← Back to స · Booklets 51–60 (digitized file 6)

సచ్చిదానందం saccidānaṃdaṃ

Original — తెలుగు
  1. సత = శాశ్వతముగా నుండుట, చిత్ = జ్ఞానము, ఆనందము = సంతోషము - ఈ మూడు తానే అయినవాడు).

  2. “యదస్తి సన్మాత్రం; యద్విభాతి చిన్మాత్రం, యత్ప్రియం ఆనందం”. (శ్రుతిః)

(ఉండునది - నాశము లేకుండ నుండునది సత్; ప్రకాశించునది చిత్; ప్రియమైనది ఆనందము - ఈ మూడురూపములు తానే అయినవాడు).

  1. సత్యంచ, చిచ్చ ఆనందశ్చ తేషామాస్పదీభూతం - సదిత్యస్య సత్వమర్థదిః, భావ ప్రథానో నిర్దేశః, అనేక సాధుకారిత్వం సూచ్యతే. చిదత్యనేన శ్రుతసత్వాఖ్యో గుణః ఆనంద ఇత్యనేన అదోగత్వగుణః-

(సత్యము, చిత్, ఆనందము - ఈ మూడింటికి ఆస్పదమైనవాడు. సత్ అనగా సత్వము - భామును ముఖ్యముగ నిర్దేశించినదు - అనేక శుభములు చేయుటను సూచించునది. చిత్ అనగా సత్వము. ఆనందము అనుటవలన రోగము లేకుండుట - ఈ మూడు లక్షణములు గలవాడు).

  1. “సత్వదేన కాలత్రయా బాధ్యం స్వరూపముచ్యతే, చిత్పదేన ప్రకాశాంతర నిరపేక్షతయా ప్రేమాస్పద తయా సుఖస్వరూపం -”.

(“సత్” అని చెప్పుటవలన భూతభవిష్యద్వర్తమానములందు నాశము లేకుండునది. “చిత్” అని చెప్పుటచేత ఇతర వస్తువులమీద ఆధారపడకస్వయముగా ప్రకాశించునది. ‘ఆనందము’ అని చెప్పుటచేత గొప్ప ప్రేమకు ఆస్పదమై యుండుటవలన సుఖమే స్వరూపముగా గలవాడు అని అర్థము).

  1. “సత్ కాంతయా భాద్యం, చిత్ ప్రమాణాంతరనైరపేక్ష్యేణ సర్వ దృశ్య ప్రకాశన తమా ప్రకాశమానం, ఆనందః నిర్మృష్ట నిఖిలదుఃఖానుషంగ సుఖరూపః, పూర్ణః, సర్వవ్యాపీ, ఆత్మా దేహేంద్రియమనో బుద్ధ్యాదిరూపా దనాత్మవర్గాత్ విలక్షణః, ప్రత్యగ్రూపం, అనేన అనృత జడ దుఃఖ పరిచ్ఛిన్నానాత్మభ్యో విలక్ష ణః, అఖండైక రసః ఆత్మేత్యుక్త భవతి”.

(‘సత్’ అనగా, భూతభవిష్యద్వర్తమానకాలములందు నశింపనిది., ‘చిత్’ అనగా ఇతర పదార్థములశక్తిమీద ఆధారపడక ఈ కనబడు ప్రపంచమంతటిని ప్రకాశింపచేయుచు తాను ప్రకాశించునది. ‘ఆనందము’ అనగా, అన్ని విధములైన దుఃఖములను పోగొట్టు సుఖరూపము - ‘పూర్ణము’ అనగా అన్నింటిలోను పూర్తిగా వ్యాపించియుండునది. దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మొదలగు అనాత్మవస్తువుల కంటె వేఱు లక్షణములు కలది - ప్రత్యగ్రూపము. ఇట్లు చెప్పుటవలన అనృతం, జడము, దుఃఖము పరిచ్ఛిన్నము అయిన అనాత్మవస్తువులకంటె వేరైనది, ఏకైక రసము, (ఒకే విధమైన తత్వము కలది) అని చెప్పబడుచున్నది).

  1. “స ఏవ సత్య విజ్ఞాన పూర్ణానందైక లక్షణః |

అసత్యాలంబనత్వేన సత్య సర్వ జడస్యతు |

సాధకత్వేన చిద్రూపః సదా ప్రేమాస్పదత్వతః |

ఆనందరూపః సర్వార్థ సాధకత్వేన హేతునా |

సర్వ సంబంధకత్వేన సంపూర్ణః శివ సంజ్ఞితః ||“. (పరాశరోపనిహత్)

(ఆ పరబ్రహ్మయే సత్య విజ్ఞాన పరిపూర్ణ ఆనందములు - సచ్చిదానంద పరిపూర్ణములు ఒకే లక్షణముగా గలవాడు - అసత్తా సత్ అనియు లంబనమువలన సత్ అనియు, జడవస్తువులకు సాధనమగుటవలన వాటికి తన చిచ్చక్తినిచ్చి - చైతన్యశక్తినిచ్చి వాటిని చైతన్యవంతములుగా చేయుటవలన ‘చిత్’ అనియు, ఎల్లపుడు ప్రేమకు ఆస్పదమగుటవలన, పురుషార్థములన్నింటిని సాధింపచేయువాడగుటవలనను, ‘ఆనందః’ అనియు, అన్నింటితోను సంబంధము కలిగియున్నందున “పరిపూర్ణుడు” అని పరబ్రహ్మ చెప్పబడుచున్నాడు).

  1. “సత్యం జ్ఞానం సుఖం స్వరూపం వరవస్తునః |

తస్మాత్సత్య చిదానందా గుణా న పరవస్తునః |

స్వరూపమేవ తస్య మాయా విజృంభితః ||” (పరాశరపురాణే)

(సత్యం - సత్యత్వము, మూడుకాలములందుండుట - శాశ్వతము, జ్ఞానము, లేక చిచ్చక్తి (చైతన్యశక్తి), సుఖము - అనంతసుఖము, శాశ్వతసుఖము, ముక్త - ఈ మూడు భగవంతుని రూపములు - చైతన్యశక్తియే భగవంతుడు, అతనికిని అతని సక్తికిని భేదములేదు - ఈ రెండు వేరుకావు. మోక్షమే భగవతుడు, భగవంతుడే మోక్షము - ఇవి అతని రూపములేకాని, అతని గుణములుకావు - భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు)

  1. నామరూపాది రహితమగు నిర్వికార, నిష్క్రియబ్రహ్మము అసత్తు అగు జగత్తుకంటె వేరగుటచేత సత్తుగాను, ‘అచిత్’ అగు (జడమగు) జగత్తుకంటె వేఱగుటచేత ‘చిత్’ గాను, దుఃఖరూపమగు జగత్తు కంటె వేరగుటచేత ‘అనందము’ గాను ఉపనిషత్తులు బోధించుచున్నవి.

  2. అగ్నికి ఎఱుపురంగు, వేడిమి, కాంతి అను మూడు గుణములున్నవి. ఇవి వేరు వేరుగా నున్నవి - అయినను ఈ మూడు లక్షణములు కలిగియున్నది ఒక్కటే - అగ్ని. అట్లే భగవంతుడు నివృత్తిలేనివాడగుటచేత అత్ అన్యు, జడమైన జగత్తుకంటె వేరు అయినవాడై ప్రకాశరూపమము గలవాడగుటచేత ‘చిత్’ అనియు, దుఃఖముకంటె వేరైన సుఖము,లేక ప్రీతి విషయము అగుటవలన ఆనందము అనియు వేరు వేరుగా చెప్పబడుచున్నను అగ్నివలె మూడు లక్షణములు కలిసిన ఒకేవస్తువుగా నున్నాడు).

