కార్యవస్తువు పుట్టకముందు అన్ని పదార్థములు వాటి కారణాత్మనముగనే నున్నవని వేదాంతమతము - కావున దానికి సద్వాదమని పేరు.
“కుతస్తఖలు సోమ్యేవం సయాత్” ఇతి హోవాచ “- కథం అసతస్సజ్జాయ తేతి - సత్వేవ సోమ్యేవ మగ్ర ఆసీత్.” (ఛాందోగ్యోపనిషత్ -)
(ఓ శాంతుడా! ఇది యెచ్చటనైన గలదా? శూన్యమునుండి సత్పదార్థమెట్లు జనించును? ఇది విరుద్ధము - కావున మొట్టమొదట ఈ ప్రపంచము సద్రూపముగానేయుండి తీరవలయును “)
“సదేవ సోమ్యేవ మగ్ర అసీత్ ఏకమేవా ద్వితీయం”. (ఛాందోగ్యోపనిషత్)
(ఓ శాంతుడా! ఈ కనబడు ప్రపంచమంతయు మొదటలో ప్రపంచము పుట్టకముందు ‘సత్’ పదార్థముగానే - ఆత్మ పదార్ధముగానే యుండెను - అది ఒకటిగానే యుండెను - రెండవ వస్తువేదియును - ఇంకొక సద్వస్తువుగాని, ఇకొక ఆత్మగాని ఇంకొక ఇతర వస్తువుగాని - అప్పుడు లేదు - అని సద్వస్తువు ఒక్కటే అప్పటికీ ఇప్పటికీ ఉన్నది అను వాదము)
kāryavastuvu puṭṭakamuṃdu anni padārthamulu vāṭi kāraṇātmanamuganē nunnavani vēdāṃtamatamu - kāvuna dāniki sadvādamani pēru.
“kutastakhalu sōmyēvaṃ sayāt” iti hōvāca “- kathaṃ asatassajjāya tēti - satvēva sōmyēva magra āsīt.” (chāṃdōgyōpaniṣat -)
(ō śāṃtuḍā! idi yeccaṭanaina galadā? śūnyamunuṃḍi satpadārthameṭlu janiṃcunu? idi viruddhamu - kāvuna moṭṭamodaṭa ī prapaṃcamu sadrūpamugānēyuṃḍi tīravalayunu “)
“sadēva sōmyēva magra asīt ēkamēvā dvitīyaṃ”. (chāṃdōgyōpaniṣat)
(ō śāṃtuḍā! ī kanabaḍu prapaṃcamaṃtayu modaṭalō prapaṃcamu puṭṭakamuṃdu ‘sat’ padārthamugānē - ātma padārdhamugānē yuṃḍenu - adi okaṭigānē yuṃḍenu - reṃḍava vastuvēdiyunu - iṃkoka sadvastuvugāni, ikoka ātmagāni iṃkoka itara vastuvugāni - appuḍu lēdu - ani sadvastuvu okkaṭē appaṭikī ippaṭikī unnadi anu vādamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.