← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హంసః haṃsaḥ

Original — తెలుగు
  1. విష్ణువు, పరమాత్మ, యతి, హంసమంత్రము -

  2. హంతి, సర్వదా గచ్ఛతి ఇతి హంసః; ఆదిత్యః; సూర్యుడు; ఎడతెగని గమనము గలవాడు).

  3. “హంతి గచ్చతి సర్వ శరీరేషు ఇతివా హంసః” (శ్రీశంకరః)

(అందఱి శరీరములందు నుండువాడు, సంచరించువాడు).

  1. హంతి, గచ్ఛతీతి హంసః, అవిద్యా తత్కార్యం వినాశయతీతివా హంసః.

(సంచారము చేయువాడు, లేక, అవిద్య (అజ్ఞానము లేక సంసారము), దాని కార్యములను నశింపచేయువాదు)

“హంతి అవిద్యాది బంధకారణం ఇతి హంసః”

(అవిద్య మొదలగు బంధమునకు కారణమైన వాటిని నశింప చేయువాడు).

  1. హంతి స్వానాం క్లేశమితి హంసః -

(తనవారి క్లేశములను - బాధలను - నశింప చేయువాడు).

  1. పరమాత్మ; యోగి - “హంసో విహంగమే (అ)పిస్యాత్ పరమాత్మని యోగిని” (ఇతి విశ్వః).

(హంస యనగా పరమాత్మ, పక్షి, యోగి యని అర్థము - అని విశ్వనిఘ్నటువు చెప్పుచున్నది).

  1. జీవః; పరమహంసః; బ్రహ్మ.

(జీవుడు; పరమహంసుడు అను యోగి - పరబ్రహ్మ)

  1. హంతి గచ్ఛతి ఇతి సంసార కాంతార పర్యటన శీలతయా హంస శబ్దవాచ్యో జీవః - భ్రమతి.

(హంస అనగా సంచరించువాడు కనుక సంసారమను అడవిలో సంచరించు స్వభావము గలవాడు అని చెప్పుటచేత జీవుడు అని అర్థము).

  1. హంస మంత్రార్థ ధ్యాన పరః -

(హంస మంత్రార్థమును ధ్యానించు నిష్ఠ గలవాడు).

  1. “అహం సః ఇతి తాదాత్మ్య భావినః సంసార భయం హంతీతి హంసః” (శ్రీశంకరః)

(అహం = నేను; సః - అతనినే; నేనే పరమాత్మను; (అహం బ్రహ్మస్మి) అని పరమాత్మతో తాదాత్మ్యభావము గలవారి సంసార భయమును నశింపచేయువాడు).

  1. వివేకీ; సారాసార వివేక చతురః; జ్ఞానీ; రుద్ధః -

(మంచి, చెడ్డ యను వివకము గలవాడు; సారాసారముల వివేకమునందు చతురుడు, సమర్థుడు;బ్రహ్మజ్ఞానము కలవాడు; శుద్ధుడు; - కల్మషము లేనివాడు).

  1. “స్వతత్వ జ్ఞానేన స్వాతిరిక్తకలనాం హంతీతి హంసః; స ఏవ అస్మి ఇత్యను సంధానం హంస యోగః”

(భగవత్తత్త్వజ్ఞానము కలిగియుండుటచేత (తాను ఎవరో - తానే పరమాత్మ యను జ్ఞానము కలిగి యుండుటచేత) పరబ్రహ్మ కాని దంతటినీ నశింప చేయువాడు - అట్టి పరమాత్మ నేనే అయితిని అని అనుసంధానము చేయుటయే హంస యోగము).

  1. స్వాతి రిక్త కలనా సర్వస్వం హత్వా స్వమాత్రమవశిష్యతే ఇతి హంసః -

(పరమాత్మ కానిదానినంతటిని నశింపచేసి తానొక్కడే మిగిలియుండువాడు).

  1. “జాగ్రదాద్యభిమానం క్రమేణగత్వా, హిత్వా, జ్ఞాన విజ్ఞానాభ్యాం సర్వం, హత్వా తురీయం గచ్ఛతి; సమ్యక్ జ్ఞానేన తదపి హత్వా తురీయాతీతం స్వమాత్ర తయా గచ్ఛతీతి, వా, హంసః; పరమాత్మా”.

(జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అను మూడు అవస్థల అభిమానము పొంది, వాటిని విడిచిపెట్టి జ్ఞాన విజ్ఞానములచేత అన్నింటినీ నశింపచేసి, తురీయావస్థను పొందును. సమ్యక్ జ్ఞానముచేత ఆ తురీయమును కూడ నశింపచేసి, తురీయమునకతీతమైన ఆత్మ మాత్రముగా నుండువాడు హంసుడు - పరమాత్మ).

  1. “హం” శబ్దేన తత్పదార్థః; ‘స’ శబ్దేన త్వం పదార్థః తయోః వ్యతిహారోచ్చారణం ‘అసి’ పదార్థం.

(హంస అను మాటలోని ‘హం’ అనుమాత “తత్వమసి” అను మహావాక్యములోని (తత్ + త్వం + అసి) తత్ అను మాటకు అర్థము - (‘తత్’ అను మాటకు బదులుగా నున్నది) తత్ అనగా పరబ్రహ్మ - ‘ఓం తత్ సత్’ అను మూడు పదమూలచేతను భగవంతుడే నిర్దేశింపబడుచున్నాడు అని (శ్రీమద్భగవద్గీత - 17 – 23) లో “హంసః” అను వాక్యములోని “సః” అను మాట పైన చెప్పిన మహావాక్యములోని ‘త్వం’ (నీవు) అను మాటకు అర్థము అగును. ‘హంస’ అను రెండు అక్షరములు వ్యతిరేకముగా (ముందుది వెనుకను, వనుకది ముందుగాను) ఉచ్చరించిన అది ఆ మహావాక్యములోని ‘అసి’ (అయితివి - అయి యున్నావు) అని దానికి అర్థము. అహం సః; అహంసో - సో(అ)హం = అతనే నేను).

  1. “హకారః పరమేశస్యాత్ తత్పదం చేతి నిశ్చితం |

సకారః ఖేచరే ప్రోక్తస్త్వం పదం చేతి నిశ్చితం |

సకారో సకారోధ్యాయతే జంతుః హకారో హి భవదె ద్ధృవం ||“.

(‘హంస’ అను మాటలోని ‘హ’ కారము పరమేశ్వరుడు - అదియే “తత్వమసి” యను మహావాక్యము (తత్ + త్వం + అసి) లోని తత్పదమునకర్థము. ఆ ‘హంస’ యను పదములోని ‘స’ అను మాటకు మహావాక్యములోని త్వం పదమునకర్థము. ‘స’ కారమును ధ్యానించు జీవుడు ‘హ’ కారమే యగును - జీవుడు (జీవాత్మ) పరమాత్మయే యగును - ముక్తిని పొందును).

(‘హ’ కారము పరబ్రహ్మ స్వరూపము; ‘స’ కారము మూల ప్రకృతి లేక దేవి. ఈ రండు అక్షరములకు మధ్య నుండు బిదువు (ఒ = సున్న; అనుస్వారము) (‘హంస’ లోని మధ్య బిందువు ప్రకృతి పురుషుల తాదాత్మ్యసంబంధము - పరబ్రహ్మయే ప్రకృతితో కలిసినందున ‘హంస’ యనగా పరబ్రహ్మమే).

  1. “సకారేణ బహిర్యాతి హకారేణ విశేత్పునః |

ప్రానస్తత్ర స ఏవాహం హంసః ఇత్యను చింతయేత్ ||”

“అపానే జుహృతి ప్రాణం ప్రాణే అపానం తథా |

ఇత్యనేన పూరక రేచకయోః ఆవర్తమానయోః హంసః ‘సోహం’ ఇత్యను లోమతః ప్రతిలోమతశ్చ అభివ్యజ్యమానాఎన అజపా మంత్రేణ తత్వ పదార్ధైక్యం వ్యతిహారేణ భావయంతి“.

(‘స’ అను అక్షరము పలికినపుడు వాయువు శరీరములోనుండి పైకి వచ్చును. ‘హా’ అను అక్షరము పలికి నపుడు మరల శరీరములోనికి ప్రవేశించును. ఆ రెండక్షరములు కలిసి (సః + హం) “సోహం” అనిన్నీ అటునుండి ఇటి అక్షరములను మార్చి పలికిన “హం సః” అని యగుచున్నది. ఈ ప్రాణవాయువు సంచారమే ‘హంస’ యని భావించవలెను).