  3. బ్రహ్మము సద్రూపము గాదు సంశయము బాపుటకు సత్పదమును, జడము అను సంశయము బాపుటకు ‘చిత్’ పదమును, నద్వితీయమను సందియము బాపుటకు అద్వితీయ పదమును, దుఃకహ్మను సందేహము బాపుటకు ‘ఆనందము’ అను పదమును, సార్థకములు కాగా, బ్రహ్మ సచ్చిదానందరూపము, గాని బ్రహ్మమందు సత్యత్వము, చిత్వము, మున్నగు ధర్మములు లేవు. బ్రహ్మము సచ్చిదానందైకరసము - అందు సచ్చిదానందములు అను అంశములు వేర్వేరులేరు, కావున ఏకరసము).

  4. “సత్తయాచ, ప్రకాశేన, ప్రియేణ చపరం పదం”.

(సత్తా, ప్రకాశము, ప్రియమౌ తానే కలవాడు అగుటచేత పరమపదమగు మోక్షము తానే అయినవాడు).

  1. “యతస్తు జాతం సకలం విచిత్రం సత్యవిత్సురాః |

ససత్యో (అ)సత్యసాక్షిత్వాత్, సాక్షిత్వాత్ చిత్ సుఖం తథా |

ప్రేమాస్పదత్వాదద్వైతం భేదా భావాత్ సురర్షభాః ||“. (సూతసంహితాయాం)

(ఈ విచిత్రమైన జగత్తు అంతయు ఎవని సత్యస్వరూపమునుండి పుట్టినదో అతడు సత్యుడు, అసత్తుకు సాక్షియగుటవలన చిత్, ప్రేమకు ఆస్పదమైనవాడు, పరమ సుఖమగు మోక్షమునిచ్చువాడగుటచేత సుఖ రూపుడైనవాడు - ఇవన్నియు కలిసి భగవంతునిలో నున్నవి)

  1. “సత్యజ్ఞానానందాదికం హి ఆత్మనః ప్రమార్థికం స్వరూపం, యద్యపి తద ఖండైకరసః, తథాపి సర్వదా బాధ రాహిత్యాద్యుపాధి భేదేన సచ్చిదానంద మితి భేదేన వ్యవహ్రియతే. స్వస్మిన్ పరికల్పిత నానాన్యక్తిషు. అధిష్టాన భూతం సన్మాత్మమేవ సత్తా ఇత్యుచ్యతే. తస్య సత్తామాత్రస్య యస్మాత్ స్వత శుద్ధిరంగీకార్యా అత్ర సదోష స్పర్శః ఇత్యర్థః. సత్యాయాః స్వతశ్శుద్ధిరంగీకార్యా జ్ఞాయతే అనేకజ్ఞానమితి, పురుషైరర్ధ్యమానత్వాత్. ఆనందస్యాపి స్వతశ్శుద్ధిరంగీకార్యా - సహ్యవిద్ధం పదార్థం పురుషై రర్ధ్యతే. బ్రహ్మస్తంబ పర్యంతైరర్థ నీయస్య తస్యానందస్య నశ్వరత్వమా శంక్య నిరస్యతి - - - పరమ ప్రేమాస్పదత్వాత్ ఆత్మనః సుఖరూపత్వం పరికల్పిత భేదభిన్నానాం సత్తా జ్ఞాన సుఖానాం నిర్దుష్టత్వేన స్వతశ్శుద్ధి ప్రతిపాదనాత్ కల్పిత భేదవిరహాత్ అఖండైక రసస్వభావేన ఏతాషామేవ ఆత్మస్వరూపత్వాత్ సత్యజ్ఞానాదిలక్షణం ఆత్మవిత్స్వపి స్వతశ్శుద్ధ మిత్యర్థః”.

(సత్యజ్ఞానానందములు మొదలగునవి ఆత్మయొక్క పరమార్థస్వరూపము. ఆత్మ అఖండైకరసము - ఒకటే తత్వము గలది. అయినను ఉపాధి భేదమువలన సత్యము, జ్ఞానము, ఆనందము అని వేఱు వేఱుగా వ్యవహరింపబడుచున్నది. తనలోనే కల్పితమైన అనేక వ్యక్తులందు అధిష్టానము చేసుకొని యుండు - అధిష్టించియుండు - సన్మాత్రమే (సద్వస్తువే) సత్తా అని చెప్పబడుచున్నది. సత్తా (చైతన్యశక్తి) స్వతః శుద్ధమైనదని అంగీకరించవలసినది. తెలియచేయునది జ్ఞానము - పురుషులు (జీవులు) అర్థించునది (కోరునది) కనుక ఆనందము - సుఖము - స్వతః శుద్ధమైనదనియే అంగీకరించవలసినది. శుద్ధముకాని దానిని పురుషులు కోరరు. బ్రహ్మాదిస్తంబపర్యంతము గలవన్నియు అర్థించు ఆనందము - సుఖము - నశించునదా అను సంశయము తొలగించుటకు ఇట్లు చెప్పడమైనది. ఆత్మ పరమప్రేమకు ఆస్పదమైనది కనుక సుఖరూపము - ఆనందరూపము. సత్, జ్ఞానము, సుఖము, (ఆనందము) అనునవి వేరు వేరు అని కల్పించబడుటచేతనున్నూ, దోషము లేనివగుటచేతను, స్వతఃశుద్ధమైనవగుటచేతను, ఆత్మవలె అక్షండైక రస స్వభావము గలవగుటచేత ఇచి ఆత్మస్వరూపము అగుతవలనను సత్య జ్ఞానానంద లక్షనము ఆత్మవలె స్వతశ్శుద్ధము)..

  1. ‘సత్’ అనగా భూతభవిష్యద్వర్తమాన కాలములందు నశించని స్వరూపము - ‘చిత్’ అనగా ప్రకాశించి ఇంకొక వస్తువుమీద ఆధారపడకుండ ప్రకాశించునది. ‘ఆనందము’ అనగా నిరతిశయ ప్రేమకు ఆస్పదమైయుండుటచేత సుఖస్వరూపమై యుండునది. ‘ఘనము’ అనగా ఆ సత్, చిత్, ఆనందములను భోధించునది. సత్ అనునది సమస్త కార్యవస్తువులకు అధిష్ఠానము, చిత్ అనునది సమస్త జీవులలోను ప్రతిబింబించిన చైతన్యము. చతుర్ముఖబ్రహ్మ మొదలు స్థావరములవరకు గల సమస్త జీవరాసులలో నుండు చైతన్యము. అన్నింటియొక్క ఆనందము వేఱువేఱుగా కాక ఒకటిగానే యుండునది ఆనందము. ఈ మూడు కలిసి ఒకేచోట నుండుటచేత సచ్చిదానందఘనము - సూక్ష్మరూపములో కరడుగట్టి, ప్రపంచమంతటను వ్యాపించి యుండునను తరగనిదగుటచేత ఘనము - ఘనీభూతము అయినది).

