అర్థ్గ వాదోపపతీచ లింగ తాత్పర్య నిర్ణయే ||“.
“లింగానితు ఉపక్రమ, ఉపసంహార, అభ్యాస, అపూర్వతా ఫల అర్థవాద ఉపపత్యా ఖ్యాని ||”.
(శాస్త్ర గ్రంధముయొక్క తాత్పర్యమును నిర్ణయించుటకు ఉపక్రమ ఉపసంహారములు, అభ్యాసము, అపూర్ణతా, ఫలము, అర్థవాదము, ఉపపతి అనెడి ఆరు విధములైన లింగములు ఉపయోగపడుచున్నవి).
(1) ఉపక్రమ ఉపసంహారముల ఏకరూపతా - అనగా, - ప్రకరణారంభమునందు ఏ యర్థము చెప్పబడినదో ఆ యర్థమే ప్రకరణాంతమందు కూడ చెప్పుట
(2) అభ్యాసము - ఎట్లు ఉపాసకుడు భగవద్దర్శనము కావలెను అను అభిలాష మనసునందు దృఢముగా నుంచుకొని అనేక స్తోత్రములను, పూజా నమస్కారములను, భగవన్నామోచ్ఛారణమును పలుమారు చేయు చున్నాడో అట్లు ఒకే అర్థము వేర్వేర - అనేక ప్రకారములచే పలుమారు చెప్పుట, ఉద్దాలకుడను తండ్రి శ్వేతకేతువను పుత్రునికి వేర్వేరు ప్రకారముగ జగత్కర్త అయిన ఈశ్వరుని యొక్క వర్ణనము చద్సి “తత్వమసి” అను వాక్యము తొమ్మిదిమారులు చెప్పియున్నాడు. ఇది అభ్యాసము
(3) అపూర్వత - అపూర్వత అనగా, సామాన్యతం సకల పదార్థముల వ్యవస్థయొక్క సామన్య పద్ధతి ఏది గలదో ఆ పద్ధతి కాక వ్యవస్థయందు ఏ యొక్క విశేష పద్ధతి ఎక్కడ కనబడుచున్నదో అక్కడ అపూర్వత అనుచున్నారు - (సకల పదార్థముల కన్న విశేష తా రూపము అయిన అపూర్వత బ్రహ్మంబునందు వర్తించుచున్నది.
(4) ఫలము - ప్రకరణప్రతిపాద్యమైన విషయమును తెలుసుకొనుటవలన గలిగెడి ప్రయోజనము.
(5) అర్థనాదము - ప్రకరణ ప్రతిపాద్యంశమునకు అచ్చటచ్చట చేయబడిన స్తుతి - ఉదాహరణకు - “నాశ్రుతం శ్రుతం భవత్యమతం మత మవిజ్ఞాతం విజ్ఞాతం” ఇందు బ్రహ్మజ్ఞాన మహిమ స్తుతియింపబడినది.
(6) ఉపపత్తి - ప్రకరణ ప్రతిపాద్యర్థమును సాధించుటకై యచ్చటచ్చట చెప్పబడిన యుక్తి - “యథాసౌమ్యే కేని మృత్పిందేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్” ఇత్యది. ఒక్క మృత్పిండ జ్ఞానముచేతనే మృదన్విత సమస్త వస్తు జ్ఞాన మెట్లు కలుగునో యటులనే బ్రహ్మవిజ్ఞానముచే సమస్త ప్రపంచ జ్ఞానమును కలుగును - అనునది యుక్తి.
(1-2). ఉపక్రమోప సంహారములు అనగా ప్రారంభము, ముగింపు. ఛాందోగ్యోపనిషత్తులో 6 - 2 - 1 లో “సదేవ సోమ్య ఇదమగ్ర ఆసీదేకమేవా ద్వితీయం”, “ఇప్పుడు ఈ కనబడు నామరూపములుగల వస్తువులన్నియు సృష్టికి ముందు ‘సత్’ పదార్థము అను ఒకే వస్తువుగా - రెండవ వస్తువు లేనిదిగా - నుండెను”అని మొదలుపెట్టి “ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మా, తత్వమసి” (ఇదంతయు ఆత్మయే, అదియే సత్పదార్థము - అదియే నీవు అయి యున్నావు) అని ముగింపబడినది.
అపూర్విత - ఉపనిషత్తులన్నింటిలోను బోధించబడిన విషయము ఒకటే - అదియే భగవత్తత్వము - “తం త్వౌపనిషదం పురుషం పృచ్ఛామి” (ఉప్నిషత్తులలో చెప్పబడిన ఆ పరమ పురుషుని గుఱించి అడుగుచున్నాను).
అభ్యాసము - చెప్పిన విషయమే మరల మరల అభ్యాసము కొఱకు చెప్పుట - (dinning) ఐతదాత్మ మిదం సర్వం? (ఈ సర్వప్రపంచము ఆత్మయే) అనునది అనేక పర్యాయములు చెప్పబడినది.
ఫలము - “బ్రహ్మ వేదబ్రహ్మైవ భవతి”
(పరబ్రహ్మను తెలుసుకొనినవాడు బ్రహ్మమే - బ్రహ్మవలెనే - యగును). ఉపనిషత్తులద్వారా బ్రహ్మ జ్ఞానము కలుగును, బ్రహ్మ తత్వము తెలియనగును.
ప్రశంస - “యేనాశ్రుతః శ్రుతం భవతి, అమతం మతమవిజ్ఞాతః విజ్ఞాతం భవతి”.. దేనిని తెలుసుకొనిన వినబడనిది - వినబడని విషయము - వినబడినదగునో; తెలియనిది తెలిసిన దగునో) - అనగా, ఉపనిషత్తులద్వారా బ్రహ్మతత్వము తెలిసిన దగును, ఇదివరకు తెలియనిదంతయు తెలియబడును, వినబడనదంతయు వినబడును).
