← Back to య · Booklets 41–50 (digitized file 5)

యుక్తః yuktaḥ

Original — తెలుగు
  1. స్థిర చిత్తః (స్థిరమైన మనస్సు గలవాడు)

  2. ఏకాగ్ర చిత్తః.

(ఒకేదానియందు - భగవంతుని ఒక్కనియందే మనస్సును నిల్పినవాడు).

  1. అభియుక్తః; అవహితః; సమాహితః.

(ఆత్మతో కూడియున్నవాడు).

  1. యోగయుక్తః (యోగమందుండువాడు).

  2. ఆత్మానుభవాయ అర్హః (శ్రీమాన్ రామానుజః)

(ఆత్మానుభవమునకు అర్హుడైనవాడు).

  1. యోగీ (యోగి).

  2. మోక్షాయ అర్హః (శ్రీమాన్ రామానుజః)

(మోక్షమునకు అర్హుడైనవాడు).

  1. “ఈశ్వరాయ కర్మాణి కరోమి, న మమఫలాయ ఇత్యేవం సమాహితః” (శ్రీశంకరః)

(ఈశ్వరునికొఱకు కర్మలను చేయుచున్నాను, నాకు ఫలము కావలెననికాదు - అని ఇట్టి సమాహితమైన మనస్సు కలవాడు)

  1. యోగ సంపూర్ణః

(యోగము సంపూర్తి చేసుకొనినవాడు)

  1. యోగఫలభాక్

(యోగఫలముననుభవించువాడు).

  1. “ఆత్మనః కూటస్థత్వ, అసంగత్వ, అంతర్బహిర్పూర్ణత్వాది దర్శనరూప ప్రజ్ఞయా యుక్తః”.

(ఆత్మ కూటస్థము, అసంగి, లోపల పైన అన్నింటిలోను పూర్తిగా నిండియుండునది - ఈ మొదలగు లక్షణములు గలదిగా ఆత్మను దర్శించు ప్రజ్ఞ (జ్ఞానము, శక్తి కలిగియుండువాడు).

  1. “యథా వినియతం చిత్త ఆత్మన్యేవావతిష్టతే |

నిస్పృహస్సర్వ కామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ||” (శ్రీమద్భగవద్గీత - 6 - 18)

“యదా వినియతం విశేషేణ నియతం సం యతం ఏకాగ్రతామాపన్నం చిత్తం, హిత్వా బాహ్యార్థచింతాం ఆత్మన్యేవావ తిష్టతే, స్వాత్మని స్థితిం లభతే ఇత్యర్థః, సర్వకర్మేభ్యః నిఃస్పృహః, నిస్పృహః సర్వకర్మేభ్యః నిర్గతా దృషాదృష్ట విషయేభ్యః స్పృహాతృష్ణా యస్య యోగినః, సః యుక్తః, సమాహితః ఇత్యుచ్యతే తదా”. (శ్రీశంకరః)

(చిత్తము సం యుతమై ఏకాగ్రతను ఎప్పుడు పొందునో బాహ్యార్థములను విడిచి ఆత్మలోనే (తన ఆత్మలోనే) స్థితి కలిగి ఎప్పుడుండునో, దృష్టాదృష్టములైన (కనబడునవి కనబడనివి అయిన) విషయములనుండి తృష్ణ ఎప్పుడు మరలింపబడునో, అప్పుడు అటువంటి యోగియుక్తుడు, లేక, సమాహితుడు అని చెప్పబడును).

“యదా ప్రయోజన విషయం చిత్తం ఆత్మన్యేవ వినియతం, విశేషేణ నియతం, నిరతిశయప్రయోజనతయా తత్రైవ నియతం నిశ్చలం అవతిష్టతే, సర్వ కర్మేభ్యః నిస్ప్రుహస్సన్ యుక్తః ఉచ్యతే, యోగార్యః ఇత్యర్థః” (శ్రీమాన్ రామానుజః)

(ప్రయోజన విషయమైన చిత్తము ఎప్పుడు ఆత్మయందే అదియే నిరతిశయ ప్రయోజనమని - దానిని మించిన ప్రయోజనము లేదని - దానియందే నిశ్చలముగా నుండునో, సర్వకర్మలందును నిఃస్పృహకలిగి యుండునో, అప్పుడు అట్టివాడు యోగమునకర్హుడు అని చెప్పబడును).

“యస్మిన్కాలే విశేషేణ స్వచ్ఛత్వా నిశ్చలం మనః ప్రతీచ్యేవ నిరుద్ధత్వాన్నియమేనావ తిష్టతే |

దృష్టా దృష్టాస్పదేభ్యశ్చ కామేభ్యో దోషదర్శనాత్ |

తృష్ణా వినిర్గతా యస్య పర వైరాగ్య యోగతః తదా సమాహితో యోగీ సిద్ధః ఇత్యుచ్యతే బుదైః ||“.

(గీతాభావప్రకాశము - 6 - 86 to 88)

(ఎప్పుడు చిత్తశుద్ధి కలిగియుండుటచేత మనస్సు నిశ్చలమై యుండునో, నిరోధింపబడియుండునో అనగా తన వసములో నుండునో దృష్టా దృష్టములకు ఆస్పదమై కామములందుండు దోషములను తెలుసుకొనుటవలన, గొప్ప వైరాగ్యము కలుగుటచేత కామములను వదలుకొని సమాహితుడైన యోగి యుక్తుడని చెప్పబడుచున్నాడు, లేక, సిద్ధుడు, సిద్ధిని పొందినవాడగు చున్నాడు).

  1. “కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి |

యోగినః కర్మ కుర్వంతి సంగత్యక్త్వా ఆత్మశుద్ధయే ||

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం |

అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబద్ధ్యతే ||“. (శ్రీమద్భగవగీత - 5 - 11,12.)