  2. సచ్చిదానందాః పరస్పరం అభిన్నాః సంతాః ఏకరూపాః ఏవ భవంతి - యది ఆత్మగుణాః స్యుః తదా పరస్పరం భిన్నాః అపి భవేయః. తేషాం ఆత్మస్వరూపత్వాత్ న తే భిన్నాః భవంతి. ఏకః ఏవ ఆత్మా నివృత్తి రహితత్వాత్ - నాసరహితత్వాత్ - సత్ ఇతి కధ్యతే. జడల విలక్షణతయా ప్రకాసరూపత్వాత్ చిత్ ఇతి కద్యతే. దుఃఖ విలక్షణతయా ముఖ్య ప్రీతి విషయత్వాత్ ఆనందః ఇతి చ కధ్యతే - యథా ఉష్ణ ప్రకాశరూపో అగ్నిః భవతి తథా సచ్చిదానంద రూప ఆత్మా భవతి. సచ్చిదానందస్వరూపమేవ శాస్త్రేషు బ్రహ్మగీయతే - “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ”, “విజ్ఞానమానందం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఇత్యాది వచినైః, తస్మాత్ ఆత్మా బ్రహ్మ స్వరూప ఏవ బ్రహ్మ ఇతి వ్యాపకస్య సంజ్ఞా - బృహి, బృహి వృద్ధౌ” ఇతి ధాతఓ నిష్పన్నః బ్రహ్మ శబ్దః యన్నిరతిశయం వ్యాపకం తదా చష్టే యస్య దేవకృతో అంతం నాస్తి తత్ వ్యాపకః ఇత్యుచ్యతే, తస్మాత్ ఆత్మా యది బ్రహ్మణః భిన్నః స్యాత్ తదా ఆత్మా దేశకృతాంతవాన్ స్యాత్. యస్య కృత అంతో అతి తస్య కాలకృతో పి అంతః అస్తీతి నియమః. తస్మాత్ తద్వస్తు అనిత్యం ఇతి కీర్త్యతి. తస్మాత్ ఆత్మా బ్రహ్మణః న భిన్నః. బ్రహ్మ యది ఆత్మభిన్నం స్యాత్ తదా బ్రహ్మ అనాత్మా భవేత్ - అనాత్మ భూతం ఘటాదికం జడం భవేత్. తస్మాత్ బ్రహ్మ ఆత్మానః న భిన్నం, బ్రహ్మస్వరూపమేవ ఆత్మా - “ఏకమేవ చైతన్యం సర్వ ప్రపంచస్య నూయా యాశ్చ అధిష్ఠానం భవతి. తస్మాత్ తత్ బ్రహ్మ ఇతి కథ్యతే - తదేవ చైతన్యం అవిద్యాయాః వ్యష్టి దేహాదినాం చ అధిష్ఠానం భవతి. తస్మాత్ ఆత్మా ఇతి కథ్యతే - ఆత్మనః బ్రహ్మణశ్చ ఉపాధి భేదం వినా భేదోనాస్తి. ఆత్మా ఇతి బ్రహ్మ ఇతి చ ఏకమేవస్తు.

(సత్, చిత్, ఆనందము అను మూడును ఒకటికొకటి వేఱుకావు, అన్నీ కలిసి ఒకటే. అవి ఆత్మగుణములే అయినచో ఒకటికొకటి వేరై యుండును - అవి ఆత్మ రూపములే అయినందున వేఱు వేఱు కావు - ఒకటే అయిన, ఆత్మ నివృత్తిలేనిదగుటచేత (నశించనిదగుతచేత) ‘సత్’ అని చెప్పబడుచున్నది. జడముకంటె వేఱు విధమైన లక్షణములు కలదగుటచేతనున్నూ, ప్రకాశించునదగుటచేతనున్నూ, ‘చిత్’ అని చెప్పబడుచున్నది. దుఃఖములేనిదగుటచేతను, ముఖ్య ప్రీతికి విషయమగుతవలనను ‘ఆనందము’ అని చెప్పబడుచున్నది. అగ్ని వేడిమి ప్రకాశము (వెలుతురు) కలదగునట్లు చెప్పబడుచున్నది. వేడిమి కాని, వెలుతురు కాని (కాంతిగాని) అగ్నికంటె వేఱుకాదు - ఆ ప్రకారమే ఆత్మ సచ్చిదానందరూపమగుచున్నది. సచ్చిదానందస్వరూపమే బ్రహ్మయని శాస్త్రములు చెప్పుచున్నవి. “సత్యం జ్ఞానం అనంతం” అనిన్నీ, ‘ప్రజ్ఞానము బ్రహ్మ’ అనిన్నీ, ‘విజ్ఞానము, ఆనందము బ్రహ్మ’ అనిన్నీ మొదక్లగు వాక్యములు చెప్పుచున్నవి. ఇందుచేత ఆత్మ బ్రహ్మ స్వరూపమే - ‘బ్రహ్మ’ అనగా వ్యాపించునది - ” బృహి, బ్రుహివృద్ధౌ” అను ధాతువు వలన పుట్టిన బ్రహ్మ యను ం,ఆతకు అనతము లేకుండగ వ్యాపించునది యని అర్థము - దేనికి దేశముతో అంతము లేదో అది వ్యాపకము అని చెప్పబడినది. అందుచేత ఆత్మ బ్రహ్మకంటె వేఱయినయడల దేశమువలన అంతము కలదగును. దేనికి దేశము వలన అంతము కలదో దానికి కాలమువలన కూడా అంతము కలదనునది నియమము - అందుచేత అట్టి వస్తువు నిత్యము కానిది. దేనికి కాలమువలన అంతము కలదో ఆ వస్తువు అనిఉత్యవస్తువు అని చెప్పబడుచున్నది - అందుచేత ఆత్మ బ్రహ్మకంటె వేఱైనదికాదు - బ్రహ్మ ఆత్మకంటె భిన్నమైనది - వేఱైనది - అయినయడల బ్రహ్మ అనాత్మవస్తువగును - కుండ మొదలగు అనాత్మ వస్తువులు జడము - అందుచేత ఆత్మకంటె వేఱైనయడల బ్రహ్మము కూడా జడమగును. అందుచేత - అందుచేత బ్రహ్మ ఆత్మకంటె వేఱుకాదు, ఆత్మ బ్రహ్మస్వరూపమే -).

(ప్రపంచమంతటికి - మాయకి - ఒకే చైతన్యము అధిష్ఠానమై అయి యున్నది. అందువలననే అది - ఆ చైతన్యము బ్రహ్మయని చెప్పబడుచున్నది. ఆ చైతన్యమే అవిద్య యొక్క వ్యష్టి దేహము మొదలగువాటికి అధిష్ఠానమై యున్నది. అందుచేతనే ఆత్మయని చెప్పబడుచున్నది. ఆత్మకు బ్రహ్మకు ఉపాధిభేదము తప్ప ఇంకొక భేదములేదు - ఆత్మ అనినను బ్రహ్మ అనినను ఒకటే).

  1. “ఆత్మద్రవ్యం స్వయం శుద్ధం సత్యజ్ఞానాది లక్షణం |

సత్తామాత్రేణ దోషోస్తి స్వతస్సిద్ధం యతః సదా |

యది సత్త స్వతో (అ)శుద్ధో దుష్టం సర్వం భ్వేత్తదా |

దుష్ట సత్తాభి సంబంధాత్ దుష్ట స్పృష్టం తథా ఖలు |

తథా కహ్లు విశుద్ధం తు న సిద్ధ్యత్యేవ కించన |

సత్తా శూన్యంతు తుచ్ఛం స్యాత్ సత్తా శుద్ధా స్వతస్త్వతః |

జ్ఞపిరూప మవిజ్ఞానం శుద్ధమేవ స్వతః సదా |

అశుద్ధర్జడరూపేహి వా దృష్టం భవేద్యతి |

దుష్టమేవ భవేత్సర్వం దుష్ట స్ఫురణ సంగమాత్ |

తథా సతి విశుద్ధం తు న సిద్ధ్యత్యేన కించన |

వస్తుస్ఫురణ శూన్యంతు తుచ్ఛమేవ భవేత్సదా |

దుష్టకారణ విజ్ఞానే దోషో (అ)స్తీతి వదేత్యది |

అభివ్యంజిక వృత్తాహిదో జ్ఞానే దోషోన చ స్వతః |

అన్యథా సకలం జ్ఞానం దుష్టమేవ స్వతో భవేత్ |

అతః స్ఫురణ రూపం తు జ్ఞానం శుద్ధం స దైవతు |

ఆనందస్తు స్వయం శుద్ధం పురుషైరిద్థ్యతే యతః |

అశుద్ధః సర్వదా భావో నార్థ్యటే పురుషైః ఖలు |

బ్రహ్మాది స్తంబ పర్యంతైరర్థ్యతే హి సుఖం సదా |

న దృశ్యతే తతో(అ)దృష్టమితి చేహ న సనగతం |

అభివ్యంజిక వృత్యాహి సుఖే దోషో న చ స్వతః |

ఆత్మరూపం సుఖం నిత్యం నైవ జన్మ వినాశవత్ |

ప్రేమాలంబనతః స్వాత్మా సుఖమేవ న సంసయః |

ఆత్మనశ్చ సుఖస్యాపి ప్రేమాలంబనతా సదా |

విద్యతే తత్తి యోరైక్యం వస్తుతోస్తు సుఖాత్మనోః |

అతశ్చా త్మతయా నిత్యం సుఖం నిర్దోషమేవహి |

అతః సత్యచిదానందాః స్వతశ్శుద్ధా న సంసయః |

సత్యాత్మ లక్షణం త్వాత్మ ద్రవ్యం శుద్ధం తతః స్వతః ||.” - (సూతసంహితాయాం)

