← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హరిః hariḥ

Original — తెలుగు
  1. విష్ణువు; సింహము,; కోతి; ఏనుగు; సూర్యుడు; ఇంద్రుడు; యముడు.

  2. హరతీతి హరిః

(హరించువాడు - సంహారము చేయువాడు)

  1. భక్తానాం పాపానాం హరతీతి హరిః -

(భక్తుల పాపములను హరించువాడు, పోగొట్టువాడు).

  1. ఆశ్రిత పాపహరః -

(భక్తుల పాపములను హరించువాడు, పోగొట్టువాడు)

  1. హరిర్హరతి పపాని దుష్ట చిత్తైరపి స్మృతః |

అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పాపకః ||. (విష్ణుపురాణే)

(దురాత్ములైనను స్మరణచేసినంతమాత్రమున హరి పాపములను సంహరించువాడు - కోరిముట్టినను, కోరక ముట్టినను అగ్ని దహించునట్లే).

  1. హరి యను రెండక్షరములు

హరియించును పాతకముల నంబుజనభా

హరి నీ నామ మహాత్మ్యము

హరి, హరి, పొగడంగ వశమె, హరి శ్రీకృష్ణా||. (శ్రీమదాంధ్రమహాభాగవతము -)

  1. స్మృతి మాత్రేణపాపం పుంసాం హరతీతి హరిః -

(తలచినంతమాత్రమున పురుషుల పాపములను హరించువాడు)

  1. హరతి అశేషం అజ్ఞానం.తత్కార్యం ఇతి హరిః -

(అజ్ఞానమును, దాని కార్యమును పూర్తిగా హరించువాడు, పోగొట్టువాడు).

  1. పాప అజ్ఞాన యోః హర్తారః -

(పాపములను అజ్ఞానమును పోగొట్టువాడు).

  1. హరతి అవిద్యాం సకార్యం ఇతి హరిః -

(అవిద్యను దానికార్యముతో కూడ హరించువాడు)

  1. అవిద్యాదే ర్హరణాత్ పరమేశ్వరో హరిః

(అవిద్య మొదలగువాటిని హరించువాడుకనుక పరమేశ్వరుడు హరియని చెప్పబడుచున్నాడు)

  1. హరతి సర్వమాశ్రితానాం దుఃఖం ఇతివా హరిః -

(భక్తుల దుఃఖమునంతను హరించువాడు - పోగొట్టువాడు).

  1. భక్తానాం సర్వక్లేశాపహారీ ఇతి హరిః -

(భక్తులయొక్క సమస్త క్లేశములను - అన్ని బాధలను హరించువాడు).

  1. సమూలం సంసారం హరతీతి హరిః -

(జననమరణరూపమైన సంసారమును, దాని కారణముతోకూడ లేకుండ చేయువాడు)

  1. జగదఖిలార్తిహరం హరా ప్రపద్యే -

(జగత్తుయొక్క బాధలన్నింటిని హరించువాడు)

  1. హరతి భక్తానాం క్లేశం భజనాను సారేణ ఇతి హరిః - తచ్చోక్తం శ్రీమద్భగవద్గీతే -

“హృద్యంతస్థో హ్య భద్రాణాం విధునోతి సుహృత్సతాం” ఇతి.

(భక్తులు తనను ఏ విధముగా భజించెదరో దానిని బట్టి భక్తుల హృదయమునందుండి వారి బాధలను పోగొట్టువాడు - అని శ్రీమద్భగవద్గీతలో చెప్పబడినది).

  1. లోక త్రయస్య మహితీం ఆర్తిం యథా ఆ హరత్ - యేన కారణేన స్వయంభువేన మనునా స్వయంభువ నామ్నా హరిః ఇత్యనూక్తః, నిఖిల లోకార్తి హరిణాత్ హేతో హరిః ఇత్యనూక్తః హరిరితి నామా నిర్దిష్టః.

(మూడు లోకముల బాధను హరించినవాడు. అందుచేత స్వయంభువమనువు భగవంతుని హరి యని చెప్పెను)

  1. స్వాతిరిక్తా విద్యా పద తత్కార్య జతం స్వావశేషతయా హరతీతి హరిః -

(తనకంటె అతిరిక్తమైన అవిద్య దాని కార్య వస్తువులన్నింటిని తాను ఒక్కడే ంగిలియుండునట్లుగా సంహరించువాడు)

  1. “హరామ్యహంచ స్మర్తృఊణాం హరిర్భాగం క్రతుష్టహరం |

వర్ణశ్చమే హరిః శ్రేష్టస్తస్మా ద్ధరి రహం స్మృతః ||“. (ఇతి భగవద్వచనాత్)

(నన్ను స్మరించు వారి పాపములను, యజ్ఞములలోని హవిర్భాగమును హరించుట చేతను, నా వర్ణము (రంగు) ను బట్టియు హరి యని నేను చెప్పబడుచున్నాను).