“కర్తృత్వాధ్యాస సామ్యేపి కశ్చిత్తేనైవ కర్మణా |

ముచ్యతే, బధ్యతే కశ్చి ద్వైషమ్యే హేతురస్తికః |

శృణు ఈశాయైవ కర్మాణి నైతాని చ ఫలాయమే |

ఇత్యభిప్రాయవాన్ యుక్తః త్యక్వా కర్మఫలం సుధీః |

కుర్వన్ కర్మాణిమోక్షాఖ్యాం శాంతిమాప్నోతి నైష్టికీం |

శుద్ధిర్వివేక సన్యాస జ్ఞాననిష్ఠా క్రమేణయా |

జాతా సా నైష్టికీ శాంతిః మోక్షరూపా సతామియాత్ ||“. (గీతాభావప్రకాశము - 5 - 88 to 91)

(కర్మచేయువాడు ఒకడు ముక్తుడగుటకు కారణమేమిటి? భగవంతుని కొఱకే ఈ కర్మ చేయు చున్నాను, నాకు ఫలముకొఱకు కాదు అని అభిప్రాయము గలవాడు యుక్తుడు. అటువంటి బుద్ధిమంతుడు కర్మఫలమందాసక్తి విడిచిపెట్టి కర్మచేయువాడు మోక్షము అను పేరుగల నైష్టిక శాంతిని పొందును - నైష్టికశాంతి అనగా సత్వశుద్ధి, నిత్యానిత్య వస్తువివేకము, సన్యాసము, జ్ఞాననిష్ట అనునవి ఒకదాని తర్వాత నొకటి కలిగియుండుట).

(నిష్కామకర్మ యోగులు ఆసక్తిని త్యజించి, మమత్వాభిమానశూన్యులై శరీరమును (స్నానాదులవలనను), మనస్సును (ధ్యానాదులవలనను) బుద్ధిని (తత్వ నిశ్చయముచేతను), ఇంద్రియముల సాహాయ్యముతో (శ్రవణకీర్తనాదులను) కర్మల నొనర్చుచున్నారు. కర్మయోగులు ఫలత్యాగము నొనర్చి ఆత్యంతికమగు శాంతికి అధికారులగుచున్నారు).

  1. “భగవంతునితో, పరమార్థసాధనతో ఆత్మతత్వముతో, కలియుట యోగము - ప్రాపంచిక దృశ్యజాలముతో సంగము తగ్గించుకొని, భగవధ్యానపరులై యుండువారు నిశ్చల చిత్తులు, యుక్తులు అనబడుదురు”.

  2. “నైవ కుంచిత్కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ |

పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్. అశ్నన్, గచ్ఛన్ స్వపన్ శ్వసన్ |

ప్రలవన్ విశృజన్, గృహ్ణ్ణన్, ఉన్మిషన్ నిమిషన్నపి |

ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంతే ఇతి థారయన్ ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 8, 9)

“ధీశుద్ధ్యా యుక్తయేవాదౌ భూత్వా తత్వ విదేవ సః |

క్రియమాణాను చేష్టాసు నకరోమీతి మన్యతే |

జ్ఞాన కర్మేంద్రియైః కర్మదశభిః తద్యధా యధం |

కర్మన్న కుర్వతా బుద్ధ్యా పశ్యత్యాత్మాన మక్రియం |

శ్వసన్ ప్రాణైః స్వపన్నంతః కరణేన మునిస్తథా |

ఉన్మిషన్నిమిషన్నేవం నాగ కూర్మాది పంచకైః |

ఏతాని స్వవిషయే వర్తంతే నత్వహం త్వితి |

ధార యస్సర్వవ్యాపారేష్వాత్మానమక్రియం విదన్ |

కుర్వన్న లిప్యతే చాతో యుక్తమేవేరితం వచః ||“. (గీతాభావప్రకాశము - 5 - 77 to 81)

(చిత్తశుద్ధికలవాడు తత్వవిదుడు - అన్ని తత్వముల యదార్థమును తెలిసినవాడగును. అట్టివాడు ఏ పనిచేసినను నేను చేయుటలేదనే భావించును - చూచుట, వినుట, తాకుట, ఆఘ్రాణము చేయుట, తినుట, నడచుట, నిద్రపోవుట, ఊపిరి తీయుట, మలము విడుచుట, మాటలాడుట మొదలగునవి ఆయా ఇంద్రియములు, మనస్సు మొదలగువాటి కర్మలు - ఆ ఇంద్రియములే వాటి కర్మలందు పని చేయుచున్నవి. ఆ పనులను చేయునది నేను కాను అని భావించును. ఏ వ్యాపారములోను ఆత్మకు కర్తృత్వములేదని భావించును).

  1. “శక్నోతీహవై శోఢుం ప్రాక్ శరీరవిమోక్షణాత్ |

కామక్రోధో ద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 23)

“స్వాను కూలేషు భోగేషు దృశ్యమనేష్వనేకథా |

స్మర్యమాణేషువా శ్రూయమాణేష్యాముష్మికేషు యః |

శోభనత్వ గుణాధ్యోసో గర్దో రత్యాత్మకః స చ |

కామస్తృష్ణాది పర్యాయః |

సర్వానర్థ కరో నృణాం |

ఆత్మనః ప్రతికూలేషు దుఃఖహేతుషు వస్తుషు |

దృశ్యమాణేషు వా శ్రూయమాణేషు స్వాంత గేహేషు చ |

తావద్దోషాను సంథానా భాసా ప్రజ్వలనాత్మకః |

ద్వేషో మన్యుః స చక్రోథః తజ్జో వేగస్త యోర్ద్వయోః |

యాచాస్తుత్కటా వస్థాలోకవేద విరోధినీ |

మార్గే ప్రవృత్తి హేతుత్వా ద్వేగో వద్యారయో యథా |

నద్యావే గోపి వర్షా సు ప్రాబ్రల్యాల్లోకవేదయోః |

విరోధిన్యప్య నిచ్ఛంతం నిరయేపాతయ పాతయత్యధః |

చిత్త ప్రక్షోభ రూపంతం స్తంభస్వేదాది లింగకం |

ఆ మృత్యోర్జాతమాత్రం యది హైవపతనాత్పురా |

తద్దోష దర్శనాభ్యాన జాతవైరాగ్య చేతసా |

మోఘీ కర్తుం సమర్దోస్తి సయోగీ సుసుఖీ నరః |

పురుషార్థైక నిష్టత్వా త్స ఏవ పురుషః సుఖీ |

అన్యస్త్వాహార నిద్రా విపశునిర్మైక తత్పరః |

నరాకారః పశుః జ్ఞేయః పురుషార్థ పరాఙ్ముఖః ||“. (గీతాభావప్రకాశము - 5 - 193 to 203)