(ఆత్మయనునది స్వయముగా శుద్ధమైనది, నిష్కల్మషమైనది, సత్ చిత్ (జ్ఞానము) ఆనందము (సుఖము) అను లక్షణములు కలది. స్వతస్సిద్ధమైనదగుటచేత సత్తామాత్రమైనది కనుక దోషము లేనిది. సత్ పదార్థము స్వయముగా అశుద్ధమే (శుద్ధము కానిది) అయినచో అంతయు కూడ దోషమైనదే అయి యుండవలెను - దుష్టమైనదానికి సంబంధించినదంతయు దుష్టమే కావలెను - అప్పుడు శుద్ధమైన వస్తువే యుండదు - సత్పదార్థము స్వతః శుద్ధమైనదగుటవలన సత్తాలేని వస్తువు శూన్యమే యగును - జ్ఞప్తి (జ్ఞాపకముంచుకొనుట) రూపమే జ్ఞానము. అది స్వతః ఎల్లపుడు శుద్ధమైనదే. జడరూపమైన వస్తువు అందఱికీ శుద్ధముకానిదేగానే అగపడును - స్వతః స్ఫురించు జ్ఞానము దుష్టమైనదైనయడల దుష్టస్ఫురణగలదంతయు దుష్టమే అవ వలయును - అట్టియెడ శుద్ధమైనదే కొంచెమైనను ఉండకపోవలయును - స్ఫురణలేనివస్తువు తచ్ఛమైనదేయగును - ఏ కారణమువలన జ్ఞానములో దోషమున్నదని తెలుసుకొనిన స్వతః జ్ఞానములో దోషమే లేదు. అట్లు కాకున్న యడల జ్ఞానము స్వతః దుష్టమైనదవవలసియుండును - అందుచేత స్ఫురణరూపమైన జ్ఞానము ఎల్లపుడు శుద్ధమైనదే - ఆనందము శుద్ధమైనది. దానిని పురుషులు (జనులు) కోరుదురు - శుద్ధముకానిదానిని ఎవరునూ కోరరు - చతుర్ముఖబ్రహ్మ మొదలు స్తంబము వఱకు గల వారందఱు ఎల్లపుడూ సుఖము కోరుదురు. ఇంద్రియములకు విషయసంపర్కము కలుగుటవలన సుఖము కలుగును - సుఖమందు దోషము స్వతః లేదు. నిత్యసుఖమనునది ఆత్మరూపము. దానికి జననమరణములు లేవు - సుఖము ఆత్మయే యగుటవలన దోషము లేనిది. పైన చెప్పిన కారణములవలన సచ్చిదానందములు స్వతః శుద్ధములు. ఇందుకు సందేహము లేదు).

  1. “అస్తీత్యోపలబ్దవ్యం” ఇత్యాదిశు తేః నిరధిష్ఠానక భ్రమా(అ)సంభవాత్ స్తన పానాది ప్రవర్తక జన్మాంతరీయ సంస్కారనువృత్తి దర్శనాచ్చ సదాత్మకత్వ మిత్యర్థః “అత్రాయః పురుషః స్వయం జ్యోతిః” (బృహదారణ్యకోపనిషత్ - 4 - 3 - 6),

“సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” (తైత్తిరీయోపనిషత్ - 2 - 1 - 1)

“అయమాత్మా సర్వానుభూః” (బృహదారణ్యకోపనిషత్ - 2 - 5 - 15)

ఇత్యాది శ్రుత్యా స్వయంప్రకాశేన స్వయంప్రకాశకజ్ఞానాత్మత్వేన చ ప్రతిపాదనాత్ చిదాత్మకమత్యర్థః - నను విజ్ఞానస్య కథం స్వయం ప్రకాసతీతి చేన్న. విషయాత్మ విజ్ఞానానాం త్రయాణామపి జడత్వే జగదాంధ్య ప్రసంగాత్ విజ్ఞానస్య విజ్ఞానాంతర సాపేక్షత్వే తయ్సాపి జదత్వేన (అ)నవస్థాపాతాచ్చాత్మనః విజ్ఞానాత్మత్వే స్వయం ప్రయోగః విజ్ఞాతా న స్వాతిరిక్త విజ్ఞానాధీన ప్రకాశః విజ్ఞానకర్మ తామంతరేణ అపరోక్షత్వాత్ సంవేదనవత్.

ఆత్మ పరమానందస్వభావః పరప్రేమాస్పదత్వాత్ వ్యతిరేకే ఘటవదిత్యాది యుక్త్యా “ఆనందో బ్రహ్మ” (తైత్తిరీయోపనిషత్ - 3 - 6)

“ఇత్యాది శ్రుత్యా చానదాత్మక మిత్యర్థః జడదాత్మకత్వంతు విరోదా దేవ న సంభవతి”. (వేదాంతపరిభాషా)

(ఉన్నది, కలదు - అన్నికాలములందుండునది (ప్రపంచమునకు అధిష్ఠానము లేదు అను భ్రమ అసంభవము అగుటవలన - అనేక జన్మల సంస్కారమునుబట్టి తెలియచ్చునది కనుక పరబ్రహ్మ ‘సత్’ అనుత సిద్ధించినది. బృహదారణ్యకోపనిషత్తులో - “ఈ పురుషుడు స్వయంజ్యోతి, స్వయంప్రకాశము” అనిన్నీ; తైత్తిరీయోపనిషత్తులో “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” (సత్ ఆత్మకమనిన్నీ జ్ఞానస్వరూపుడనిన్నీ, అనంతుడు - అంతము లేనివాడు, ఏ విధముగా చూచినను అంతములేనివాడు) అనిన్నీ; బృహదారణ్యకోపనిషత్తులో “ఈ ఆత్మ సర్వానుభూః” అనిన్నీ శ్రుతి చెప్పుటచేత పరబ్రహ్మ స్వయంప్రకాసము (తనంతట తానే ప్రకాశించునది - ప్రకాశించుటకు ఇంకొకరిమీద అధారపడియుండనిది) లేక, స్వయముగా జ్ఞానము కలిగియున్నదనిన్నీ, శ్రుతి చెప్పుటచేత పరబ్రహ్మ ‘చిత్’ - చిదాత్మకము - అని చెప్పబడుచున్నది. జ్ఞానమునకు స్వయంప్రకాశము ఎట్లు కలుగును అనగా విజ్ఞానము కలవాడు ఇతరుల చిజ్ఞానముమీద అధారపడియుండడు)

(ఆత్మ పరమ ప్రేమాస్పదము కనుకను, “ఆనందము పరబ్రహ్మమే” అని శ్రుతి - తైత్తరీయోపనిషత్ - 3 6 - చెప్పుటవలనను ఆత్మ అనందాత్మకము - ఆనందమే బ్రహ్మ)

  1. “సచ్చిదానందంబులాత్మ స్వరూపంబై సద్రూప విద్రూపంబులవలె సర్వ బుద్ధి వృత్తులయందును ఆనందరూపంబున కభివ్యక్తి కలుగవలెనది లేదు - గావున ఆనందరూపముగాదు అన్నను అందుకు ఉష్ణ ప్రకాశరూపంబైన దీప ప్రకాశమే గృహమందు వ్యాపించియుండును, ఉష్ణంబు వ్యాప్తంబుగాక యుండును - ఉదకమందు ఉష్ణమే ప్రకాశమై యుండును, ప్రకాశంబు ప్రకటంబుగాక యుండును. మరి యందు ఉష్ణ ప్రకాశంబులు రెండును ప్రకటించి తోపుచుండు కైవడి పాషాణుదులయందు బ్రహ్మ సద్రూపంబునకు నభివ్యక్తిగాక చిదానందంబుల కభివ్యక్తియగుటం జేసి యొక్క తమోగుణంబువలన నజ్ఞానమయంబున మూఢ వృత్తి యందును, రాగమయంబైన ఘోరవృత్తి యందును సచ్చిద్రూపంబులు రెంటికిన్నీ స్పష్టత. ఇంతే గాని ఆనందరూపంబునకు స్పష్టత దొరకొనదు - సత్వగుణంబువలన వైరాగ్యమయంబగు శాంతవృత్తి యందు సచ్చిదానంబనెడు త్రిరూపంబులకు స్ఫురణంబు గలుగుటం జేసి యానందంబాత్మ స్వరూపము”.

