(హృదయరూపములో నుండు గ్రంధి)
(చైతన్యమును, జడవస్తువులును కలుపు అహంకారము హృదయమే గ్రంధి (ముడివంటిది).
(హృదయమును గ్రంధివలె బంధించునది).
(హృదయమనగా అంతఃకరణము; అంతఃకరణమునకు గ్రంధులు - ముడులు వలె విడిపించుకొనుటకు చాలకష్టమైనవి - రాగము, ద్వేషము, మొదలగునవి. హృదయమందుండునది యనుటచే జీవుడని యర్థము).
(అహంకారముయొక్క లక్షణములు గలది. అహంకారమే లక్షణముగా గల బంధము).
(అణంకారమను బంధము; అహంకారము మొదలగునవి - మనస్సు, చిత్తము, బుద్ధి).
(హృదయముయొక్క గ్రంధులు - రాగము మొదలగునవి, లేక, హృదయమనగా హృదయమందుండు జీవుడు. జీవిని గ్రంధి యనగా జీవునకు ప్రకృతితో కలిగిన సంబంధము).
(అవిద్య యనగా అజ్ఞానము - అవిద్యా వాసనతో నిండియుండునది).
(హృదయమును చేరునవి కామము మొదలగునవి. అవియే గ్రంధి, వ్రణము- కామాదులను వ్రణము).
(చైతన్యము అహంకారము తాదాత్మ్యమగుట).
(హృదయము = హృత్ + అయము - హృత్ అనగా అవిద్య లేక అజ్ఞానము, దాని కార్యములు - అయమనగా తదారోప అపవాదాధి కరణము - భాస్య భాసకములు, అధరాధేయములు యొక్క తాదాత్మ్య సంబంధము హృదయగ్రంధి - తానే బ్రహ్మమను జ్ఞానమను ఖడ్గముచేత విడిపోవును - నశించిపోవును).
తనకంటె (ఆత్మకంటె) వేఱయిన దేహము మొదలగువాటితో తాదాత్మ్యము చెంది అవియే తాను అని తలంచుట హృదయగ్రంధి యని చెప్పబడును).
భిద్యతే హృదయగ్రంధ్రి శ్ఛిద్యంతే సన్ర్వ సంశయా |
క్షీయంతే చస్యకర్మాణి తస్మిన్ దృష్టేపరావరే || (ముండకోపనిషత్)
(పరమేశ్వరుని చూచిన తోడనే - పరబ్రహ్మజ్ఞానము కలిగినంతనే, పరబ్రహ్మ సాక్షాత్కారము పొందినవెంటనే హృదయగ్రంధి విడిపోవును - అన్ని విధముల సంశయములు తీరిపోవును - కర్మలన్నియు నశించును - పునర్జన్మ లేకుండును).
అవిద్య (అజ్ఞానము), రాగము (ఇష్టమైన పదార్థములందు అనురాగము), ద్వేషము (ఇష్టములేని పదార్థములందు అసూయ), భయము, మోహము, దుఃఖము అను అయిదును కలిసి హృదయగ్రంధి యగుచున్నది).
విద్వాంశుడైనను దేహేంద్రియాదులందు బ్రీతి సేసిన మిధునీభావ సుఖ బ్రథానంబగు గృహస్థాశ్రమంబు నంగీకరించి, స్వరూపస్మృతి శూన్యుండై మూఢుండగుచు నందు సంసార తాపంబులం బొందు పురుషుండు స్త్రీ తోడం గూడి యేకీ భావంబు నొందుట దనకు హృదయగ్రంధియై యుండును). (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 -)
“ఆహార శుద్ధౌ సత్వ శుద్ధిః, సత్వ శుద్ధౌ ధ్రువా స్మృతిః |
స్మృతే లాభే సర్వ గ్రంధీనాం విప్రమోక్షః ||“. (ఛాందోగ్యోపనిషత్ - 7 - 26 -2)
(ఆహారము శుద్ధమైనదైన యడల, సత్వ శుద్ధి యగును - సత్వశుద్ధి (constitution) కలిగినయడల స్మృతి కలుగును - స్మృతి కలిగిన సమస్త గ్రంధూ విడిపోవును -).
అధమర్త్యో భవేత్య తావదను శాసనం ||“. (కఠోపనిషత్ - 2 - 3 - 15)
(హృదయగ్రంధులన్నియు విడిపోయినంతనే మనజుడు ముక్తిని పొందును).