(కనబడుచున్నటువంటిన్నీ, స్మరించుచున్నటువంటిన్నీ, వినబడు చున్నటువంటిన్నీ, పరలోకమునకు సంబంధించినవిన్నీ అయిన అనేక రకముల భోగములందు శోభనము కలుగునన్న అభిప్రాయము కలుగుటవలన వాటిని అనుభవించవలెనన్న అభిలాషయే కామము. దీనికే మఱియొక పేరు తృష్ణ. ఇది నరులకు సర్వానర్థములను కలుగచేయునది. ఆ ప్రకారముగానే కనబడుచున్నటువంటిన్నీ, వినబడుచున్నటువంటిన్నీ, తనకు ప్రతికూలముగా నున్నటువంటిన్నీ, దుఃఖమునకు కారణమైనటువంటిన్నీ వస్తువులందు కలుగునది ద్వేషము - దీనినే మన్యువు, క్రోధము అని అందురు. ఈ కామక్రోధ ములు రెండింటివలన అత్యుత్కటమైన వేగము (జోరు) (అడ్డులేని ప్రవాహము వంటిది) లోకమునకు వేదమునకును విరోధమైనది. వర్షాకాలమునందు నదుల ప్రవా హము యొక్క వేగము మానవునకిష్టములేకపోయినను, ఒక పాడు గోతిలోనికి పడవేయును - ఆ ప్రకారముగానే యీ కామక్రోధములవేగము (జోరు అయిన ప్రవర్తన) లోకమునకు వేదమునకు విరోధి అయిన భోగములను సరకమను పాడు గోతిలో పడవేయును - ఈ వేగము చిత్త ప్రక్షోభమును కలిగించును. మరణము పర్యంతము ఈ ప్రకారము పని చేయుచుండును - ఈ వేగమను మరణమునకు ముందుగనే అరికట్టవలెను - దానివలన కలుగు దోషములను తెలుసుకొని వైరాగ్యముపొంది దానిని వ్యర్థమొనరింప కలిగినవాడు యోగి, యుక్తుడు. అటువంటి నరుడే సుఖి. పరమపురుషార్థమను ఒకే దానియందు నిష్ట కలిగియుండుటచేత అట్టివాడే పురుషుడు, సుఖి. అట్లుకానివాడు, పరమపురుషార్థమందు పరాఙ్ముఖుడైనవాడిని - ఆహారము, నిద్ర మొదలగు పశు ధర్మములందే నిష్ట కలిగియున్నవాడిని, వాటియందు తత్పరుడైనవాడిని, నరుని ఆకారముతోనున్నను పశువు అనే తెలుసుకొనవలెను).

  1. కర్మణ్య కర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్ ||.

(శ్రీమద్భగవద్గీత - 4 - 18)

“దేహేంద్రియాది వ్యాపారే నిషిద్ధే, విహితే తథా |

కర్మణి అహం కరోమీతి. ధర్మాధ్యాసే ప్రకల్పితే |

స్వాత్మన్య సంగ చిద్రూపే నిరీహే నిష్క్రియే(అ)మరే |

పశ్యత్మ కర్మయో వస్తు దృష్ట్యా సమ్యగ్వివేకతః |

యథా నౌస్థేన తీరస్థ వృక్షే విచలేష్వపి |

కల్పితం చలనం, తద్విదశ్రియే కర్మ కల్పితం |

అకర్త్రాత్మ విచారేణ కర్మాభావం చ వస్తుతః |

తీర్థస్థ వృక్షేష్వివ యః పశ్యేత్యాత్మ స్వరూపవిత్ |

తథా మాయావికారేషు సదా దేహేంద్రియాదిషు |

స్వ వ్యాపారేషు తచ్చూస్యస్తూష్ణీ మాసే సుఖం త్వితి |

ఆరోపితాభిమానేన వ్యాపారో పరమాభిధే |

గచ్ఛత్స్వ గమనం యద్వత్కల్పితం నృషు దూరగైః |

తథా దేహేంద్రియాదీనాం స్వవ్యాపార విచారణాత్ |

యశ్చ కర్మ నివృత్యాఖ్యం వ్యాపారం పరిపశ్యతి |

ఉదాసీనదశా యామప్యహమాసే సతా దృశః |

ఏవం రూపో(అ)అభిమానోస్తి కర్మయశ్చేతి పశ్యతి |

ఏవం భూతస్స ఆత్మజ్ఞో బుధ్ధిమత్వాది భిర్గుణైః |

స్తూయతే వాసుదేవేన సమ్యగ్దర్శితయా మునిః ||“. (గీతాభావప్రకాశము - 4 - 110 to 119)