(వివేక చింతామణి - 1)

  1. “పర్వతాలయందున్నూ సదంశం ఉన్నదికనుక తన్నిరసనార్థమై చిత్పదప్రయోగం సచ్చిద్పదాలున్నూ చంద్ర సూర్యాగ్నులకు కలిగి ఉన్నవి కనుక తన్నిరిసనార్థమై ఆనందప్రయోగము. సచ్చిదానందములున్నూ హరి బ్రహ్మాదుల యందు కలవు గనుక తన్నిరసనార్థమై నిత్యపదప్రయోగము. సచ్చిదానంద నిత్యత్వమున్నూ బ్రహ్మమైనచోట ప్రాదేశిక శంకా నిరసనార్థము పూర్ణపద ప్రయోగము” - ఇవన్నియు కలిసి సచ్చిదానంద నిత్య పరిపూర్ణుడు పరబ్రహ్మ అని చెప్పబడును“.
Transliteration
  1. sata = śāśvatamugā nuṃḍuṭa, cit = jñānamu, ānaṃdamu = saṃtōṣamu - ī mūḍu tānē ayinavāḍu).

  2. “yadasti sanmātraṃ; yadvibhāti cinmātraṃ, yatpriyaṃ ānaṃdaṃ”. (śrutiḥ)

(uṃḍunadi - nāśamu lēkuṃḍa nuṃḍunadi sat; prakāśiṃcunadi cit; priyamainadi ānaṃdamu - ī mūḍurūpamulu tānē ayinavāḍu).

  1. satyaṃca, cicca ānaṃdaśca tēṣāmāspadībhūtaṃ - sadityasya satvamarthadiḥ, bhāva prathānō nirdēśaḥ, anēka sādhukāritvaṃ sūcyatē. cidatyanēna śrutasatvākhyō guṇaḥ ānaṃda ityanēna adōgatvaguṇaḥ-

(satyamu, cit, ānaṃdamu - ī mūḍiṃṭiki āspadamainavāḍu. sat anagā satvamu - bhāmunu mukhyamuga nirdēśiṃcinadu - anēka śubhamulu cēyuṭanu sūciṃcunadi. cit anagā satvamu. ānaṃdamu anuṭavalana rōgamu lēkuṃḍuṭa - ī mūḍu lakṣaṇamulu galavāḍu).

  1. “satvadēna kālatrayā bādhyaṃ svarūpamucyatē, citpadēna prakāśāṃtara nirapēkṣatayā prēmāspada tayā sukhasvarūpaṃ -”.

(“sat” ani ceppuṭavalana bhūtabhaviṣyadvartamānamulaṃdu nāśamu lēkuṃḍunadi. “cit” ani ceppuṭacēta itara vastuvulamīda ādhārapaḍakasvayamugā prakāśiṃcunadi. ‘ānaṃdamu’ ani ceppuṭacēta goppa prēmaku āspadamai yuṃḍuṭavalana sukhamē svarūpamugā galavāḍu ani arthamu).

  1. “sat kāṃtayā bhādyaṃ, cit pramāṇāṃtaranairapēkṣyēṇa sarva dṛśya prakāśana tamā prakāśamānaṃ, ānaṃdaḥ nirmṛṣṭa nikhiladuḥkhānuṣaṃga sukharūpaḥ, pūrṇaḥ, sarvavyāpī, ātmā dēhēṃdriyamanō buddhyādirūpā danātmavargāt vilakṣaṇaḥ, pratyagrūpaṃ, anēna anṛta jaḍa duḥkha paricchinnānātmabhyō vilakṣa ṇaḥ, akhaṃḍaika rasaḥ ātmētyukta bhavati”.

(‘sat’ anagā, bhūtabhaviṣyadvartamānakālamulaṃdu naśiṃpanidi., ‘cit’ anagā itara padārthamulaśaktimīda ādhārapaḍaka ī kanabaḍu prapaṃcamaṃtaṭini prakāśiṃpacēyucu tānu prakāśiṃcunadi. ‘ānaṃdamu’ anagā, anni vidhamulaina duḥkhamulanu pōgoṭṭu sukharūpamu - ‘pūrṇamu’ anagā anniṃṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍunadi. dēhamu, iṃdriyamulu, manassu, buddhi modalagu anātmavastuvula kaṃṭe vēṟu lakṣaṇamulu kaladi - pratyagrūpamu. iṭlu ceppuṭavalana anṛtaṃ, jaḍamu, duḥkhamu paricchinnamu ayina anātmavastuvulakaṃṭe vērainadi, ēkaika rasamu, (okē vidhamaina tatvamu kaladi) ani ceppabaḍucunnadi).

  1. “sa ēva satya vijñāna pūrṇānaṃdaika lakṣaṇaḥ |

asatyālaṃbanatvēna satya sarva jaḍasyatu |

sādhakatvēna cidrūpaḥ sadā prēmāspadatvataḥ |

ānaṃdarūpaḥ sarvārtha sādhakatvēna hētunā |

sarva saṃbaṃdhakatvēna saṃpūrṇaḥ śiva saṃjñitaḥ ||“. (parāśarōpanihat)

(ā parabrahmayē satya vijñāna paripūrṇa ānaṃdamulu - saccidānaṃda paripūrṇamulu okē lakṣaṇamugā galavāḍu - asattā sat aniyu laṃbanamuvalana sat aniyu, jaḍavastuvulaku sādhanamaguṭavalana vāṭiki tana ciccaktinicci - caitanyaśaktinicci vāṭini caitanyavaṃtamulugā cēyuṭavalana ‘cit’ aniyu, ellapuḍu prēmaku āspadamaguṭavalana, puruṣārthamulanniṃṭini sādhiṃpacēyuvāḍaguṭavalananu, ‘ānaṃdaḥ’ aniyu, anniṃṭitōnu saṃbaṃdhamu kaligiyunnaṃduna “paripūrṇuḍu” ani parabrahma ceppabaḍucunnāḍu).

  1. “satyaṃ jñānaṃ sukhaṃ svarūpaṃ varavastunaḥ |

tasmātsatya cidānaṃdā guṇā na paravastunaḥ |

svarūpamēva tasya māyā vijṛṃbhitaḥ ||” (parāśarapurāṇē)

(satyaṃ - satyatvamu, mūḍukālamulaṃduṃḍuṭa - śāśvatamu, jñānamu, lēka ciccakti (caitanyaśakti), sukhamu - anaṃtasukhamu, śāśvatasukhamu, mukta - ī mūḍu bhagavaṃtuni rūpamulu - caitanyaśaktiyē bhagavaṃtuḍu, atanikini atani saktikini bhēdamulēdu - ī reṃḍu vērukāvu. mōkṣamē bhagavatuḍu, bhagavaṃtuḍē mōkṣamu - ivi atani rūpamulēkāni, atani guṇamulukāvu - bhagavaṃtuḍu nirguṇuḍu, nirākāruḍu)

  1. nāmarūpādi rahitamagu nirvikāra, niṣkriyabrahmamu asattu agu jagattukaṃṭe vēraguṭacēta sattugānu, ‘acit’ agu (jaḍamagu) jagattukaṃṭe vēṟaguṭacēta ‘cit’ gānu, duḥkharūpamagu jagattu kaṃṭe vēraguṭacēta ‘anaṃdamu’ gānu upaniṣattulu bōdhiṃcucunnavi.