(అపానవాయువులో ప్రాణవాయువును, ప్రాణవాయువులో అపాన వాయువును హోమము చేయుదురు. ఈ ప్రకారముగా ప్రానవాయువును రేచించుట (పైకి వదలివేయుట), పూరించుట (శరీరములోనికి పీల్చుట యనునవి ‘హం’ ‘సః’ అను అక్షరములను, అటునుండి ఇటు, ఇటునుండి అటు కలిపిన ‘హంసః’ అనిన్నీ, ‘సోహం’ (సః + అహం) అనిన్నీ యగుచున్నవి, ఇవియే “తత్ త్వం” అను పదమౌనకు అర్థమగుచున్నవి. (తత్ = ఆ పరబరహ్మ; ‘త్వం’ - నీవే) అను పరమార్థము వేదాంతసారము - మహావాక్యార్థము - అగుచున్నవి).

  1. హంస = హ + o = స - (హకారము, సకారము, అనుస్వారము) ‘హ’ కారమనగా ప్రపంచమునంతకును సృష్టి స్థితి లయములను చేయు పరబ్రహ్మ. ‘స’ కారమనగా దేహము ఇంద్రియములు మొదలగు దృశ్యపదార్థములు, అచేతనములు మొదలగునవి స్వరూపములుగా గలవి. అత్వరజస్తమములను త్రిగుణములుగలదియు, అనేకవిధములుగా, అనేక రూపములిగా మారునదియునగు ప్రకృతి, అనుస్వారము (o = సున్న) జీవ బ్రహ్మలకు అనాదిగా గల సంబంధము - ప్రకృతి పురుషులకుగల సంబంధము - ప్రకృతి పురుషుల సం యోగమువలననే సృష్టి యగుచున్నది. ప్రకృతి అనేక ఆకారములు, నామములు గల వస్తువులుగా మారుచున్నది. నామరూపములు లేని నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ప్రకృతితో కలిసి నామ రూపములు గల జీవుడైనాడు - అందుచేత హంసుడు అనగా జీవుడు - మీదను చతుర్ముఖబ్రహ్మ మొదలు క్రిందను గడ్డిపోచ వరకు గల సమస్త వస్తువులందు ఈ ప్రకృతి పరబ్రహ్మల అంశలు నిండుగా వ్యాపించియున్నవి.

  2. “భిక్షూణాం మోక్షార్థినాం కుటీచక, బహూదక, హంస, పరమ హంసశ్చేతి చత్వారః

--- అధహంసా నామ గ్రామైక రాత్రం, నగరే పంచరాత్రం క్షేత్రే సప్తరాత్రం తదుపరి నవసేత్ గోమూత్ర గోమయా వారిణో నిత్యం చాంద్రాయణ పరాయణాః యోగమార్గే మోక్షమేవ ప్రార్థయంతే - - -” (భిక్షుకోపనిషత్)

(మోక్షము కోరు సన్యాసులు నాలుగు విధములు - కుటీచకులు, బహూదకులు, హంసలు, పరమహంసలు. హంసుడు అనగా ఒక గ్రామంలో ఒక రాత్రి, ఒక నగరమందు అయిదు రాత్రులందు, క్షేత్రస్థలమందు ఏడు రాత్రులు కంటె కాలముండకూడదు. గోమూత్రము, గోమయాహరిణులు, చాంద్రాయణ వ్రతము చేయువారు, యోగ మార్గమందుండి మోక్షమునే కోరువారు).

  1. యథా హంసో నీరం క్షీరంచ పృథక్తర్తుం శక్తః ఏవం అహం గుణాం శ్చేతశ్చేత ద్యోతియితుం హంస రూపేణ ఆగతోస్మి.

(నీటిని పాలను హంస ఎట్లు వేరుచేయగలదో అట్లే నేను త్రిగుణములను మనస్సును వేఱు వేఱుగా చేయుటకు హంస రూపముతో వచ్చితిని).

  1. దోష హీనత్వాత్ ‘హం’, సారత్వాత్ ‘సః’ హం చాసౌ, సశ్చ ఇతి హంసః.