(దేహము, ఇంద్రియములు మొదలగు వాటిచే చేయు విహిత కర్మలు, ప్రతిషేధించిన కర్మలు - వీటిని చేయునపుడు, ” ఈ కర్మ నేను చేయుచున్నాను” అని తాను అసంగుడుం చిద్రూపుడు, నిష్క్రియుడు, నిష్కాముడు అయినను తనయందు అరోపించుకొనుచున్నాడు. పడవలో ప్రయాణము చేయుచున్నవానికి ఒడ్డున (కదలని) చెట్లు కదులుచున్నట్లు కనుపించును. ఇది కల్పితము - వివేకమువలన చెట్లు కదలలేదు అని తెలుసుకొనును. అట్లే పరమాత్మ రూపుడైనవాడు తాను బ్రహ్మజ్ఞానము కలిగియుండుటచేత తాను కర్మ చేయుచున్నను చేయనట్లే భావించును. కర్మను చేయక ఊరకనే కూరుచుండువాడు నేను ఏ కర్మను చేయలేదనుకొనును - ఇది కూడ అధ్యాసయే. కంటికి దూరముగా నడుచుచున్న మనుష్యులు దూరముగా నుండుటవలన నడుచు చున్నట్లు కనబడరు. చాలా దూరములో పోవుచున్న రైలుబండిగాని, స్టీమరుగాని నిలిచియున్నట్లే అనిపించును - ఇదియును అధ్యాసయే. ఆ ప్రకారముగానే దేహేంద్రియముల వ్యాపారములు (అవి చేయు కర్మలు) మాయా పరిణామములు. అవి కనబడకుండ జరుగునవి. కాని వాటిని తెలుసుకొనినవాడు నేను ఏ పనిని చేయలేదని తలచును. కాని జ్ఞానియగువాడు అట్టి అకర్మయందు తాను పనిచేయుచున్నాననే తలచును - ఎందుచేతననగా దేహేంద్రియాదులు చేయు కనబడని పనులలో బ్రహ్మ చైతన్యముండుటయే వీటికి కారణమని తెలిసి నేను కర్మ చేయుచున్నాను అని భావించును - (తెలుసుకొనును). ఇట్లు కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవడు చూచునో అతడు మనుష్యులలో బుద్ధిమంతుడు - జ్ఞాని, బ్రహ్మజ్ఞానము కలవాడు - యుక్తుడు, యోగము నెఱిగినవాడు, కృతకృత్యుడే - (తాను చేయవలసిన పనులన్నియు చేసినవాడే యగును).

  1. “జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |

శీతోష్ణ సుఖదుఃఖేషు తదా మానావమాన యోః |

జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కుటస్థో విజితేంద్రియః |

యుక్తః ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః |

సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు |

సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 7, 8, 9)

“నత్సు విక్షేపకేష్వేషు శీతోష్ణాదిషు యస్య ను |

న జహాతి సమత్వం ధీరాత్మ తత్వ సమీక్షణాత్ |

జితేంద్రియస్య శాంతస్య రాగ ద్వేష పరీక్షయాత్ |

సమాధి విషయస్తస్య స్వపరాశో హరిర్భవేత్ |

న్యాన్యస్యేత్యాశయో విష్ణో స్తస్మాచ్ఛాం తో భవేన్మునిః |

శాస్త్రోక్తానాం పదార్థానాం జ్ఞానం స్యాదౌప దేశికం |

అసందిగ్ధ విపర్యాసం విజ్ఞానం స్వానుభూతితః |

జాతాలం ప్రత్యయస్తాభ్యా మాత్మా చిత్తం హి యస్య సః |

సన్నిధానేపి భాగానాం నిర్వికారో (అ)తి ధీరధీః |

వ్యావర్తితాని భోగేభ్యో యేన సర్వేంద్రియాణి సః |

హేయోపాధేయ ధీశూన్యతయా యస్య సమాని చ |

మృత్పాషాణ సువర్ణాని వీత తృష్ణో నిజాత్మవిత్ |

ఈదృశో యుక్త చిత్తత్వాద్యోగా రూఢ ఇతీర్యతే |

వినా ప్రత్యుపకారేస్సా ముపకర్తా సుహృత్ స్మృతః |

స్నేహవాన్ మిత్రమిత్యుక్తమరిః స్యాదపకారకః |

ఉదాసీనో ద్వయోః పుంసోర్ద్వేషా ద్వివద మానయోః |

పక్షపాత విహీనత్వా దుభయో రప్యుపేక్షకః |

మధ్యస్ర్హో యో హితాన్వేషీ ద్వయోర్వివద మానయోః |

స్వస్త్యాప్రియో భవేద్ద్వేష్యః సంబందో బంధురుచ్యతే |

ఏతేషు శాస్త్ర విహిత కర్మకారిషు సాధుషు |

పాపేషు శాస్త్రమర్యాదాం సముల్లంఘ్య ప్రవర్తిషు |

చాన్యేష్వపి సర్వేషు సమబుద్ధిర్విముచ్యతే |

కః కింకర్మేతి ధీ శూన్య ఉత్కష్టః సమ్మతో మమ ||“. (గీతాభావప్రకాశము - 6 - 36 to 38; 40 to 48)

(శీతోష్ణములందు, మానావమానములందు మనోజయము కలిగినవాడు శాంతుడు, శాస్త్రజ్ఞానమును, అనుభవజ్ఞానమును కలిగియుండుటచేత తృప్తిని చెందినవాడు, మనోజయము, ఇంద్రియజయము కలవాడున్నూ, కూటస్థమువలె నిలకడగలవాడున్నూ, బంగారమును, మట్టిని, ఱాయిని ఒకేమాదిరిగా చూచువాడున్నూ, యుక్తుడు (యోగారూఢుడు) అని చెప్పబడును – ప్రత్యుప కారమునాసించక ఉపకారము చేయువానియందు, స్నేహితునియందు, అపకారము చేయువానియందు, వాదోపవాదములు చేయుచున్న ఇద్దరిమధ్య ఉదాసీను డుగా నుండువానియందును, అట్లే వాదోపవాదములు చేయుచున్న యిద్దరి మధ్య పక్షపాతము లేక మధ్యస్థుడుగాముండువానియందును, తనకు అప్రియుడు - ద్వేషింపతగినవానియందును బంధువునందును, పాపులైనను, పుణ్యులైనను, శాస్త్రము ప్రకారము నడచువారు, లేక శాస్త్రమునుల్లంఘించి నడచువారియందును, మిగిలిన వారందరియందును, సమమైన - బుద్ధి కలిగినవాడు విశేషించి యుక్తుడు - యోగారూఢుడని చెప్పబడును).

