← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాధనచతుష్టయము sādhanacatuṣṭayamu

Original — తెలుగు
  1. “శ్లో ||. నిత్యానిత్య వస్తు వివేకశ్చ ఇహా ముత్ర విరాగతా |

శమాది షట్క సంపత్తిః ముముక్షుః తత్సమభ్యసేత్ ||“.

(నిత్యానిత్య వస్తు వివేకము, ఇహా ముత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము).

  1. వివేకాదికములు నాలుగును సర్వకాలము అవశ్యముండవలయును. ప్రథమ సాధనముగల శాస్త్రజ్ఞుడును విషయమందాసక్తి గలవాడై కామ కర్మంబునందు కామకర్మమందు ప్రవర్తించును, కనుక ద్వితీయ సాధనము (వైరాగ్యము) గావలయును. ఈ రెండు సాధనములుండినను కొందఱు కోపాదులచేత దహింపబడుటవలన మూడవ సాధనము (శమాది షట్కము) కావలయును - ఈ మూడు ఉండినను, కొందఱు మోక్షాకాంక్షలేక శ్రవణాదికమునందు ప్రవర్తింపరు. అందువలన నాలుగవ సాధనము (ముముక్షత్వము) గావలయును.

  2. శమాదీనాం షణ్ణామపి సాధనానాం ఏక సాధనత్వేన ఏవ అభిప్రేతత్వాత్ వివేకాదీని చత్వారీ ఏవ సాధనాని, న నవేతి జ్ఞేయం.

(శమము, దమము మొదలగునవి ఆరు అయినను అవి అన్నియు కలిసి ఒకే సాధనము క్రింద లెక్కింప బడు చున్నవి. అందుచేత నిత్యా నిత్య వస్తు వివేకము మొదలగునవి నాలుగనియే లెక్కింపబడుచున్నవి. శమదమాదులు ఆరును కలిసి తొమ్మిది).

Transliteration
  1. “ślō ||. nityānitya vastu vivēkaśca ihā mutra virāgatā |

śamādi ṣaṭka saṃpattiḥ mumukṣuḥ tatsamabhyasēt ||“.

(nityānitya vastu vivēkamu, ihā mutrārtha phalabhōga virāgamu, śamadamādi ṣaṭka saṃpatti, mumukṣutvamu).

  1. vivēkādikamulu nālugunu sarvakālamu avaśyamuṃḍavalayunu. prathama sādhanamugala śāstrajñuḍunu viṣayamaṃdāsakti galavāḍai kāma karmaṃbunaṃdu kāmakarmamaṃdu pravartiṃcunu, kanuka dvitīya sādhanamu (vairāgyamu) gāvalayunu. ī reṃḍu sādhanamuluṃḍinanu koṃdaṟu kōpādulacēta dahiṃpabaḍuṭavalana mūḍava sādhanamu (śamādi ṣaṭkamu) kāvalayunu - ī mūḍu uṃḍinanu, koṃdaṟu mōkṣākāṃkṣalēka śravaṇādikamunaṃdu pravartiṃparu. aṃduvalana nālugava sādhanamu (mumukṣatvamu) gāvalayunu.

  2. śamādīnāṃ ṣaṇṇāmapi sādhanānāṃ ēka sādhanatvēna ēva abhiprētatvāt vivēkādīni catvārī ēva sādhanāni, na navēti jñēyaṃ.

(śamamu, damamu modalagunavi āru ayinanu avi anniyu kalisi okē sādhanamu kriṃda lekkiṃpa baḍu cunnavi. aṃducēta nityā nitya vastu vivēkamu modalagunavi nāluganiyē lekkiṃpabaḍucunnavi. śamadamādulu ārunu kalisi tommidi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.