← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హరః haraḥ

Original — తెలుగు
  1. సర్వాణి దుఃఖాని పాపాని హరతీతి హరః -

(సమస్తమైన దుఃఖములను - పాపములను - హరించువాడు - హరుడు - శివుడు).

  1. భక్తానాం జ్ఞానా జ్ఞానకృత మానసిక, వచిక, కాయిక పాపహరీ భగవన్ సాంబశివః

(భక్తులయొక్క తెలిసి చేసిన పాపములను, తెలియక చేసిన పాపములను, మనస్సులో చేసినది, చెడు ఆలోచనలతో చేసినది, వాక్కుకు సంబంధించినవి, శరీరముతో చేసినవి - అగు సమస్త పాపములను హరించువాడు - అంబ అయిన పార్వతీదేవితో కూడియుండువాడు - శివుడు).

  1. ‘అచిద్వర్గం స్వాత్మనో భోగ్యత్వేన హరతీతి భోక్తా హరః ఇత్యుచ్యతే –’. (శ్రీమాన్ రామానుజః)

(జడ పదార్థములన్నింటినీ తనకు భోగ్యమైనవని వాటిని భోగించువాడు - తినువాడు - ఆహరించువాడు - భోక్త). (అత్తి = తినువాడు కనుక ఆత్మ)

  1. అవిద్యాదేర్హరణాత్ హరః -

(అవిద్య (అజ్ఞానము) మొదలగువాటిని హరించువాడు).

  1. “ప్రసంగాత్ కౌతుకాల్లోభాత్ భయాదజ్ఞాన తోపివా |

‘హర’ ఇత్యుచ్చరన్ మర్త్యః సర్వ పాపైః ప్రముచ్యతే ||“.

(ప్రసంగవశమున కాని, భయమువలన గాని, అజ్ఞానము వలన గాని ‘హర’ అని ఉచ్చరించు మనుజుడు అన్ని విధములయిన పాపములనుండి విముక్తుడగును).

Transliteration
  1. sarvāṇi duḥkhāni pāpāni haratīti haraḥ -

(samastamaina duḥkhamulanu - pāpamulanu - hariṃcuvāḍu - haruḍu - śivuḍu).

  1. bhaktānāṃ jñānā jñānakṛta mānasika, vacika, kāyika pāpaharī bhagavan sāṃbaśivaḥ

(bhaktulayokka telisi cēsina pāpamulanu, teliyaka cēsina pāpamulanu, manassulō cēsinadi, ceḍu ālōcanalatō cēsinadi, vākkuku saṃbaṃdhiṃcinavi, śarīramutō cēsinavi - agu samasta pāpamulanu hariṃcuvāḍu - aṃba ayina pārvatīdēvitō kūḍiyuṃḍuvāḍu - śivuḍu).

  1. ‘acidvargaṃ svātmanō bhōgyatvēna haratīti bhōktā haraḥ ityucyatē –’. (śrīmān rāmānujaḥ)

(jaḍa padārthamulanniṃṭinī tanaku bhōgyamainavani vāṭini bhōgiṃcuvāḍu - tinuvāḍu - āhariṃcuvāḍu - bhōkta). (atti = tinuvāḍu kanuka ātma)

  1. avidyādērharaṇāt haraḥ -

(avidya (ajñānamu) modalaguvāṭini hariṃcuvāḍu).

  1. “prasaṃgāt kautukāllōbhāt bhayādajñāna tōpivā |

‘hara’ ityuccaran martyaḥ sarva pāpaiḥ pramucyatē ||“.

(prasaṃgavaśamuna kāni, bhayamuvalana gāni, ajñānamu valana gāni ‘hara’ ani uccariṃcu manujuḍu anni vidhamulayina pāpamulanuṃḍi vimuktuḍagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.