← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హిరణ్యగర్భః hiraṇyagarbhaḥ

Original — తెలుగు
  1. హిరణ్యం సకల జగదుత్పాదక శక్తిః, సమస్త సమూహోవా, గర్భే యస్య సః; హిరణ్యగర్భః; బ్రహ్మ.

(హిరణ్యమనగా సమస్తమైన జగత్తును పుట్టించు శక్తి; లేక జగత్తు అంతా, లేక, జగత్తులోనున్న వస్తువులన్నియు గర్భమందు కలవాడు - చతుర్ముఖబ్రహ్మ).

  1. హిరణ్మయ రూపబ్రహ్మాండం గర్భే యస్య సః; హిరణ్యాత్మకం బ్రహ్మాండం గర్భో యస్య సః -

(హిరణ్మయమైన, లేక, హిరణ్మయరూపమైన, బ్రహ్మాండము తన గర్భమందు గలవాడు; లేక, అట్టి బ్రహ్మాండము గర్భముగా గలవాడు - పుట్టిన చోటుగాగా గలవాడు - సమస్త జగత్తు పుట్టుటకు వీలయిన శక్తి ఉపాదానముగా (కుండ చేయుటకు మట్టివలె) కలవాడు).

  1. చతుర్ముఖబ్రహ్మ-

(సృష్టిలోనున్న వస్తువులన్నింటికి ఉపాదానమై, భగవంతుని చిచ్ఛక్తితోకూడి సృష్టి చేయుటకు తగిన స్థితిలో నున్న ప్రకృతి. తనలోనుండి మహత్తత్వము మొదలగు తత్వములను పుట్టించునది, లేక, ప్రపంచముగా మారునది).

  1. ‘హిరణ్య గర్భః ఇతి యత్ హిరణ్యాండ సముద్భవః’. (దేవీభాగవతము)

(హిరణ్మయమై అండాకారముగానుండు ప్రకృతినుండి పుట్టినది. అటువంటి ప్రకృతియొక్క మార్పు, పరిణామము)

  1. హిరణమయాండ వర్తిత్వాత్ హిరణ్యగర్భః - బ్రహ్మ విరించి, తదాత్మా.

(హిరణ్మయమైన అండాకారముగనుండు దానిలో నుండువాడు - చతుర్ముఖబ్రహ్మ, విరించి, చతుర్ముఖబ్రహ్మ స్వరూపము).

(బంగారు మయమైన అండము, లేక, అండాకారముగా నున్నదానిలోనుండు వాడు - ఈ హిరణ్మయాండమే బ్రహ్మాండము - అండాకారములో (కోడిగ్రుడ్డు ఆకారములో నుండుబ్రహ్మ, పరబ్రహ్మయొక్క చైతన్యశక్తితో కలిసి సృష్టి చేయుటకు వీలగు అవస్థలోనున్న ప్రకృతి).

  1. హిరణ్యగర్భః సంభూతకారణం, హిరణ్మయం అండం యద్వీర్యసంభూతం తదస్య గర్భః ఇతి హిరణ్య గర్భః (శ్రీశంకరః)

(ప్రపంచసృష్టికి కారణమైన అండము - తన వీర్యమువలన సృష్టించు శక్తి కలిగినది కనుక అది తన గర్భమందు కలవాడు).

  1. హిరణ్యం హిరణ్మయాండం తస్య గర్భో హిరణ్యగర్భః - బ్రహ్మాండోదరవర్తీ ఇతయర్థః; యద్వా హిత రమణీయం గర్భ, అంతఃకరణం యస్యాసౌ హిరణ్య గర్భః.

(హిరణ్మయాండము - జగత్తును సృష్టించకలుగు శక్తి, ఉపాదానము కలిసి అండాకారముగనున్న గర్భములోపల వర్తించువాడు, లేక, రమణీయమైన ప్రియమును కలిగించు అంతఃకరణము గలవాడు)

  1. హిరణ్యం సకల జగదుత్పాతిక సమష్టి జీవజాతం తత్ గర్భే యస్య సః హిరణ్య గర్భః -

(హిరణ్యము అనగా జగత్తును పుటించు సూక్ష్మరూపములోనున్న జీవుల సమష్టిరూపము - అది తనగర్భమందు కలవాడు).

  1. సకల జగదుత్పత్తి స్థితిలయ కర్తా బ్రహ్మవిష్ణు శివ రూపో హిరణ్యగర్భః -

(జగత్తునంతటిని సృష్టించి, పోషించి నశింపచేయువాడు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తుల రూపుడైనవాడు).