ఈ ఆరు విధముల లింగముల అన్వయము ప్రకారము ఉపనిషత్తులు ప్రమాణగ్రంధమని నిర్ణయింపబడినది.
arthga vādōpapatīca liṃga tātparya nirṇayē ||“.
“liṃgānitu upakrama, upasaṃhāra, abhyāsa, apūrvatā phala arthavāda upapatyā khyāni ||”.
(śāstra graṃdhamuyokka tātparyamunu nirṇayiṃcuṭaku upakrama upasaṃhāramulu, abhyāsamu, apūrṇatā, phalamu, arthavādamu, upapati aneḍi āru vidhamulaina liṃgamulu upayōgapaḍucunnavi).
(1) upakrama upasaṃhāramula ēkarūpatā - anagā, - prakaraṇāraṃbhamunaṃdu ē yarthamu ceppabaḍinadō ā yarthamē prakaraṇāṃtamaṃdu kūḍa ceppuṭa
(2) abhyāsamu - eṭlu upāsakuḍu bhagavaddarśanamu kāvalenu anu abhilāṣa manasunaṃdu dṛḍhamugā nuṃcukoni anēka stōtramulanu, pūjā namaskāramulanu, bhagavannāmōcchāraṇamunu palumāru cēyu cunnāḍō aṭlu okē arthamu vērvēra - anēka prakāramulacē palumāru ceppuṭa, uddālakuḍanu taṃḍri śvētakētuvanu putruniki vērvēru prakāramuga jagatkarta ayina īśvaruni yokka varṇanamu cadsi “tatvamasi” anu vākyamu tommidimārulu ceppiyunnāḍu. idi abhyāsamu
(3) apūrvata - apūrvata anagā, sāmānyataṃ sakala padārthamula vyavasthayokka sāmanya paddhati ēdi galadō ā paddhati kāka vyavasthayaṃdu ē yokka viśēṣa paddhati ekkaḍa kanabaḍucunnadō akkaḍa apūrvata anucunnāru - (sakala padārthamula kanna viśēṣa tā rūpamu ayina apūrvata brahmaṃbunaṃdu vartiṃcucunnadi.
(4) phalamu - prakaraṇapratipādyamaina viṣayamunu telusukonuṭavalana galigeḍi prayōjanamu.
(5) arthanādamu - prakaraṇa pratipādyaṃśamunaku accaṭaccaṭa cēyabaḍina stuti - udāharaṇaku - “nāśrutaṃ śrutaṃ bhavatyamataṃ mata mavijñātaṃ vijñātaṃ” iṃdu brahmajñāna mahima stutiyiṃpabaḍinadi.
(6) upapatti - prakaraṇa pratipādyarthamunu sādhiṃcuṭakai yaccaṭaccaṭa ceppabaḍina yukti - “yathāsaumyē kēni mṛtpiṃdēna sarvaṃ mṛṇmayaṃ vijñātaṃ syāt” ityadi. okka mṛtpiṃḍa jñānamucētanē mṛdanvita samasta vastu jñāna meṭlu kalugunō yaṭulanē brahmavijñānamucē samasta prapaṃca jñānamunu kalugunu - anunadi yukti.
(1-2). upakramōpa saṃhāramulu anagā prāraṃbhamu, mugiṃpu. chāṃdōgyōpaniṣattulō 6 - 2 - 1 lō “sadēva sōmya idamagra āsīdēkamēvā dvitīyaṃ”, “ippuḍu ī kanabaḍu nāmarūpamulugala vastuvulanniyu sṛṣṭiki muṃdu ‘sat’ padārthamu anu okē vastuvugā - reṃḍava vastuvu lēnidigā - nuṃḍenu”ani modalupeṭṭi “aitadātmyamidaṃ sarvaṃ tatsatyaṃ sa ātmā, tatvamasi” (idaṃtayu ātmayē, adiyē satpadārthamu - adiyē nīvu ayi yunnāvu) ani mugiṃpabaḍinadi.
apūrvita - upaniṣattulanniṃṭilōnu bōdhiṃcabaḍina viṣayamu okaṭē - adiyē bhagavattatvamu - “taṃ tvaupaniṣadaṃ puruṣaṃ pṛcchāmi” (upniṣattulalō ceppabaḍina ā parama puruṣuni guṟiṃci aḍugucunnānu).
abhyāsamu - ceppina viṣayamē marala marala abhyāsamu koṟaku ceppuṭa - (dinning) aitadātma midaṃ sarvaṃ? (ī sarvaprapaṃcamu ātmayē) anunadi anēka paryāyamulu ceppabaḍinadi.
phalamu - “brahma vēdabrahmaiva bhavati”
(parabrahmanu telusukoninavāḍu brahmamē - brahmavalenē - yagunu). upaniṣattuladvārā brahma jñānamu kalugunu, brahma tatvamu teliyanagunu.
praśaṃsa - “yēnāśrutaḥ śrutaṃ bhavati, amataṃ matamavijñātaḥ vijñātaṃ bhavati”.. dēnini telusukonina vinabaḍanidi - vinabaḍani viṣayamu - vinabaḍinadagunō; teliyanidi telisina dagunō) - anagā, upaniṣattuladvārā brahmatatvamu telisina dagunu, idivaraku teliyanidaṃtayu teliyabaḍunu, vinabaḍanadaṃtayu vinabaḍunu).
ī āru vidhamula liṃgamula anvayamu prakāramu upaniṣattulu pramāṇagraṃdhamani nirṇayiṃpabaḍinadi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.