← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాధన sādhana

Original — తెలుగు
  1. ఉపాయము, ఉపకరణము.

  2. “పత్నీ పుత్ర విత్త వయో అవస్థా జాత్యభిమానాదికం కర్మ సాధనం” (విచారసాగరము).

(భార్యా పుత్రులు, ధనము, వయస్సు అవస్థలవలన కలుగు అభిమానము మొదలగు వాటి గుఱించి చేయు కర్మ).

  1. “సాధనానాంతు సర్వేషాం ముముక్షా మూలకారణం” (సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహము).

(సాధనములన్నింటికి మోక్షము కోరుటయే మూల కారణము)

  1. “ప్రారంభమున శాస్త్ర గురు వాక్యముల ద్వారా సాధాకుడు భగవంతుడెట్టివాడో తెలుసుకొనును - అత్తఱి భగవంతుని చేరుటకు భక్తుడు తన ఆధాత్మిక యాత్రను ఉపక్రమించెనన్నమాట. ఉపక్రమించెనే కాని అతనిని ఇంకను సమీపించలేదు” (భగవంతునిలో ఐక్యమగుటకు సాధకునకు మూడు సాధనములు శ్రీకృష్ణభగవానుడు శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నాడు - అవి ఎట్లనగా - “జ్ఞాతుం, ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుంచ పరంతప” అని చెప్పియున్నాడు - దీనిని గుఱించి యీ క్రింద విధముగా వ్యాఖ్యానము చేయబడినది -) (భగవంతుని తెలుసుకొనుటకు (జ్ఞాతుం) సంభవించెనేకాని చూచుట సంభవించలేదు (ద్రష్టుం). ఇది ప్రాధమిక దశ - ద్వైత స్థితి. ఈ స్థితిలో భగవంతుడు వేఱు, భక్తుడు వేఱుగ నుండును - భక్తి మాత్రము కుంటువడక యుండును- కాని యిట్టి స్థితి చాలగు. సాధనను భక్తిని తీవ్రతరమొనర్చి ఇంకను ముందునకు కొనసాగిపోవలెను - ఇట్లు చేయుచుండ చిత్త పరిపక్వత ననుసరించి కొంత కాలమునకు దేవుని అతి సమీపమునకు వచ్చును - దేవుని స్పర్శించును, దేవునితో మాట్లాడును (ప్రహ్లాదునివలె). దేవునిలో తానొక భాగముగ (అంశముగ) తయారగునంతటి దశకు వచ్చును - అత్తఱి దేవుని తెలుసుకొనుట అను స్థితిని దాటినవాడై దేవుని ప్రత్యక్షముగ (face to face - ముఖా ముఖి) చూచునట్టి స్థితికి వచ్చును - (ద్రష్టుం). ఇది మాధ్యమిక దశ. విశిష్టాద్వైత స్థితితో దీనిని పోల్చవచ్చును - అయితే ఇదియును చాలదు. దేవుని చూచుట మాత్రంతో సంతుష్టి పడక దేవునిలో ప్రవేశించుటకై ప్రయత్నించ వలెను - (ప్రవేష్టుం). ఇది చరమ స్థితి. అభ్యాసవశమున సాధన యొక్క తీవ్రతచేత, భక్తియొక్క పరాకాష్టచేత ఇట్టి సాక్షాత్కారదశ జీవునకు లభించగలదు - దేవుని ఎంతగా తెలుసుకొనినను, ఎంతగా చూచినను దేవునిలో ప్రవేశించునంతటి ఔన్నత్యదశ వానికి ఉండదు, దేవుడు తాను వేరుగా నున్నంత వఱకు ఏదో విధముగ భయముండుచునే యుండును - (“ద్వితీయాద్వై భయం భవతి”). కావున దేవునిలో ఐక్యమైపోయినపుడే, దేవునియందు ప్రవేశించినపుడే పూర్ణ నిర్భయత్వము, పూర్ణానందము జీవునకు సంప్రాప్తించగలదు - ఇదియే అద్వైత స్థితి. ఈ ప్రకారముగా గీతాచార్యుడు - “జ్ఞాతుం, ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ, పరంతప” అను మహోన్నత వాక్యము ద్వార లోకమునకు ద్వైత విశిష్టాద్వైత అద్వైతములను మూడింటిని ప్రతిపాదించి ఒక్కొక్క మెట్టు పైకి పోయి తుదకు భగవంతునిలో ప్రవేశించుట యను చరమాద్వైత స్థితిని సర్వులును పొందులాగున ఆదేశించెను.