  1. హరతి ప్రాపయతి సర్వం ఆశ్రితాన్ ఇతి హరిః.

(నన్ను ఆశ్రయించి యుండువారలకు - నా భక్తులకు - అన్నింటిని పొందింపచేయువాడు)

  1. క. హరి మయము విశ్వమంతయు

హరి విశ్వమయుండు, సంశయము పనిలేదా

హరిమయము గాని ద్రవ్యము

పరమాణువు లేదు వంశపావన, వింటే. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 17)

(ఈ విశ్వమంతటిలోను - ప్రపంచమంతటిలోను - దానిలోని ప్రతి వస్తువులోను హరి - (భగవంతుడు) లోన పైన పూర్తిగా నిండియున్నాడు. భగవంతునిలో ఈ విశ్వమంతయు సూక్ష్మరూపములో నిమిడి యున్నది. భగవంతుడు పూర్తిగా నిండియుండని వస్తువు పరమాణువైనను లేదు).

  1. “పారిజాత హరం పాపహరం గోపీమనో హరం |

గోపీ వస్త్రహరం గోపం శ్రీనివాసం భ్జే (అ)నిశం ||“. (శ్రీవెంకటేశ మహాత్మ్యము - 3 - 28)

(పాపమును హరించువాడు, పారిజాత వృక్షమును హరించినవాడు, గోపికల వస్త్రములను హరించినవాడు, గోపికల మనస్సును హరించినవాడు కనుక హరి –

“నవ్వు రా |

జిల్లెడి మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో |

మల్లియలార |

మీ పొదల మాటున లేడుకదమ్మ చెప్పరే ||“.

  1. “తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |

స బ్రహ్మ స శివ స్స హరిస్సేంద్ర స్సో(అ)క్షరః పరమ స్స్వరాట్ ||“. (మంత్రపుష్పము)

(అతనే బ్రహ్మ, అతనే శివుడు, అతనే హరి, అతనే అక్షరుడు, ఉత్కృష్టమైనవాడు, స్వయముగా ప్రకాశించువాడు).

Transliteration
  1. viṣṇuvu; siṃhamu,; kōti; ēnugu; sūryuḍu; iṃdruḍu; yamuḍu.

  2. haratīti hariḥ

(hariṃcuvāḍu - saṃhāramu cēyuvāḍu)

  1. bhaktānāṃ pāpānāṃ haratīti hariḥ -

(bhaktula pāpamulanu hariṃcuvāḍu, pōgoṭṭuvāḍu).

  1. āśrita pāpaharaḥ -

(bhaktula pāpamulanu hariṃcuvāḍu, pōgoṭṭuvāḍu)

  1. harirharati papāni duṣṭa cittairapi smṛtaḥ |

aniccayāpi saṃspṛṣṭō dahatyēvahi pāpakaḥ ||. (viṣṇupurāṇē)

(durātmulainanu smaraṇacēsinaṃtamātramuna hari pāpamulanu saṃhariṃcuvāḍu - kōrimuṭṭinanu, kōraka muṭṭinanu agni dahiṃcunaṭlē).

  1. hari yanu reṃḍakṣaramulu

hariyiṃcunu pātakamula naṃbujanabhā

hari nī nāma mahātmyamu

hari, hari, pogaḍaṃga vaśame, hari śrīkṛṣṇā||. (śrīmadāṃdhramahābhāgavatamu -)

  1. smṛti mātrēṇapāpaṃ puṃsāṃ haratīti hariḥ -

(talacinaṃtamātramuna puruṣula pāpamulanu hariṃcuvāḍu)

  1. harati aśēṣaṃ ajñānaṃ.tatkāryaṃ iti hariḥ -

(ajñānamunu, dāni kāryamunu pūrtigā hariṃcuvāḍu, pōgoṭṭuvāḍu).

  1. pāpa ajñāna yōḥ hartāraḥ -

(pāpamulanu ajñānamunu pōgoṭṭuvāḍu).

  1. harati avidyāṃ sakāryaṃ iti hariḥ -

(avidyanu dānikāryamutō kūḍa hariṃcuvāḍu)

  1. avidyādē rharaṇāt paramēśvarō hariḥ

(avidya modalaguvāṭini hariṃcuvāḍukanuka paramēśvaruḍu hariyani ceppabaḍucunnāḍu)

  1. harati sarvamāśritānāṃ duḥkhaṃ itivā hariḥ -

(bhaktula duḥkhamunaṃtanu hariṃcuvāḍu - pōgoṭṭuvāḍu).