(దోషములేనివాడగుటచేత ‘హం’, సారముగలవాడగుటచేత ‘సః’ - ఈ రెండూ కలిసి “హంసః” అయినది).

  1. “హంసో జటాధారీ త్రిపుండ్రోర్థ్వ పుండ్రధారీ, అ సంక్షిప్త మధూకరాన్నాశీ కౌపీన ఖండధారీ” (సన్యాసోపనిషత్)

(జటలు ధరించినవాడు, త్రిపుండ్రము, ఊర్థ్వపుండ్రము ధరించినవాడు, మండూకరముచే సంపాదించిన అన్నము తినువాడు, గోచీపాత ధరించినవాడు హంసుడు).

  1. “ఏక దండులును, శిఖా వర్జముగా యజ్ఞోపవీతదారులును, శక్యకమండలపాణులను, గ్రామైకరాత్రవాసులును, కృచ్ఛ్రచాంద్రాయణ పరులును నగువారు హంసలు”.

  2. క్రమేణ జాగ్రదా ద్యవస్థా త్రయం హత్వా తుర్యపదం గచ్ఛతీతి హంసః. వ్యష్టితుర్యేః ప్రత్యగాత్మా, స ఏవ పరమః సర్వఓత్కృష్టః - సమష్ట్యవస్థా త్రయం హత్వా తత్తుర్యపదం గచ్చతీతి పరమహంసః.

(జాగ్రత్స్వప్న సుఖప్త్యవస్థలను క్రమముగా (ఒకదాని తర్వాత నొకటిని) నశింపచేసి, తుర్యుపదమును చేరు వాడు హంసుడు. వ్యష్టి తుర్య పదమునకు ప్రత్యగాత్మ అతనే అన్నింటికంటె ఉత్కృష్టమైనవాడు, పరమాత్మ. సమష్టి అవస్థలు మూడును నశింప చేసుకొని తుర్యపదమును చేరువాడు పరమ హంసుడు).

  1. “కేవల జ్ఞానా భ్యాస నిష్టుండగు హంసుండును” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 12 - 388)

  2. “హంసో హంస పరంపరాది మహిమాధారం జగన్మోహనం” (శ్రీకృష్ణకర్ణామృతం - 2 - 40)

Transliteration
  1. viṣṇuvu, paramātma, yati, haṃsamaṃtramu -

  2. haṃti, sarvadā gacchati iti haṃsaḥ; ādityaḥ; sūryuḍu; eḍategani gamanamu galavāḍu).

  3. “haṃti gaccati sarva śarīrēṣu itivā haṃsaḥ” (śrīśaṃkaraḥ)

(aṃdaṟi śarīramulaṃdu nuṃḍuvāḍu, saṃcariṃcuvāḍu).

  1. haṃti, gacchatīti haṃsaḥ, avidyā tatkāryaṃ vināśayatītivā haṃsaḥ.

(saṃcāramu cēyuvāḍu, lēka, avidya (ajñānamu lēka saṃsāramu), dāni kāryamulanu naśiṃpacēyuvādu)

“haṃti avidyādi baṃdhakāraṇaṃ iti haṃsaḥ”

(avidya modalagu baṃdhamunaku kāraṇamaina vāṭini naśiṃpa cēyuvāḍu).

  1. haṃti svānāṃ klēśamiti haṃsaḥ -

(tanavāri klēśamulanu - bādhalanu - naśiṃpa cēyuvāḍu).

  1. paramātma; yōgi - “haṃsō vihaṃgamē (a)pisyāt paramātmani yōgini” (iti viśvaḥ).

(haṃsa yanagā paramātma, pakṣi, yōgi yani arthamu - ani viśvanighnaṭuvu ceppucunnadi).

  1. jīvaḥ; paramahaṃsaḥ; brahma.

(jīvuḍu; paramahaṃsuḍu anu yōgi - parabrahma)

  1. haṃti gacchati iti saṃsāra kāṃtāra paryaṭana śīlatayā haṃsa śabdavācyō jīvaḥ - bhramati.

(haṃsa anagā saṃcariṃcuvāḍu kanuka saṃsāramanu aḍavilō saṃcariṃcu svabhāvamu galavāḍu ani ceppuṭacēta jīvuḍu ani arthamu).