“అట్టి పరిపూర్ణ అద్వైత స్థితి యందే జీవునకు సర్వదుఃఖములున్నూ శమించిపోయి పరమానందప్రాప్తి కలుగును - అత్తఱి ఇక మానవుడు మానవుడుగా నుండడు, మాధవుడుగా మారిపోవును. వ్యష్టి సమష్టి యందు విలీనమై సమష్టి రూపముగనే శేషించును - ఉప్పు గల్లు సముద్రములో ప్రవేశించి సముద్ర రూపముగనే పరిణతమగునట్లును, అగ్నియందాహుతి ప్రవేశించి అగ్నిరూపముగనే మారునట్లును, జీవుడు పరమాత్మయందు ప్రవేశించి పరమాత్మరూపముగనే చెన్నొందును. కాబట్టి సాధకుడు దేవుని తెలుసుకొనుట మాత్రముతో సంతుష్టిపడక, చూచుటమాత్రముతో తృప్తిపడక ఇంకను పైకిపోయి దేవునిలో ప్రవేశించి తానే దేవుడై ఇక విశ్రాంతి నొందవలెను - ద్వైత విశిష్టాద్వైతములందు ప్రావీణ్యము సంపాదించనిదే అద్వైతస్థితి ఎవనికిని లభింపజాలదు”.

  1. భగవంతునియొక్క విరాడ్రూపమును దృష్టియందుంచుకొని లోకమున వ్యవహరించుచో మనుజునకు చక్కని శీల సంపత్తి ఉదయించగలదు. భగవానుని విశ్వరూపతత్వమును బాగుగ తెలుసుకొనినవాడు సర్వత్ర దైవముయొక్క ఉనికిని అనుభూతమొనర్చుకొనుచు పాపాచరణము లేకయుండును. సర్వ ప్రాణులయడల దయ కలిగియుండును, ఎవరితోను విరోధము, వైరము లేకయుండును, అసూయాద్వేషములు అంతరించిపోగలవు. అనన్య శక్తిభావము హృదయమున పొంగి పొరలు చుండును - ఇట్టి నైర్మలత్వము ఎపుడు చేకూరునో ఇక మోక్షము దరిదాపున ఉన్నట్లే.

ప్రారంభ స్థితిలో వ్యష్టిరూపము నారాధించుట, తదుపరి సమష్టిరూపము నాశ్రయించుట, ఆ పిమ్మట వ్యష్టి సమష్ఠుల రెంటిని వాటి త్రిపుటీ రహితమగు నామరూప వివర్జిత కేవల సచ్చిదానంద పరమాత్మను సాక్షాత్కరించుకొనుట. ఇది సాధకుని దారి కావున మొట్టమొదట (విభూతి యోగమున తెలుపబడినటుల) భగవంతుని చెట్టునందు, పుట్టయందు పూజించుచు క్రమముగ పైకిపోయి భగవంతుని విశ్వరూపముని భావించుచు, యినక్ను పైకి పోయి, భగవంతునికి రూపములేదు అఖండ ప్రజ్ఞాన ఘన స్వరూపమే యాతడు అని చింతించుచు ఉప్పుకల్లు సముద్రమున కలసి పోవునట్లు ధ్యేయమగు అట్టి పరమాత్మయందు కలిసి ద్వైతవర్జితమగు కేవల పరమాత్మగ శేషించుటయే జీవుని పరమ లక్ష్యము, పరమ ధర్మము).