హృద్యంతస్థో హ్య భద్రాణి విధునోతి సుహృత్సతాం |
నష్ట ప్రాయేష్వ భద్రేషు నిత్యం భాగవతసేవయా |
భగవత్యుత్త మశ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ |
తదా రజస్తమో భావాః కామ లోభాధి యశ్యయే |
చేత ఏతైరాని విధ్వం స్థితం సత్వే ప్రసీదతి |
ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః |
భగవత్తత్త్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే |
భిద్యతే హృదయ గ్రంధిశ్చిద్ధ్యంతే సర్వ సంశయాః |
క్షీయంతే చాస్య కర్మాణి దృష్టే ఏవమాత్మ నీశ్వరే ||“. (శ్రీమద్భాగవతం 1 - 2 - 17 to 21)
(పై శ్లోకములకు ఆంధ్రీకరణము ఈ క్రిందవిధముగా నున్నది -
“వ. పుణ్య శ్రవణ కీర్తనుడైన కృష్ణుండు దన కథలు వినువారి హృదయంబులందు నిలిచి, శుభంబులాచరించు, అశుభంబుల పరిహరించు. అశుభంబులు నష్టంబులైన భాగవతసేవా విశేషంబున నిశ్చల భక్తి యుదయించు, భక్తి కలుగ రజస్తమోగుణ ప్రభూతంబులైన కామలోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్వగుణంబున ప్రసన్నంబగు. ప్రసన్న మనస్కుండైన ముక్త సంగుండగు; ముక్త సంగుండైన నీశ్వర తత్వ జ్ఞానంబు సిద్ధించు. ఈశ్వరుండు గానంబడిన జిజ్జడ గ్రధన రూపంబైన యహంకారంబు భిన్నంబగు, నహంకారంబు భిన్నంబైన నసంభావనాది రూపంబులగు సమయంబులువిచ్ఛిన్నంబులగు సంశయ విచ్ఛేదంబైన ననారబ్దఫలంబులైన కర్మంబులు నిశ్శేషంబులై నశించు”. (శ్రీమహాభాగవతము - 1- 2 – 56)
(hṛdayarūpamulō nuṃḍu graṃdhi)
(caitanyamunu, jaḍavastuvulunu kalupu ahaṃkāramu hṛdayamē graṃdhi (muḍivaṃṭidi).
(hṛdayamunu graṃdhivale baṃdhiṃcunadi).
(hṛdayamanagā aṃtaḥkaraṇamu; aṃtaḥkaraṇamunaku graṃdhulu - muḍulu vale viḍipiṃcukonuṭaku cālakaṣṭamainavi - rāgamu, dvēṣamu, modalagunavi. hṛdayamaṃduṃḍunadi yanuṭacē jīvuḍani yarthamu).
(ahaṃkāramuyokka lakṣaṇamulu galadi. ahaṃkāramē lakṣaṇamugā gala baṃdhamu).
(aṇaṃkāramanu baṃdhamu; ahaṃkāramu modalagunavi - manassu, cittamu, buddhi).
(hṛdayamuyokka graṃdhulu - rāgamu modalagunavi, lēka, hṛdayamanagā hṛdayamaṃduṃḍu jīvuḍu. jīvini graṃdhi yanagā jīvunaku prakṛtitō kaligina saṃbaṃdhamu).
(avidya yanagā ajñānamu - avidyā vāsanatō niṃḍiyuṃḍunadi).
(hṛdayamunu cērunavi kāmamu modalagunavi. aviyē graṃdhi, vraṇamu- kāmādulanu vraṇamu).
(caitanyamu ahaṃkāramu tādātmyamaguṭa).
(hṛdayamu = hṛt + ayamu - hṛt anagā avidya lēka ajñānamu, dāni kāryamulu - ayamanagā tadārōpa apavādādhi karaṇamu - bhāsya bhāsakamulu, adharādhēyamulu yokka tādātmya saṃbaṃdhamu hṛdayagraṃdhi - tānē brahmamanu jñānamanu khaḍgamucēta viḍipōvunu - naśiṃcipōvunu).
tanakaṃṭe (ātmakaṃṭe) vēṟayina dēhamu modalaguvāṭitō tādātmyamu ceṃdi aviyē tānu ani talaṃcuṭa hṛdayagraṃdhi yani ceppabaḍunu).
