← Back to స · Booklets 51–60 (digitized file 6)

సగుణః saguṇaḥ

Original — తెలుగు
  1. గుణసహితః -

(గుణములు కలవాడు - సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములు కలవాడు - ఈ మూడు గుణములకూడియుండు పరబ్రహ్మ).

  1. ఏకైక గుణవిశిష్టః -

(ఒక్కొక్క గుణము విశేషముగా గలవాడు).

  1. “స్వాతంత్ర్యాది గుణవాన్”. (శ్రీజయతీర్థః)

(స్వతంత్రము మొదలగు గుణములు కలవాడు).

  1. స్థూలః (స్థూలరూపములో నున్న భగవంతుడు - భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైన రూపముగలవాడైనను త్రిగుణములుగల మాయతో కలిసినప్పుడు స్థూలరూపము గలవాడగుచున్నాడు -

  2. మాయయా యుతం

(చిత్ర విచిత్రమైన సృష్టి చేయుటవలన మాయ యని చెప్పబడు ప్రకృతితో కలిసియుండువాడు -) (సృష్టిలోనున్న ప్రతివస్తువులోను ప్రకృతి అంశ భగవంతుని అంశ ఉన్నది)

  1. “క. అగుణుండగు పరమేశుడు

జగముల కల్పించు కొఱకు జతురత మాయా

సగుణుండగు, గావున హరి

భగవంతుండనగ బరిగె భవ్య చరిత్రా “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 99)

  1. “నిర్గుణుండైన పరమేశ్వరుండు గలుగుచు లేకుండుచు త్రిగుణంబుల తోడం గూడిన తన మాయచేత నింతయు సృజియించి గుణవంతుని చందంబున నిజమాయా విలసితంబులైన గుణంబులలో ప్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుంగు -”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 2 -)

  1. “ఆ. జన్మకర్మములును జన్మంబులును లేవు

శిష్ట రక్షణంబు సేయ వలసి

గుణవిరహితుడయ్యు గుణి యయి

సర్వ రక్షణ వినాశకేళి సలుపుచుండు “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూర్వ - భాగము - 1451)

  1. అనంతకల్యాణ గుణః

(అంతములేని కల్యాణగుణములు కలవాడు.)

Transliteration
  1. guṇasahitaḥ -

(guṇamulu kalavāḍu - satvamu, rajassu, tamassu anu mūḍu guṇamulu kalavāḍu - ī mūḍu guṇamulakūḍiyuṃḍu parabrahma).

  1. ēkaika guṇaviśiṣṭaḥ -

(okkokka guṇamu viśēṣamugā galavāḍu).

  1. “svātaṃtryādi guṇavān”. (śrījayatīrthaḥ)

(svataṃtramu modalagu guṇamulu kalavāḍu).

  1. sthūlaḥ (sthūlarūpamulō nunna bhagavaṃtuḍu - bhagavaṃtuḍu sūkṣmāti sūkṣmamaina rūpamugalavāḍainanu triguṇamulugala māyatō kalisinappuḍu sthūlarūpamu galavāḍagucunnāḍu -

  2. māyayā yutaṃ

(citra vicitramaina sṛṣṭi cēyuṭavalana māya yani ceppabaḍu prakṛtitō kalisiyuṃḍuvāḍu -) (sṛṣṭilōnunna prativastuvulōnu prakṛti aṃśa bhagavaṃtuni aṃśa unnadi)

  1. “ka. aguṇuṃḍagu paramēśuḍu

jagamula kalpiṃcu koṟaku jaturata māyā

saguṇuṃḍagu, gāvuna hari

bhagavaṃtuṃḍanaga barige bhavya caritrā “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 99)

  1. “nirguṇuṃḍaina paramēśvaruṃḍu galugucu lēkuṃḍucu triguṇaṃbula tōḍaṃ gūḍina tana māyacēta niṃtayu sṛjiyiṃci guṇavaṃtuni caṃdaṃbuna nijamāyā vilasitaṃbulaina guṇaṃbulalō pravēśiṃci vijñāna vijṛṃbhituṃḍai veluṃgu -”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 2 -)

  1. “ā. janmakarmamulunu janmaṃbulunu lēvu

śiṣṭa rakṣaṇaṃbu sēya valasi

guṇavirahituḍayyu guṇi yayi

sarva rakṣaṇa vināśakēḷi salupucuṃḍu “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pūrva - bhāgamu - 1451)

  1. anaṃtakalyāṇa guṇaḥ

(aṃtamulēni kalyāṇaguṇamulu kalavāḍu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.