లు పుట్టిన కార్యవస్తులన్నింటికీ (భూతములన్నింటికీ) తండ్రి అయినవాడు. ప్రతి వస్తువులోను భగవదంశ ప్రకృతి అంశ కూడ నుండును - భగవదంశ శక్తి రూపములో - చైతన్యము కలిగించి ప్రకృతి అంశచేత మఱియొక వస్తువును కలిగింపచేయును - ఇదియే సృష్టిప్రకారము).

  1. "శాస్త్రయోనిత్వాత్" - (బ్రహ్మసూత్రములు 1 -1 - 3)

(ఋగ్వేదము మొదలగు వేదములు బ్రహ్మనుండి పుట్టినవి. అందుచేత ఆ వేదములకు బ్రహ్మ ‘యోని’ చెప్పబడుచున్నాడు. ఈ కారణమువలన - బ్రహ్మనుండి పుట్టినవి కనుక - వేదములు ప్రమాణగ్రంధములు (authority). వేదములో చెప్పబడిన విషయముగుఱించి వేదమే ప్రమాణము)

Transliteration
  1. utpattisthānamu - sarvabhūtōtpattisthānamu; garbhasthānamu, janmasthānamu -

  2. jagat yasmāt jātaṃ, sayōniḥ, jagatkāraṇaṃ; prakṛtiḥ

(jagattu puṭṭuka cōṭu - prakṛti)

  1. kāraṇaṃ; abhivyaktasthānaṃ, mārgaṃ.

(kārya vastuvunu puṭṭiṃcunadi - sūkṣamamagu vastuvu - sthūlarūpamulō paiki kanupiṃcunaṭlu cēyunadi - aṭlu cēyu sthānamu - mārgamu)

  1. "mamayōnirmahadbrahma tasmin garbhaṃ dadāmyahaṃ |

saṃbhavaḥ sarvabhūtānāṃ tatō bhavati bhārata |

sarva yōniṣu kauṃtēya mūrtayaḥ saṃbhavaṃti yāḥ |

tāsāṃ brahma mahadyōni rahaṃ bījapradaḥ pitā ||” (śrīmadbhagavadgīta - 14 - 3,4)

(mahadbrahmayanagā prakṛti. dānini bhagavaṃtuḍu yōnigā upayōgiṃcukoni dānihē garbhamunu dhariṃcunaṭlu cēyucunnāḍu. dānilōnuṃḍi samasta bhūtamulu okadānilōnuṃḍi okaṭigā puṭṭucunnavi. aṭlu puṭṭina vastuvu kāryamu. kāryavastuvu eṃdulōnuṃḍi puṭṭinadō adi (dāniki) kāraṇamu (kāraṇavastuvu). ī kāraṇavastuvu kāryavastuvunaku yōni (puṭṭukasthānamu). iṭlu pratiyōnilōnu (kāraṇavastuvulōnu) modaṭi yōni ayina prakṛti aṃśa unnadi. aṃducēta iṭṭi yōnulu ayina kāraṇavastuvulanniṃṭiki prakṛti mahadyōni (mūlakāraṇamu). dānilōnunna bhagavadaṃśa dānilō tana bījamunuṃchi dānicē garbhamu dhariṃcunaṭlu cēsi, dānilōnuṃḍi yiṃkoka vastuvunu puṭṭunaṭlu (āvirbhaviṃcunaṭlu) cēyunu, kanuka bhagavaṃtuḍu aṭlu puṭṭina kāryavastulanniṃṭikī (bhūtamulanniṃṭikī) taṃḍri ayinavāḍu. prati vastuvulōnu bhagavadaṃśa prakṛti aṃśa kūḍa nuṃḍunu - bhagavadaṃśa śakti rūpamulō - caitanyamu kaligiṃci prakṛti aṃśacēta maṟiyoka vastuvunu kaligiṃpacēyunu - idiyē sṛṣṭiprakāramu).

  1. "śāstrayōnitvāt" - (brahmasūtramulu 1 -1 - 3)

(ṛgvēdamu modalagu vēdamulu brahmanuṃḍi puṭṭinavi. aṃducēta ā vēdamulaku brahma ‘yōni’ ceppabaḍucunnāḍu. ī kāraṇamuvalana - brahmanuṃḍi puṭṭinavi kanuka - vēdamulu pramāṇagraṃdhamulu (authority). vēdamulō ceppabaḍina viṣayamuguṟiṃci vēdamē pramāṇamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.