  1. హిరణ్యగర్భో నామ మూర్తిత్రయా దన్యః ప్రధమో జీవః –

“స వై శరీరే ప్రధమః స వై పురుష ఉచ్యతే, ఆది కర్తా స భూతానాం బ్రహ్మాగ్రే సమవర్తత ||”.

(హిరణ్యగర్భుడు అనగా త్రిమూర్తులకంటె వేఱైన మొదటి జీవుడు - ఇందు గుఱించి శ్రుతి ఇట్లు చెప్పుచున్నది - అతనే శరీరముగల మొదటి వాడు, అతనే పురుషుడని చెప్పబడుచున్నాడు - శరీరమను పురమందు శయనించువాడు - ప్రకృతియను భూతములను మొదట సృజించినవాడు. అతనే మొదట ఉండెను).

  1. “యోబ్రహ్మణం విదధాతి పూర్వం” (శ్వేతాశ్వతరోపనిషత్ - 6 - 15)

ఇత్యాది శ్రుతిః -

(ఎవరు పూర్వము బ్రహ్మను విధించెనో - అని శ్రుతి చెప్పుటవలన హిరణ్యగర్భుడు సృష్టి చేయు బ్రహ్మయని తెలియుచున్నది).

  1. “జీవబ్రహ్మలకు భేదములేదు - అను మొదలగు వ్యవహారము ఇందు వ్యష్టి వ్యవహారమునకు నాధారమగువానిని జీవుడనియు, సమష్టివ్యవహారమునకు ఆధారభూతమగు సామాన్యమును హిరణ్యగర్భుడనియు చెప్పుచున్నారు.

  2. “జ్యోతిర్వై హిరణ్యం, తేజోవై హిరణ్యం” ఇత్యైతరేయ శతపథ బ్రాహ్మణే; హిరణ్యాని సూర్యాదీని తేజాంసి గర్భే యస్య, తథా సూర్యా దీనాం తేజసాం యోగర్భో (అ)ధిష్ఠానం స హిరణ్యగర్భః.

(ఐతరేయ శ అపథ బ్రాహ్మణములో హిరణ్యమనగా జ్యోతి, తేజస్సు, అని చెప్పబడీంది. తేజస్సు గర్భములో (లోపల) గలది. సూర్యుడు మొద;అగునవి హిరణ్యములు - అందుచేత తేజస్సుగల సూర్యుడు మొదలగువాటికి గర్భములేక అధిష్ఠానము అయినవాడు. హిరణ్యగర్భుడు - సూర్యుడు మొదలగు తేజోరూపములు గలవాటిని కలుగచేయువాడు, పుట్టించు శక్తి గలవాడు - పుట్టించుటకు అవసరమైన పదార్థము - ఉపాదానము - (material) గలవాడు).

  1. “అపంచీకృతమహాభూతాని సప్త దసకం భౌతిక హిరణ్యగర్భ ఇత్యుచ్యతే. ఏత త్సూక్ష్మశరీరమాత్మఫః, తదుభయాభిమాన్యాత్మా - తైజసః”.

(పంచీకృతముకాని పంచమహాభూతములు పదిహేను సూక్ష్మ తత్వములు కలిసి భౌతిక హిరణ్య గర్భుడని చెప్పబడును. ఇది ఆత్మయొక్క సూక్ష్మశరీరము - ఈ రెండింటిని అభిమానించి వాటిలో నుండు పరమాత్మచైతన్యము తజసుడని చెప్పబడును).

  1. “ఆ ఈశ్వరుండు విరాట్పురుషుండు, హిరణ్యగర్భుండు, అంతర్యామి అని యీ విధంబున త్రివిధంబైయుండు - లింగ శరీర సమష్ట్యభిమాని మహాప్రాణుండు సూత్రాత్ముండు అని మొదలైనవి హిరణ్యగర్భుని పర్యాయనామములు” (వివేకచింతామణి -)

  2. “విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతమనెడి ఈశ్వరమాయోపాధి శరీరాలకు సాక్షి స్వరూపమైనదే మూలప్రకృతి”.

(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 6)

  1. “సకల భూతాలకున్నూ ఆశ్రయమైన హిరణ్యగర్భ శరీరము. దీనిలో వ్యాపకమైన ఆత్మ సూత్రాత్మ”.

