← Back to య · Booklets 41–50 (digitized file 5)

యుగప్రమాణము yugapramāṇamu

Original — తెలుగు

“కృతయుగము నాలుగువేల దివ్యవర్షములు, తదీయ సంధ్య

లెనుబది నూరేండ్లు విను త్రేతవత్సర త్రి సహస్రములగు, తదీయ సంధ్య

లారు నూరేడులు నగు ద్వాపరము రెండువేల వత్సరములవెలయు, సంధ్య

లోలి నన్నూరేడు లొగి, గలియుగము సహస్ర వర్షములు సంధ్యాంశ మరయ

రెండు నూఱేడులును నిల్చియుండు జువ్వె

యనఘ! సంధ్యాంశ మధ్యంబునందు ధర్మ

మతిశయించును సంధ్యాంశమందు ధర్మ

మల్పమై కానబడుచుండు ననఘ చరిత”.

“కృతయుగము 17,28,000 + త్రేతాయుగము 12,96,000 + ద్వాపరయుగము 8,64,000, కలియుగము 4,32,000 మొత్తము 43,20,000 సంవత్సరములు కలిసి ఒక మహా యుగము, లేక ఒక దేవయుగము. 71 మహాయుగములు ఒక మన్వంతరము, 14 మన్వంతరములు బ్రహ్మకు ఒక పగలు, లేక, ఒక మనుష్యకల్పము, ఒక మనుష్యమాసము పితృదేవతలకు ఒక అహోరాత్రము. అందు శుక్లపక్షము పగలు, కృష్ణపక్షము రాత్రి. ఒక మనుష్య సంవత్సరము, దేవతులకు ఒక అహోరాత్రము - అందు ఉత్తరాయణము పగలు, దక్షిణాయనము రాత్రి. 320 అహోరాత్రములు ఒక దేవ సంవత్సరము, 12,000 దేవ సంవత్సరములు బ్రహ్మకు ఒక అహోరాత్రము - - ఒక బ్రహ్మ అహోరాత్రము ఒక మనుష్యకల్పము.”

Transliteration

“kṛtayugamu nāluguvēla divyavarṣamulu, tadīya saṃdhya

lenubadi nūrēṃḍlu vinu trētavatsara tri sahasramulagu, tadīya saṃdhya

lāru nūrēḍulu nagu dvāparamu reṃḍuvēla vatsaramulavelayu, saṃdhya

lōli nannūrēḍu logi, galiyugamu sahasra varṣamulu saṃdhyāṃśa maraya

reṃḍu nūṟēḍulunu nilciyuṃḍu juvve

yanagha! saṃdhyāṃśa madhyaṃbunaṃdu dharma

matiśayiṃcunu saṃdhyāṃśamaṃdu dharma

malpamai kānabaḍucuṃḍu nanagha carita”.

“kṛtayugamu 17,28,000 + trētāyugamu 12,96,000 + dvāparayugamu 8,64,000, kaliyugamu 4,32,000 mottamu 43,20,000 saṃvatsaramulu kalisi oka mahā yugamu, lēka oka dēvayugamu. 71 mahāyugamulu oka manvaṃtaramu, 14 manvaṃtaramulu brahmaku oka pagalu, lēka, oka manuṣyakalpamu, oka manuṣyamāsamu pitṛdēvatalaku oka ahōrātramu. aṃdu śuklapakṣamu pagalu, kṛṣṇapakṣamu rātri. oka manuṣya saṃvatsaramu, dēvatulaku oka ahōrātramu - aṃdu uttarāyaṇamu pagalu, dakṣiṇāyanamu rātri. 320 ahōrātramulu oka dēva saṃvatsaramu, 12,000 dēva saṃvatsaramulu brahmaku oka ahōrātramu - - oka brahma ahōrātramu oka manuṣyakalpamu.”

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.