  2. agniki eṟupuraṃgu, vēḍimi, kāṃti anu mūḍu guṇamulunnavi. ivi vēru vērugā nunnavi - ayinanu ī mūḍu lakṣaṇamulu kaligiyunnadi okkaṭē - agni. aṭlē bhagavaṃtuḍu nivṛttilēnivāḍaguṭacēta at anyu, jaḍamaina jagattukaṃṭe vēru ayinavāḍai prakāśarūpamamu galavāḍaguṭacēta ‘cit’ aniyu, duḥkhamukaṃṭe vēraina sukhamu,lēka prīti viṣayamu aguṭavalana ānaṃdamu aniyu vēru vērugā ceppabaḍucunnanu agnivale mūḍu lakṣaṇamulu kalisina okēvastuvugā nunnāḍu).

  3. brahmamu sadrūpamu gādu saṃśayamu bāpuṭaku satpadamunu, jaḍamu anu saṃśayamu bāpuṭaku ‘cit’ padamunu, nadvitīyamanu saṃdiyamu bāpuṭaku advitīya padamunu, duḥkahmanu saṃdēhamu bāpuṭaku ‘ānaṃdamu’ anu padamunu, sārthakamulu kāgā, brahma saccidānaṃdarūpamu, gāni brahmamaṃdu satyatvamu, citvamu, munnagu dharmamulu lēvu. brahmamu saccidānaṃdaikarasamu - aṃdu saccidānaṃdamulu anu aṃśamulu vērvērulēru, kāvuna ēkarasamu).

  4. “sattayāca, prakāśēna, priyēṇa caparaṃ padaṃ”.

(sattā, prakāśamu, priyamau tānē kalavāḍu aguṭacēta paramapadamagu mōkṣamu tānē ayinavāḍu).

  1. “yatastu jātaṃ sakalaṃ vicitraṃ satyavitsurāḥ |

sasatyō (a)satyasākṣitvāt, sākṣitvāt cit sukhaṃ tathā |

prēmāspadatvādadvaitaṃ bhēdā bhāvāt surarṣabhāḥ ||“. (sūtasaṃhitāyāṃ)

(ī vicitramaina jagattu aṃtayu evani satyasvarūpamunuṃḍi puṭṭinadō ataḍu satyuḍu, asattuku sākṣiyaguṭavalana cit, prēmaku āspadamainavāḍu, parama sukhamagu mōkṣamuniccuvāḍaguṭacēta sukha rūpuḍainavāḍu - ivanniyu kalisi bhagavaṃtunilō nunnavi)

  1. “satyajñānānaṃdādikaṃ hi ātmanaḥ pramārthikaṃ svarūpaṃ, yadyapi tada khaṃḍaikarasaḥ, tathāpi sarvadā bādha rāhityādyupādhi bhēdēna saccidānaṃda miti bhēdēna vyavahriyatē. svasmin parikalpita nānānyaktiṣu. adhiṣṭāna bhūtaṃ sanmātmamēva sattā ityucyatē. tasya sattāmātrasya yasmāt svata śuddhiraṃgīkāryā atra sadōṣa sparśaḥ ityarthaḥ. satyāyāḥ svataśśuddhiraṃgīkāryā jñāyatē anēkajñānamiti, puruṣairardhyamānatvāt. ānaṃdasyāpi svataśśuddhiraṃgīkāryā - sahyaviddhaṃ padārthaṃ puruṣai rardhyatē. brahmastaṃba paryaṃtairartha nīyasya tasyānaṃdasya naśvaratvamā śaṃkya nirasyati - - - parama prēmāspadatvāt ātmanaḥ sukharūpatvaṃ parikalpita bhēdabhinnānāṃ sattā jñāna sukhānāṃ nirduṣṭatvēna svataśśuddhi pratipādanāt kalpita bhēdavirahāt akhaṃḍaika rasasvabhāvēna ētāṣāmēva ātmasvarūpatvāt satyajñānādilakṣaṇaṃ ātmavitsvapi svataśśuddha mityarthaḥ”.

(satyajñānānaṃdamulu modalagunavi ātmayokka paramārthasvarūpamu. ātma akhaṃḍaikarasamu - okaṭē tatvamu galadi. ayinanu upādhi bhēdamuvalana satyamu, jñānamu, ānaṃdamu ani vēṟu vēṟugā vyavahariṃpabaḍucunnadi. tanalōnē kalpitamaina anēka vyaktulaṃdu adhiṣṭānamu cēsukoni yuṃḍu - adhiṣṭiṃciyuṃḍu - sanmātramē (sadvastuvē) sattā ani ceppabaḍucunnadi. sattā (caitanyaśakti) svataḥ śuddhamainadani aṃgīkariṃcavalasinadi. teliyacēyunadi jñānamu - puruṣulu (jīvulu) arthiṃcunadi (kōrunadi) kanuka ānaṃdamu - sukhamu - svataḥ śuddhamainadaniyē aṃgīkariṃcavalasinadi. śuddhamukāni dānini puruṣulu kōraru. brahmādistaṃbaparyaṃtamu galavanniyu arthiṃcu ānaṃdamu - sukhamu - naśiṃcunadā anu saṃśayamu tolagiṃcuṭaku iṭlu ceppaḍamainadi. ātma paramaprēmaku āspadamainadi kanuka sukharūpamu - ānaṃdarūpamu. sat, jñānamu, sukhamu, (ānaṃdamu) anunavi vēru vēru ani kalpiṃcabaḍuṭacētanunnū, dōṣamu lēnivaguṭacētanu, svataḥśuddhamainavaguṭacētanu, ātmavale akṣaṃḍaika rasa svabhāvamu galavaguṭacēta ici ātmasvarūpamu agutavalananu satya jñānānaṃda lakṣanamu ātmavale svataśśuddhamu)..

  1. ‘sat’ anagā bhūtabhaviṣyadvartamāna kālamulaṃdu naśiṃcani svarūpamu - ‘cit’ anagā prakāśiṃci iṃkoka vastuvumīda ādhārapaḍakuṃḍa prakāśiṃcunadi. ‘ānaṃdamu’ anagā niratiśaya prēmaku āspadamaiyuṃḍuṭacēta sukhasvarūpamai yuṃḍunadi. ‘ghanamu’ anagā ā sat, cit, ānaṃdamulanu bhōdhiṃcunadi. sat anunadi samasta kāryavastuvulaku adhiṣṭhānamu, cit anunadi samasta jīvulalōnu pratibiṃbiṃcina caitanyamu. caturmukhabrahma modalu sthāvaramulavaraku gala samasta jīvarāsulalō nuṃḍu caitanyamu. anniṃṭiyokka ānaṃdamu vēṟuvēṟugā kāka okaṭigānē yuṃḍunadi ānaṃdamu. ī mūḍu kalisi okēcōṭa nuṃḍuṭacēta saccidānaṃdaghanamu - sūkṣmarūpamulō karaḍugaṭṭi, prapaṃcamaṃtaṭanu vyāpiṃci yuṃḍunanu taraganidaguṭacēta ghanamu - ghanībhūtamu ayinadi).