bhidyatē hṛdayagraṃdhri śchidyaṃtē sanrva saṃśayā |
kṣīyaṃtē casyakarmāṇi tasmin dṛṣṭēparāvarē || (muṃḍakōpaniṣat)
(paramēśvaruni cūcina tōḍanē - parabrahmajñānamu kaliginaṃtanē, parabrahma sākṣātkāramu poṃdinaveṃṭanē hṛdayagraṃdhi viḍipōvunu - anni vidhamula saṃśayamulu tīripōvunu - karmalanniyu naśiṃcunu - punarjanma lēkuṃḍunu).
avidya (ajñānamu), rāgamu (iṣṭamaina padārthamulaṃdu anurāgamu), dvēṣamu (iṣṭamulēni padārthamulaṃdu asūya), bhayamu, mōhamu, duḥkhamu anu ayidunu kalisi hṛdayagraṃdhi yagucunnadi).
vidvāṃśuḍainanu dēhēṃdriyādulaṃdu brīti sēsina midhunībhāva sukha brathānaṃbagu gṛhasthāśramaṃbu naṃgīkariṃci, svarūpasmṛti śūnyuṃḍai mūḍhuṃḍagucu naṃdu saṃsāra tāpaṃbulaṃ boṃdu puruṣuṃḍu strī tōḍaṃ gūḍi yēkī bhāvaṃbu noṃduṭa danaku hṛdayagraṃdhiyai yuṃḍunu). (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 -)
“āhāra śuddhau satva śuddhiḥ, satva śuddhau dhruvā smṛtiḥ |
smṛtē lābhē sarva graṃdhīnāṃ vipramōkṣaḥ ||“. (chāṃdōgyōpaniṣat - 7 - 26 -2)
(āhāramu śuddhamainadaina yaḍala, satva śuddhi yagunu - satvaśuddhi (constitution) kaliginayaḍala smṛti kalugunu - smṛti kaligina samasta graṃdhū viḍipōvunu -).
adhamartyō bhavētya tāvadanu śāsanaṃ ||“. (kaṭhōpaniṣat - 2 - 3 - 15)
(hṛdayagraṃdhulanniyu viḍipōyinaṃtanē manajuḍu muktini poṃdunu).
hṛdyaṃtasthō hya bhadrāṇi vidhunōti suhṛtsatāṃ |
naṣṭa prāyēṣva bhadrēṣu nityaṃ bhāgavatasēvayā |
bhagavatyutta maślōkē bhaktirbhavati naiṣṭhikī |
tadā rajastamō bhāvāḥ kāma lōbhādhi yaśyayē |
cēta ētairāni vidhvaṃ sthitaṃ satvē prasīdati |
ēvaṃ prasanna manasō bhagavadbhakti yōgataḥ |
bhagavattattva vijñānaṃ mukta saṃgasya jāyatē |
bhidyatē hṛdaya graṃdhiściddhyaṃtē sarva saṃśayāḥ |
kṣīyaṃtē cāsya karmāṇi dṛṣṭē ēvamātma nīśvarē ||“. (śrīmadbhāgavataṃ 1 - 2 - 17 to 21)
(pai ślōkamulaku āṃdhrīkaraṇamu ī kriṃdavidhamugā nunnadi -
“va. puṇya śravaṇa kīrtanuḍaina kṛṣṇuṃḍu dana kathalu vinuvāri hṛdayaṃbulaṃdu nilici, śubhaṃbulācariṃcu, aśubhaṃbula parihariṃcu. aśubhaṃbulu naṣṭaṃbulaina bhāgavatasēvā viśēṣaṃbuna niścala bhakti yudayiṃcu, bhakti kaluga rajastamōguṇa prabhūtaṃbulaina kāmalōbhādulaku vaśaṃbugāka cittaṃbu satvaguṇaṃbuna prasannaṃbagu. prasanna manaskuṃḍaina mukta saṃguṃḍagu; mukta saṃguṃḍaina nīśvara tatva jñānaṃbu siddhiṃcu. īśvaruṃḍu gānaṃbaḍina jijjaḍa gradhana rūpaṃbaina yahaṃkāraṃbu bhinnaṃbagu, nahaṃkāraṃbu bhinnaṃbaina nasaṃbhāvanādi rūpaṃbulagu samayaṃbuluvicchinnaṃbulagu saṃśaya vicchēdaṃbaina nanārabdaphalaṃbulaina karmaṃbulu niśśēṣaṃbulai naśiṃcu”. (śrīmahābhāgavatamu - 1- 2 – 56)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.