  2. ఆ మహత్తందు ఉత్తమ మధ్యమ కనీయోహం అనెడీహంకార త్రితయోత్పత్తి : - “మహతో అహ్నకారః” అని శ్రుతి కలదు కనుక -“మధ్యమోహం” అనెడి తైజసాహంకారం వల్ల జగత్సూక్ష్మ శరీరుండై, రజోగుణంవల్ల వర్తిలిన వికృతి భావంతో గూడి యిచ్ఛాశక్తి యుక్తుండై హిరణ్యగర్భుడనిపించుకొనును - “హిరణ్యగర్భస్సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్” అని శ్రుతి.

(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 1)

  1. లింగదేహాభిమానీ సూత్రాత్మా -

(సూక్ష్మ దేహము నాశ్రయించియుండువాడు - సూత్రాత్మ)

  1. హితం రమణీయం జత్యుజ్జ్వలం జ్ఞానం గర్భో అంతస్సారో యస్య సః హిరణ్యగర్భః -

(రమణీయమైనదిన్నీ, మిక్కిలి ప్రకాశించుచుండునదిన్నీ యగు జ్ఞానము తనలోపలి సారముగా గలవాడు).

  1. “బ్రహ్మ దేవానాం ప్రథమం సంబభూవ”.

(దేవాది రూపమగు ప్రపంచమునకంతకును చతుర్ముఖబ్రహ్మ - హిరణ్యగర్భుడు మొదట జనించెను).

  1. జీవసమష్టి

(ప్రాణులందరు వేరు వేరుగా పుట్టకముందు వారి సమష్టి సూక్ష్మరూపము).

  1. హిరణ్యమనగా జ్ఞానము; దానిచే ప్రకాశించువాడు. సమష్టి సూక్ష్మ శరీరమునొంది యున్న ఈశ్వరుడు హిరణ్యగర్భుడనియు సూత్రాత్మకుడనియు, ప్రాణుడని తెలియబడుచున్నాడు - ఇతనికి సమష్టి అజ్ఞానము కారణ శరీరము - సమష్టి స్వప్నము సుషుప్త్యవస్థ).

(సమష్టి సూక్ష్మ శరీరమును పొందిన యతను హిరణ్య గర్భుడని, వ్యష్టి సూక్ష్మశరీరమును పొందినవాడు జీవుడు అని తెలుసుకొనునది).

  1. “సకల సూక్ష్మశరీరమునందు ‘నేను’ అనునట్టి అభిమానియైన చైతన్యము పేరు హిరణ్యగర్భుడు”.

  2. హిరణ్యస్య వైష్ణవస్య పరప పదస్య గర్భః గర్భభూతః సర్వ దైవాభివ్యక్తరూపేణ తత్ర వర్తిష్ణుః ఇతి యావత్ ; యద్వా హిరణ్యాని అసంఖ్యేయ దివ్య కల్యాణ గుణాః గర్భే యస్య సః హిరణ్యగర్భః - సమస్త కల్యాణగుణ నిధింతి యావత్. హిత రమణీయం హిరణ్యం ఇతి వైదిక నిరుక్తాత్ - సువర్ణవత్ స్పృహణీయ త్వాచ్చ హిరణ్యశబ్దో వైష్ణవం పరమం థామ కల్యాణగుణ జాతంచ ఆవష్టే - అత ఏవ హి వైష్ణవం పరమంధామ హిరణ్య రూపత్వేనైవ ఉచ్యతే శ్రుతిషు)

(హిరణ్యమనగా వుష్ణువునదియైన - విష్ణువునకు - సంబంధించిన - పరపదము - (వైకుంఠము, లేక, మోక్షము) యొక్క గర్భము - దానియందు దేవతులకు అభివ్యక్తమగుచూక్కడ ప్రవతించువాడు; లేక హిరణ్యములు అనగా లెక్కలేనన్ని కల్యాణగుణములు గర్భమందు కలవాడు - అనగా సమస్తమైన కల్యాణగుణములకు నిధి అయినవాడు. హితమైనది, అనగ రమణీయమైనది హిరణ్యము అని వేదములో అర్థము చెప్పబడియుండుటవలనను, బంగారమువలె స్పృహణీయముగా నుండుటవలనను హిరణ్యము అను మాట విష్ణుని పరమథామము హిరణ్యరూపముగా - జ్యోతిస్వరూపముగా - చెప్పబడుచున్నది.