  2. saccidānaṃdāḥ parasparaṃ abhinnāḥ saṃtāḥ ēkarūpāḥ ēva bhavaṃti - yadi ātmaguṇāḥ syuḥ tadā parasparaṃ bhinnāḥ api bhavēyaḥ. tēṣāṃ ātmasvarūpatvāt na tē bhinnāḥ bhavaṃti. ēkaḥ ēva ātmā nivṛtti rahitatvāt - nāsarahitatvāt - sat iti kadhyatē. jaḍala vilakṣaṇatayā prakāsarūpatvāt cit iti kadyatē. duḥkha vilakṣaṇatayā mukhya prīti viṣayatvāt ānaṃdaḥ iti ca kadhyatē - yathā uṣṇa prakāśarūpō agniḥ bhavati tathā saccidānaṃda rūpa ātmā bhavati. saccidānaṃdasvarūpamēva śāstrēṣu brahmagīyatē - “satyaṃ jñānamanaṃtaṃ brahma”, “vijñānamānaṃdaṃ brahma” “prajñānaṃ brahma” ityādi vacinaiḥ, tasmāt ātmā brahma svarūpa ēva brahma iti vyāpakasya saṃjñā - bṛhi, bṛhi vṛddhau” iti dhātaō niṣpannaḥ brahma śabdaḥ yanniratiśayaṃ vyāpakaṃ tadā caṣṭē yasya dēvakṛtō aṃtaṃ nāsti tat vyāpakaḥ ityucyatē, tasmāt ātmā yadi brahmaṇaḥ bhinnaḥ syāt tadā ātmā dēśakṛtāṃtavān syāt. yasya kṛta aṃtō ati tasya kālakṛtō pi aṃtaḥ astīti niyamaḥ. tasmāt tadvastu anityaṃ iti kīrtyati. tasmāt ātmā brahmaṇaḥ na bhinnaḥ. brahma yadi ātmabhinnaṃ syāt tadā brahma anātmā bhavēt - anātma bhūtaṃ ghaṭādikaṃ jaḍaṃ bhavēt. tasmāt brahma ātmānaḥ na bhinnaṃ, brahmasvarūpamēva ātmā - “ēkamēva caitanyaṃ sarva prapaṃcasya nūyā yāśca adhiṣṭhānaṃ bhavati. tasmāt tat brahma iti kathyatē - tadēva caitanyaṃ avidyāyāḥ vyaṣṭi dēhādināṃ ca adhiṣṭhānaṃ bhavati. tasmāt ātmā iti kathyatē - ātmanaḥ brahmaṇaśca upādhi bhēdaṃ vinā bhēdōnāsti. ātmā iti brahma iti ca ēkamēvastu.

(sat, cit, ānaṃdamu anu mūḍunu okaṭikokaṭi vēṟukāvu, annī kalisi okaṭē. avi ātmaguṇamulē ayinacō okaṭikokaṭi vērai yuṃḍunu - avi ātma rūpamulē ayinaṃduna vēṟu vēṟu kāvu - okaṭē ayina, ātma nivṛttilēnidaguṭacēta (naśiṃcanidagutacēta) ‘sat’ ani ceppabaḍucunnadi. jaḍamukaṃṭe vēṟu vidhamaina lakṣaṇamulu kaladaguṭacētanunnū, prakāśiṃcunadaguṭacētanunnū, ‘cit’ ani ceppabaḍucunnadi. duḥkhamulēnidaguṭacētanu, mukhya prītiki viṣayamagutavalananu ‘ānaṃdamu’ ani ceppabaḍucunnadi. agni vēḍimi prakāśamu (veluturu) kaladagunaṭlu ceppabaḍucunnadi. vēḍimi kāni, veluturu kāni (kāṃtigāni) agnikaṃṭe vēṟukādu - ā prakāramē ātma saccidānaṃdarūpamagucunnadi. saccidānaṃdasvarūpamē brahmayani śāstramulu ceppucunnavi. “satyaṃ jñānaṃ anaṃtaṃ” aninnī, ‘prajñānamu brahma’ aninnī, ‘vijñānamu, ānaṃdamu brahma’ aninnī modaklagu vākyamulu ceppucunnavi. iṃducēta ātma brahma svarūpamē - ‘brahma’ anagā vyāpiṃcunadi - ” bṛhi, bruhivṛddhau” anu dhātuvu valana puṭṭina brahma yanu ṃ,ātaku anatamu lēkuṃḍaga vyāpiṃcunadi yani arthamu - dēniki dēśamutō aṃtamu lēdō adi vyāpakamu ani ceppabaḍinadi. aṃducēta ātma brahmakaṃṭe vēṟayinayaḍala dēśamuvalana aṃtamu kaladagunu. dēniki dēśamu valana aṃtamu kaladō dāniki kālamuvalana kūḍā aṃtamu kaladanunadi niyamamu - aṃducēta aṭṭi vastuvu nityamu kānidi. dēniki kālamuvalana aṃtamu kaladō ā vastuvu aniutyavastuvu ani ceppabaḍucunnadi - aṃducēta ātma brahmakaṃṭe vēṟainadikādu - brahma ātmakaṃṭe bhinnamainadi - vēṟainadi - ayinayaḍala brahma anātmavastuvagunu - kuṃḍa modalagu anātma vastuvulu jaḍamu - aṃducēta ātmakaṃṭe vēṟainayaḍala brahmamu kūḍā jaḍamagunu. aṃducēta - aṃducēta brahma ātmakaṃṭe vēṟukādu, ātma brahmasvarūpamē -).

(prapaṃcamaṃtaṭiki - māyaki - okē caitanyamu adhiṣṭhānamai ayi yunnadi. aṃduvalananē adi - ā caitanyamu brahmayani ceppabaḍucunnadi. ā caitanyamē avidya yokka vyaṣṭi dēhamu modalaguvāṭiki adhiṣṭhānamai yunnadi. aṃducētanē ātmayani ceppabaḍucunnadi. ātmaku brahmaku upādhibhēdamu tappa iṃkoka bhēdamulēdu - ātma aninanu brahma aninanu okaṭē).

  1. “ātmadravyaṃ svayaṃ śuddhaṃ satyajñānādi lakṣaṇaṃ |

sattāmātrēṇa dōṣōsti svatassiddhaṃ yataḥ sadā |

yadi satta svatō (a)śuddhō duṣṭaṃ sarvaṃ bhvēttadā |

duṣṭa sattābhi saṃbaṃdhāt duṣṭa spṛṣṭaṃ tathā khalu |

tathā kahlu viśuddhaṃ tu na siddhyatyēva kiṃcana |

sattā śūnyaṃtu tucchaṃ syāt sattā śuddhā svatastvataḥ |

jñapirūpa mavijñānaṃ śuddhamēva svataḥ sadā |

aśuddharjaḍarūpēhi vā dṛṣṭaṃ bhavēdyati |

duṣṭamēva bhavētsarvaṃ duṣṭa sphuraṇa saṃgamāt |

tathā sati viśuddhaṃ tu na siddhyatyēna kiṃcana |

vastusphuraṇa śūnyaṃtu tucchamēva bhavētsadā |

duṣṭakāraṇa vijñānē dōṣō (a)stīti vadētyadi |

abhivyaṃjika vṛttāhidō jñānē dōṣōna ca svataḥ |

anyathā sakalaṃ jñānaṃ duṣṭamēva svatō bhavēt |

ataḥ sphuraṇa rūpaṃ tu jñānaṃ śuddhaṃ sa daivatu |

ānaṃdastu svayaṃ śuddhaṃ puruṣairidthyatē yataḥ |

aśuddhaḥ sarvadā bhāvō nārthyaṭē puruṣaiḥ khalu |

brahmādi staṃba paryaṃtairarthyatē hi sukhaṃ sadā |

na dṛśyatē tatō(a)dṛṣṭamiti cēha na sanagataṃ |

abhivyaṃjika vṛtyāhi sukhē dōṣō na ca svataḥ |

ātmarūpaṃ sukhaṃ nityaṃ naiva janma vināśavat |

prēmālaṃbanataḥ svātmā sukhamēva na saṃsayaḥ |

ātmanaśca sukhasyāpi prēmālaṃbanatā sadā |

vidyatē tatti yōraikyaṃ vastutōstu sukhātmanōḥ |

ataścā tmatayā nityaṃ sukhaṃ nirdōṣamēvahi |

ataḥ satyacidānaṃdāḥ svataśśuddhā na saṃsayaḥ |

satyātma lakṣaṇaṃ tvātma dravyaṃ śuddhaṃ tataḥ svataḥ ||.” - (sūtasaṃhitāyāṃ)