  1. haṃsa maṃtrārtha dhyāna paraḥ -

(haṃsa maṃtrārthamunu dhyāniṃcu niṣṭha galavāḍu).

  1. “ahaṃ saḥ iti tādātmya bhāvinaḥ saṃsāra bhayaṃ haṃtīti haṃsaḥ” (śrīśaṃkaraḥ)

(ahaṃ = nēnu; saḥ - ataninē; nēnē paramātmanu; (ahaṃ brahmasmi) ani paramātmatō tādātmyabhāvamu galavāri saṃsāra bhayamunu naśiṃpacēyuvāḍu).

  1. vivēkī; sārāsāra vivēka caturaḥ; jñānī; ruddhaḥ -

(maṃci, ceḍḍa yanu vivakamu galavāḍu; sārāsāramula vivēkamunaṃdu caturuḍu, samarthuḍu;brahmajñānamu kalavāḍu; śuddhuḍu; - kalmaṣamu lēnivāḍu).

  1. “svatatva jñānēna svātiriktakalanāṃ haṃtīti haṃsaḥ; sa ēva asmi ityanu saṃdhānaṃ haṃsa yōgaḥ”

(bhagavattattvajñānamu kaligiyuṃḍuṭacēta (tānu evarō - tānē paramātma yanu jñānamu kaligi yuṃḍuṭacēta) parabrahma kāni daṃtaṭinī naśiṃpa cēyuvāḍu - aṭṭi paramātma nēnē ayitini ani anusaṃdhānamu cēyuṭayē haṃsa yōgamu).

  1. svāti rikta kalanā sarvasvaṃ hatvā svamātramavaśiṣyatē iti haṃsaḥ -

(paramātma kānidāninaṃtaṭini naśiṃpacēsi tānokkaḍē migiliyuṃḍuvāḍu).

  1. “jāgradādyabhimānaṃ kramēṇagatvā, hitvā, jñāna vijñānābhyāṃ sarvaṃ, hatvā turīyaṃ gacchati; samyak jñānēna tadapi hatvā turīyātītaṃ svamātra tayā gacchatīti, vā, haṃsaḥ; paramātmā”.

(jāgradavastha, svapnāvastha, suṣuptyavastha anu mūḍu avasthala abhimānamu poṃdi, vāṭini viḍicipeṭṭi jñāna vijñānamulacēta anniṃṭinī naśiṃpacēsi, turīyāvasthanu poṃdunu. samyak jñānamucēta ā turīyamunu kūḍa naśiṃpacēsi, turīyamunakatītamaina ātma mātramugā nuṃḍuvāḍu haṃsuḍu - paramātma).

  1. “haṃ” śabdēna tatpadārthaḥ; ‘sa’ śabdēna tvaṃ padārthaḥ tayōḥ vyatihārōccāraṇaṃ ‘asi’ padārthaṃ.

(haṃsa anu māṭalōni ‘haṃ’ anumāta “tatvamasi” anu mahāvākyamulōni (tat + tvaṃ + asi) tat anu māṭaku arthamu - (‘tat’ anu māṭaku badulugā nunnadi) tat anagā parabrahma - ‘ōṃ tat sat’ anu mūḍu padamūlacētanu bhagavaṃtuḍē nirdēśiṃpabaḍucunnāḍu ani (śrīmadbhagavadgīta - 17 – 23) lō “haṃsaḥ” anu vākyamulōni “saḥ” anu māṭa paina ceppina mahāvākyamulōni ‘tvaṃ’ (nīvu) anu māṭaku arthamu agunu. ‘haṃsa’ anu reṃḍu akṣaramulu vyatirēkamugā (muṃdudi venukanu, vanukadi muṃdugānu) uccariṃcina adi ā mahāvākyamulōni ‘asi’ (ayitivi - ayi yunnāvu) ani dāniki arthamu. ahaṃ saḥ; ahaṃsō - sō(a)haṃ = atanē nēnu).

  1. “hakāraḥ paramēśasyāt tatpadaṃ cēti niścitaṃ |

sakāraḥ khēcarē prōktastvaṃ padaṃ cēti niścitaṃ |

sakārō sakārōdhyāyatē jaṃtuḥ hakārō hi bhavade ddhṛvaṃ ||“.