  1. అపంచీకృత పంచమహాభూతములు -

  2. ప్రథమ జీవుడు

  3. సమష్టి లింగ శరీరాభిమానీ.

Transliteration
  1. hiraṇyaṃ sakala jagadutpādaka śaktiḥ, samasta samūhōvā, garbhē yasya saḥ; hiraṇyagarbhaḥ; brahma.

(hiraṇyamanagā samastamaina jagattunu puṭṭiṃcu śakti; lēka jagattu aṃtā, lēka, jagattulōnunna vastuvulanniyu garbhamaṃdu kalavāḍu - caturmukhabrahma).

  1. hiraṇmaya rūpabrahmāṃḍaṃ garbhē yasya saḥ; hiraṇyātmakaṃ brahmāṃḍaṃ garbhō yasya saḥ -

(hiraṇmayamaina, lēka, hiraṇmayarūpamaina, brahmāṃḍamu tana garbhamaṃdu galavāḍu; lēka, aṭṭi brahmāṃḍamu garbhamugā galavāḍu - puṭṭina cōṭugāgā galavāḍu - samasta jagattu puṭṭuṭaku vīlayina śakti upādānamugā (kuṃḍa cēyuṭaku maṭṭivale) kalavāḍu).

  1. caturmukhabrahma-

(sṛṣṭilōnunna vastuvulanniṃṭiki upādānamai, bhagavaṃtuni cicchaktitōkūḍi sṛṣṭi cēyuṭaku tagina sthitilō nunna prakṛti. tanalōnuṃḍi mahattatvamu modalagu tatvamulanu puṭṭiṃcunadi, lēka, prapaṃcamugā mārunadi).

  1. ‘hiraṇya garbhaḥ iti yat hiraṇyāṃḍa samudbhavaḥ’. (dēvībhāgavatamu)

(hiraṇmayamai aṃḍākāramugānuṃḍu prakṛtinuṃḍi puṭṭinadi. aṭuvaṃṭi prakṛtiyokka mārpu, pariṇāmamu)

  1. hiraṇamayāṃḍa vartitvāt hiraṇyagarbhaḥ - brahma viriṃci, tadātmā.

(hiraṇmayamaina aṃḍākāramuganuṃḍu dānilō nuṃḍuvāḍu - caturmukhabrahma, viriṃci, caturmukhabrahma svarūpamu).

(baṃgāru mayamaina aṃḍamu, lēka, aṃḍākāramugā nunnadānilōnuṃḍu vāḍu - ī hiraṇmayāṃḍamē brahmāṃḍamu - aṃḍākāramulō (kōḍigruḍḍu ākāramulō nuṃḍubrahma, parabrahmayokka caitanyaśaktitō kalisi sṛṣṭi cēyuṭaku vīlagu avasthalōnunna prakṛti).

  1. hiraṇyagarbhaḥ saṃbhūtakāraṇaṃ, hiraṇmayaṃ aṃḍaṃ yadvīryasaṃbhūtaṃ tadasya garbhaḥ iti hiraṇya garbhaḥ (śrīśaṃkaraḥ)

(prapaṃcasṛṣṭiki kāraṇamaina aṃḍamu - tana vīryamuvalana sṛṣṭiṃcu śakti kaliginadi kanuka adi tana garbhamaṃdu kalavāḍu).

  1. hiraṇyaṃ hiraṇmayāṃḍaṃ tasya garbhō hiraṇyagarbhaḥ - brahmāṃḍōdaravartī itayarthaḥ; yadvā hita ramaṇīyaṃ garbha, aṃtaḥkaraṇaṃ yasyāsau hiraṇya garbhaḥ.

(hiraṇmayāṃḍamu - jagattunu sṛṣṭiṃcakalugu śakti, upādānamu kalisi aṃḍākāramuganunna garbhamulōpala vartiṃcuvāḍu, lēka, ramaṇīyamaina priyamunu kaligiṃcu aṃtaḥkaraṇamu galavāḍu)

  1. hiraṇyaṃ sakala jagadutpātika samaṣṭi jīvajātaṃ tat garbhē yasya saḥ hiraṇya garbhaḥ -

(hiraṇyamu anagā jagattunu puṭiṃcu sūkṣmarūpamulōnunna jīvula samaṣṭirūpamu - adi tanagarbhamaṃdu kalavāḍu).