Transliteration
  1. upāyamu, upakaraṇamu.

  2. “patnī putra vitta vayō avasthā jātyabhimānādikaṃ karma sādhanaṃ” (vicārasāgaramu).

(bhāryā putrulu, dhanamu, vayassu avasthalavalana kalugu abhimānamu modalagu vāṭi guṟiṃci cēyu karma).

  1. “sādhanānāṃtu sarvēṣāṃ mumukṣā mūlakāraṇaṃ” (sarva vēdāṃta siddhāṃta sāra saṃgrahamu).

(sādhanamulanniṃṭiki mōkṣamu kōruṭayē mūla kāraṇamu)

  1. “prāraṃbhamuna śāstra guru vākyamula dvārā sādhākuḍu bhagavaṃtuḍeṭṭivāḍō telusukonunu - attaṟi bhagavaṃtuni cēruṭaku bhaktuḍu tana ādhātmika yātranu upakramiṃcenannamāṭa. upakramiṃcenē kāni atanini iṃkanu samīpiṃcalēdu” (bhagavaṃtunilō aikyamaguṭaku sādhakunaku mūḍu sādhanamulu śrīkṛṣṇabhagavānuḍu śrīmadbhagavadgītalō ceppiyunnāḍu - avi eṭlanagā - “jñātuṃ, draṣṭuṃ ca tatvēna pravēṣṭuṃca paraṃtapa” ani ceppiyunnāḍu - dīnini guṟiṃci yī kriṃda vidhamugā vyākhyānamu cēyabaḍinadi -) (bhagavaṃtuni telusukonuṭaku (jñātuṃ) saṃbhaviṃcenēkāni cūcuṭa saṃbhaviṃcalēdu (draṣṭuṃ). idi prādhamika daśa - dvaita sthiti. ī sthitilō bhagavaṃtuḍu vēṟu, bhaktuḍu vēṟuga nuṃḍunu - bhakti mātramu kuṃṭuvaḍaka yuṃḍunu- kāni yiṭṭi sthiti cālagu. sādhananu bhaktini tīvrataramonarci iṃkanu muṃdunaku konasāgipōvalenu - iṭlu cēyucuṃḍa citta paripakvata nanusariṃci koṃta kālamunaku dēvuni ati samīpamunaku vaccunu - dēvuni sparśiṃcunu, dēvunitō māṭlāḍunu (prahlādunivale). dēvunilō tānoka bhāgamuga (aṃśamuga) tayāragunaṃtaṭi daśaku vaccunu - attaṟi dēvuni telusukonuṭa anu sthitini dāṭinavāḍai dēvuni pratyakṣamuga (face to face - mukhā mukhi) cūcunaṭṭi sthitiki vaccunu - (draṣṭuṃ). idi mādhyamika daśa. viśiṣṭādvaita sthititō dīnini pōlcavaccunu - ayitē idiyunu cāladu. dēvuni cūcuṭa mātraṃtō saṃtuṣṭi paḍaka dēvunilō pravēśiṃcuṭakai prayatniṃca valenu - (pravēṣṭuṃ). idi carama sthiti. abhyāsavaśamuna sādhana yokka tīvratacēta, bhaktiyokka parākāṣṭacēta iṭṭi sākṣātkāradaśa jīvunaku labhiṃcagaladu - dēvuni eṃtagā telusukoninanu, eṃtagā cūcinanu dēvunilō pravēśiṃcunaṃtaṭi aunnatyadaśa vāniki uṃḍadu, dēvuḍu tānu vērugā nunnaṃta vaṟaku ēdō vidhamuga bhayamuṃḍucunē yuṃḍunu - (“dvitīyādvai bhayaṃ bhavati”). kāvuna dēvunilō aikyamaipōyinapuḍē, dēvuniyaṃdu pravēśiṃcinapuḍē pūrṇa nirbhayatvamu, pūrṇānaṃdamu jīvunaku saṃprāptiṃcagaladu - idiyē advaita sthiti. ī prakāramugā gītācāryuḍu - “jñātuṃ, draṣṭuṃca tatvēna pravēṣṭuṃca, paraṃtapa” anu mahōnnata vākyamu dvāra lōkamunaku dvaita viśiṣṭādvaita advaitamulanu mūḍiṃṭini pratipādiṃci okkokka meṭṭu paiki pōyi tudaku bhagavaṃtunilō pravēśiṃcuṭa yanu caramādvaita sthitini sarvulunu poṃdulāguna ādēśiṃcenu.