(‘haṃsa’ anu māṭalōni ‘ha’ kāramu paramēśvaruḍu - adiyē “tatvamasi” yanu mahāvākyamu (tat + tvaṃ + asi) lōni tatpadamunakarthamu. ā ‘haṃsa’ yanu padamulōni ‘sa’ anu māṭaku mahāvākyamulōni tvaṃ padamunakarthamu. ‘sa’ kāramunu dhyāniṃcu jīvuḍu ‘ha’ kāramē yagunu - jīvuḍu (jīvātma) paramātmayē yagunu - muktini poṃdunu).

(‘ha’ kāramu parabrahma svarūpamu; ‘sa’ kāramu mūla prakṛti lēka dēvi. ī raṃḍu akṣaramulaku madhya nuṃḍu biduvu (o = sunna; anusvāramu) (‘haṃsa’ lōni madhya biṃduvu prakṛti puruṣula tādātmyasaṃbaṃdhamu - parabrahmayē prakṛtitō kalisinaṃduna ‘haṃsa’ yanagā parabrahmamē).

  1. “sakārēṇa bahiryāti hakārēṇa viśētpunaḥ |

prānastatra sa ēvāhaṃ haṃsaḥ ityanu ciṃtayēt ||”

“apānē juhṛti prāṇaṃ prāṇē apānaṃ tathā |

ityanēna pūraka rēcakayōḥ āvartamānayōḥ haṃsaḥ ‘sōhaṃ’ ityanu lōmataḥ pratilōmataśca abhivyajyamānāena ajapā maṃtrēṇa tatva padārdhaikyaṃ vyatihārēṇa bhāvayaṃti”.

(‘sa’ anu akṣaramu palikinapuḍu vāyuvu śarīramulōnuṃḍi paiki vaccunu. ‘hā’ anu akṣaramu paliki napuḍu marala śarīramulōniki pravēśiṃcunu. ā reṃḍakṣaramulu kalisi (saḥ + haṃ) “sōhaṃ” aninnī aṭunuṃḍi iṭi akṣaramulanu mārci palikina “haṃ saḥ” ani yagucunnadi. ī prāṇavāyuvu saṃcāramē ‘haṃsa’ yani bhāviṃcavalenu).

(apānavāyuvulō prāṇavāyuvunu, prāṇavāyuvulō apāna vāyuvunu hōmamu cēyuduru. ī prakāramugā prānavāyuvunu rēciṃcuṭa (paiki vadalivēyuṭa), pūriṃcuṭa (śarīramulōniki pīlcuṭa yanunavi ‘haṃ’ ‘saḥ’ anu akṣaramulanu, aṭunuṃḍi iṭu, iṭunuṃḍi aṭu kalipina ‘haṃsaḥ’ aninnī, ‘sōhaṃ’ (saḥ + ahaṃ) aninnī yagucunnavi, iviyē “tat tvaṃ” anu padamaunaku arthamagucunnavi. (tat = ā parabarahma; ‘tvaṃ’ - nīvē) anu paramārthamu vēdāṃtasāramu - mahāvākyārthamu - agucunnavi).

  1. haṃsa = ha + o = sa - (hakāramu, sakāramu, anusvāramu) ‘ha’ kāramanagā prapaṃcamunaṃtakunu sṛṣṭi sthiti layamulanu cēyu parabrahma. ‘sa’ kāramanagā dēhamu iṃdriyamulu modalagu dṛśyapadārthamulu, acētanamulu modalagunavi svarūpamulugā galavi. atvarajastamamulanu triguṇamulugaladiyu, anēkavidhamulugā, anēka rūpamuligā mārunadiyunagu prakṛti, anusvāramu (o = sunna) jīva brahmalaku anādigā gala saṃbaṃdhamu - prakṛti puruṣulakugala saṃbaṃdhamu - prakṛti puruṣula saṃ yōgamuvalananē sṛṣṭi yagucunnadi. prakṛti anēka ākāramulu, nāmamulu gala vastuvulugā mārucunnadi. nāmarūpamulu lēni nirākāra nirguṇa parabrahma prakṛtitō kalisi nāma rūpamulu gala jīvuḍaināḍu - aṃducēta haṃsuḍu anagā jīvuḍu - mīdanu caturmukhabrahma modalu kriṃdanu gaḍḍipōca varaku gala samasta vastuvulaṃdu ī prakṛti parabrahmala aṃśalu niṃḍugā vyāpiṃciyunnavi.