(ātmayanunadi svayamugā śuddhamainadi, niṣkalmaṣamainadi, sat cit (jñānamu) ānaṃdamu (sukhamu) anu lakṣaṇamulu kaladi. svatassiddhamainadaguṭacēta sattāmātramainadi kanuka dōṣamu lēnidi. sat padārthamu svayamugā aśuddhamē (śuddhamu kānidi) ayinacō aṃtayu kūḍa dōṣamainadē ayi yuṃḍavalenu - duṣṭamainadāniki saṃbaṃdhiṃcinadaṃtayu duṣṭamē kāvalenu - appuḍu śuddhamaina vastuvē yuṃḍadu - satpadārthamu svataḥ śuddhamainadaguṭavalana sattālēni vastuvu śūnyamē yagunu - jñapti (jñāpakamuṃcukonuṭa) rūpamē jñānamu. adi svataḥ ellapuḍu śuddhamainadē. jaḍarūpamaina vastuvu aṃdaṟikī śuddhamukānidēgānē agapaḍunu - svataḥ sphuriṃcu jñānamu duṣṭamainadainayaḍala duṣṭasphuraṇagaladaṃtayu duṣṭamē ava valayunu - aṭṭiyeḍa śuddhamainadē koṃcemainanu uṃḍakapōvalayunu - sphuraṇalēnivastuvu tacchamainadēyagunu - ē kāraṇamuvalana jñānamulō dōṣamunnadani telusukonina svataḥ jñānamulō dōṣamē lēdu. aṭlu kākunna yaḍala jñānamu svataḥ duṣṭamainadavavalasiyuṃḍunu - aṃducēta sphuraṇarūpamaina jñānamu ellapuḍu śuddhamainadē - ānaṃdamu śuddhamainadi. dānini puruṣulu (janulu) kōruduru - śuddhamukānidānini evarunū kōraru - caturmukhabrahma modalu staṃbamu vaṟaku gala vāraṃdaṟu ellapuḍū sukhamu kōruduru. iṃdriyamulaku viṣayasaṃparkamu kaluguṭavalana sukhamu kalugunu - sukhamaṃdu dōṣamu svataḥ lēdu. nityasukhamanunadi ātmarūpamu. dāniki jananamaraṇamulu lēvu - sukhamu ātmayē yaguṭavalana dōṣamu lēnidi. paina ceppina kāraṇamulavalana saccidānaṃdamulu svataḥ śuddhamulu. iṃduku saṃdēhamu lēdu).

  1. “astītyōpalabdavyaṃ” ityādiśu tēḥ niradhiṣṭhānaka bhramā(a)saṃbhavāt stana pānādi pravartaka janmāṃtarīya saṃskāranuvṛtti darśanācca sadātmakatva mityarthaḥ “atrāyaḥ puruṣaḥ svayaṃ jyōtiḥ” (bṛhadāraṇyakōpaniṣat - 4 - 3 - 6),

“satyaṃ jñānamanaṃtaṃ brahma” (taittirīyōpaniṣat - 2 - 1 - 1)

“ayamātmā sarvānubhūḥ” (bṛhadāraṇyakōpaniṣat - 2 - 5 - 15)

ityādi śrutyā svayaṃprakāśēna svayaṃprakāśakajñānātmatvēna ca pratipādanāt cidātmakamatyarthaḥ - nanu vijñānasya kathaṃ svayaṃ prakāsatīti cēnna. viṣayātma vijñānānāṃ trayāṇāmapi jaḍatvē jagadāṃdhya prasaṃgāt vijñānasya vijñānāṃtara sāpēkṣatvē taysāpi jadatvēna (a)navasthāpātāccātmanaḥ vijñānātmatvē svayaṃ prayōgaḥ vijñātā na svātirikta vijñānādhīna prakāśaḥ vijñānakarma tāmaṃtarēṇa aparōkṣatvāt saṃvēdanavat.

ātma paramānaṃdasvabhāvaḥ paraprēmāspadatvāt vyatirēkē ghaṭavadityādi yuktyā “ānaṃdō brahma” (taittirīyōpaniṣat - 3 - 6)

“ityādi śrutyā cānadātmaka mityarthaḥ jaḍadātmakatvaṃtu virōdā dēva na saṃbhavati”. (vēdāṃtaparibhāṣā)

(unnadi, kaladu - annikālamulaṃduṃḍunadi (prapaṃcamunaku adhiṣṭhānamu lēdu anu bhrama asaṃbhavamu aguṭavalana - anēka janmala saṃskāramunubaṭṭi teliyaccunadi kanuka parabrahma ‘sat’ anuta siddhiṃcinadi. bṛhadāraṇyakōpaniṣattulō - “ī puruṣuḍu svayaṃjyōti, svayaṃprakāśamu” aninnī; taittirīyōpaniṣattulō “satyaṃ jñānamanaṃtaṃ brahma” (sat ātmakamaninnī jñānasvarūpuḍaninnī, anaṃtuḍu - aṃtamu lēnivāḍu, ē vidhamugā cūcinanu aṃtamulēnivāḍu) aninnī; bṛhadāraṇyakōpaniṣattulō “ī ātma sarvānubhūḥ” aninnī śruti ceppuṭacēta parabrahma svayaṃprakāsamu (tanaṃtaṭa tānē prakāśiṃcunadi - prakāśiṃcuṭaku iṃkokarimīda adhārapaḍiyuṃḍanidi) lēka, svayamugā jñānamu kaligiyunnadaninnī, śruti ceppuṭacēta parabrahma ‘cit’ - cidātmakamu - ani ceppabaḍucunnadi. jñānamunaku svayaṃprakāśamu eṭlu kalugunu anagā vijñānamu kalavāḍu itarula cijñānamumīda adhārapaḍiyuṃḍaḍu)

(ātma parama prēmāspadamu kanukanu, “ānaṃdamu parabrahmamē” ani śruti - taittarīyōpaniṣat - 3 6 - ceppuṭavalananu ātma anaṃdātmakamu - ānaṃdamē brahma)

  1. “saccidānaṃdaṃbulātma svarūpaṃbai sadrūpa vidrūpaṃbulavale sarva buddhi vṛttulayaṃdunu ānaṃdarūpaṃbuna kabhivyakti kalugavalenadi lēdu - gāvuna ānaṃdarūpamugādu annanu aṃduku uṣṇa prakāśarūpaṃbaina dīpa prakāśamē gṛhamaṃdu vyāpiṃciyuṃḍunu, uṣṇaṃbu vyāptaṃbugāka yuṃḍunu - udakamaṃdu uṣṇamē prakāśamai yuṃḍunu, prakāśaṃbu prakaṭaṃbugāka yuṃḍunu. mari yaṃdu uṣṇa prakāśaṃbulu reṃḍunu prakaṭiṃci tōpucuṃḍu kaivaḍi pāṣāṇudulayaṃdu brahma sadrūpaṃbunaku nabhivyaktigāka cidānaṃdaṃbula kabhivyaktiyaguṭaṃ jēsi yokka tamōguṇaṃbuvalana najñānamayaṃbuna mūḍha vṛtti yaṃdunu, rāgamayaṃbaina ghōravṛtti yaṃdunu saccidrūpaṃbulu reṃṭikinnī spaṣṭata. iṃtē gāni ānaṃdarūpaṃbunaku spaṣṭata dorakonadu - satvaguṇaṃbuvalana vairāgyamayaṃbagu śāṃtavṛtti yaṃdu saccidānaṃbaneḍu trirūpaṃbulaku sphuraṇaṃbu galuguṭaṃ jēsi yānaṃdaṃbātma svarūpamu”.

(vivēka ciṃtāmaṇi - 1)

  1. “parvatālayaṃdunnū sadaṃśaṃ unnadikanuka tannirasanārthamai citpadaprayōgaṃ saccidpadālunnū caṃdra sūryāgnulaku kaligi unnavi kanuka tannirisanārthamai ānaṃdaprayōgamu. saccidānaṃdamulunnū hari brahmādula yaṃdu kalavu ganuka tannirasanārthamai nityapadaprayōgamu. saccidānaṃda nityatvamunnū brahmamainacōṭa prādēśika śaṃkā nirasanārthamu pūrṇapada prayōgamu” - ivanniyu kalisi saccidānaṃda nitya paripūrṇuḍu parabrahma ani ceppabaḍunu”.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.