Transliteration
  1. sthira cittaḥ (sthiramaina manassu galavāḍu)

  2. ēkāgra cittaḥ.

(okēdāniyaṃdu - bhagavaṃtuni okkaniyaṃdē manassunu nilpinavāḍu).

  1. abhiyuktaḥ; avahitaḥ; samāhitaḥ.

(ātmatō kūḍiyunnavāḍu).

  1. yōgayuktaḥ (yōgamaṃduṃḍuvāḍu).

  2. ātmānubhavāya arhaḥ (śrīmān rāmānujaḥ)

(ātmānubhavamunaku arhuḍainavāḍu).

  1. yōgī (yōgi).

  2. mōkṣāya arhaḥ (śrīmān rāmānujaḥ)

(mōkṣamunaku arhuḍainavāḍu).

  1. “īśvarāya karmāṇi karōmi, na mamaphalāya ityēvaṃ samāhitaḥ” (śrīśaṃkaraḥ)

(īśvarunikoṟaku karmalanu cēyucunnānu, nāku phalamu kāvalenanikādu - ani iṭṭi samāhitamaina manassu kalavāḍu)

  1. yōga saṃpūrṇaḥ

(yōgamu saṃpūrti cēsukoninavāḍu)

  1. yōgaphalabhāk

(yōgaphalamunanubhaviṃcuvāḍu).

  1. “ātmanaḥ kūṭasthatva, asaṃgatva, aṃtarbahirpūrṇatvādi darśanarūpa prajñayā yuktaḥ”.

(ātma kūṭasthamu, asaṃgi, lōpala paina anniṃṭilōnu pūrtigā niṃḍiyuṃḍunadi - ī modalagu lakṣaṇamulu galadigā ātmanu darśiṃcu prajña (jñānamu, śakti kaligiyuṃḍuvāḍu).

  1. “yathā viniyataṃ citta ātmanyēvāvatiṣṭatē |

nispṛhassarva kāmēbhyō yukta ityucyatē tadā ||” (śrīmadbhagavadgīta - 6 - 18)

“yadā viniyataṃ viśēṣēṇa niyataṃ saṃ yataṃ ēkāgratāmāpannaṃ cittaṃ, hitvā bāhyārthaciṃtāṃ ātmanyēvāva tiṣṭatē, svātmani sthitiṃ labhatē ityarthaḥ, sarvakarmēbhyaḥ niḥspṛhaḥ, nispṛhaḥ sarvakarmēbhyaḥ nirgatā dṛṣādṛṣṭa viṣayēbhyaḥ spṛhātṛṣṇā yasya yōginaḥ, saḥ yuktaḥ, samāhitaḥ ityucyatē tadā”. (śrīśaṃkaraḥ)

(cittamu saṃ yutamai ēkāgratanu eppuḍu poṃdunō bāhyārthamulanu viḍici ātmalōnē (tana ātmalōnē) sthiti kaligi eppuḍuṃḍunō, dṛṣṭādṛṣṭamulaina (kanabaḍunavi kanabaḍanivi ayina) viṣayamulanuṃḍi tṛṣṇa eppuḍu maraliṃpabaḍunō, appuḍu aṭuvaṃṭi yōgiyuktuḍu, lēka, samāhituḍu ani ceppabaḍunu).

“yadā prayōjana viṣayaṃ cittaṃ ātmanyēva viniyataṃ, viśēṣēṇa niyataṃ, niratiśayaprayōjanatayā tatraiva niyataṃ niścalaṃ avatiṣṭatē, sarva karmēbhyaḥ nispruhassan yuktaḥ ucyatē, yōgāryaḥ ityarthaḥ” (śrīmān rāmānujaḥ)

(prayōjana viṣayamaina cittamu eppuḍu ātmayaṃdē adiyē niratiśaya prayōjanamani - dānini miṃcina prayōjanamu lēdani - dāniyaṃdē niścalamugā nuṃḍunō, sarvakarmalaṃdunu niḥspṛhakaligi yuṃḍunō, appuḍu aṭṭivāḍu yōgamunakarhuḍu ani ceppabaḍunu).

“yasminkālē viśēṣēṇa svacchatvā niścalaṃ manaḥ pratīcyēva niruddhatvānniyamēnāva tiṣṭatē |

dṛṣṭā dṛṣṭāspadēbhyaśca kāmēbhyō dōṣadarśanāt |

tṛṣṇā vinirgatā yasya para vairāgya yōgataḥ tadā samāhitō yōgī siddhaḥ ityucyatē budaiḥ ||“.

(gītābhāvaprakāśamu - 6 - 86 to 88)

(eppuḍu cittaśuddhi kaligiyuṃḍuṭacēta manassu niścalamai yuṃḍunō, nirōdhiṃpabaḍiyuṃḍunō anagā tana vasamulō nuṃḍunō dṛṣṭā dṛṣṭamulaku āspadamai kāmamulaṃduṃḍu dōṣamulanu telusukonuṭavalana, goppa vairāgyamu kaluguṭacēta kāmamulanu vadalukoni samāhituḍaina yōgi yuktuḍani ceppabaḍucunnāḍu, lēka, siddhuḍu, siddhini poṃdinavāḍagu cunnāḍu).

  1. “kāyēna manasā buddhyā kēvalairiṃdriyairapi |

yōginaḥ karma kurvaṃti saṃgatyaktvā ātmaśuddhayē ||

yuktaḥ karmaphalaṃ tyaktvā śāṃtimāpnōti naiṣṭikīṃ |

ayuktaḥ kāmakārēṇa phalē saktō nibaddhyatē ||“. (śrīmadbhagavagīta - 5 - 11,12.)