“aṭṭi paripūrṇa advaita sthiti yaṃdē jīvunaku sarvaduḥkhamulunnū śamiṃcipōyi paramānaṃdaprāpti kalugunu - attaṟi ika mānavuḍu mānavuḍugā nuṃḍaḍu, mādhavuḍugā māripōvunu. vyaṣṭi samaṣṭi yaṃdu vilīnamai samaṣṭi rūpamuganē śēṣiṃcunu - uppu gallu samudramulō pravēśiṃci samudra rūpamuganē pariṇatamagunaṭlunu, agniyaṃdāhuti pravēśiṃci agnirūpamuganē mārunaṭlunu, jīvuḍu paramātmayaṃdu pravēśiṃci paramātmarūpamuganē cennoṃdunu. kābaṭṭi sādhakuḍu dēvuni telusukonuṭa mātramutō saṃtuṣṭipaḍaka, cūcuṭamātramutō tṛptipaḍaka iṃkanu paikipōyi dēvunilō pravēśiṃci tānē dēvuḍai ika viśrāṃti noṃdavalenu - dvaita viśiṣṭādvaitamulaṃdu prāvīṇyamu saṃpādiṃcanidē advaitasthiti evanikini labhiṃpajāladu”.

  1. bhagavaṃtuniyokka virāḍrūpamunu dṛṣṭiyaṃduṃcukoni lōkamuna vyavahariṃcucō manujunaku cakkani śīla saṃpatti udayiṃcagaladu. bhagavānuni viśvarūpatatvamunu bāguga telusukoninavāḍu sarvatra daivamuyokka unikini anubhūtamonarcukonucu pāpācaraṇamu lēkayuṃḍunu. sarva prāṇulayaḍala daya kaligiyuṃḍunu, evaritōnu virōdhamu, vairamu lēkayuṃḍunu, asūyādvēṣamulu aṃtariṃcipōgalavu. ananya śaktibhāvamu hṛdayamuna poṃgi poralu cuṃḍunu - iṭṭi nairmalatvamu epuḍu cēkūrunō ika mōkṣamu daridāpuna unnaṭlē.

prāraṃbha sthitilō vyaṣṭirūpamu nārādhiṃcuṭa, tadupari samaṣṭirūpamu nāśrayiṃcuṭa, ā pimmaṭa vyaṣṭi samaṣṭhula reṃṭini vāṭi tripuṭī rahitamagu nāmarūpa vivarjita kēvala saccidānaṃda paramātmanu sākṣātkariṃcukonuṭa. idi sādhakuni dāri kāvuna moṭṭamodaṭa (vibhūti yōgamuna telupabaḍinaṭula) bhagavaṃtuni ceṭṭunaṃdu, puṭṭayaṃdu pūjiṃcucu kramamuga paikipōyi bhagavaṃtuni viśvarūpamuni bhāviṃcucu, yinaknu paiki pōyi, bhagavaṃtuniki rūpamulēdu akhaṃḍa prajñāna ghana svarūpamē yātaḍu ani ciṃtiṃcucu uppukallu samudramuna kalasi pōvunaṭlu dhyēyamagu aṭṭi paramātmayaṃdu kalisi dvaitavarjitamagu kēvala paramātmaga śēṣiṃcuṭayē jīvuni parama lakṣyamu, parama dharmamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.