← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షమా kṣamā

Original — తెలుగు
  1. క్షమానామ ప్రియా ప్రియేషు సర్వేషు తాడన పీడనేషు సహనం : (శాండిల్యోపనిషత్).

(క్షమ అనగా అన్ని విధములైన ప్రియాప్రియములందును - ఇష్టా యిష్టములందును, అనగా, ఇష్టమైన వస్తువులందును, ఇష్టముకాని వస్తువులందును, ఇష్టమైన జనుల యడలను, ఇష్టముకాని జనుల యడలను, ఇష్టమైన పరిస్థితులందును, ఇష్టముకాని పరిస్థితులందును, కొట్టుట, పీడించుట (భాధించుట) యందును సహనము (ఓర్పు) కలుగియుండుట).

  1. సుఖదుఃఖాది ద్వంద్వ సహనం -

(సుఖము, దుఃఖము, కష్టము, సుఖము, మంచి, చెడు, శీతోష్ణములు మొదలగు ద్వంద్వములను సహించుట).

  1. అపకార సహనం -

(తనకు ఇతరులు చేసిన అపకారమును సహించుట)

  1. సహిష్ణుత్వం

(సహనము, సహించియుండుట, ఓర్పు; కష్టమును సహించియుండుట).

  1. “క్షమా, నిందా తాడనాదౌ సమత్వధీః”. (గీతాభావప్రకాశము - 10 - 18)

(నిందించుట, కొట్టుట మొదలగు వాటియందు సమమైన బుద్ధి కలిగియుండుట).

  1. “క్షమా హర్ష విషాదాది హేతౌ ధీర్నిర్వికారతా”.

(క్షమయనగా సంతోషము, దుఃఖము మొదలగు వాటికి కారణమగు వాటియందు మనస్సును వికారము పొందనీయకుండుట).

  1. “పరిభావాదిషు ఉత్పద్యమానేషు క్రోధ ప్రతిబంధః క్షమా”.

(అవమానము మొదలగువాటిని కలుగచేయువాటియందు క్రోధమును ఆపివేయునది - అణచునది).

  1. “అవమానాది సహన శీలత్వం, పృధివీ వత్ అనుద్వేగః”

(అవమానము మొదలగువాటిని సహించు స్వభావము - భూమివలె ఉద్వేగమును పొందకుండుట).

  1. క్షమాతు క్రోధాభావేన సహా పకర్తుః అనపకారః (శ్రీ ఆనందతీర్థః)

(అపకారము చేసినవాని యడల క్రోధములేకుండి ఉపకారము చేయుట).

  1. “ఆకృష్టస్యవా తాడితస్యవా అవికృత చిత్తతా” (శ్రీశంకరః)

(లాగి కొట్టబడినప్పటికీ వికారము - మార్పు - చెందని మనస్సు కలిగియుండుట)

  1. “మనోవికార హేతౌ నత్యపి అవికృత మనస్త్వం” (శ్రీమాన్ రామానుజః)

(మనస్సును వికారము చెందించు కారణము కలిగినప్పటికీ వికారము చెందని (మార్పు చెందని) మనస్సు కలిగియుండుట).

  1. “ఆకృష్టస్య తాడి తస్యవా అంతర్విక్రియా నుత్పత్తిః - ఉత్పన్నాయాం విక్రియాయాం ఉపశమనం అకృఓధః - ఇతి అవోచామ - ఇత్థం క్షమాయాః అక్రోథస్య చ విశేషః” (శ్రీశంకరః)

(లాగి యీడ్చినప్పటికి, కొట్టబడినప్పటికి లోపల - మనస్సులో - వికారము పొందకుండుట. వికారము పొందినప్పుడు దానిని ఉపశమించుకొనుట (తగ్గించుకొని లేకుండుట) క్రోధము లేకుండుట. అందుచేత క్షమ అనగా క్రోధము లేకుండుటయే).

  1. పర నిమిత్త పీడానుభవే అపి తం ప్రతిచిత్త వికార రహితతా (శ్రీమాన్ రామానుజః)

(ఇతరునివలన కలిగిన పీడ - బాధ - అనుభవించుచున్నప్పటికీ అతనికి ప్రతీకారము చేయకుండు మనస్సు కలిగియుండుట).

  1. మనసః అనుద్వేగః క్షమా

(మనస్సును ఉద్వేగము పొందనీయకుండుట)

  1. కాయేన మనసా వాచా శతృభిః పరిపీడితే |

బుద్ధి క్షోభ నివృత్తిర్యా క్షమా సా ముని పుంగవ || (దర్శనోపనిషత్)

(శరీరముచేతగాని, మనస్సుచేతగాని, వాక్కుచేతగాని శతృవులు బాధ పెట్టినపుడు బుద్ధి క్షోభపడకుండా నివృత్తి చేసుకొనుట క్షమా).

  1. భూమి - సహించునది; భరించునది కనుక ఓర్పుగలది.

