← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హిరణ్మయాండము hiraṇmayāṃḍamu

Original — తెలుగు
  1. “సీ. ఒనర నేబదికోట్లయోజనమ్ములు గర్భ గోళము, దళమొక కోటి యోజ

నంబులు గలిగివర్ణ్యంబై హిరణ్మయాండంబు దీపించు నున్నతి దనర్చి

నయ్యండమునకు జలానలానిలవియత్ప్రభృతి సప్తావృతి ప్రతిభ దనరు

భువి యాదిగా సప్త భావన పర్యంతమ్ము దగ నూర్ధ్వలోక సప్తకము వెలయు

నతల వితలాది సంజ్ఞల నమరి క్రింద

జగములొకయేడు గలవు విశాలలీల,

నిండు భువిదక్క దక్కిన ఒందుపట్లు

పుణ్యపరిపాక లభ్యముల్ భూవరేణ్య “. (కులశేఖరమహీపాల చరిత్ర - 2 - 112)

  1. సీ. - - - మయాయుక్త పురుషవరుడు

కాలాత్మకుడు నను కారణంబున నిర్వికారుడైనట్టి జగన్నివాసు

డాది జాత క్షోభుడయ్యె; నమ్మేటివలనను గుణత్రయంబును జనించె

నా గుణత్రయంబునందయ్యె మహత్తత్త్వమది రజోగుణహేతువైన, దని

తే. యందహంకారమొగి త్రిగుణాత్మకమున

బొడమె; మఱిదానివలన బ్రభూతమయ్యె

బంచతన్మాత్ర లందు సంభవమునొం దె

భూత పంచకమీ సృష్టి హేతువగుచు.

“వ. అవియును దమలోన బ్రత్యేకంబు భువ్న నిర్మాణకంబునకు సమర్థంబులుగాక; యన్నిటి సంఘాతంబున బాంచభౌతికంబైన హిరణ్మయాండంబు సృజియించె. అదియును జలాంతర్వర్తియై వృద్ధిపొందుచుండె”. (శ్రీమధాంధ్రమహాభాగవతము - 3 - 20 - 717, 718) (చూడుము - ‘బ్రహ్మాండము’)

Transliteration
  1. “sī. onara nēbadikōṭlayōjanammulu garbha gōḷamu, daḷamoka kōṭi yōja

naṃbulu galigivarṇyaṃbai hiraṇmayāṃḍaṃbu dīpiṃcu nunnati danarci

nayyaṃḍamunaku jalānalānilaviyatprabhṛti saptāvṛti pratibha danaru

bhuvi yādigā sapta bhāvana paryaṃtammu daga nūrdhvalōka saptakamu velayu

natala vitalādi saṃjñala namari kriṃda

jagamulokayēḍu galavu viśālalīla,

niṃḍu bhuvidakka dakkina oṃdupaṭlu

puṇyaparipāka labhyamul bhūvarēṇya “. (kulaśēkharamahīpāla caritra - 2 - 112)

  1. sī. - - - mayāyukta puruṣavaruḍu

kālātmakuḍu nanu kāraṇaṃbuna nirvikāruḍainaṭṭi jagannivāsu

ḍādi jāta kṣōbhuḍayye; nammēṭivalananu guṇatrayaṃbunu janiṃce

nā guṇatrayaṃbunaṃdayye mahattattvamadi rajōguṇahētuvaina, dani

tē. yaṃdahaṃkāramogi triguṇātmakamuna

boḍame; maṟidānivalana brabhūtamayye

baṃcatanmātra laṃdu saṃbhavamunoṃ de

bhūta paṃcakamī sṛṣṭi hētuvagucu.

“va. aviyunu damalōna bratyēkaṃbu bhuvna nirmāṇakaṃbunaku samarthaṃbulugāka; yanniṭi saṃghātaṃbuna bāṃcabhautikaṃbaina hiraṇmayāṃḍaṃbu sṛjiyiṃce. adiyunu jalāṃtarvartiyai vṛddhipoṃducuṃḍe”. (śrīmadhāṃdhramahābhāgavatamu - 3 - 20 - 717, 718) (cūḍumu - ‘brahmāṃḍamu’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.