“kartṛtvādhyāsa sāmyēpi kaścittēnaiva karmaṇā |

mucyatē, badhyatē kaści dvaiṣamyē hēturastikaḥ |

śṛṇu īśāyaiva karmāṇi naitāni ca phalāyamē |

ityabhiprāyavān yuktaḥ tyakvā karmaphalaṃ sudhīḥ |

kurvan karmāṇimōkṣākhyāṃ śāṃtimāpnōti naiṣṭikīṃ |

śuddhirvivēka sanyāsa jñānaniṣṭhā kramēṇayā |

jātā sā naiṣṭikī śāṃtiḥ mōkṣarūpā satāmiyāt ||“. (gītābhāvaprakāśamu - 5 - 88 to 91)

(karmacēyuvāḍu okaḍu muktuḍaguṭaku kāraṇamēmiṭi? bhagavaṃtuni koṟakē ī karma cēyu cunnānu, nāku phalamukoṟaku kādu ani abhiprāyamu galavāḍu yuktuḍu. aṭuvaṃṭi buddhimaṃtuḍu karmaphalamaṃdāsakti viḍicipeṭṭi karmacēyuvāḍu mōkṣamu anu pērugala naiṣṭika śāṃtini poṃdunu - naiṣṭikaśāṃti anagā satvaśuddhi, nityānitya vastuvivēkamu, sanyāsamu, jñānaniṣṭa anunavi okadāni tarvāta nokaṭi kaligiyuṃḍuṭa).

(niṣkāmakarma yōgulu āsaktini tyajiṃci, mamatvābhimānaśūnyulai śarīramunu (snānādulavalananu), manassunu (dhyānādulavalananu) buddhini (tatva niścayamucētanu), iṃdriyamula sāhāyyamutō (śravaṇakīrtanādulanu) karmala nonarcucunnāru. karmayōgulu phalatyāgamu nonarci ātyaṃtikamagu śāṃtiki adhikārulagucunnāru).

  1. “bhagavaṃtunitō, paramārthasādhanatō ātmatatvamutō, kaliyuṭa yōgamu - prāpaṃcika dṛśyajālamutō saṃgamu taggiṃcukoni, bhagavadhyānaparulai yuṃḍuvāru niścala cittulu, yuktulu anabaḍuduru”.

  2. “naiva kuṃcitkarōmīti yuktō manyēta tatvavit |

paśyan, śṛṇvan, spṛśan, jighran. aśnan, gacchan svapan śvasan |

pralavan viśṛjan, gṛhṇṇan, unmiṣan nimiṣannapi |

iṃdriyāṇīṃdriyārthēṣu vartaṃtē iti thārayan ||“. (śrīmadbhagavadgīta - 5 - 8, 9)

“dhīśuddhyā yuktayēvādau bhūtvā tatva vidēva saḥ |

kriyamāṇānu cēṣṭāsu nakarōmīti manyatē |

jñāna karmēṃdriyaiḥ karmadaśabhiḥ tadyadhā yadhaṃ |

karmanna kurvatā buddhyā paśyatyātmāna makriyaṃ |

śvasan prāṇaiḥ svapannaṃtaḥ karaṇēna munistathā |

unmiṣannimiṣannēvaṃ nāga kūrmādi paṃcakaiḥ |

ētāni svaviṣayē vartaṃtē natvahaṃ tviti |

dhāra yassarvavyāpārēṣvātmānamakriyaṃ vidan |

kurvanna lipyatē cātō yuktamēvēritaṃ vacaḥ ||“. (gītābhāvaprakāśamu - 5 - 77 to 81)

(cittaśuddhikalavāḍu tatvaviduḍu - anni tatvamula yadārthamunu telisinavāḍagunu. aṭṭivāḍu ē panicēsinanu nēnu cēyuṭalēdanē bhāviṃcunu - cūcuṭa, vinuṭa, tākuṭa, āghrāṇamu cēyuṭa, tinuṭa, naḍacuṭa, nidrapōvuṭa, ūpiri tīyuṭa, malamu viḍucuṭa, māṭalāḍuṭa modalagunavi āyā iṃdriyamulu, manassu modalaguvāṭi karmalu - ā iṃdriyamulē vāṭi karmalaṃdu pani cēyucunnavi. ā panulanu cēyunadi nēnu kānu ani bhāviṃcunu. ē vyāpāramulōnu ātmaku kartṛtvamulēdani bhāviṃcunu).

  1. “śaknōtīhavai śōḍhuṃ prāk śarīravimōkṣaṇāt |

kāmakrōdhō dbhavaṃ vēgaṃ sa yuktaḥ sa sukhī naraḥ ||“. (śrīmadbhagavadgīta - 5 - 23)

“svānu kūlēṣu bhōgēṣu dṛśyamanēṣvanēkathā |

smaryamāṇēṣuvā śrūyamāṇēṣyāmuṣmikēṣu yaḥ |

śōbhanatva guṇādhyōsō gardō ratyātmakaḥ sa ca |

kāmastṛṣṇādi paryāyaḥ |

sarvānartha karō nṛṇāṃ |

ātmanaḥ pratikūlēṣu duḥkhahētuṣu vastuṣu |

dṛśyamāṇēṣu vā śrūyamāṇēṣu svāṃta gēhēṣu ca |

tāvaddōṣānu saṃthānā bhāsā prajvalanātmakaḥ |

dvēṣō manyuḥ sa cakrōthaḥ tajjō vēgasta yōrdvayōḥ |

yācāstutkaṭā vasthālōkavēda virōdhinī |

mārgē pravṛtti hētutvā dvēgō vadyārayō yathā |

nadyāvē gōpi varṣā su prābralyāllōkavēdayōḥ |

virōdhinyapya nicchaṃtaṃ nirayēpātaya pātayatyadhaḥ |

citta prakṣōbha rūpaṃtaṃ staṃbhasvēdādi liṃgakaṃ |

ā mṛtyōrjātamātraṃ yadi haivapatanātpurā |

taddōṣa darśanābhyāna jātavairāgya cētasā |

mōghī kartuṃ samardōsti sayōgī susukhī naraḥ |

puruṣārthaika niṣṭatvā tsa ēva puruṣaḥ sukhī |

anyastvāhāra nidrā vipaśunirmaika tatparaḥ |

narākāraḥ paśuḥ jñēyaḥ puruṣārtha parāṅmukhaḥ ||“. (gītābhāvaprakāśamu - 5 - 193 to 203)