  2. సమస్త కార్యేషు సమర్థః; క్షమతే ఇతివా క్షమః (శ్రీశంకరః)

(అన్ని కార్యములు చేయుటయందు సమర్థత కలిగియుండుట, లేక క్షమించువాడు).

  1. క్షమా శత్రౌచ మిత్రౌచ యతీనా మేవ భూషణం ||.

(శతౄవు యడల, మిత్రుని యడల క్షమ కలిగియుండుట యతులకు భూషణము వంటిది - అలంకారము వంటిది).

  1. “అలంకారో హి నారీణాం క్షమాతు పురుషస్యవా |”

(క్షమ అనునది స్త్రీలకు, పురుషులకు కూడ అలంకారమువంటిది)

  1. “క్షమా, సత్యం, దమః శమః |

- - భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథి గ్విధాః ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 4, 5)

(క్షమ, సత్యము, దమము, శమము మొదలగు భావములన్నియు (మనోభావములన్నియు) అనేక విధములుగా నావలననే (భగవంతునివలననే) భూతములకు కలుగుచున్నవి).

  1. “మృత్యుః సర్వహరశ్చాహం - - - స్మృతిర్మేథా ధృతిః క్షమా”. (శ్రీమద్భగవద్గీత - 10 - 34)

(అన్నింటిని సమ్హరించు మృత్యువు, స్మృతి, మేధస్సు, ధైర్యము, క్షమ - ఇవన్నియు నేనే - (భగవంతుడే). రూపము లేనివి (abstract things) కూడా భగవంతుడే).

  1. క్షమాదానం, క్షమాయజ్ఞః, క్షమా సత్యం హి పుత్రికాః |

క్షమాయశః, క్షమా ధర్మః క్షమయా విష్టితం జగత్ ||.

(క్షమ దానము, క్షమయే యజ్ఞము, క్షమయే సత్యము, క్షమయే యశస్సు, క్షమయే ధర్మము - జగత్తు క్షమచేత ఆవేశింపబడియున్నది).

  1. “క. క్షమ కలిగిన సిరి గలుగును

క్షమ గలిగిన వాణి గలుగు సౌరప్రభయున్

క్షమగలుగ దోన కలుగును

క్షమ గలిగిన మెచ్చు శౌరి సదయుడు దండ్రీ“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 16 - 463)

Transliteration
  1. kṣamānāma priyā priyēṣu sarvēṣu tāḍana pīḍanēṣu sahanaṃ : (śāṃḍilyōpaniṣat).

(kṣama anagā anni vidhamulaina priyāpriyamulaṃdunu - iṣṭā yiṣṭamulaṃdunu, anagā, iṣṭamaina vastuvulaṃdunu, iṣṭamukāni vastuvulaṃdunu, iṣṭamaina janula yaḍalanu, iṣṭamukāni janula yaḍalanu, iṣṭamaina paristhitulaṃdunu, iṣṭamukāni paristhitulaṃdunu, koṭṭuṭa, pīḍiṃcuṭa (bhādhiṃcuṭa) yaṃdunu sahanamu (ōrpu) kalugiyuṃḍuṭa).

  1. sukhaduḥkhādi dvaṃdva sahanaṃ -

(sukhamu, duḥkhamu, kaṣṭamu, sukhamu, maṃci, ceḍu, śītōṣṇamulu modalagu dvaṃdvamulanu sahiṃcuṭa).

  1. apakāra sahanaṃ -

(tanaku itarulu cēsina apakāramunu sahiṃcuṭa)

  1. sahiṣṇutvaṃ

(sahanamu, sahiṃciyuṃḍuṭa, ōrpu; kaṣṭamunu sahiṃciyuṃḍuṭa).

  1. “kṣamā, niṃdā tāḍanādau samatvadhīḥ”. (gītābhāvaprakāśamu - 10 - 18)

(niṃdiṃcuṭa, koṭṭuṭa modalagu vāṭiyaṃdu samamaina buddhi kaligiyuṃḍuṭa).

  1. “kṣamā harṣa viṣādādi hētau dhīrnirvikāratā”.

(kṣamayanagā saṃtōṣamu, duḥkhamu modalagu vāṭiki kāraṇamagu vāṭiyaṃdu manassunu vikāramu poṃdanīyakuṃḍuṭa).

  1. “paribhāvādiṣu utpadyamānēṣu krōdha pratibaṃdhaḥ kṣamā”.

(avamānamu modalaguvāṭini kalugacēyuvāṭiyaṃdu krōdhamunu āpivēyunadi - aṇacunadi).

  1. “avamānādi sahana śīlatvaṃ, pṛdhivī vat anudvēgaḥ”

(avamānamu modalaguvāṭini sahiṃcu svabhāvamu - bhūmivale udvēgamunu poṃdakuṃḍuṭa).

  1. kṣamātu krōdhābhāvēna sahā pakartuḥ anapakāraḥ (śrī ānaṃdatīrthaḥ)

(apakāramu cēsinavāni yaḍala krōdhamulēkuṃḍi upakāramu cēyuṭa).