  2. “bhikṣūṇāṃ mōkṣārthināṃ kuṭīcaka, bahūdaka, haṃsa, parama haṃsaścēti catvāraḥ

--- adhahaṃsā nāma grāmaika rātraṃ, nagarē paṃcarātraṃ kṣētrē saptarātraṃ tadupari navasēt gōmūtra gōmayā vāriṇō nityaṃ cāṃdrāyaṇa parāyaṇāḥ yōgamārgē mōkṣamēva prārthayaṃtē - - -” (bhikṣukōpaniṣat)

(mōkṣamu kōru sanyāsulu nālugu vidhamulu - kuṭīcakulu, bahūdakulu, haṃsalu, paramahaṃsalu. haṃsuḍu anagā oka grāmaṃlō oka rātri, oka nagaramaṃdu ayidu rātrulaṃdu, kṣētrasthalamaṃdu ēḍu rātrulu kaṃṭe kālamuṃḍakūḍadu. gōmūtramu, gōmayāhariṇulu, cāṃdrāyaṇa vratamu cēyuvāru, yōga mārgamaṃduṃḍi mōkṣamunē kōruvāru).

  1. yathā haṃsō nīraṃ kṣīraṃca pṛthaktartuṃ śaktaḥ ēvaṃ ahaṃ guṇāṃ ścētaścēta dyōtiyituṃ haṃsa rūpēṇa āgatōsmi.

(nīṭini pālanu haṃsa eṭlu vērucēyagaladō aṭlē nēnu triguṇamulanu manassunu vēṟu vēṟugā cēyuṭaku haṃsa rūpamutō vaccitini).

  1. dōṣa hīnatvāt ‘haṃ’, sāratvāt ‘saḥ’ haṃ cāsau, saśca iti haṃsaḥ.

(dōṣamulēnivāḍaguṭacēta ‘haṃ’, sāramugalavāḍaguṭacēta ‘saḥ’ - ī reṃḍū kalisi “haṃsaḥ” ayinadi).

  1. “haṃsō jaṭādhārī tripuṃḍrōrthva puṃḍradhārī, a saṃkṣipta madhūkarānnāśī kaupīna khaṃḍadhārī” (sanyāsōpaniṣat)

(jaṭalu dhariṃcinavāḍu, tripuṃḍramu, ūrthvapuṃḍramu dhariṃcinavāḍu, maṃḍūkaramucē saṃpādiṃcina annamu tinuvāḍu, gōcīpāta dhariṃcinavāḍu haṃsuḍu).

  1. “ēka daṃḍulunu, śikhā varjamugā yajñōpavītadārulunu, śakyakamaṃḍalapāṇulanu, grāmaikarātravāsulunu, kṛcchracāṃdrāyaṇa parulunu naguvāru haṃsalu”.

  2. kramēṇa jāgradā dyavasthā trayaṃ hatvā turyapadaṃ gacchatīti haṃsaḥ. vyaṣṭituryēḥ pratyagātmā, sa ēva paramaḥ sarvaōtkṛṣṭaḥ - samaṣṭyavasthā trayaṃ hatvā tatturyapadaṃ gaccatīti paramahaṃsaḥ.

(jāgratsvapna sukhaptyavasthalanu kramamugā (okadāni tarvāta nokaṭini) naśiṃpacēsi, turyupadamunu cēru vāḍu haṃsuḍu. vyaṣṭi turya padamunaku pratyagātma atanē anniṃṭikaṃṭe utkṛṣṭamainavāḍu, paramātma. samaṣṭi avasthalu mūḍunu naśiṃpa cēsukoni turyapadamunu cēruvāḍu parama haṃsuḍu).

  1. “kēvala jñānā bhyāsa niṣṭuṃḍagu haṃsuṃḍunu” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 12 - 388)

  2. “haṃsō haṃsa paraṃparādi mahimādhāraṃ jaganmōhanaṃ” (śrīkṛṣṇakarṇāmṛtaṃ - 2 - 40)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.