  1. bhaktānāṃ sarvaklēśāpahārī iti hariḥ -

(bhaktulayokka samasta klēśamulanu - anni bādhalanu hariṃcuvāḍu).

  1. samūlaṃ saṃsāraṃ haratīti hariḥ -

(jananamaraṇarūpamaina saṃsāramunu, dāni kāraṇamutōkūḍa lēkuṃḍa cēyuvāḍu)

  1. jagadakhilārtiharaṃ harā prapadyē -

(jagattuyokka bādhalanniṃṭini hariṃcuvāḍu)

  1. harati bhaktānāṃ klēśaṃ bhajanānu sārēṇa iti hariḥ - taccōktaṃ śrīmadbhagavadgītē -

“hṛdyaṃtasthō hya bhadrāṇāṃ vidhunōti suhṛtsatāṃ” iti.

(bhaktulu tananu ē vidhamugā bhajiṃcedarō dānini baṭṭi bhaktula hṛdayamunaṃduṃḍi vāri bādhalanu pōgoṭṭuvāḍu - ani śrīmadbhagavadgītalō ceppabaḍinadi).

  1. lōka trayasya mahitīṃ ārtiṃ yathā ā harat - yēna kāraṇēna svayaṃbhuvēna manunā svayaṃbhuva nāmnā hariḥ ityanūktaḥ, nikhila lōkārti hariṇāt hētō hariḥ ityanūktaḥ haririti nāmā nirdiṣṭaḥ.

(mūḍu lōkamula bādhanu hariṃcinavāḍu. aṃducēta svayaṃbhuvamanuvu bhagavaṃtuni hari yani ceppenu)

  1. svātiriktā vidyā pada tatkārya jataṃ svāvaśēṣatayā haratīti hariḥ -

(tanakaṃṭe atiriktamaina avidya dāni kārya vastuvulanniṃṭini tānu okkaḍē ṃgiliyuṃḍunaṭlugā saṃhariṃcuvāḍu)

  1. “harāmyahaṃca smartṛūṇāṃ harirbhāgaṃ kratuṣṭaharaṃ |

varṇaścamē hariḥ śrēṣṭastasmā ddhari rahaṃ smṛtaḥ ||“. (iti bhagavadvacanāt)

(nannu smariṃcu vāri pāpamulanu, yajñamulalōni havirbhāgamunu hariṃcuṭa cētanu, nā varṇamu (raṃgu) nu baṭṭiyu hari yani nēnu ceppabaḍucunnānu).

  1. harati prāpayati sarvaṃ āśritān iti hariḥ.

(nannu āśrayiṃci yuṃḍuvāralaku - nā bhaktulaku - anniṃṭini poṃdiṃpacēyuvāḍu)

  1. ka. hari mayamu viśvamaṃtayu

hari viśvamayuṃḍu, saṃśayamu panilēdā

harimayamu gāni dravyamu

paramāṇuvu lēdu vaṃśapāvana, viṃṭē. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 17)

(ī viśvamaṃtaṭilōnu - prapaṃcamaṃtaṭilōnu - dānilōni prati vastuvulōnu hari - (bhagavaṃtuḍu) lōna paina pūrtigā niṃḍiyunnāḍu. bhagavaṃtunilō ī viśvamaṃtayu sūkṣmarūpamulō nimiḍi yunnadi. bhagavaṃtuḍu pūrtigā niṃḍiyuṃḍani vastuvu paramāṇuvainanu lēdu).

  1. “pārijāta haraṃ pāpaharaṃ gōpīmanō haraṃ |

gōpī vastraharaṃ gōpaṃ śrīnivāsaṃ bhjē (a)niśaṃ ||“. (śrīveṃkaṭēśa mahātmyamu - 3 - 28)

(pāpamunu hariṃcuvāḍu, pārijāta vṛkṣamunu hariṃcinavāḍu, gōpikala vastramulanu hariṃcinavāḍu, gōpikala manassunu hariṃcinavāḍu kanuka hari –

“navvu rā |

jilleḍi mōmuvāḍokaḍu celvala mānadhanaṃbu deccenō |

malliyalāra |

mī podala māṭuna lēḍukadamma cepparē ||“.

  1. “tasyāḥ śikhāyā madhyē paramātmā vyavasthitaḥ |

sa brahma sa śiva ssa harissēṃdra ssō(a)kṣaraḥ parama ssvarāṭ ||“. (maṃtrapuṣpamu)

(atanē brahma, atanē śivuḍu, atanē hari, atanē akṣaruḍu, utkṛṣṭamainavāḍu, svayamugā prakāśiṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.