  1. sakala jagadutpatti sthitilaya kartā brahmaviṣṇu śiva rūpō hiraṇyagarbhaḥ -

(jagattunaṃtaṭini sṛṣṭiṃci, pōṣiṃci naśiṃpacēyuvāḍu - brahma viṣṇu mahēśvarulanu trimūrtula rūpuḍainavāḍu).

  1. hiraṇyagarbhō nāma mūrtitrayā danyaḥ pradhamō jīvaḥ –

“sa vai śarīrē pradhamaḥ sa vai puruṣa ucyatē, ādi kartā sa bhūtānāṃ brahmāgrē samavartata ||”.

(hiraṇyagarbhuḍu anagā trimūrtulakaṃṭe vēṟaina modaṭi jīvuḍu - iṃdu guṟiṃci śruti iṭlu ceppucunnadi - atanē śarīramugala modaṭi vāḍu, atanē puruṣuḍani ceppabaḍucunnāḍu - śarīramanu puramaṃdu śayaniṃcuvāḍu - prakṛtiyanu bhūtamulanu modaṭa sṛjiṃcinavāḍu. atanē modaṭa uṃḍenu).

  1. “yōbrahmaṇaṃ vidadhāti pūrvaṃ” (śvētāśvatarōpaniṣat - 6 - 15)

ityādi śrutiḥ -

(evaru pūrvamu brahmanu vidhiṃcenō - ani śruti ceppuṭavalana hiraṇyagarbhuḍu sṛṣṭi cēyu brahmayani teliyucunnadi).

  1. “jīvabrahmalaku bhēdamulēdu - anu modalagu vyavahāramu iṃdu vyaṣṭi vyavahāramunaku nādhāramaguvānini jīvuḍaniyu, samaṣṭivyavahāramunaku ādhārabhūtamagu sāmānyamunu hiraṇyagarbhuḍaniyu ceppucunnāru.

  2. “jyōtirvai hiraṇyaṃ, tējōvai hiraṇyaṃ” ityaitarēya śatapatha brāhmaṇē; hiraṇyāni sūryādīni tējāṃsi garbhē yasya, tathā sūryā dīnāṃ tējasāṃ yōgarbhō (a)dhiṣṭhānaṃ sa hiraṇyagarbhaḥ.

(aitarēya śa apatha brāhmaṇamulō hiraṇyamanagā jyōti, tējassu, ani ceppabaḍīṃdi. tējassu garbhamulō (lōpala) galadi. sūryuḍu moda;agunavi hiraṇyamulu - aṃducēta tējassugala sūryuḍu modalaguvāṭiki garbhamulēka adhiṣṭhānamu ayinavāḍu. hiraṇyagarbhuḍu - sūryuḍu modalagu tējōrūpamulu galavāṭini kalugacēyuvāḍu, puṭṭiṃcu śakti galavāḍu - puṭṭiṃcuṭaku avasaramaina padārthamu - upādānamu - (material) galavāḍu).

  1. “apaṃcīkṛtamahābhūtāni sapta dasakaṃ bhautika hiraṇyagarbha ityucyatē. ēta tsūkṣmaśarīramātmaphaḥ, tadubhayābhimānyātmā - taijasaḥ”.

(paṃcīkṛtamukāni paṃcamahābhūtamulu padihēnu sūkṣma tatvamulu kalisi bhautika hiraṇya garbhuḍani ceppabaḍunu. idi ātmayokka sūkṣmaśarīramu - ī reṃḍiṃṭini abhimāniṃci vāṭilō nuṃḍu paramātmacaitanyamu tajasuḍani ceppabaḍunu).

  1. “ā īśvaruṃḍu virāṭpuruṣuṃḍu, hiraṇyagarbhuṃḍu, aṃtaryāmi ani yī vidhaṃbuna trividhaṃbaiyuṃḍu - liṃga śarīra samaṣṭyabhimāni mahāprāṇuṃḍu sūtrātmuṃḍu ani modalainavi hiraṇyagarbhuni paryāyanāmamulu” (vivēkaciṃtāmaṇi -)

  2. “virāṭ hiraṇyagarbha avyākṛtamaneḍi īśvaramāyōpādhi śarīrālaku sākṣi svarūpamainadē mūlaprakṛti”.

(brahmavidyāsudhārṇavamu - 6)

  1. “sakala bhūtālakunnū āśrayamaina hiraṇyagarbha śarīramu. dīnilō vyāpakamaina ātma sūtrātma”.

