← Back to స · Booklets 51–60 (digitized file 6)

సదాశ్రయణం sadāśrayaṇaṃ

Original — తెలుగు

విద్వద్భిః ప్రభుసమాశ్రయే ణీవ స్థాతవ్యం - ” సదాశ్రయేణ శోభంతే పండితా వనితా లతాః” ఇతి.

(విద్వాంసుకు - పండితులు - ప్రభువునాశ్రయించి యుండవలెను) (పండితులు, స్త్రీలు, లతలు సత్పురుషులను ఆశ్రయించుటచేత శోభిల్లుదురు).

“సదేవ సోమ్యేద మగ్ర ఆసీదేకమేవ అద్వితీయం”

“సదేవ ఇతి విజాతీయ భేదో వ్యావర్తతే. ‘ఏకమేవ’ ఇతి స జాతీయ భేదః”అద్వితీయమితి” స్వగతభావ రూప భేదః“.

(అనేకమైన నామ రూపములతో కనబడుచున్న ఈ ప్రపంచము సృష్టికిముందు ‘సత్’ పదార్థముగానే (ఆత్మగానే) యుండెను. ఆ ‘సత్’ పదార్థమొక్కటే, అటువంటిది మఱియొకటి లేకుండెను - సత్పదార్థమొక్కటే యని చెప్పుటవలన విజాతీయభేదము లేనిది. అనగా, ‘సత్’ కాక మఱియొలటి లేదు అని చెప్పబడినది. ‘ఏకమేవ’ (ఒక్కటే అని చెప్పుటచేత సజాతీయ భదము లేదు అని చెప్పబడినది; అనగా ‘సత్’ పదార్థము- లోకములకు సృష్టిస్థితి లయములుచేయగలుగు తనలాంటి పదార్థము మఱియొకటి లేదు అని చెప్పుత. ‘సత్’ పదార్థము అప్ప (ఆత్మ తప్ప) యింకేమియు లేదని యర్థము. ‘అద్వితీయం’ ఏ విధమనైదియు ఇంకొకటి లేదు - ఇట్లు చెప్పుటచేత సత్పదార్థము ఒకటే యుండెను - అని అర్థము - అవయవములవంటివి లేవుకనుక స్వగత భేదము లేదు).

Transliteration

vidvadbhiḥ prabhusamāśrayē ṇīva sthātavyaṃ - ” sadāśrayēṇa śōbhaṃtē paṃḍitā vanitā latāḥ” iti.

(vidvāṃsuku - paṃḍitulu - prabhuvunāśrayiṃci yuṃḍavalenu) (paṃḍitulu, strīlu, latalu satpuruṣulanu āśrayiṃcuṭacēta śōbhilluduru).

“sadēva sōmyēda magra āsīdēkamēva advitīyaṃ”

“sadēva iti vijātīya bhēdō vyāvartatē. ‘ēkamēva’ iti sa jātīya bhēdaḥ”advitīyamiti” svagatabhāva rūpa bhēdaḥ”.

(anēkamaina nāma rūpamulatō kanabaḍucunna ī prapaṃcamu sṛṣṭikimuṃdu ‘sat’ padārthamugānē (ātmagānē) yuṃḍenu. ā ‘sat’ padārthamokkaṭē, aṭuvaṃṭidi maṟiyokaṭi lēkuṃḍenu - satpadārthamokkaṭē yani ceppuṭavalana vijātīyabhēdamu lēnidi. anagā, ‘sat’ kāka maṟiyolaṭi lēdu ani ceppabaḍinadi. ‘ēkamēva’ (okkaṭē ani ceppuṭacēta sajātīya bhadamu lēdu ani ceppabaḍinadi; anagā ‘sat’ padārthamu- lōkamulaku sṛṣṭisthiti layamulucēyagalugu tanalāṃṭi padārthamu maṟiyokaṭi lēdu ani cepputa. ‘sat’ padārthamu appa (ātma tappa) yiṃkēmiyu lēdani yarthamu. ‘advitīyaṃ’ ē vidhamanaidiyu iṃkokaṭi lēdu - iṭlu ceppuṭacēta satpadārthamu okaṭē yuṃḍenu - ani arthamu - avayavamulavaṃṭivi lēvukanuka svagata bhēdamu lēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.