(kanabaḍucunnaṭuvaṃṭinnī, smariṃcucunnaṭuvaṃṭinnī, vinabaḍu cunnaṭuvaṃṭinnī, paralōkamunaku saṃbaṃdhiṃcinavinnī ayina anēka rakamula bhōgamulaṃdu śōbhanamu kalugunanna abhiprāyamu kaluguṭavalana vāṭini anubhaviṃcavalenanna abhilāṣayē kāmamu. dīnikē maṟiyoka pēru tṛṣṇa. idi narulaku sarvānarthamulanu kalugacēyunadi. ā prakāramugānē kanabaḍucunnaṭuvaṃṭinnī, vinabaḍucunnaṭuvaṃṭinnī, tanaku pratikūlamugā nunnaṭuvaṃṭinnī, duḥkhamunaku kāraṇamainaṭuvaṃṭinnī vastuvulaṃdu kalugunadi dvēṣamu - dīninē manyuvu, krōdhamu ani aṃduru. ī kāmakrōdha mulu reṃḍiṃṭivalana atyutkaṭamaina vēgamu (jōru) (aḍḍulēni pravāhamu vaṃṭidi) lōkamunaku vēdamunakunu virōdhamainadi. varṣākālamunaṃdu nadula pravā hamu yokka vēgamu mānavunakiṣṭamulēkapōyinanu, oka pāḍu gōtilōniki paḍavēyunu - ā prakāramugānē yī kāmakrōdhamulavēgamu (jōru ayina pravartana) lōkamunaku vēdamunaku virōdhi ayina bhōgamulanu sarakamanu pāḍu gōtilō paḍavēyunu - ī vēgamu citta prakṣōbhamunu kaligiṃcunu. maraṇamu paryaṃtamu ī prakāramu pani cēyucuṃḍunu - ī vēgamanu maraṇamunaku muṃduganē arikaṭṭavalenu - dānivalana kalugu dōṣamulanu telusukoni vairāgyamupoṃdi dānini vyarthamonariṃpa kaliginavāḍu yōgi, yuktuḍu. aṭuvaṃṭi naruḍē sukhi. paramapuruṣārthamanu okē dāniyaṃdu niṣṭa kaligiyuṃḍuṭacēta aṭṭivāḍē puruṣuḍu, sukhi. aṭlukānivāḍu, paramapuruṣārthamaṃdu parāṅmukhuḍainavāḍini - āhāramu, nidra modalagu paśu dharmamulaṃdē niṣṭa kaligiyunnavāḍini, vāṭiyaṃdu tatparuḍainavāḍini, naruni ākāramutōnunnanu paśuvu anē telusukonavalenu).

  1. karmaṇya karma yaḥ paśyēt akarmaṇi ca karma yaḥ sabuddhimān manuṣyēṣu sayuktaḥ kṛtsna karmakṛt ||.

(śrīmadbhagavadgīta - 4 - 18)

“dēhēṃdriyādi vyāpārē niṣiddhē, vihitē tathā |

karmaṇi ahaṃ karōmīti. dharmādhyāsē prakalpitē |

svātmanya saṃga cidrūpē nirīhē niṣkriyē(a)marē |

paśyatma karmayō vastu dṛṣṭyā samyagvivēkataḥ |

yathā nausthēna tīrastha vṛkṣē vicalēṣvapi |

kalpitaṃ calanaṃ, tadvidaśriyē karma kalpitaṃ |

akartrātma vicārēṇa karmābhāvaṃ ca vastutaḥ |

tīrthastha vṛkṣēṣviva yaḥ paśyētyātma svarūpavit |

tathā māyāvikārēṣu sadā dēhēṃdriyādiṣu |

sva vyāpārēṣu taccūsyastūṣṇī māsē sukhaṃ tviti |

ārōpitābhimānēna vyāpārō paramābhidhē |

gacchatsva gamanaṃ yadvatkalpitaṃ nṛṣu dūragaiḥ |

tathā dēhēṃdriyādīnāṃ svavyāpāra vicāraṇāt |

yaśca karma nivṛtyākhyaṃ vyāpāraṃ paripaśyati |

udāsīnadaśā yāmapyahamāsē satā dṛśaḥ |

ēvaṃ rūpō(a)abhimānōsti karmayaścēti paśyati |

ēvaṃ bhūtassa ātmajñō budhdhimatvādi bhirguṇaiḥ |

stūyatē vāsudēvēna samyagdarśitayā muniḥ ||“. (gītābhāvaprakāśamu - 4 - 110 to 119)