  2. ā mahattaṃdu uttama madhyama kanīyōhaṃ aneḍīhaṃkāra tritayōtpatti : - “mahatō ahnakāraḥ” ani śruti kaladu kanuka -“madhyamōhaṃ” aneḍi taijasāhaṃkāraṃ valla jagatsūkṣma śarīruṃḍai, rajōguṇaṃvalla vartilina vikṛti bhāvaṃtō gūḍi yicchāśakti yuktuṃḍai hiraṇyagarbhuḍanipiṃcukonunu - “hiraṇyagarbhassamavartatāgrē bhūtasya jātaḥ patirēka āsīt” ani śruti.

(brahmavidyāsudhārṇavamu - 1)

  1. liṃgadēhābhimānī sūtrātmā -

(sūkṣma dēhamu nāśrayiṃciyuṃḍuvāḍu - sūtrātma)

  1. hitaṃ ramaṇīyaṃ jatyujjvalaṃ jñānaṃ garbhō aṃtassārō yasya saḥ hiraṇyagarbhaḥ -

(ramaṇīyamainadinnī, mikkili prakāśiṃcucuṃḍunadinnī yagu jñānamu tanalōpali sāramugā galavāḍu).

  1. “brahma dēvānāṃ prathamaṃ saṃbabhūva”.

(dēvādi rūpamagu prapaṃcamunakaṃtakunu caturmukhabrahma - hiraṇyagarbhuḍu modaṭa janiṃcenu).

  1. jīvasamaṣṭi

(prāṇulaṃdaru vēru vērugā puṭṭakamuṃdu vāri samaṣṭi sūkṣmarūpamu).

  1. hiraṇyamanagā jñānamu; dānicē prakāśiṃcuvāḍu. samaṣṭi sūkṣma śarīramunoṃdi yunna īśvaruḍu hiraṇyagarbhuḍaniyu sūtrātmakuḍaniyu, prāṇuḍani teliyabaḍucunnāḍu - itaniki samaṣṭi ajñānamu kāraṇa śarīramu - samaṣṭi svapnamu suṣuptyavastha).

(samaṣṭi sūkṣma śarīramunu poṃdina yatanu hiraṇya garbhuḍani, vyaṣṭi sūkṣmaśarīramunu poṃdinavāḍu jīvuḍu ani telusukonunadi).

  1. “sakala sūkṣmaśarīramunaṃdu ‘nēnu’ anunaṭṭi abhimāniyaina caitanyamu pēru hiraṇyagarbhuḍu”.

  2. hiraṇyasya vaiṣṇavasya parapa padasya garbhaḥ garbhabhūtaḥ sarva daivābhivyaktarūpēṇa tatra vartiṣṇuḥ iti yāvat ; yadvā hiraṇyāni asaṃkhyēya divya kalyāṇa guṇāḥ garbhē yasya saḥ hiraṇyagarbhaḥ - samasta kalyāṇaguṇa nidhiṃti yāvat. hita ramaṇīyaṃ hiraṇyaṃ iti vaidika niruktāt - suvarṇavat spṛhaṇīya tvācca hiraṇyaśabdō vaiṣṇavaṃ paramaṃ thāma kalyāṇaguṇa jātaṃca āvaṣṭē - ata ēva hi vaiṣṇavaṃ paramaṃdhāma hiraṇya rūpatvēnaiva ucyatē śrutiṣu)

(hiraṇyamanagā vuṣṇuvunadiyaina - viṣṇuvunaku - saṃbaṃdhiṃcina - parapadamu - (vaikuṃṭhamu, lēka, mōkṣamu) yokka garbhamu - dāniyaṃdu dēvatulaku abhivyaktamagucūkkaḍa pravatiṃcuvāḍu; lēka hiraṇyamulu anagā lekkalēnanni kalyāṇaguṇamulu garbhamaṃdu kalavāḍu - anagā samastamaina kalyāṇaguṇamulaku nidhi ayinavāḍu. hitamainadi, anaga ramaṇīyamainadi hiraṇyamu ani vēdamulō arthamu ceppabaḍiyuṃḍuṭavalananu, baṃgāramuvale spṛhaṇīyamugā nuṃḍuṭavalananu hiraṇyamu anu māṭa viṣṇuni paramathāmamu hiraṇyarūpamugā - jyōtisvarūpamugā - ceppabaḍucunnadi.

  1. apaṃcīkṛta paṃcamahābhūtamulu -

  2. prathama jīvuḍu

  3. samaṣṭi liṃga śarīrābhimānī.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.