  1. “ākṛṣṭasyavā tāḍitasyavā avikṛta cittatā” (śrīśaṃkaraḥ)

(lāgi koṭṭabaḍinappaṭikī vikāramu - mārpu - ceṃdani manassu kaligiyuṃḍuṭa)

  1. “manōvikāra hētau natyapi avikṛta manastvaṃ” (śrīmān rāmānujaḥ)

(manassunu vikāramu ceṃdiṃcu kāraṇamu kaliginappaṭikī vikāramu ceṃdani (mārpu ceṃdani) manassu kaligiyuṃḍuṭa).

  1. “ākṛṣṭasya tāḍi tasyavā aṃtarvikriyā nutpattiḥ - utpannāyāṃ vikriyāyāṃ upaśamanaṃ akṛōdhaḥ - iti avōcāma - itthaṃ kṣamāyāḥ akrōthasya ca viśēṣaḥ” (śrīśaṃkaraḥ)

(lāgi yīḍcinappaṭiki, koṭṭabaḍinappaṭiki lōpala - manassulō - vikāramu poṃdakuṃḍuṭa. vikāramu poṃdinappuḍu dānini upaśamiṃcukonuṭa (taggiṃcukoni lēkuṃḍuṭa) krōdhamu lēkuṃḍuṭa. aṃducēta kṣama anagā krōdhamu lēkuṃḍuṭayē).

  1. para nimitta pīḍānubhavē api taṃ praticitta vikāra rahitatā (śrīmān rāmānujaḥ)

(itarunivalana kaligina pīḍa - bādha - anubhaviṃcucunnappaṭikī ataniki pratīkāramu cēyakuṃḍu manassu kaligiyuṃḍuṭa).

  1. manasaḥ anudvēgaḥ kṣamā

(manassunu udvēgamu poṃdanīyakuṃḍuṭa)

  1. kāyēna manasā vācā śatṛbhiḥ paripīḍitē |

buddhi kṣōbha nivṛttiryā kṣamā sā muni puṃgava || (darśanōpaniṣat)

(śarīramucētagāni, manassucētagāni, vākkucētagāni śatṛvulu bādha peṭṭinapuḍu buddhi kṣōbhapaḍakuṃḍā nivṛtti cēsukonuṭa kṣamā).

  1. bhūmi - sahiṃcunadi; bhariṃcunadi kanuka ōrpugaladi.

  2. samasta kāryēṣu samarthaḥ; kṣamatē itivā kṣamaḥ (śrīśaṃkaraḥ)

(anni kāryamulu cēyuṭayaṃdu samarthata kaligiyuṃḍuṭa, lēka kṣamiṃcuvāḍu).

  1. kṣamā śatrauca mitrauca yatīnā mēva bhūṣaṇaṃ ||.

(śatṝvu yaḍala, mitruni yaḍala kṣama kaligiyuṃḍuṭa yatulaku bhūṣaṇamu vaṃṭidi - alaṃkāramu vaṃṭidi).

  1. “alaṃkārō hi nārīṇāṃ kṣamātu puruṣasyavā |”

(kṣama anunadi strīlaku, puruṣulaku kūḍa alaṃkāramuvaṃṭidi)

  1. “kṣamā, satyaṃ, damaḥ śamaḥ |

- - bhavaṃti bhāvā bhūtānāṃ matta ēva pṛthi gvidhāḥ ||“. (śrīmadbhagavadgīta - 10 - 4, 5)

(kṣama, satyamu, damamu, śamamu modalagu bhāvamulanniyu (manōbhāvamulanniyu) anēka vidhamulugā nāvalananē (bhagavaṃtunivalananē) bhūtamulaku kalugucunnavi).

  1. “mṛtyuḥ sarvaharaścāhaṃ - - - smṛtirmēthā dhṛtiḥ kṣamā”. (śrīmadbhagavadgīta - 10 - 34)

(anniṃṭini samhariṃcu mṛtyuvu, smṛti, mēdhassu, dhairyamu, kṣama - ivanniyu nēnē - (bhagavaṃtuḍē). rūpamu lēnivi (abstract things) kūḍā bhagavaṃtuḍē).

  1. kṣamādānaṃ, kṣamāyajñaḥ, kṣamā satyaṃ hi putrikāḥ |

kṣamāyaśaḥ, kṣamā dharmaḥ kṣamayā viṣṭitaṃ jagat ||.

(kṣama dānamu, kṣamayē yajñamu, kṣamayē satyamu, kṣamayē yaśassu, kṣamayē dharmamu - jagattu kṣamacēta āvēśiṃpabaḍiyunnadi).

  1. “ka. kṣama kaligina siri galugunu

kṣama galigina vāṇi galugu sauraprabhayun

kṣamagaluga dōna kalugunu

kṣama galigina meccu śauri sadayuḍu daṃḍrī”. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 16 - 463)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.