(dēhamu, iṃdriyamulu modalagu vāṭicē cēyu vihita karmalu, pratiṣēdhiṃcina karmalu - vīṭini cēyunapuḍu, ” ī karma nēnu cēyucunnānu” ani tānu asaṃguḍuṃ cidrūpuḍu, niṣkriyuḍu, niṣkāmuḍu ayinanu tanayaṃdu arōpiṃcukonucunnāḍu. paḍavalō prayāṇamu cēyucunnavāniki oḍḍuna (kadalani) ceṭlu kadulucunnaṭlu kanupiṃcunu. idi kalpitamu - vivēkamuvalana ceṭlu kadalalēdu ani telusukonunu. aṭlē paramātma rūpuḍainavāḍu tānu brahmajñānamu kaligiyuṃḍuṭacēta tānu karma cēyucunnanu cēyanaṭlē bhāviṃcunu. karmanu cēyaka ūrakanē kūrucuṃḍuvāḍu nēnu ē karmanu cēyalēdanukonunu - idi kūḍa adhyāsayē. kaṃṭiki dūramugā naḍucucunna manuṣyulu dūramugā nuṃḍuṭavalana naḍucu cunnaṭlu kanabaḍaru. cālā dūramulō pōvucunna railubaṃḍigāni, sṭīmarugāni niliciyunnaṭlē anipiṃcunu - idiyunu adhyāsayē. ā prakāramugānē dēhēṃdriyamula vyāpāramulu (avi cēyu karmalu) māyā pariṇāmamulu. avi kanabaḍakuṃḍa jarugunavi. kāni vāṭini telusukoninavāḍu nēnu ē panini cēyalēdani talacunu. kāni jñāniyaguvāḍu aṭṭi akarmayaṃdu tānu panicēyucunnānanē talacunu - eṃducētananagā dēhēṃdriyādulu cēyu kanabaḍani panulalō brahma caitanyamuṃḍuṭayē vīṭiki kāraṇamani telisi nēnu karma cēyucunnānu ani bhāviṃcunu - (telusukonunu). iṭlu karmayaṃdu akarmanu, akarmayaṃdu karmanu evaḍu cūcunō ataḍu manuṣyulalō buddhimaṃtuḍu - jñāni, brahmajñānamu kalavāḍu - yuktuḍu, yōgamu neṟiginavāḍu, kṛtakṛtyuḍē - (tānu cēyavalasina panulanniyu cēsinavāḍē yagunu).

  1. “jitātmanaḥ praśāṃtasya paramātmā samāhitaḥ |

śītōṣṇa sukhaduḥkhēṣu tadā mānāvamāna yōḥ |

jñāna vijñāna tṛptātmā kuṭasthō vijitēṃdriyaḥ |

yuktaḥ ityucyatē yōgī samalōṣṭāśma kāṃcanaḥ |

suhṛnmitrāryudāsīna madhyasthadvēṣya baṃdhuṣu |

sādhuṣvapi ca pāpēṣu samabuddhirviśiṣyatē ||“. (śrīmadbhagavadgīta - 6 - 7, 8, 9)

“natsu vikṣēpakēṣvēṣu śītōṣṇādiṣu yasya nu |

na jahāti samatvaṃ dhīrātma tatva samīkṣaṇāt |

jitēṃdriyasya śāṃtasya rāga dvēṣa parīkṣayāt |

samādhi viṣayastasya svaparāśō harirbhavēt |

nyānyasyētyāśayō viṣṇō stasmācchāṃ tō bhavēnmuniḥ |

śāstrōktānāṃ padārthānāṃ jñānaṃ syādaupa dēśikaṃ |

asaṃdigdha viparyāsaṃ vijñānaṃ svānubhūtitaḥ |

jātālaṃ pratyayastābhyā mātmā cittaṃ hi yasya saḥ |

sannidhānēpi bhāgānāṃ nirvikārō (a)ti dhīradhīḥ |

vyāvartitāni bhōgēbhyō yēna sarvēṃdriyāṇi saḥ |

hēyōpādhēya dhīśūnyatayā yasya samāni ca |

mṛtpāṣāṇa suvarṇāni vīta tṛṣṇō nijātmavit |

īdṛśō yukta cittatvādyōgā rūḍha itīryatē |

vinā pratyupakārēssā mupakartā suhṛt smṛtaḥ |

snēhavān mitramityuktamariḥ syādapakārakaḥ |

udāsīnō dvayōḥ puṃsōrdvēṣā dvivada mānayōḥ |

pakṣapāta vihīnatvā dubhayō rapyupēkṣakaḥ |

madhyasrhō yō hitānvēṣī dvayōrvivada mānayōḥ |

svastyāpriyō bhavēddvēṣyaḥ saṃbaṃdō baṃdhurucyatē |

ētēṣu śāstra vihita karmakāriṣu sādhuṣu |

pāpēṣu śāstramaryādāṃ samullaṃghya pravartiṣu |

cānyēṣvapi sarvēṣu samabuddhirvimucyatē |

kaḥ kiṃkarmēti dhī śūnya utkaṣṭaḥ sammatō mama ||“. (gītābhāvaprakāśamu - 6 - 36 to 38; 40 to 48)

(śītōṣṇamulaṃdu, mānāvamānamulaṃdu manōjayamu kaliginavāḍu śāṃtuḍu, śāstrajñānamunu, anubhavajñānamunu kaligiyuṃḍuṭacēta tṛptini ceṃdinavāḍu, manōjayamu, iṃdriyajayamu kalavāḍunnū, kūṭasthamuvale nilakaḍagalavāḍunnū, baṃgāramunu, maṭṭini, ṟāyini okēmādirigā cūcuvāḍunnū, yuktuḍu (yōgārūḍhuḍu) ani ceppabaḍunu – pratyupa kāramunāsiṃcaka upakāramu cēyuvāniyaṃdu, snēhituniyaṃdu, apakāramu cēyuvāniyaṃdu, vādōpavādamulu cēyucunna iddarimadhya udāsīnu ḍugā nuṃḍuvāniyaṃdunu, aṭlē vādōpavādamulu cēyucunna yiddari madhya pakṣapātamu lēka madhyasthuḍugāmuṃḍuvāniyaṃdunu, tanaku apriyuḍu - dvēṣiṃpataginavāniyaṃdunu baṃdhuvunaṃdunu, pāpulainanu, puṇyulainanu, śāstramu prakāramu naḍacuvāru, lēka śāstramunullaṃghiṃci naḍacuvāriyaṃdunu, migilina vāraṃdariyaṃdunu, samamaina - buddhi kaliginavāḍu viśēṣiṃci yuktuḍu - yōgārūḍhuḍani ceppabaḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.